Ramappa lake
-
ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సీతక్క
-
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
రామప్ప సరస్సుకు పొంచి ఉన్న ముప్పు
- ముందే హెచ్చరించిన ‘సాక్షి’ - పట్టించుకోని అధికార యంత్రాంగం - వరద ఉధృతికి తెగిపోయిన తూము ఆనకట్ట - వృథాగా పోతున్న సరస్సు నీరు వెంకటాపురం : నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రామప్ప సరస్సులోని నీరు వృథాగా పోతోంది. ఈ పరి స్థితి మూడేళ్లుగా కొనసాగుతుండడంతో ‘సాక్షి’ పలు కథనాలను వెలువరించింది. దీంతో ఐబీ అధికారులు రెండేళ్ల క్రితం తూము ను మరమ్మతు చేయడానికి రూ.20 లక్షలు వెచ్చించి రింగ్‌బండ్ నిర్మాణం చేపట్టారు. తూము మరమ్మతు పనులు పూర్తయినా రింగ్‌బండ్‌ను తొలగించ లేదు. గత ఏడాది రబీ సీజన్లో రామాంజాపూర్ గ్రామానికి చెందిన రైతులు చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం లేదని చెప్పడంతో అధికారులు తూము షట్టర్లను తెరిచారు. నీరు పొలాలకు అందినప్పటికీ రింగ్‌బండ్‌కు చెందిన మట్టి షట్టర్ల కిందకు చేరింది. షట్టర్లు కిందికి దింపే ప్రయత్నం చేసినా మట్టి ఉండడంతో దిగలేదు. దీనితో నీరంతా తూము ద్వారా వృథాగా పోతోంది. ఈ విషయ మై మళ్లీ మూడు రోజుల పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించగా స్పందించిన ఐబీ అధికారులు నెలరోజుల క్రితం తూము సమీపంలో ఆనకట్ట నిర్మించారు. వేసవి కాలంలో తూము నుంచి నీరు వృథాగా పోకుండా మరమ్మతు పనులు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నాలుగు రోజు లుగా కూలీలతో తూములో పేరుకుపోయిన మట్టిని తొలగిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా వర్షాలు తీవ్రంగా కురుస్తుండడంతో అధికారులు తూము సమీపంలో నిర్మించిన ఆన కట్ట తెగిపోయింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి సరస్సులోని నీరంతా వృథాగా పోతోంది. ఐబీ అధికారు ల నిర్లక్ష్యం మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. మరో పెద్ద ఆనకట్ట నిర్మిస్తాం : డీఈ ఆనందం ఈ విషయమై ఐబీ డీఈ ఆనందంను సాక్షి వివరణ కోరగా మూడు రోజులుగా తూములో పేరుకుపోయిన మట్టిని తొలగి స్తున్నామని చెప్పారు. వర్షాలకు ఆన కట్ట తెగిపోరుు వృథాగా పోతున్న నీటిని అరికట్టేందుకు పొక్లెరుునర్ను మాట్లాడినట్లు చెప్పారు. తూము వద్ద మరో పెద్ద ఆనకట్ట నిర్మించి మూడు రోజుల్లోగా మరమ్మతులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. -
మట్టి పోసి.. మ..మ అనిపించారు..
- షట్టర్ల కింది మట్టి తొలగింపులో నిర్లక్ష్యం - రింగ్బండ్తో పొంచి ఉన్న ముప్పు - ఆందోళనలో రామప్ప రైతులు వెంకటాపురం : రామప్ప సరస్సు లీకేజీ నీటిని అరికట్టేందుకు తాత్కాలికంగా మట్టితో ఆన కట్ట నిర్మించి ఐబీ అధికారులు చేతులు దులుపుకున్నారు. రామప్ప ప్రధాన తూము నుంచి మూడు రోజులుగా సరస్సు నీరు వృథాగా పోతుందని ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు ప్రొక్లెయినర్‌తో తూము ముందు చిన్న ఆన కట్ట నిర్మించి లీకేజీ నీటిని అదుపుచేశారు. కానీ షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాల్సిన పనిని మాత్రం మరిచారు. ఒక భారీ వర్షం కురిసిందంటే తూము ముందు పేరుకుపోయిన మట్టి, రాళ్లు తూములోకి వెళ్లి నిలిచిపోతారుు. అదే జరిగితే ప్రధాన తూము నుంచి ఆయకట్టు పొలాలకు రాబోయే రోజుల్లో చుక్కసాగునీరు కూడా అందే పరిస్థితులు కనిపించడం లేదు. రామప్ప సరస్సును నమ్ముకుని పంటలు సాగుచేసుకుంటున్న రైతాంగానికి ఇక గడ్డుకాలమే ఎదురుకానుంది. రింగ్‌బండ్ తొలగించకపోతే తమ పంటపొలాలు ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లీకేజీ నీటిని అదుపు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి రింగ్‌బండ్‌ను తొలగించి షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
రైతులకు శాపంగా మారిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు
వెంకటాపురం : నీటితో రామప్ప సరస్సు కళకళలాడుతున్నా.. వర్షాలు లేవన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప సరస్సును నమ్ముకొని మండలంలోని పాలంపేట, రామాంజాపూర్, వెంకటాపురం, ఎల్లారెడ్డిపల్లె, నల్లగుంట, లక్ష్మీదేవిపేట, గంపోనిపల్లె, వీర్లపల్లె గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగుచేస్తున్నారు. 36 అడుగుల నీటిసామర్థం గల ఈ సరస్సు కింద అధికారికంగా ఐదువేల ఎకరాలు, అనధికారికంగా మరో ఐదువేల ఎకరాలు సాగవుతోంది. సరస్సు ఒకసారి పూర్తిస్థాయిలో నిండితే రెండేళ్లపాటు ఖరీఫ్, రబీ పంటలకు ఢోకా ఉండదు. దీనికింద సోమికాలువ, ఒగరు కాలువ, నల్లకాలువ ఉన్నాయి. వీటి ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. సరస్సులో 27 అడుగుల నీటిమట్టం ఉన్నట్లయితే ఖరీఫ్, రబీ పంటలు, 18 అడుగుల నీరు ఉంటే ఖరీఫ్ సాగవుతుంది. ప్రస్తుతం సరస్సులో 25అడుగుల నీరు ఉంది. అంటే ఖరీఫ్ పంటలకు సరిపడా నీరు ఉన్నట్టే. అయితే వానలు కురవలేదన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దయతలచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలైన కష్టాలు సరస్సులో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించి గత నాలుగేళ్లుగా వెంకటాపురం, గణపురం మండలాల్లోని 26 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో అధికారులు రబీ పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు రబీ పంటలను కోల్పోతున్నారు. సరస్సులోకి దేవాదుల నీరు వచ్చే వరకు మండలంలోని గ్రామాలను మినహాయిం చి ఇతర గ్రామాలకు తాగునీటి సరఫరాను నిలిపివేయాలని రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రతీ ఏటా రైతులకు, అధికారులకు మధ్య వివాదా లు చోటుచేసుకుంటున్నాయి. అసలే రబీ పంటలు కోల్పో యి నష్టాల పాలవుతున్న రైతులు.. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు కూడా అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో ఏంచేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. చేసేది లేక వరుణుడిపైనే ఆశలు పెట్టుకుని వరినార్లు పోసుకున్నారు. వేసిన పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంద ని, అధికారులు తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు.