![Pawan's comments are meaningless - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/26/Untitled-8.jpg.webp?itok=0Tb1XAcL)
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి : ఉద్దానం సమస్యను ప్రభుత్వం గాలికి వదిలేసిందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించడం అర్ధరహితమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. గతంలో పవన్ కల్యాణ్ ఉద్దానంలో పర్యటించిన అనంతరం అక్కడ కిడ్నీ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.
అప్పుడు ఇదే పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలి పారని, ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చే యడం తగదన్నారు. గడచిన కాలంలో ఉద్దా నం ప్రాంతంలో పెద్ద ఎత్తున శుద్ధ జలం ప్లాం ట్లు, జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అంతే కాకుండా కిడ్నీ బా ధితులకు పింఛన్ కూడా అందజేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో పరిస్థితులపై అవగాహన లేకుండా పవన్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటీవల కాలంలో తిరుపతి దేవస్థానం విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లుగా రమణ దీక్షితులు సీఎం చంద్రబాబుపై లేనిపోని వి మర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
టెక్కలి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కాపలాదారుని గా ఉన్నానని, రావివలస ఫ్యాక్టరీ యాజమాన్యం తనకు 2 ఎకరాల భూమి ఇచ్చారని కొంత మంది ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సమావేశంలో ఎంపీపీ ఎం.సుందరమ్మ, జెడ్పీటీసీ కె.సుప్రియ, వైస్ ఎంపీపీ హెచ్.రామకృష్ణ బి.శేషగి రి, ఎం. రాము, పి.అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment