Acchennayudu
-
ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై సందిగ్థత ఏర్పడింది. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతూ ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికను పూర్తిచేయాల్సి వుంది. కానీ, కరోనా పేరుతో వాటన్నింటినీ వాయిదా వేశారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే అయినా ఏపీ అధ్యక్షుడి ఎంపికపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావును తప్పించాలని గతంలోనే నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఆ పదవికి సరిపోడనే అభిప్రాయం వచ్చింది. దీనికితోడు ఆయన ఓటమిపాలవడం, ఓడిపోయిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు 63.49 శాతం) అచ్చెన్నాయుడుపై పునరాలోచన ఈ నేపథ్యంలో.. అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేశారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ మార్పు చేయకుండా కొద్దిరోజుల తర్వాత చేద్దామని ఆగారు. గత వారం జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. అన్ని కమిటీల నియామకాన్ని వాయిదా వేశారు. బీసీలు పార్టీకి దూరమయ్యారనే ఉద్దేశంతో ఆ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి అవకాశమిస్తే బాగుంటుందని మొదట్లో చూసినా ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కళా వెంకట్రావులా కాకుండా దూకుడుగా ఉంటాడని, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోననే అభిప్రాయం అగ్రనాయకత్వంలో ఏర్పడినట్లు తెలిసింది. బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చాక ఆయన బలపడితే భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. (డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు) -
మద్దతంటూనే మెలిక!
సాక్షి, అమరావతి: ‘ఏపీ దిశ’ చట్ట రూపకల్పన బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం శాసనసభలో చేసిన అసందర్భ ప్రస్తావనలు శాసనసభలో దుమారం రేపాయి. బిల్లుపై సూచనలు చేయడానికి బదులు ఎలక్షన్ వాచ్ డాగ్ రిపోర్టులంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రులు, అధికార పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సూచనలు కోరితే ఏమిటిది? హోంమంత్రి సుచరిత ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణ బిల్లు ప్రతిపాదించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని, అయితే ఈ ఉత్సాహం అమలులోనూ ఉండాలన్నారు. తక్షణ న్యాయం అనేది ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారని, దానిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎలక్షన్ వాచ్ డాగ్ ఏడీఆర్ నివేదిక ప్రకారం ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని విపక్ష నేత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు. ఆ ఘనత మీదే.. తహశీల్దారు వనజాక్షి కేసులో చంద్రబాబు నిర్వాకాన్ని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రశ్నించారు. ఓ మహిళా అధికారిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రశంసించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఐజీపీ హోదా కలిగిన ఎన్.బాలసుబ్రమణ్యంపై నాడు టీడీపీ ఎంపీ, ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు దాడి చేస్తే బాధిత అధికారికి న్యాయం చేయడానికి బదులు పంచాయితీ చేసిందెవరని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రి వెలంపల్లి అభ్యంతరం తెలిపారు. టీడీపీ హయాంలో తమపై కేసులు పెట్టారంటూ కాల్ మనీ, సెక్స్‌రాకెట్ కేసులను ప్రస్తావించారు. ఎర్రగడ్డ ఆస్పత్రి...అమరావతిలో మానసిక చికిత్సాలయం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ దళిత మహిళ టెక్కలి సీఐ, ఎస్ఐ, అచ్చెన్నాయుడి వేధింపులు భరించలేక గతంలో సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిందని ఎమ్మెల్యే అప్పలనాయుడు గుర్తు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ అధికార పార్టీ సభ్యులు, మంత్రుల వ్యాఖ్యలు వినలేకపోతున్నామని, కొడాలి నానీని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిస్తే మంచిదనటంతో వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అచ్చెన్నను ముందు వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చాలని, అమరావతిలో మానసిక చికిత్సాలయం ఏర్పాటు చేసి అందులో తొలి పేషెంట్‌గా చంద్రబాబును చేర్చాలని లేదంటే ఆయన మార్షల్స్‌ను, పోలీసులను కొడుతుంటారని మంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ దశలో అచ్చెన్న, కొడాలి నానీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు బిల్లుకు మద్దతిస్తున్నామంటూనే మార్షల్స్‌తో జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని, తాను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు, కన్నబాబుకు మధ్య ’నాయుడు’ అనే పదంపై వాగ్వాదం జరిగింది. -
అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ అన్నింటిలో దందా చేసుకుని కమీషన్లు దండుకుని అవినీతిపరుడిగా పేరు సంపాదించుకున్న నువ్వా అవినీతిరహిత పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి పాలన గురించి మాట్లాడేది.. అంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏౖMðక సీఎం జగన్ అని అన్నారు. సీఎం రోజుకు 20 గంటలు కష్టపడి నవరత్నాల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అవినీతిరహిత, పారదర్శక పాలన అందించేందుకు పాటుపడుతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం నాణ్య మైన బియ్యం పంపిణీని చేపట్టారని.. ఒక్క రో జులో 92 శాతం పూర్తిచేశారని.. హర్షించాల్సింది పోయి అక్కసుతో టీడీపీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. ఎక్కడో ఒక చోట తడిసిన బి య్యాన్ని పట్టుకుని దాన్నే హైలెట్ చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగుల బాధలను తీర్చేం దుకు రూ.600 కోట్లతో తాగునీరు పంపిణీ, 200 పకడల సూపర్‌స్పెషాలటీ హాస్పటల్ ని ర్మాణానికి ఈ నెల 6వ తేదిన సీఎం శంకుస్ధాపన చేస్తే దానిపై విమర్శించడం సిగ్గులేని తనా నికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఉద్దాన ప్రాంతంలో గల బెంతు ఒరియాలు, బుడగ జంగాలు తమ సమస్యలు విన్నవించుకుంటే దానిపై ప్రత్యేక కమిషన్ వేసి ఆదుకున్నారన్నారు. మత్య్సకారుల అభివృద్ధికి జెట్టీలనిర్మానానికి, కోల్డ్ స్టోరేజీకి, భావనపాడు పోర్టు నిర్మానానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం హర్షనీయమన్నారు. అలాగే తిత్లీ తుపాన్లో నష్టపోయిన కొబ్బరి రైతులకు, జీడిమామిడి రైతులకు పరిహారాల పెంపు మాట నిలబెట్టుకుని బాధితులందరికీ న్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రధాన ప్రాజెక్టులైన వంశధార ప్రాజెక్టు, నేరడి బ్యారేజ్ నిర్మాణం, ఆఫ్‌షోర్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా ఐదేళ్ళు గడిపేశారన్నారు. జిల్లాలో కోడిరామ్మూర్తి స్టేడియం, టెక్కలిలో స్టేడియం, జూనియర్ కళాశాల నిర్మాణం, ఇలా అనేక హామీలను గాలికొదిలేశారన్నారు. అచ్చెన్నది నేర చరిత్ర అచ్చెన్నాయుడు తన రాజకీయ హవా చూపించి అధికారులను బెదిరించడం, ఎస్సీ కులస్తులపై దాడి చేయడం వంటి కేసుల్లో ఇరుక్కుని నేటికీ కోర్టుకు హాజరవుతున్నారని దువ్వాడ ధ్వజెమెత్తారు. నిమ్మాడలో తన మాట వినని వారికి గ్రామ బహిష్కరణ చేసి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నాడన్నారు. అలాగే నిత్యం గ్రానైట్ క్వారీల వద్ద నుంచి కమీషన్‌గా బ్లాక్‌లను తీసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న నాయకుడు అచ్చెన్నాయుడని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, వైన్స్, ధాన్యం, మినుములు అన్నింటిలో దోపిడీ చేసుకుని అవినీతిపరుడిగా ముద్ర పడ్డారన్నారు. ‘ నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. తేదీ, వేదిక నువ్వు చెప్పాలని’ సవాలు విసిరారు. అలాగే ఎన్నికల్లో 12 బూత్‌లలో రిగ్గింగ్ చేసి భయపెట్టి గెలవడం గొప్ప కాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టె‘క్కలి కాలం’.. మాఫియా జాలం
సాక్షి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వాడు మన పార్టీకి ఓటేయలేదు సార్.. అని ఓ కార్యకర్త చెబితే చాలు! వెంటనే అతని పెన్షన్ రద్దయిపోతుంది. ఈ డీలర్ వైఎస్సార్సీపీ అభిమాని సార్.. అంటే అతని రేషన్‌షాపు లైసెన్స్ కేన్సిల్ అయిపోతుంది. ఈ వీఆర్వో మనకు అనుకూలంగా పని చేయడం లేదంటే ఆయనకు బదిలీ అవుతుంది. అంతేనా? అభివృద్ధి పనులన్నీ అయిన వారికే దక్కుతాయి. మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సక్రమంగా వ్యాపారం సాగించుకోవాలన్నా, గ్రానైట్ వ్యాపారుల జోలికి అధికారులు వెళ్లకుండా చూడాలన్నా ఆయన అండదండలతోనే సాధ్యమవుతాయి.. ఇవన్నీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మాఫియా నాయకుడిని తలపించేలా సాగిస్తున్న రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అక్రమాలు, అరాచకాలు..!! ఐదేళ్ల క్రితం 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు అచ్చెన్నాయుడు. ఆ ఎన్నికల్లో ఆయన ప్రజలను కాకుండా రిగ్గింగ్నే నమ్ముకుని అతి కష్టమ్మీద వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఈ ఐదేళ్లలో అచ్చెన్న అండ్ కో అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడ్డారు. జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. అభివృద్ధి పను ల కాంట్రాక్టులను సొంత సంస్థకు బదలాయించుకున్నారు. మద్యం వ్యాపారుల నుంచి, రైస్‌మిల్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కోట్లు కుమ్మరించే గ్రానైట్ వ్యాపారులకు అండగా నిలిచారు. అచ్చెన్న అండ చూసుకుని ఆయన అనుచరగణం భూఆక్రమణలు, కబ్జాలకు తెగబడ్డారు. కోటబొమ్మాళి కేంద్రంగా అచ్చెన్నాయుడి అనుయాయులు నకిలీ బ్రాండెడ్ మద్యం సీసాల మూతలు, రేపర్ల తయారీని చేపట్టారు. వివిధ మార్గాల నుంచి కమీషన్లను వసూలు చేసే బాధ్యతను మంత్రి సోదరుడు హరిప్రసాద్ చూసుకుంటారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో కొండలు, గుట్టలు, చెరువులను మంత్రి గారి వందిమాగదులు కబ్జా చేసేశారు. అమ్మో నిమ్మాడ..! నిమ్మాడ.. అచ్చెన్నాయుడి సొంతూరు. ఆ ఊళ్లో దాదాపు 40 వరకు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లున్నాయి. అక్కడ క్వారీల నుంచి యూనిట్లకు గ్రానైట్‌ను అనుమతులకు మించి తరలిస్తుంటారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించాల్సి ఉంటుంది. ఇలా జరిమానాగా వసూలు చేయాల్సిన సొమ్ము రూ.కోట్లలో ఉంటుందని చెబుతా రు. కానీ మైనింగ్ అధికారులు ఆ యూనిట్ల వైపు తొంగిచూసే సాహసమే చేయరు. పైగా ఈ వ్యాపారుల నుంచి నెలనెలా వీరే వసూలు చేసి మంత్రి కిచ్చే బాధ్యతను నెత్తికొత్తుకున్నారని చెబుతారు. సంబంధిత గ్రానైట్ వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు చెల్లిస్తుండడం వల్ల వారిపై ఈగ వాలకుండా చూసుకుంటారు. రిగ్గింగ్‌తో బయటపడి.. 2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు సంతబొమ్మాళి మండలంలో 15 చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడి 8,387 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేవు. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. అచ్చెన్న, ఆయన బృందం అక్రమాలు, అరాచకాలకు విసిగి వేసారిపోయారు టెక్కలి ఓటర్లు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్యేను చేస్తే ఇంకెంతగా దోచుకుంటారోనని భీతిల్లుతున్నారు. అందుకే అచ్చెన్నకు ఓటుతో ఎప్పుడు బుద్ధి చెబుదామా? వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను ఎప్పుడు గెలిపిద్దామా? అని ఎదురు చూస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం, అచ్చెన్నపై వ్యతిరేకత, జగన్ ప్రభంజనమే కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అచ్చెన్నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అన్యాయాలకు అంతే లేదు.. కోటబొమ్మాళి మండలం యలమంచిలికి చెందిన కెల్లి తవుడుకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు అండతో టీడీపీ కార్యకర్తలు అతడి పింఛన్ తొలగించేశారు. మనస్థాపానికి గురైన ఆ వృద్ధుడు మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కర్రి అప్పారావు అనే వృద్ధుడి పెన్షను కూడా జన్మభూమి కమిటీ సభ్యులు తొలగించారు. పోరాటం చేసి చివరకు మనస్థాపంతో చనిపోయాడు. ఇలా ఈ గ్రామంలో 13 మంది వృద్ధులు మనస్థాపానికి గురై మరణించారు. టెక్కలి మండలం బూరగాంలో గాసయ్య అనే వ్యక్తి రేషన్ డిపో నిర్వహిస్తుండేవాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు అండతో గాసయ్య డీలర్‌షిప్‌ను తొలగించేశారు. వైఎస్సార్ సీపీకు అనుకూలంగా ఉన్నాడనే కక్షతో డీలర్‌షిప్‌ను రద్దు చేయించారు. అచ్చెన్న అండ్ కో ఘనతలు.. మచ్చుకు కొన్ని..! ♦ టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మల్టీ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడానికి రూ.80 కోట్లు మంజూరయింది. అర్హత లేకపోయినా దాని కాంట్రాక్టు రవాణా శాఖమంత్రి కూడా అయిన అచ్చెన్న బినామీ శ్రీనివాస్‌కే దక్కింది. ♦ నియోజకవర్గ అభివృద్ధి పనులను తొలుత బినామీలు/అనుచరులు దక్కించుకుంటారు. ఆ తర్వాత అచ్చెన్న సోదరుడి కుమారుడు పేరిట ఉన్న సురేష్ కన్స్ట్రక్షన్స్ పరం చేస్తారు. ఆ పనులను సురేష్ పూర్తి చేస్తారు. ♦ నియోజకవర్గ కేంద్రం టెక్కలి రోడ్డు విస్తరణలో 150కి పైగా ఇళ్లను తొలగించారు. 2015 నుంచి పరిహారం ఇవ్వకపోవడంతో చాలామంది పేదలు రోడ్డున పడ్డారు. ♦ రాయివలసలో ఉన్న మెట్కోర్ ఫెర్రో అల్లాయీస్ సంస్థ మూసివేయడంతో 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరికి 60 శాతం వరకు జీతాలొచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కార్మికమంత్రిగా ఏమీ చేయలేకపోయారు. ♦ పెన్షన్లు, రేషన్ కార్డులు తమ వారికి మంజూరు చేయాలన్నా, వైఎస్సార్సీపీ వారివి రద్దు చేయాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు కట్టబెట్టారు. ♦ ఉదాహరణకు కోటబొమ్మాళి మండలం యలమంచిలిలో వైఎస్సార్సీపీకి చెందిన 80 మంది వృద్ధాప్య పెన్షన్లు తొలగించారు. ఈ అన్యాయంపై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ల నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట 40 రోజులపాటు బాధితులు దీక్షలు చేశారు. చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించినా అచ్చెన్న సామ్రాజ్యంలో ఇప్పటికీ అమలు కాలేదు. వీరిలో 13 మంది మనోవేదనతో చనిపోయారు. ♦ తాను చదువుకున్న టెక్కలి డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఇప్పటికీ మరుగుదొడ్లకు ర న్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేకపోవడం అచ్చెన్న అభివృద్ధికి ఓ మచ్చుతునక! అన్యాయంగా పింఛన్ తీసేశారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాననే కక్షతో మా గ్రామ టిడీపీ నేతలు నా పింఛన్‌ను అన్యాయంగా తీసేశారు. పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినా పింఛన్ ఇవ్వలేదు. –కవిటి కేశవయ్య, బాధిత వృద్ధుడు, యలమంచిలి, టెక్కలి నియోజకవర్గం -
అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశాడో సమాధానం చెప్పాలని విష్ణుకుమార్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడంలేదని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ‘ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసు. అందుకే ఆయన నల్ల చొక్కా ధరించలేదు’ అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ పోరు ఉధృతం చేశారని గ్రహించిన టీడీపీ యూటర్న్ తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘మొన్నటివరకు జగన్, పవన్, బీజేపీ ఒకటి అని విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. -
అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా..
వజ్రపు కొత్తూరు రూరల్: తిత్లీ తుపాన్ బాధితులను పరామర్శించడానికి మంగళవారం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గరుడబద్ర, బైపల్లి, బాతుపురం, చినవంక, డోకులపాడు, తాడివాడ, కిడిసింగి, వజ్రపుకొత్తూరు గ్రామాల్లో అయన పర్యటించారు. చంద్రబాబు మాట్లాడుతుండగా బాధితులు అడుగడుగునా నిరసన వ్యక్తం చేశారు. చినవంక గ్రామంలో సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు యువకులు అడ్డుతగిలారు. దీంతో చంద్రబాబు అగ్రహాంతో ఊగిపోయారు. నోర్ముయ్.. చెప్పింది విను అంటూ వారిపై కన్నెర్ర చేశారు. ‘‘నాతో వితండవాదం చేయకండి. బుద్ధి ఉండి మాట్లాడండి. నాకు అడ్డు తగిలితే బుల్డోజర్తో తొక్కిస్తా. నేను 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా.. నా దగ్గర తోక జాడిస్తే తోక కత్తిరిస్తా’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు తీరుపై తుపాన్ బాధితులు మండిపడ్డారు. తమ రుణాలను మాఫీ చేయాలని మహిళలు కోరగా.. అందుకు డబ్బులు రాష్ట్రంలో లేవని చంద్రబాబు బదులిచ్చారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు జరగడం లేదని చినవంక గ్రామస్తులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ కలుగుజేసుకొని మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లానని అన్నారు. అయన(అచ్చెన్నాయుడు) మాత్రం ఏం చేస్తారులే అని చంద్రబాబు బదులివ్వడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల సహాయం కోరాం తుపాన్ బాధితులను ఆదుకోవాలని ఇతర రాష్ట్రాల సహాయాన్ని కోరామని, బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం
టెక్కలి : ఉద్దానం సమస్యను ప్రభుత్వం గాలికి వదిలేసిందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించడం అర్ధరహితమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. గతంలో పవన్ కల్యాణ్ ఉద్దానంలో పర్యటించిన అనంతరం అక్కడ కిడ్నీ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. అప్పుడు ఇదే పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలి పారని, ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చే యడం తగదన్నారు. గడచిన కాలంలో ఉద్దా నం ప్రాంతంలో పెద్ద ఎత్తున శుద్ధ జలం ప్లాం ట్లు, జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అంతే కాకుండా కిడ్నీ బా ధితులకు పింఛన్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో పరిస్థితులపై అవగాహన లేకుండా పవన్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటీవల కాలంలో తిరుపతి దేవస్థానం విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా రమణ దీక్షితులు సీఎం చంద్రబాబుపై లేనిపోని వి మర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కాపలాదారుని గా ఉన్నానని, రావివలస ఫ్యాక్టరీ యాజమాన్యం తనకు 2 ఎకరాల భూమి ఇచ్చారని కొంత మంది ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ ఎం.సుందరమ్మ, జెడ్పీటీసీ కె.సుప్రియ, వైస్ ఎంపీపీ హెచ్.రామకృష్ణ బి.శేషగి రి, ఎం. రాము, పి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో బీరు రాజకీయాలు
-
నేను అలా అనలేదు: అచ్చెన్నాయుడు
విజయవాడ : నిరుద్యోగ భృతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోలేదని, దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సమాచారం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రన్న పథకం ద్వారా 2 కోట్లమందికి బీమా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
బాబుకు నోటీసులిస్తే ఖబడ్దార్
* కేసీఆర్‌కు మంత్రులు అచ్చెన్న, దేవినేని హెచ్చరిక * రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేస్తే తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అక్రమాలను రోజుకొకటి చొప్పున బహిర్గతం చేస్తామని మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని, చంద్రబాబును దెబ్బతీసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకేస్తే తాము వందడుగులు ముందుకేస్తామని పేర్కొన్నారు. రాజకీయపార్టీలన్నీ కలసి టీడీపీని, చంద్రబాబును దెబ్బతీసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నాయని ఆరోపించారు. బుధవారం సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు చంద్రబాబుతోపాటు టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు, విపక్ష కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆధారాలుంటే కేసీఆర్‌పై కేసు ఎందుకు నమోదు చేయట్లేదని విలేకరులు ప్రశ్నించగా.. కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, కేంద్రం స్పందించకపోతే తామే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసి.. ఫోన్‌ట్యాపింగ్‌పై విచారణ చేస్తామని ఆయన బదులిచ్చారు. రేవంత్‌రెడ్డి కేసును పక్కదోవ పట్టించేందుకు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారా? అన్న ప్రశ్నకు.. రేవంత్ తప్పు చేసుంటే అనుభవిస్తారని, ఆయన కేసుతో తమకు సంబంధం లేదని, కోర్టు విచారణలో ఉన్నందున దానిపై మాట్లాడనని అచ్చెన్నాయుడు చెప్పారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నది చంద్రబాబును కాదని.. ఐదు కోట్ల మంది తెలుగువారినని చెప్పారు.