హైదరాబాద్‌కు మూసీ.. ముంబైకి మీఠీ.. చెన్నైకి అడయార్, ఢిల్లీకి యమునా.. కోల్‌కతాకు హూగ్లీ.. మహానగరాల్లో కాలుష్య కాసార నదులివీ..! ఈ సమస్యకు పరిష్కారం తమ వద్ద ఉందని సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము న్యూ జనరేటర్‌ను అభివృద్ధి పరిచామని, ఇది మురుగునీటితో పాటు మానవ వ్యర్థాలను కూడా శుద్ధి చేస్తుందని పేర్కొంటున్నారు. మంచి నీటితో పాటు విద్యుత్, ఎరువు కూడా దీని ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. బయోరియాక్టర్‌లో ఉండే బ్యాక్టీరియా ఘన వ్యర్థాలను విడగొట్టి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మిగిలిన ద్రవాన్ని సూక్ష్మస్థాయి ఫిల్టర్ ద్వారా పంపించి బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఘన పదార్థాలను వేరు చేస్తుంది. ఇలా మిగిలిపోయిన నీటిని క్లోరిన్‌తో శుద్ధి చేస్తే.. మంచినీరు సిద్ధమైపోతుంది. మిగిలిపోయిన ఘన వ్యర్థాలను ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొత్తం మూడు దశల్లో రసాయనాల వాడకం తక్కువ కాబట్టి న్యూజనరేటర్ వాడకం సులువుగా జరిగిపోతుందన్న మాట. అంతేకాదు.. వీటిని సులభ్ కాంప్లెక్స్ వంటి కమ్యూనిటీ మరుగుదొడ్లకు అనుసంధానించుకుని అక్కడికక్కడే లబ్ధి పొందొచ్చు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ న్యూజనరేటర్‌లను మన దేశంతో పాటు దక్షిణాఫ్రికాలో ప్రయోగాత్మకంగా వాడేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment