srikakulam corporation
-
Srikakulam: సిక్కోలు నగరానికి న్యూలుక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా విశిష్టతలు చిత్తరువుల రూపంలో కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. గోడలపై గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తున్నాయి. అందమైన కుడ్య చిత్రాలు నగరానికి కొత్తశోభను తీసుకొస్తున్నాయి. పరిసరాలు అందంగా ఉంటే ఆ అనుభూతే వేరు. సిక్కోలు నగరంలో ఇప్పుడదే కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు కూడళ్లు, ఫ్లైవోవర్లు, వంతెనలు, ప్రభుత్వ ప్రాంగణాల గోడలపై రంగులతో అద్దుతున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా శ్రీకాకుళంలో కుడ్య చిత్రాలను వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా రంగులతో వేస్తున్న ఈ చిత్రాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల జోరుగా పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై వోవర్లు, వంతెనలు, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, పాఠశాలు/కళాశాలల ప్రహరీలు, ప్రభుత్వభవనాల కాంపౌడ్స్కు జిల్లా, నగర చరిత్రను తెలియ జేసే కుడ్యచిత్రాలను ప్రత్యేక రంగులతో వేస్తున్నారు. నగరంలో 23 ప్రదేశాల్లో ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరసవల్లి, వంశధార, నాగావళి, మన జాతీయతను తెలియజేసే పెయింటింగ్స్ వేస్తున్నారు. రూ.1.43 కోట్లతో ఈ పనుల్ని చేపడుతున్నారు. శరవేగంగా పనులు జరిగేలా కమిషనర్ ఓబులేసు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా రాజీ పడకుండా, దగ్గరుండి పెయింటింగ్స్ వేయించే పనిలో నిమగ్నమయ్యారు. (క్లిక్: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు) -
అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ అన్నింటిలో దందా చేసుకుని కమీషన్లు దండుకుని అవినీతిపరుడిగా పేరు సంపాదించుకున్న నువ్వా అవినీతిరహిత పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి పాలన గురించి మాట్లాడేది.. అంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏౖMðక సీఎం జగన్ అని అన్నారు. సీఎం రోజుకు 20 గంటలు కష్టపడి నవరత్నాల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అవినీతిరహిత, పారదర్శక పాలన అందించేందుకు పాటుపడుతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం నాణ్య మైన బియ్యం పంపిణీని చేపట్టారని.. ఒక్క రో జులో 92 శాతం పూర్తిచేశారని.. హర్షించాల్సింది పోయి అక్కసుతో టీడీపీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. ఎక్కడో ఒక చోట తడిసిన బి య్యాన్ని పట్టుకుని దాన్నే హైలెట్ చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగుల బాధలను తీర్చేం దుకు రూ.600 కోట్లతో తాగునీరు పంపిణీ, 200 పకడల సూపర్‌స్పెషాలటీ హాస్పటల్ ని ర్మాణానికి ఈ నెల 6వ తేదిన సీఎం శంకుస్ధాపన చేస్తే దానిపై విమర్శించడం సిగ్గులేని తనా నికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఉద్దాన ప్రాంతంలో గల బెంతు ఒరియాలు, బుడగ జంగాలు తమ సమస్యలు విన్నవించుకుంటే దానిపై ప్రత్యేక కమిషన్ వేసి ఆదుకున్నారన్నారు. మత్య్సకారుల అభివృద్ధికి జెట్టీలనిర్మానానికి, కోల్డ్ స్టోరేజీకి, భావనపాడు పోర్టు నిర్మానానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం హర్షనీయమన్నారు. అలాగే తిత్లీ తుపాన్లో నష్టపోయిన కొబ్బరి రైతులకు, జీడిమామిడి రైతులకు పరిహారాల పెంపు మాట నిలబెట్టుకుని బాధితులందరికీ న్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రధాన ప్రాజెక్టులైన వంశధార ప్రాజెక్టు, నేరడి బ్యారేజ్ నిర్మాణం, ఆఫ్‌షోర్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా ఐదేళ్ళు గడిపేశారన్నారు. జిల్లాలో కోడిరామ్మూర్తి స్టేడియం, టెక్కలిలో స్టేడియం, జూనియర్ కళాశాల నిర్మాణం, ఇలా అనేక హామీలను గాలికొదిలేశారన్నారు. అచ్చెన్నది నేర చరిత్ర అచ్చెన్నాయుడు తన రాజకీయ హవా చూపించి అధికారులను బెదిరించడం, ఎస్సీ కులస్తులపై దాడి చేయడం వంటి కేసుల్లో ఇరుక్కుని నేటికీ కోర్టుకు హాజరవుతున్నారని దువ్వాడ ధ్వజెమెత్తారు. నిమ్మాడలో తన మాట వినని వారికి గ్రామ బహిష్కరణ చేసి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నాడన్నారు. అలాగే నిత్యం గ్రానైట్ క్వారీల వద్ద నుంచి కమీషన్‌గా బ్లాక్‌లను తీసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న నాయకుడు అచ్చెన్నాయుడని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, వైన్స్, ధాన్యం, మినుములు అన్నింటిలో దోపిడీ చేసుకుని అవినీతిపరుడిగా ముద్ర పడ్డారన్నారు. ‘ నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. తేదీ, వేదిక నువ్వు చెప్పాలని’ సవాలు విసిరారు. అలాగే ఎన్నికల్లో 12 బూత్‌లలో రిగ్గింగ్ చేసి భయపెట్టి గెలవడం గొప్ప కాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మన నగరం – మన బాధ్యత
శ్రీకాకుళం అర్బన్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మన నగరం – మన బాధ్యత కార్యక్రమం ద్వారా నగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత నగరంగా చేయాలని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ పీఏ శోభ కోరారు. శ్రీకాకుళంలోని నగరసంస్థకార్యాలయంలో జన్మభూమి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులతో ఆమె శనివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో గల 36 వార్డుల్లో బహిరంగ మల విసర్జనను నిర్మూలించి మన నగరాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నగరంలో 29,681 ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని, ఇంకా సుమారు 2070 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1878 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు రాగా వాటిలో 1332 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మిగిలినవి ఈ నెలాఖరులోపున పూర్తి చేస్తామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలం లేని వారికి కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించి అప్పగిస్తామన్నారు. రాబోయే 20 రోజుల్లో నగరంలో పూర్తిగా బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు... ఈ నెల 6వ తేదీ నుంచి 15 వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ పరిధిలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డులలో ర్యాలీలను కమిటీల పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. మీడియా సాయంతో బహిరంగ మల విసర్జనపై అనర్థాలను వివరిస్తామన్నారు. నాగావళి నదీతీరం వెంబడి మల విసర్జన నిరోధించేందుకు గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో ఉన్న 13 సులభ్ కాంప్లెక్స్‌లను బాగు చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ నగరంలో బహిరంగ మల విసర్జన నిర్మూలనతో పాటు దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయడం, పందుల సంచారాన్ని నిరోధించడం చేయాలన్నారు. మురుగు కాల్వలపై పలకలు వేయించాలన్నారు. రూ.5కోట్లతో నాగావళి నదీతీరాన్ని పార్కులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. చెత్తను ఎవరి ఇంటి వద్ద వారు చెత్త బుట్టల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేసేలా చూడాలన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.