udhanam
-
తిత్లీతో తక్షణ జీవనాధారం కరువు
అక్టోబర్ 11 వ తేదీన ముంచుకొచ్చిన తిత్లీ తుఫాను ఉద్దానం ప్రజల జీవికను చుట్ట చుట్టి తన విలయపు రెక్కల మీద మోసుకు పోయింది. ఒక మత్స్యకార మహిళ మాటల్లో చెప్పాలంటే ‘‘తుఫాను యిరిగినాక సూత్తే వూరు తామర లాగా పైకి తేలినాది’’. విశాఖనుంచి ఒక బృందంగా కూడి నవంబర్ 1 తేదీన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. 160 కిలోమీటర్ల మేర విస్తరించిన తిత్లీ ప్రభావం శ్రీకాకుళం జిల్లా తామరపల్లి నుంచే కనపడసాగింది. పూండి నుంచి ఇద్దువానిపాలెం వరకూ దాదాపు నలభైగ్రామాలని చూశాం. పదిగ్రామాల లోపలికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాం. తుఫానుకు ఎడాపెడా కూలిపోయిన కొబ్బరి, జీడిమామిడి, పనస చెట్లతోపాటు అనేకచెట్లు ఎండి మోడువారుతున్నాయి. వాటి తొలగింపుకి ప్రభుత్వం సమకూర్చిన కోతమిషన్లు మొదలు నుంచి కొమ్మల్ని వేరుచేసి వెళ్ళిపోతున్నాయి. పదిమంది కలిస్తే తప్ప ఎత్తలేని చెట్టు మొదళ్ళు, కొమ్మలు–లారీల కొద్దీ ఎత్తవలసిన కొబ్బరిబొండాల గుట్టలని ఏం చేయాలో అర్థంకాక అలాగే వదిలేశారు రైతులు. పోయినవి ఏడాదికి ఒకటి రెండుసార్లు వేసుకునే పంటలు కాదు, నాటిన పదేళ్ళకి కాపుకి వచ్చే పంటలు. ఇక అన్నేళ్ల పాటు వేలాది చిన్నకారు రైతుల జీవిక ఎలా గడు స్తుంది అన్నది ఇపుడు సమస్య. ఒకటీ అరా వేర్లు భూమిలోకి అంటుకుని ఉంటే చెట్టు చిగురించే ఆస్కారం ఉంది కనుక కొమ్మలు కొట్టేసి మొదలుని అలాగే ఉంచుతున్నారు కొందరు రైతులు. కానీ మొదలుకూడా తీసేస్తేనే నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు అధికారులు. ఉంచాలో తీయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులే ఎక్కువ అండగా నిలబడ్డారని ప్రజలు చెపుతున్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లోకి ప్రభుత్వమే కదిలి వెళ్ళాలన్న ఆలోచన మంచిదే. కానీ పటాటోపాల రాజకీయవ్యవస్థలో పెద్దలరాక ఊరికి బరువు తప్ప ఓదార్పు కాదు. స్థానికంగా పని చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు, వచ్చీపోయే వారి ప్రొటోకాల్ కోసం పరుగులు తీయడంలో మునిగిపోయారు. సర్వేలు చేసి, ఆన్ లైన్లో పొందుపరిచి నష్టపరిహారం ఇవ్వాలనుకోవడం పక్కా ప్రణాళిక కావచ్చు. కానీ సర్వం కోల్పోయిన వారికి ఎంత తొందరగా సాయం అందితే అంత ఉపశమనం కలుగుతుంది. విపత్తు వచ్చి ఇరవైరోజులు దాటినా వారికి భరోసా కలగకపోవడమే విషాదం. విపత్తువల్ల ప్రజల మానసికస్థితి ఊహించని మార్పులకి లోనవుతుంది. గొల్ల గండి గ్రామానికి వెళ్ళే తోవలో ఒకచోట భార్యాభర్తలిద్దరు చిన్నిచిన్ని ఎండుకొమ్మలు విరిచి పక్కన పెడుతూ కనిపించారు. మిగతావారు కనపడటం లేదేంటని అడిగితే ‘‘ఇదంతా సూసి బరాయించుకోనేక వూరువూరంతా తుండుగుడ్డ కప్పుకోని ఇంట్లోట పడుకుంది’ అని చెప్పిందామె. అంతేకాదు ‘ఇంట్లోట ఎండగా ఉంటే తోటకి వచ్చి సల్లగా కూకునేవాళ్ళం, తోటే ఎండ గొడతంటే ఎందల పడేది’ అని నిట్టూ ర్చింది. ప్రజలకి పునర్నిర్మాణం మీద ఆశ మానసికంగా కూడా కలగాలి. ఇద్డువానిపాలెం పరిస్థితి అత్యంత విషాదకరం. సముద్రతీర గ్రామం కావటాన ఏడెనిమిదేళ్ళ కిందట అక్కడికి దగ్గరలో ఉన్న బోరువంకలో వారికి స్థలం కేటాయించారు. ఈ తుఫానుకి గ్రామం సగం ఊడ్చిపెట్టుకుపోయింది. కానీ ఆన్లైన్లో వారిపేర్లు లేవు. ఎందుకంటే వారికి బోరువంకలో స్థలం కేటాయించారు కనుక అక్కడనే వారి ఇల్లు చూపించాలి. ‘మా ఊరిని దత్తత తీసుకోమని ఎవరికైనా చెప్పండి’ అంటూ పోరాటాలగడ్డ మీద పుట్టిన యువకుడు ‘కర్రి నాగరాజు’ నిస్సహాయతతో అన్నమాటలు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి. తీరప్రాంతపు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం నివారణా మార్గాలను అమలుచేయాలి. భూమికోతని ఆపే రావణుడి మీసాలనే నేలతీగెలు, తీరప్రాంతపు తుఫానుగాలుల తీవ్రతని తగ్గించే పొట్టి చెట్లు, మొగలి పొదలు, సరుగుడు చెట్లతో మూడంచెల రక్షణవనాల పెంపకం సంబంధిత శాఖలు నిర్వహించాలి. తుఫాను షెల్టర్లను ప్రజలు ఉపయోగించుకునే భవనాలుగా మార్చాలి. ప్రజల తక్షణ జీవనాధారం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు ఆహ్వానించి అమలు చేయాలి. (పర్యటించిన బృందం: కృష్ణాబాయి, జెవి రత్నం, నారాయణ వేణు, శశాంక్, రవి, ఈ వ్యాసకర్త) వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘ 88850 16788 సందర్భం కె.ఎన్. మల్లీశ్వరి -
పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం
టెక్కలి : ఉద్దానం సమస్యను ప్రభుత్వం గాలికి వదిలేసిందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించడం అర్ధరహితమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. గతంలో పవన్ కల్యాణ్ ఉద్దానంలో పర్యటించిన అనంతరం అక్కడ కిడ్నీ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. అప్పుడు ఇదే పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలి పారని, ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చే యడం తగదన్నారు. గడచిన కాలంలో ఉద్దా నం ప్రాంతంలో పెద్ద ఎత్తున శుద్ధ జలం ప్లాం ట్లు, జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అంతే కాకుండా కిడ్నీ బా ధితులకు పింఛన్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పరిస్థితులపై అవగాహన లేకుండా పవన్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటీవల కాలంలో తిరుపతి దేవస్థానం విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా రమణ దీక్షితులు సీఎం చంద్రబాబుపై లేనిపోని వి మర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కాపలాదారుని గా ఉన్నానని, రావివలస ఫ్యాక్టరీ యాజమాన్యం తనకు 2 ఎకరాల భూమి ఇచ్చారని కొంత మంది ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ ఎం.సుందరమ్మ, జెడ్పీటీసీ కె.సుప్రియ, వైస్ ఎంపీపీ హెచ్.రామకృష్ణ బి.శేషగి రి, ఎం. రాము, పి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్నాయుడిపై పవన్ కల్యాణ్ ధ్వజం
టెక్కలి : ‘అచ్చెన్నాయుడూ.. 2014 ఎన్నికల్లో నీ గెలుపు కోసం నాతో పాటు జనసేన కార్యకర్తలు భుజం కాశాం.. ఇప్పుడు ఆ భుజాలను నరికివేశావు.. నియోజకవర్గ సమస్యలతో పాటు ఉద్దానం కిడ్నీ బాధితులు, మత్స్యకారుల బాధలను గాలికొదిలేశావు..’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా బుధవారం టెక్కలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై గతంలో పర్యటన చేస్తే ప్రభుత్వం హడావుడి చర్యలు చేసిందని, ఇప్పటికీ బాధితులకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేదన్నారు. విదేశాల నుంచి వైద్య నిపుణులను తీసుకువస్తే కనీసం వారిని నియమించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో సమస్యలు గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. థర్మల్ పోరాటంలో ఉద్యమకారులు అశువులు బాశారని, ఇప్పుడు భావనపాడు పోర్టు నిర్మాణం విషయంలో స్పష్టత లేకుండా ఆదాని కంపెనీలతో లాలూచీ చేసుకుంటున్నారని ఆరోపించారు. తన పోరాట యాత్రను అడ్డుకోవడానికి గుండాలతో రౌడీ మూకలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి చేష్టలకు బెదిరే ప్రసక్తి లేదన్నారు. ఎంతో పచ్చని వాతావరణం కలిగిన జిల్లాను అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించే కుట్రలు చేస్తే సహించేది లేదన్నారు. ఉపాధి లేక వేలాది మంది వలసపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తన పోరాట యాత్ర ముగిసేలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా పట్టణంలో కవాతు నిర్వహించేందుకు సిద్ధం కాగా శివారు ప్రాంతంలో ఆటంకాలు కలిగించారంటూ పవన్‌తో పాటు ఆయన కార్యకర్తలు తారస్థాయిలో మండిపడ్డారు. సభలో జనసేన నాయకులు రియాజ్, ప్రభు, పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరరావు, స్థానిక కార్యకర్తలు కె.యాదవ్, ఎ.శ్రీధర్, ఎన్.శేఖర్, కె.కిరణ్, ఎం.పూర్ణ, ఎం.అవినాష్, డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌కు బందోబస్తు : ఎస్పీ శ్రీకాకుళం సిటీ: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆ పార్టీ అభ్యర్థన మేరకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు సబ్ డివిజన్ పోలీసు అధికారులకు సెక్యూరిటీ పరంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా తరుపున పీఎస్వోలు, రోప్ పార్టీలు, మప్పికాంపోనెంట్, ట్రాఫిక్ కాంపోనెంట్, లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్‌కల్యాణ్ బస చేసిన విడిది వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
శుద్ధ ప్రచారమే!
♦ ఉద్దానంలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటులో కనిపించని వేగం ♦ కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు అందని శుద్ధజలం ♦ హామీలు నెరవేర్చకపోవడంపై ఉద్దానం వాసుల ఆగ్రహం కంచిలి, సోంపేట : జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి శుద్ధజలం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు నిజం కావడానికి ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఉత్సాహంగా ప్ర కటించిన నేతలు పనుల్లో ఆ ఊపు చూపించడం లేదు. ఒకచోట పనులు చేసి వంద చోట్ల చేసినట్లు ప్రచారం మాత్రమే జరుగుతోంది. మండలానికి ఒక యూనిట్ ప్రాతిపదికన పనులు చేపడతామని వారు చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు పొం తన కుదరడం లేదు. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్థానిక టీడీపీ నేతలు చాలా సార్లు చెప్పారు. తీరా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చి పలాస వరకు తిరిగి ఇచ్ఛాపురం ని యోజకవర్గానికి వెళ్లకపోవడంతో అ క్కడి ప్రజలు, పార్టీ క్యాడర్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఆర్ఓ ప్లాంట్ల పథకాన్ని సోంపేటలో ప్రారంభిస్తామనే అంశం కూడా అడుగున పడింది. ప్రాణాలు పోతున్నాయి.. కిడ్నీ వ్యాధి మూలాన ఉద్దానంలో ఎంతో మంది కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణాలను కనుగొనలేకపోయారు. అయితే కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో గల నీటిలో ఏదో సమస్య ఉందనే అనుమానంతో చా లా వరకు ఉద్దాన ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాను చేపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ఈ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. టెక్కలి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మం డలానికో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీరందించటానికి ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణ పరిధి బిరుసువాడ వద్ద ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యింది. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో పరిశీలిస్తే.. కంచిలి మండలంలో మండపల్లి పంచాయతీ పరిధి ఒరియా నారాయణపురం గ్రామంలోను, కవిటి మండల కేంద్రంలోను, ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామంలో ఇప్పటి వరకు కేవలం బోర్ల తవ్వటం మాత్రమే అయ్యింది. దీంతో టీడీపీ నేతల ప్రకటన ఆరంభ శూరత్వమేనా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. సోంపేటలో రూ.1.88కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 16 హేబిటేషన్లలో, కంచిలిలో రూ.1.95కోట్లతో ప్లాంటు ఏ ర్పాటు చేసి 21 హేబిటేషన్లలోను, ఇచ్ఛాపురం మండలం లో రూ.1.47కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 13 హేబిటేషన్లలోను, కవిటిలో రూ.2.93కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 38 హేబిటేషన్లలో సబ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మండలానికో ఆర్ఓ ప్లాంటు ప్రధానమైనది ఏర్పాటు చేసి, అక్కడ నుంచి కిడ్నీవ్యాధుల ప్రభావం ఉండే హేబిటేషన్ గ్రామాలకు 5వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్లను ట్రాక్టర్ల సహాయంతో సరఫరా చేసి, అక్కడే సబ్పాయింట్లు పెట్టి 20 లీటర్ల నీటిని రూ.2లు చొప్పున స్వైపింగ్ కార్డులతో అమ్మకాలు జరుపుతామని సన్నాహాలు చేస్తున్నారు. అయితే పనుల్లో వేగం లేకపోవడం స్థానికులను అసహనానికి గురి చేస్తోంది. సమాధానాలు ఏవీ? ప్రభుత్వం తరఫున మండలానికో చోట ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి హేబిటేషన్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా తీసుకెళ్లి, అక్కడ సబ్పాయింట్ల వద్ద సరఫరా చేసే ప్రక్రియ ఎన్నాళ్లు సాగుతుందో అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఒక్కో హేబిటేషన్కు 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ నీళ్లు సరిపోతాయా లేదా సరిపోకపోతే అవసరమైనన్ని నీళ్లు సరఫరా చేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ దీనికి సమాధానం చెప్పేవారే లేకపోయారు. మందస : మందస మండలంలోని ఉద్దాన ప్రాంతానికి శుద్ధజలం అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన హామీ గాల్లో కలి సిపోయింది. ఉద్దాన ప్రాంతానికి కేంద్రం హరిపురం కావడంతో రివర్స్ ఆస్మాసిస్(ఆర్ఓ)ప్లాంట్‌ను హరిపురంలో ని ర్మించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. హరిపురంలో ఆక్రమణ భూములు, ప్రభుత్వ భూములుండగా వాటి ని వదిలేసిన అధికారులు శ్మశానం పక్కన ఉన్న భూమిని ఎంచుకున్నారు. అయితే ఆ నీటిని ఎలా తాగుతామని ఉద్దా నం వాసులు ముందు నుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ లోగా ఏమైందో ఏమో ఈ స్థలాన్ని కాదని పాత ఆర్ అండ్ బీ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు, సర్వేయర్లు వెళ్లి ఈ ప్రాంతంలోనే ఆర్ఓ ప్లాం ట్ నిర్మించాలని సర్వే కూడా చేశారు. కానీ పనులు ముం దుకు కదల్లేదు. ప్రభుత్వం తలచుకుంటే స్థల సమస్య పెద్దదేం కాదు. కానీ వారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఉద్దానానికి శుద్ధజలం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.