Waste water
-
జల సంక్షోభం ముంచుకొస్తోంది!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. ⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు -
అణుజలం.. ఆందోళన స్వరం
జపాన్‌లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ? ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం 2011, మార్చి 11. జపాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్‌లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి. అణు జలాల శుద్ధి ఇలా..! ► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు. ► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు. ► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది. జపాన్ ఏమంటోంది ? ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్‌లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు. అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్‌హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు. ఆ జలాలు విషతుల్యమేనా ? ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్‌పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది. మరో మార్గం లేదా ? జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి. వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ? ► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది. ► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి. ► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు. ► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు. ► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
హైదరాబాద్‌లో నిత్యం ఎంత మురుగు వస్తుందంటే...
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మురుగు శుద్ధి ప్రహసనంగా మారింది. దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వెలువడుతోన్న వ్యర్థజలాల్లో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతోందని ఇటీవల నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ఈ నేపథ్యంలో మన నగరంలో రోజువారీగా సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాల శుద్ధి జరుగుతోంది. మిగతా సగం ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్, జంటజలాశయాలు, చారిత్రక మూసీ నదిని ముంచెత్తుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాటుకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా దుస్థితి ఇదీ... నీతిఆయోగ్ ఇటీవల ‘అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా..ఇందులో 13 శాతం తీవ్రంగా..మరో 17 శాతం మధ్యస్థ కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఆయా జలాశయాల నీటిలో భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్ విషపూరిత రసాయనాలు, ఫార్మా అవశేషాలున్నట్లు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం కలుషితమైనట్లు గుర్తించారు. గ్రేటర్ సిటీలో పరిస్థితి ఇలా... ► గ్రేటర్ పరిధిలో నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమౌతున్నాయి. ► ఇందులో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను సుమారు 25 మురుగు శుద్ధి కేంద్రాల్లో జలమండలి శుద్ధి చేస్తోంది. ► మిగతా మురుగు నగరవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో కలుస్తోంది. కాగా భవిష్యత్‌లో మురుగు నగరాన్ని ముంచెత్తుతోందన్న అంచనాతో మిగతా వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు దశలవారీగా మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించాలని సంకల్పించింది. రాబోయే ఐదేళ్లలో నగరంలో మూడు ప్యాకేజీలుగా 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి ప్రకటించింది . ► తొలివిడతగా రూ.1280 కోట్లతో నగరంలో పలు చోట్ల 17 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవ కాశాలున్నాయి. ఇక మరో 14 ఎస్టీపీలను దశలవారీగా నగరంలో నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మొత్తంగా 31 ఎస్టీపీలను రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని.. వీటిలో రోజువారీగా 1000– 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయవచ్చని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి) -
మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు. ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం రసాయన పరిశ్రమలు వ్యర్ధ జలాలను ఒక్క చుక్క కూడా బయటకు వదలకూడదు. ఇందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు అంగీకార పత్రాన్ని కాలుష్యం నియంత్రణ మండలికి ఇస్తాయి. అయినా తప్పు జరిగితే జరిమానాలు కడితే సరిపోతుంది కదా అన్న ధోరణితో పరిశ్రమలు కాలుష్య జలాలు విడుదల చేస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల అవినీతి సమస్యను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య జలాల కారణంగా చేపలు సరిగా ఎదగని పరిస్థితితో పాటు చేపలు ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ విభాగాలు కొన్ని కాలుష్యం కారకులకే వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాలుష్యం బారిన పడే చెరువులకు చేప పిల్లలు ఇవ్వమని చెబుతున్న మత్స్యశాఖ తీరును గతంలో మత్స్యకారులు ఎండగట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని చెరువుల వివరాలు వెల్లడించిందని అందులో పేర్లు లేకుంటేనే చేప పిల్లలు ఇస్తామన్న రీతిలో మత్స్యశాఖ వ్యవహరించింది. నిజానికి ఇక్కడ తప్పు చేస్తున్నది రసాయన పరిశ్రమలు, కాలుష్యాన్ని నియంత్రించకుంటే సంబంధిత పరిశ్రమలను మూసివేయాలి కానీ ఇక్కడ తప్పు చేస్తున్న పరిశ్రమలను వదిలేసి చెరువులకు చేపలు ఇవ్వటం మానేస్తున్నారని మత్సకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలు, అధికారుల తీరు మారాలని మత్సకారులు కోరుతున్నారు. కాలుష్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ సమయాల్లో సంబంధిత అధికారులు విచారణ, తనిఖీలు అంటూ హడావిడి చేసి అనంతరం సమస్యను మరుగున పడవేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల చిత్తశుద్ధితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. -
గ్రామాల్లో మురుగుకి చెక్
సాక్షి, మచిలీపట్నం: గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని పంచాయతీల్లో ఓపెన్ డ్రెయిన్స్ నిర్మించాలని సంకల్పించింది. రాష్ట్రంలో ఐదువేల జనాభాకు పైబడిన పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని గత ప్రభుత్వం హంగామా చేసింది. నిరంతరం మురుగు నీరు పారే పరిస్థితి లేనప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వలన ప్రయోజనం ఉండదని అప్పట్లో ఉన్నతాధికారులు మొత్తుకున్నా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున అంచనాలు వేసి పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ మేలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లోనూ అమలు... అన్ని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.1,897.50 కోట్లతో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎల్‌డబ్ల్యూఎం) ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టులో 30 శాతం స్వచ్ఛాంధ్ర మిషన్, 70 శాతం ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ మేరకు రూ.577.50 కోట్లు స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి, మిగిలిన రూ. 1,320 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.11.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారుల్లో ఒక వైపు, మెయిన్ రోడ్లలో ఇరువైపులా నిర్మించనున్నారు. తొలుత నియోజకవర్గానికో గ్రామ పంచాయతీని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పంచాయతీల్లో అమలు చేస్తారు. స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇళ్ల వద్ద సోక్ పిట్స్ నిర్మిస్తారు. అలాగే సోక్ పిట్ లేదా డ్రైన్లకు అనుసంధానిస్తూ బట్టలు, వంట సామాగ్రి శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్లాట్ ఫామ్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇళ్లల్లో వినియోగించే నీటిలో 80 శాతం డ్రైన్స్ ద్వారా వెళ్లే విధంగా డిజైన్ చేయనున్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఓపెన్ డ్రైన్స్ రాష్ట్రాన్ని నూరు శాతం మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని గ్రామాల్లో సంతృప్త స్థాయిలో ఓపెన్ డ్రైన్స్ నిర్మించేందుకు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు చేపట్టాం. ఇందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశాం. –సంపత్‌కుమార్, ఎండీ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ -
భయపెడుతున్న ఈ–కోలి భూతం
అమలాపురం: ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నది..పంట కాలువల్లో మాత్రమే ఉన్న ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి ఇప్పుడు భూగర్భ జలాల్లోనూ కనిపిస్తోంది. ప్రజలకు రోగ కారకమైన దీని ఉధృతి వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశముంది. రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు, స్థానికంగా పేపరు మిల్లుల నుంచి వచ్చే వర్థ్య జలాలు, గోదావరి ఎగువ ప్రాంతాల్లో పలు కంపెనీల రసాయనాలు, పట్టణాలకు చెందిన మురుగునీరు కలవడం వల్ల దీని సాంద్రత రోజురోజుకు పెరుగుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో నదిలో ఏకంగా ఐదు వేల కాలనీస్ (యూనిట్లు) వరకు ఈ–కోలి రికార్డు స్థాయిలో నమోదయిందంటే దీని తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదుల నుంచి వచ్చే నీటిలోనూ, భూగర్భ జలాల్లో ఇది ఎక్కువగా ఉందని కోనసీమ కాలుష్యంపై పరిశోధన చేస్తున్న ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ పెచ్చెట్టి కృష్ణకిశోర్ అధ్యయన బృందం నిర్ధారించింది. ఈ నీటినే జిల్లాలో సుమారు 60 శాతం మంది ప్రజలు తాగునీరుగా వినియోగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలతోపాటు వందల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇటీవల కాలంలో ఆక్వా సాగు విచ్చలవిడిగా పెరగడంతో వృథా అవుతున్న మేతలు, రసాయనాల వల్ల చెరువుల చుట్టుపక్కల సుమారు 2 కి.మీ. మేర నీరు ఉప్పుబారిన పడడంతో పాటు కాలుష్యం కారణంగా భూగర్భ జలాల్లో ఈ–కోలి వ్యాప్తి చెందుతోంది. గడచిన మూడేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు మొఖం చాటేయడం కూడా ఈ–కోలి బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియాలోనే ‘ఈ–కోలి’ అత్యంత ప్రమాదకరం - బ్యాక్టీరియాలో అత్యంత ప్రమాదకరమైంది ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). దీనివల్ల ఆయాసం, వాంతులు, కడుపునొప్పి, అతిసార, తీవ్ర జ్వరానికి దారితీస్తోంది. - వర్షాకాలం సీజన్లో పలువురు జ్వరాల బారిన పడడానికి ఇదే కారణం. ఇది వృద్ధి చెందకుండా చర్యలు తీసుకునే అధికార వ్యవస్థ లేదు. - కొత్త నీరు వస్తున్న సమయంలో.. అంటే వర్షాకాలంలో భూగర్భ జలాల్లో సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. ప్రమాదస్థాయిని దాటుతోంది.. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ–కోలి స్థాయి 625 నుంచి 650 కాలనీస్(యానిట్లు) దాటి ఉంది. మెట్టలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. నీటిలో 500 కాలనీస్ దాటితే ప్రమాదం. సముద్రంలో పేరుకుపోయే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాల మీద దట్టమైన ఇసుక పేరుకుపోతోంది. ఓఎన్జీసీ తవ్వకాలతో అవి నీటిపైకి వస్తాయి. జిల్లాలో నదీ ముఖ ద్వారాలైన బలుసుతిప్ప, అంతర్వేది. ఓడలరేవు ద్వారా ఇది నదిలోకి వచ్చి, అక్కడ నుంచి భూగర్భంలోకి చేరడం, ఆక్వా చెరువుల ద్వారా విస్తరిస్తోంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
గోదావరిలో గరళం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగర ప్రజలు మంచినీరే తాగుతున్నారా? పేపర్ మిల్లు రసాయనిక జలాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. పేపర్‌మిల్లు వెనుక నుంచి గోదావరిలోకి పెద్ద కాలువ ఉంది. ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదల వల్ల ఆ కాలువ వెతికితే తప్ప ఎవరికీ కనిపించదు. ఆ కాలువ నుంచి పేపర్ తయారీ అనంతరం విడుదలవుతున్న రసాయనిక జలాలు నేరుగా కోటిలింగాల ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు పక్కన నదిలో కలుస్తున్నాయి. నిరంతరంగా 10 హెచ్‌పీ(హార్స్పవర్) మోటారు ద్వారా ఎంత నీరు వస్తుందో ఆ స్థాయిలో 24 గంటల పాటు పేపర్ మిల్లు రసాయనిక వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరిలో ఇన్‌ఫ్లో లేకపోవడంతో నదీ జలాలు మరింత కలుషితమువుతున్నాయి. 23 వేల కిలో లీటర్ల నీటి వినియోగం కోటిలింగాల ఘాట్ వద్ద నదిలో ఏర్పాటు చేసిన ఇన్‌టేక్ పాయింట్ నుంచి పేపర్ మిల్లు ప్రతి రోజూ 23 వేల కిలో లీటర్ల నీటిని ఉపయోగించుకుంటోంది. పేపర్ తయారీకి వివిధ దశల్లో సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగించి అనంతరం ఆ నీటిని వెంకటనగరం పంచాయతీ పరిధిలోని లంకల్లో విడుదల చేస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలోకి పైపుల ద్వారా అధికారికంగా వ్యర్థ జలాలను తరలిస్తోంది. అక్కడ ఇసుకలో రసాయనిక జలాలు కలిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే అది ఎంత మేర అమలు జరుగుతుందోనన్నది ప్రశ్నార్థకమే. దానితోపాటు అనధికారికంగా కోటిలింగాల ఘాట్ ఇసుక ర్యాంపు వద్ద రసాయనిక వ్యర్థ జలాలను కలుపుతుండడంతో నది కలుషితం అవడంతోపాటు నగర ప్రజల తాగునీరు ఎంత మేరకు సురక్షితం అనేది ప్రశ్నగా మారింది. కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న 10 ఎంఎల్డీ ప్లాంటుతోపాటు మరో మూడు ప్లాంట్ల ద్వారా నగరంలోని దాదాపు 5 లక్షల మంది జనాభాకు ప్రతి రోజూ 65 మిలియన్ లీటర్లు (ఒక మిలియన్= 10 లక్షల లీటర్లు) నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. వాటర్ ప్లాంట్లలో సాధారణ ప్రక్రియలో బ్లీచింగ్, క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రసాయనిక వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిపోవని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే వ్యాధులు పేపర్ తయారీ అనంతరం విడుదలయ్యే రసాయన వ్యర్థ జాలాలు తాగునీటిలో కలవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులతోపాటు మానవ అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. సాధారణంగా తాగే నీటిలో పీహెచ్ విలువ ఏడు ఉండాలి. రసాయన జలాలు కలవడం వల్ల నీటి రంగు మారడంతోపాటు ఆ నీటిలో పీహెచ్ విలువ రెండు లేదా మూడుకు పడిపోతుంది. దీని వల్ల ఆ నీరు తాగిన వారిలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణకోశ, శ్వాసకోస వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది. క్యాన్సర్ వస్తుంది. కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జల చరాలు ఆ నీటిలో మనుగడ సాగించలేవు. బైలాజికల్ ఆక్సిన్ డిమాండ్ కలవడం వల్ల నీటిలోని చేపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా చనిపోతాయి. కోటిలింగాల ఘాట్ వద్ద రసాయన వ్యర్థ జాలాలు కలిసే ప్రాంతం చుట్టు పక్కల చేపలు సంచరించడంలేదు. మత్య్సశాఖ గతేడాది నవంబర్‌లో దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వేసినా అవి ఇక్కడ జీవించే అవకాశం లేకపోవడంతో పాపికొండలు,పోలవరం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతాయనిమత్య్సకారులు చెబుతున్నారు. వేట మానేశాం నదిలో నీరు తేడా వల్ల చేపలు వాటిని తాగవు. దీంతో చేపలు పాపికొండలు, భద్రాచలం వైపునకు వెళ్లిపోతున్నాయి. అధికారులు చాలా చేపలు వదిలారు. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. వేట మానేసి చాలా రోజులైంది. ఎవరిని అడగాలో తెలియదు.– బొడ్డు పోసయ్య, మల్లాడి ఆదినారాయణ,మత్స్యకారులు, కోలిటింగాల ఘాట్ తనిఖీ చేసి చర్యలు చేపడతాం గోదావరిలో వ్యర్థనీటిని కలుపుతుండం మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు చేపడతాం. మా సిబ్బంది ప్రతి నెలా తనిఖీ చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అధికారులను రాజమహేంద్రవరం పంపిస్తాం. – ఎ.రామారావునాయుడు,పర్యావరణ ఇంజనీర్, కాకినాడ -
వృథా నీటితో సిరుల పంట..
► నీటితో కళకళలాడుతున్న సైరిగాం చెరువులు సైరిగాం: ఒకప్పుడు ఆ గ్రామంలో ఖరీఫ్ పంటకు కూడా సాగునీరు వెతుక్కోవాల్సి వచ్చేది. జలు మూరు ఓపెన్ హెడ్ తోపాటు 19 ఆర్ పర్లాం, 20ఆర్ కూర్మానాథపురం వంటి కాలువలు ఉన్నా పొలాలు సాగునీటి కోసం ఆశగా ఎదురు చూసేవి. కానీ ఇప్పుడు వేసవిలోనూ ఈ గ్రామానికి తనివి తీరా నీరు అందుతోంది. గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముద్దాడ రవి చంద్ర ఆ గ్రామంలో ఉన్న బూసప్ప కోనేరు, చుట్టు గుండం, ఊరుగుండం, సింకింనాయడుచెరువు, గాదిబంద, బైమ్మకోనేరు, సోమనాద్రి చెరువు, మంగళవారం చెరువు, పాపమ్మకోనేరు, ఉప్పరవాని చెరువు తదితర వాటిని ఇటీవలే బాగు చేశారు. దీంతో వర్షాకాలంలో వృథాగా పోయే నీరు ఇప్పుడు ఆయా చెరువుల్లో నిల్వ ఉండి పంటకు జీవం పోస్తోంది. ఈ నీటితోనే ఇప్పుడు 159 ఎకరాల వరకు పెసర, మినుగు, నువ్వు, పొద్దు తిరుగుడు తదితర పంటలు సాగు చేస్తున్నారు. పశువులకు కూడా దాహం తీరుతోంది. ఇందులో కొన్ని భూములకు నేరుగా నీరు వెళ్లగా మరి కొన్ని పొలాలకు మాత్రం ఇంజిన్లతో నీటిని తోడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో వరి తదితర పంటలు చేతికి వచ్చి ఎకరాకు 30 బస్తాలు వరకూ దిగుబడి వస్తుందని ఆ రైతులు చెబుతున్నారు. -
నీటి గుంత.. తీరని చింత
ఫాంపాండ్ నిర్మాణాల్లో తీవ్ర జాప్యం రైతులకు కరువైన అవగాహన పట్టింపులేని అధికారులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం వర్ధన్నపేట : అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారింది. నీటి గుంతల నిర్మాణంతో వృథా నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు సంకల్పించిన ప్రభుత్వ ఆశయాన్ని వారు నీరుగారుస్తున్నారు. ఫలితంగా సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 15 మండలాల్లో ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రతి రైతుకు నీటి గుంతలపై అవగాహన కల్పించి భూగర్భజలాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఫారంపాండ్స్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే వాటికి సంబంధించిన పనులను ప్రారంభించింది. పర్యవేక్షణ కరువు.. ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఫారంపాండ్స్ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా పనుల్లో వేగం పెరగడం లేదు. వేలల్లో మంజూరు చేసిన అధికారులు నిర్మాణాలపై శ్రద్ధ వహించడం లేదని తెలుస్తోంది. నీటి గుంతల ప్రయోజనాలపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4,417 మంజూరు.. జిల్లాలో ఈ ఏడాది 4,417 మంది రైతులకు ఫారంఫాండ్స్ మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు 2381 పూర్తికాగా, 929 నిర్మాణ దశలోనే ఉన్నా యి. కాగా, 1107 మంది రైతులు ప్రారంభంలోనే వెనకడుగు వేశారు. ఫారంఫాండ్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదే శాలు జారీ చేస్తున్నా లక్ష్యం పూర్తికాకపోవడం గమనార్హం. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట వెనకంజ.. ఫారంఫాండ్స్ నిర్మాణాల్లో వర్ధన్నపేట మండలం వెనకంజలో కొనసాగుతుంది. మండలానికి 631 మంజూరుకాగా.. ఇప్పటివరకు 82 నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. కాగా, చెన్నారావుపేటలో 470 మంజూరుకాగా 303 పూర్తయ్యాయి. ఆత్మకూరులో 128, దుగ్గొండిలో 425, గీసుకొండలో 45, ఖానాపురంలో 60, నల్ల»ñబెల్లిలో 95, నర్సంపేటలో 55, నెక్కొండలో 343, పరకాలలో 45, పర్వతగిరిలో 283, రాయపర్తిలో 94, సంగెంలో 386, శాయం పేటలో 38 పూర్తయ్యాయి. అవగాహన కల్పిస్తే లక్ష్యం పూర్తి.. ఫారంఫాండ్ నిర్మాణాలతో సాగు భూమిలో కొంత కోల్పోతామనే ఆలోచనతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పల్లపు ప్రదేశంలో గుం తలను నిర్మించడంతో వర్షపు ద్వారా వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండే అవకాశం ఉంది. అవసరమైన సమయాల్లో ఫారంఫాండ్లోని నీటిని సాగునీటిగా పంటలకు ఉపయోగించవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగు నీరు రైతులకు అందుబాటులో ఉంటుంది. నీటి గుంతల నిర్మాణంతో కొంత భూమి కోల్పోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని విష యాలపై అధికారులు అవగాహన కల్పించాలి. తద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది. రమణారెడ్డికి అభినందనలు.. వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో రైతు సొల్లేటి రమణారెడ్డి ఉపాధిహామీ పథకం ద్వారా ఇటీవల ఫారంపాండ్‌ను నిర్మించారు. నీరు నిల్వ ఉండడంతో మోటార్ ద్వారా ఆయన పంటకు సాగునీటినిఅందిస్తున్నారు. కాగా, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫారంఫాండ్‌ను పరిశీలించిన కలెక్టర్ రైతు రమణారెడ్డి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. -
వానా కాలం మాయా జాలం
యథేచ్ఛగా వ్యర్థ జలాల విడుదల కలుషితమవుతున్న నీటి వనరులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి వ్యాధుల బారిన పడుతున్న జనం పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి మామూలుగానే పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థ జలాలను విచ్చలవిడిగా జనం మీదికి వదిలేస్తుంటాయి. ఇక వానా కాలం వస్తే పండగే.. వర్షపు నీటితో కలిసి పారిశ్రామిక వ్యర్థాలను, నీళ్లను యథేచ్ఛగా వదిలేయడం మరింత సులభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదిదే.. పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలతో పరిసర ప్రాంతాల్లోని కుంటలు, పొలాలు నిండిపోతున్నాయి. జనం గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే లేడు. పై నుంచి పొగ.. కింద నుంచి నీళ్లు వదులుతూ పరిశ్రమలు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి వానా కాలం మాయా జాలంపరిశ్రమల తీరుకళ్లు మూసుకుంటోంది. కాలుష్య జలాలతో పచ్చని చేలు బీడుగా మారుతున్నాయి. పరిశ్రమల తీరు ఉదాహరణకు జిన్నారం పరిధిలో ఉన్న పరిశ్రమల సమీపంలో వెయ్యి అడుగుల లోతుకు తవ్వినా పసుపు పచ్చని నీళ్లు వస్తున్నాయంటే.. వ్యర్థ జలాలు ఈ ప్రాంతంలో ఎంతగా భూమిలోకి ఇంకిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా, పటాన్చెరు, శివ్వంపేట, కొండాపూర్, పుల్కల్, జహీరాబాద్ ప్రాంతాలు సైతం పారిశ్రామిక కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. -
నీటి వృథా ఫైన్
వాన నీటి సంరక్షణకు బెంగళూరు జలమండలి నూతన పంథా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం బెంగళూరు: జలసంరక్షణపై దృష్టి సారించకుండా నీటిని వృధా చేస్తున్న ఇంటి యజమానులపై ఇక జరిమానా వేటు పడనుంది. వర్షపు నీటి సంరక్షణ, సేకరణ విధానాన్ని ఇంటిలో ఏ ర్పాటు చేసుకోకుండా అలసత్వం వహిస్తున్న న గరంలోని ఇంటి యజమానులపై ‘జరిమానా’ కొరడా విదిలించాలని బెంగళూరు జలమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జలమండలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. 50శాతం మాత్రమే అమలు..... నగరంలో భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు గాను వర్షపు నీటి సంరక్షణ, సేకరణలపై(రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) బెంగళూరు జలమండలి గతంలోనే దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నగరంలో 40ఁ60 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రతి ఇంటిలో వర్షపు నీటిని సేకరించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గృహాల్లో దాదాపు 50శాతం ఇళ్లలో మాత్రమే వర్షపు నీటిని సేకరించే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక వర్షపు నీటి సేకరణకు ప్రాధాన్యం ఇవ్వని ఇళ్ల యజమానులకు నోటీసులు ఇవ్వడం తప్పితే జలమండలి మరేమీ చేయలేకపోయింది. అందుకే వసతి ఉండి కూడా వర్షపు నీటి సేకరణకు ప్రాధాన్యం ఇవ్వని ఇళ్ల యజమానులపై ఇక ‘జరిమానా’ వేటు వేయాలని జలమండలి నిర్ణయించింది. ఇంటిలో వర్షపు నీటి సేకరణ విధానం లేని వారికి నీటి బిల్లుపై మరో 25శాతం మొత్తాన్ని జరిమానాగా విధించాలని నిర్ణయించింది. ఇందుకు జలమండలి సమితి సభలోనూ అనుమతి లభించడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో.... రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో నగరంలో సైతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు నగర వాసుల నీటి విని యోగం మాత్రం రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో వర్షపు నీటి సేకరణపై మరోసారి దృష్టి సారించాల్సిన ఆవశ్యకత జలమండలికి ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఇప్పటికే వర్షపు నీటి సేకరణ విధానాన్ని ఏర్పాటు చేసుకోని యజమానులకు జరిమానాను విధిస్తున్నారు. ఇదే విధానాన్ని నగరంలో సైతం అమల్లోకి తీసుకొస్తేనే వర్షపు నీటి సంరక్షణ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని జలమండలి భావిస్తోంది. డిసెంబర్ 1 నుండి అమల్లోకి? ఇక జలమండలి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే డిసెంబర్ 1 నుండి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని జలమండళి అధ్యక్షుడు టి.ఎం.విజయభాస్కర్ చెబుతున్నారు. ‘వర్షపు నీటి సంరక్షణా విధానాన్ని ఏర్పాటు చేసుకోని ఇంటి యజమానులకు ముందుగా జరిమానా విధిస్తాం. మూడు నెలల తర్వాత కూడా వారు అలసత్వాన్ని ప్రదర్శిస్తే జరిమానాను రెండింతలు చేస్తాం. అప్పటికీ ఇంటిలో వర్షపు నీటి సంరక్షణా విధానం ఏర్పాటు చేయకపోతే నీటి కనెక్సన్ను తొలగిస్తాం’ అని విజయభాస్కర్ తెలిపారు. -
రామప్ప సరస్సుకు పొంచి ఉన్న ముప్పు
- ముందే హెచ్చరించిన ‘సాక్షి’ - పట్టించుకోని అధికార యంత్రాంగం - వరద ఉధృతికి తెగిపోయిన తూము ఆనకట్ట - వృథాగా పోతున్న సరస్సు నీరు వెంకటాపురం : నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రామప్ప సరస్సులోని నీరు వృథాగా పోతోంది. ఈ పరి స్థితి మూడేళ్లుగా కొనసాగుతుండడంతో ‘సాక్షి’ పలు కథనాలను వెలువరించింది. దీంతో ఐబీ అధికారులు రెండేళ్ల క్రితం తూము ను మరమ్మతు చేయడానికి రూ.20 లక్షలు వెచ్చించి రింగ్‌బండ్ నిర్మాణం చేపట్టారు. తూము మరమ్మతు పనులు పూర్తయినా రింగ్‌బండ్‌ను తొలగించ లేదు. గత ఏడాది రబీ సీజన్లో రామాంజాపూర్ గ్రామానికి చెందిన రైతులు చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం లేదని చెప్పడంతో అధికారులు తూము షట్టర్లను తెరిచారు. నీరు పొలాలకు అందినప్పటికీ రింగ్‌బండ్‌కు చెందిన మట్టి షట్టర్ల కిందకు చేరింది. షట్టర్లు కిందికి దింపే ప్రయత్నం చేసినా మట్టి ఉండడంతో దిగలేదు. దీనితో నీరంతా తూము ద్వారా వృథాగా పోతోంది. ఈ విషయ మై మళ్లీ మూడు రోజుల పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించగా స్పందించిన ఐబీ అధికారులు నెలరోజుల క్రితం తూము సమీపంలో ఆనకట్ట నిర్మించారు. వేసవి కాలంలో తూము నుంచి నీరు వృథాగా పోకుండా మరమ్మతు పనులు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నాలుగు రోజు లుగా కూలీలతో తూములో పేరుకుపోయిన మట్టిని తొలగిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా వర్షాలు తీవ్రంగా కురుస్తుండడంతో అధికారులు తూము సమీపంలో నిర్మించిన ఆన కట్ట తెగిపోయింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి సరస్సులోని నీరంతా వృథాగా పోతోంది. ఐబీ అధికారు ల నిర్లక్ష్యం మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. మరో పెద్ద ఆనకట్ట నిర్మిస్తాం : డీఈ ఆనందం ఈ విషయమై ఐబీ డీఈ ఆనందంను సాక్షి వివరణ కోరగా మూడు రోజులుగా తూములో పేరుకుపోయిన మట్టిని తొలగి స్తున్నామని చెప్పారు. వర్షాలకు ఆన కట్ట తెగిపోరుు వృథాగా పోతున్న నీటిని అరికట్టేందుకు పొక్లెరుునర్ను మాట్లాడినట్లు చెప్పారు. తూము వద్ద మరో పెద్ద ఆనకట్ట నిర్మించి మూడు రోజుల్లోగా మరమ్మతులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్లకు వరంగా కాలువ పనులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీటి బొట్టును ఒడిసి పట్టాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. పాలకులు పదేపదే చెబుతున్న మాటలివి.. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెద్ద వర్షం వస్తే ఆ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి. చెరువులకు, కాలువలకు గండ్లు పడి నీటి పారుదల వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. తరచి చూస్తే కాంట్రాక్టర్ల కాసుల దాహం.. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం ఇందులో కనిపిస్తోంది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే కాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో కాలువలకు నీరు వదిలే సమయంలోనే కాంట్రాక్టర్లు పనులు చేపడుతుంటారు. అధికారులు కూడా ఆ సమయంలోనే నిధులు మంజూరు చేస్తుంటారు. దీంతో పనులు నాసిరకంగా సాగి అవి‘నీటి’లో కొట్టుకుపోతున్నాయి. కాలువ పనుల్లో ప్రవహిస్తున్న అక్రమాలపై ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు నిలదీశారు. అలాగే కాలువల దుస్థితిని కూడా సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. ప్రభుత్వమూ స్పందించలేదు. ఫలితంగా బనగానపల్లె పరిధిలోని ఎస్సార్బీసీకి మంగళవారం భారీ గండి పడి వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ఈ ఘటన మరువక ముందే బుధవారం చాగలమర్రి సమీపంలో కేసీ కెనాల్ 231/100 కి.మీ వద్ద ఓ చోట, 231/200 కి.మీ వద్ద మరో చోట గండి పడింది. రెండు చోట్ల గండ్లు పడటంతో సుమారు 300 క్యూసెక్కులకుపైగా నీరు వృథాగా పోతున్నాయి. ఇటీవల కాలంలో 0.5 కి.మీ వద్ద కేసీ కాలువకు గండిపడిన విషయం విదితమే. ప్రధాన కాలువలకు తరచూ గండ్లు పడటానికి పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయ‘కట్’.. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, ఎల్లెల్సీలను నిర్మించారు. ఎల్లెల్సీ మినహా మిగిలిన రెండు కాలువల ద్వారా వచ్చే నీటి ఆధారంగా 3.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. అయితే కొంత కాలంగా కాలువలకు విడుదలచేసే నీరు చివరి ఆయకట్టుకు అందటం లేదు. నాసిరకం నిర్మాణాలతో కట్టకున్న రాళ్లు, మట్టి కాలువల్లో చేరుతోంది. కర్నూలు- కడప కాలువను రూ.1,170 కోట్లతో ఆధునికీకరించారు. కర్నూలు నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకు 0 నుంచి 325 కి.మీ వరకు ఈ కాలువ విస్తరించింది. గండ్లు పడతాయనే ఉద్దేశంతో 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. 2,500 క్యూసెక్కులకే పరిమితం చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఏటా ఆయకట్టు తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాళ్లవాగు నీళ్లు వృథా
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీ ప్రభాత్‌నగర్ శివారులో ఉన్న రాళ్లవాగు పికప్ డ్యాం నిండుకుండలా ఉంది. కానీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. చివరి భూములకు నీరందక బీళ్లుగా దర్శమిస్తున్నాయి. రాళ్లవాగు పికప్ డ్యాం కింద మూడు వేల ఎకరాల సాగు భూమి ఉంది. కుడి కాల్వ కింద 1500 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 1500 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. మరమ్మతులు చేయకపోవడంతో... ఇటీవల ఈ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరింది. కానీ డ్యాం తూములకు మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి నీరు వృథాగా పోతోంది. మరోవైపు డ్యాం లీకై కూడా నీళ్లు వృథాగా పోతున్నాయి. కుడి ఎడమ కాల్వల చుట్టూ చెట్లు అల్లుకుపోయి లోపల సిల్టు పేరుకుపోయింది. దీంతో కాల్వ ద్వారా భూములకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా నీరు సరఫరా కాకపోవడంతో వందలాది ఎకరాల పొలాలు బీళ్లుగా మారినట్లు రైతులు తెలిపారు. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు... డ్యాం నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయని అనేకసార్లు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీజన్లో నీరు అందడం లేదని రైతులు అంటున్నారు. ఈ లీకుల కారణంగా డ్యాంలోని నీరంతా వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈ బజారన్నను వివరణ కోరగా.. రాళ్లవాగు పికప్ డ్యాం కోసం మూడు నెలల క్రితం రూ. 2 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే కాల్వలు, తూములకు మరమ్మతులు చేస్తామని అన్నారు.