రామప్ప సరస్సుకు పొంచి ఉన్న ముప్పు
- ముందే హెచ్చరించిన ‘సాక్షి’
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- వరద ఉధృతికి తెగిపోయిన తూము ఆనకట్ట
- వృథాగా పోతున్న సరస్సు నీరు
వెంకటాపురం : నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రామప్ప సరస్సులోని నీరు వృథాగా పోతోంది. ఈ పరి స్థితి మూడేళ్లుగా కొనసాగుతుండడంతో ‘సాక్షి’ పలు కథనాలను వెలువరించింది. దీంతో ఐబీ అధికారులు రెండేళ్ల క్రితం తూము ను మరమ్మతు చేయడానికి రూ.20 లక్షలు వెచ్చించి రింగ్‌బండ్ నిర్మాణం చేపట్టారు. తూము మరమ్మతు పనులు పూర్తయినా రింగ్‌బండ్‌ను తొలగించ లేదు.
గత ఏడాది రబీ సీజన్‌లో రామాంజాపూర్ గ్రామానికి చెందిన రైతులు చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం లేదని చెప్పడంతో అధికారులు తూము షట్టర్లను తెరిచారు. నీరు పొలాలకు అందినప్పటికీ రింగ్‌బండ్‌కు చెందిన మట్టి షట్టర్ల కిందకు చేరింది. షట్టర్లు కిందికి దింపే ప్రయత్నం చేసినా మట్టి ఉండడంతో దిగలేదు. దీనితో నీరంతా తూము ద్వారా వృథాగా పోతోంది. ఈ విషయ మై మళ్లీ మూడు రోజుల పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించగా స్పందించిన ఐబీ అధికారులు నెలరోజుల క్రితం తూము సమీపంలో ఆనకట్ట నిర్మించారు.
వేసవి కాలంలో తూము నుంచి నీరు వృథాగా పోకుండా మరమ్మతు పనులు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నాలుగు రోజు లుగా కూలీలతో తూములో పేరుకుపోయిన మట్టిని తొలగిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా వర్షాలు తీవ్రంగా కురుస్తుండడంతో అధికారులు తూము సమీపంలో నిర్మించిన ఆన కట్ట తెగిపోయింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి సరస్సులోని నీరంతా వృథాగా పోతోంది. ఐబీ అధికారు ల నిర్లక్ష్యం మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు.
మరో పెద్ద ఆనకట్ట నిర్మిస్తాం : డీఈ ఆనందం
ఈ విషయమై ఐబీ డీఈ ఆనందంను సాక్షి వివరణ కోరగా మూడు రోజులుగా తూములో పేరుకుపోయిన మట్టిని తొలగి స్తున్నామని చెప్పారు. వర్షాలకు ఆన కట్ట తెగిపోరుు వృథాగా పోతున్న నీటిని అరికట్టేందుకు పొక్లెరుునర్‌ను మాట్లాడినట్లు చెప్పారు. తూము వద్ద మరో పెద్ద ఆనకట్ట నిర్మించి మూడు రోజుల్లోగా మరమ్మతులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.