అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా... | YSRCP Leader Duvvada Srinivas Fires On Acchennaidu In Srikakulam | Sakshi
Sakshi News home page

అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...

Published Mon, Sep 9 2019 8:05 AM | Last Updated on Mon, Sep 9 2019 8:08 AM

YSRCP Leader Duvvada Srinivas Fires On Acchennaidu In Srikakulam - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌  

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్‌ అన్నింటిలో దందా చేసుకుని కమీషన్లు దండుకుని అవినీతిపరుడిగా పేరు సంపాదించుకున్న నువ్వా అవినీతిరహిత పాలన అందిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి మాట్లాడేది.. అంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏౖMðక సీఎం జగన్‌ అని అన్నారు. సీఎం రోజుకు 20 గంటలు కష్టపడి నవరత్నాల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అవినీతిరహిత, పారదర్శక పాలన అందించేందుకు పాటుపడుతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం నాణ్య మైన బియ్యం పంపిణీని చేపట్టారని.. ఒక్క రో జులో 92 శాతం పూర్తిచేశారని.. హర్షించాల్సింది పోయి అక్కసుతో టీడీపీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు.

ఎక్కడో ఒక చోట తడిసిన బి య్యాన్ని పట్టుకుని దాన్నే హైలెట్‌ చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగుల బాధలను తీర్చేం దుకు రూ.600 కోట్లతో తాగునీరు పంపిణీ, 200 పకడల సూపర్‌స్పెషాలటీ హాస్పటల్‌ ని ర్మాణానికి ఈ నెల 6వ తేదిన సీఎం శంకుస్ధాపన చేస్తే దానిపై విమర్శించడం సిగ్గులేని తనా నికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఉద్దాన ప్రాంతంలో గల బెంతు ఒరియాలు, బుడగ జంగాలు తమ సమస్యలు విన్నవించుకుంటే దానిపై ప్రత్యేక కమిషన్‌ వేసి ఆదుకున్నారన్నారు. మత్య్సకారుల అభివృద్ధికి  జెట్టీలనిర్మానానికి, కోల్డ్‌ స్టోరేజీకి, భావనపాడు పోర్టు నిర్మానానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం హర్షనీయమన్నారు. అలాగే తిత్లీ తుపాన్‌లో నష్టపోయిన కొబ్బరి రైతులకు, జీడిమామిడి రైతులకు పరిహారాల పెంపు మాట నిలబెట్టుకుని బాధితులందరికీ న్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రధాన ప్రాజెక్టులైన వంశధార ప్రాజెక్టు, నేరడి బ్యారేజ్‌ నిర్మాణం, ఆఫ్‌షోర్‌ వంటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా ఐదేళ్ళు గడిపేశారన్నారు. జిల్లాలో కోడిరామ్మూర్తి స్టేడియం, టెక్కలిలో స్టేడియం, జూనియర్‌ కళాశాల నిర్మాణం, ఇలా అనేక హామీలను గాలికొదిలేశారన్నారు. 

అచ్చెన్నది నేర చరిత్ర
అచ్చెన్నాయుడు తన రాజకీయ హవా చూపించి అధికారులను బెదిరించడం, ఎస్సీ కులస్తులపై దాడి చేయడం వంటి కేసుల్లో ఇరుక్కుని నేటికీ కోర్టుకు హాజరవుతున్నారని దువ్వాడ ధ్వజెమెత్తారు. నిమ్మాడలో తన మాట వినని వారికి గ్రామ బహిష్కరణ చేసి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నాడన్నారు. అలాగే నిత్యం గ్రానైట్‌ క్వారీల వద్ద నుంచి కమీషన్‌గా బ్లాక్‌లను తీసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న నాయకుడు అచ్చెన్నాయుడని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, వైన్స్, ధాన్యం, మినుములు అన్నింటిలో దోపిడీ చేసుకుని అవినీతిపరుడిగా ముద్ర పడ్డారన్నారు. ‘ నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. తేదీ, వేదిక నువ్వు చెప్పాలని’ సవాలు విసిరారు. అలాగే ఎన్నికల్లో 12 బూత్‌లలో రిగ్గింగ్‌ చేసి భయపెట్టి గెలవడం గొప్ప కాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబు, మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరి, కోరాడ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement