- యథేచ్ఛగా వ్యర్థ జలాల విడుదల
- కలుషితమవుతున్న నీటి వనరులు
- వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
- వ్యాధుల బారిన పడుతున్న జనం
- పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి
మామూలుగానే పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థ జలాలను విచ్చలవిడిగా జనం మీదికి వదిలేస్తుంటాయి. ఇక వానా కాలం వస్తే పండగే.. వర్షపు నీటితో కలిసి పారిశ్రామిక వ్యర్థాలను, నీళ్లను యథేచ్ఛగా వదిలేయడం మరింత సులభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదిదే.. పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలతో పరిసర ప్రాంతాల్లోని కుంటలు, పొలాలు నిండిపోతున్నాయి.
జనం గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే లేడు. పై నుంచి పొగ.. కింద నుంచి నీళ్లు వదులుతూ పరిశ్రమలు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి వానా కాలం మాయా జాలంపరిశ్రమల తీరుకళ్లు మూసుకుంటోంది. కాలుష్య జలాలతో పచ్చని చేలు బీడుగా మారుతున్నాయి.
పరిశ్రమల తీరు ఉదాహరణకు జిన్నారం
పరిధిలో ఉన్న పరిశ్రమల సమీపంలో వెయ్యి అడుగుల లోతుకు తవ్వినా పసుపు పచ్చని నీళ్లు వస్తున్నాయంటే.. వ్యర్థ జలాలు ఈ ప్రాంతంలో ఎంతగా భూమిలోకి ఇంకిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా, పటాన్‌చెరు, శివ్వంపేట, కొండాపూర్, పుల్‌కల్, జహీరాబాద్ ప్రాంతాలు సైతం పారిశ్రామిక కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.