duvvada srinivas
-
మీ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ ఇవ్వరా..?
-
పవన్, బాబును ఏకిపారేసిన దువ్వాడ
-
అచ్చెన్నాయుడుకి దువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే తప్పులేదా ?
-
ఏపీలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
-
అచ్చెన్నాయుడుకి దువ్వాడ మాస్ వార్నింగ్
-
పవన్ కు దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్
-
అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
-
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
-
సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల జీవన ప్రమాణాలను పెంచారు
-
అమ్మా.. మీరు కుప్పంతో సహా..జరగబోయే నిజం ఇదే
-
శ్రీకాకుళం ప్రజల తలరాతలను మార్చిన దేవుడు జగనన్న
-
అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూకబ్జాదారుడు : ఎమ్మెల్సీ దువ్వాడ
-
పాదయాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుంటాం
టెక్కలి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, అమరావతి యాత్ర పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు వస్తే.. ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుని వారిని తరిమికొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందని, ఇప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనవల్ల పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి.. అందులో అమరావతి ఉండాలి అనేది తమ నినాదమని.. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం.. తన వాళ్ల ప్రయోజనం కోసం కేవలం అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల భిక్షతో దశాబ్దాలుగా రాజకీయంగా లబ్ధిపొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అమరావతిలో రాజధాని నినాదంతో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడుకు 24 గంటలు సమయం ఇచ్చానని దువ్వాడ గుర్తుచేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై పోటీకి తానింకా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని కావాలంటే ఆ ఒక్క ప్రాంతానికే మద్దతిస్తే.. ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడు అంటూ ప్రతి గ్రామంలో బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన విశాఖలో జరగనున్న ర్యాలీకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని, ఉత్తరాంధ్ర సత్తాను దేశం మొత్తం చాటుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
ఉత్తరాంధ్రులకు అచ్చెన్న వెన్నుపోటు
టెక్కలి: దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు వేసిన ఓట్లతో రాజకీయంగా అభివృద్ధి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇప్పుడు అదే ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రచారకర్తగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో మద్రాసు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఒకే రాజధాని ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా సీఎం వైఎస్ జగన్ ఉన్నత ఆశయంతో శ్రీకృష్ణ కమిటీ చెప్పిన ప్రకారం పాలన వికేంద్రీకరణకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. టీడీపీ హయాంలో రాజధాని పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్నారు. -
Atchannaidu: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. ఇందులో అచ్చెన్న అనుచరుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ‘ఏం ఫర్వాలేదు.. నేను చూసుకుంటా.. సీఐతో మాట్లాడాను.. గ్రామస్తులంతా ఒకటే మాట మీద ఉండండి...’అన్న అచ్చెన్న మాటల వెనుక మర్మం ఏమై ఉంటుందని టెక్కలి నియోజకవర్గమంతా చర్చ నడుస్తోంది. అసలు సీఐతో ఏం మాట్లాడారు...? ఆ వ్యక్తి మరణానికి ఎవరు కారకులు..? మృతి వెనుక గల కారణాలు ఏమిటి? అన్నవి తేలాలి. వివరాల్లోకి వెళితే... గత నెల 27న కోటపాడు–కొత్తూరు గ్రామాని కి చెందిన కొండాల గున్నయ్య, చాట్ల రమేష్ తదితరులు ఇంటి రేకులు ఇప్పిస్తామంటూ కొండాల బాలకృష్ణను బయటకు తీసుకువెళ్లారు. కొంత సమయం తర్వాత గున్నయ్య, రమేష్‌లు మాత్రమే గ్రామానికి తిరిగి వచ్చారు. తన భర్త ఇంకా ఇంటికి రాలేదని కల్యాణి గున్నయ్య భార్యను ప్రశ్నించింది. బాలకృష్ణ పవర్‌ప్లాంట్ సమీపంలో గల కడప లంక వైపు వెళ్లాడని చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజున అసలు విషయం బయటపడింది. గున్నయ్య, రమేష్‌లను గట్టిగా నిలదీయడంతో పవర్‌ప్లాంట్ సమీపంలో గల కాలువ వద్దకు వెళ్లి వెతుకులాట ప్రారంభించారు. అదే కాలువలో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహా న్ని ఇంటికి తీసుకురాకుండా అంత్యక్రియలు చేసేశారు. ఇదంతా జరిగిన కొన్ని రోజులకు అచ్చెన్నాయు డు ఓ వ్యక్తితో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఆ సంభాషణలో ఆసక్తికరమైన మాటలు ఉన్నాయి. కాకరాపల్లి గ్రామానికి చెంది న పల్లి చిన్నబాబు అనే వ్యక్తి ప్రాధేయపడగా ‘ఏం ఫర్వాలేదు.. నేను సీఐతో మాట్లాడాను. మీరంతా ఒక మాట అనుకుని చెప్పండి’ అని అచ్చెన్న చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో ఆ మృతుని భార్య కల్యాణి బయటకు వచ్చి హత్య వెనుక కుట్ర ఉందని బాధ్యులైన వారిని రక్షించేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త బాలకృష్ణను గున్నయ్య, రమే‹Ùలు హత్య చేశారని, దీనికి కొండాల గణేశ్వరరావు సహకరించాడని, నిందితుల్ని అచ్చెన్నాయుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడను ఆశ్రయించారు. మొత్తానికి ఈ ఆడియో లీక్ వ్యవహారం టెక్కలి నియోజకవర్గంలో సంచలనమైంది. అసలు సీఐతో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు.. అందరూ ఒక మాట మీద ఉండాలని చెప్పడం వెనుక అసలు విషయమేమిటో.. తేల్చాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ అచ్చెన్నాయుడు ఆడియో సంభాషణ బట్టి చూస్తే.. హత్య జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ జోలికొస్తే ఊరుకోం..
టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా వారి నోళ్లను అదుపులో పెట్టుకోవాలని, అలా కాకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జోలికి ఎవరైనా వస్తే ఆత్మాహుతి దళంగా మారుతానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ జంక్షన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో దిక్కులేక అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ నాయకుల అంతు చూస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ దృష్టిలో అధికారం అంటే అంతు చూడటం అని మరోసారి ఆ పార్టీ నాయకులే అంగీకరించారని చురకలంటించారు. కేవలం సీఎం వైఎస్ జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే మహానాడును నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏ ప్రయోజనం చేకూర్చారో మహానాడులో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ మహిళా కార్యకర్తలతో తొడలు కొట్టించటం చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం కేంద్ర బృందాలు వస్తుండటం సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతోందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. -
మద్యం సిండికేట్లకు డాన్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: మద్యం సిండికేట్లకు డాన్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, పీవీవీ సూర్యనారాయణరాజు, రమేశ్ యాదవ్, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి దువ్వాడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చేలా లోకేశ్ అండ్ కో ప్రవర్తించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాల వారికి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తే తమను మాట్లాడనీయకుండా పథకం ప్రకారం టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని అన్నారు. చివరికి మీ అంతు చూస్తామంటూ సభలో లోకేశ్ హెచ్చరికలు చేయడం చూస్తుంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందన్నారు. మైనా ర్టీకి చెందిన రుహుల్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోను ఆందోళనలు చేశారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉందా అన్ని ప్రశ్నించారు. -
నన్ను చంపడానికి.. అచ్చెన్నాయుడు కుట్ర: ఎమ్మెల్సీ దువ్వాడ
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావును ఆపార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే హత్య చేయించి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాక ముందే.. అతని కుటుంబ సభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే వెంకటరావు ఆత్మహత్యకు తానే కారణమని అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి దువ్వాడ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్నాయుడు ఏడాదిగా తనను చంపేందుకు కుట్ర చేసున్నారన్నారు. తనను చంపడానికి వెంకటరావును అచ్చెన్నాయుడు పావుగా చేసుకున్నారని చెప్పారు. టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావు దాన్ని వెంకటరావు బహిర్గతం చేయడంతో కుట్ర బట్టబయలు అవుతుందని ఆందోళన చెందిన అచ్చెన్నాయుడు ఆయన్ని హత్య చేయించారని ఆరోపించారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు సొంత పంచాయతీ నిమ్మాడలో సర్పంచిగా ఎవరు పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వారిని కింజరాపు సోదరులు హత్య చేయిస్తారని ఆరోపించారు. ఇప్పటికే నిమ్మాడలో ఏడుగురిని హత్య చేయించిన రక్తచరిత్ర అచ్చెన్నాయుడు కుటుంబానికి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన కింజరాపు అప్పన్నకు తాను మద్దతుగా నిలిచి.. నామినేషన్ వేయించానని చెప్పారు. చదవండి: ఈఎస్ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేస్తాడట: కొలుసు పార్థసారధి పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావు మూడ్రోజుల క్రితం కింజరాపు అప్పన్నకు ఫోన్ చేసి.. ‘‘అచ్చెన్నాయుడుకు నువ్వు సమీప బంధువు అవుతావు. అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకు పోటీగా ఎలా నిలబడతావ్. దువ్వాడను ఏడాదిలోగా చంపేస్తాం. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారని చెప్పారు (ఇందుకు సంబంధించిన ఆడియోను వినిపించారు). దీనిపై ఆందోళన చెందిన అప్పన్న టెక్కలి పోలీసు స్టేషన్లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు.. మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోని వెంకటరావు ఇంటికి వెళ్లారని.. ఆ సమయంలో అతను ఇంట్లో లేరని.. వస్తే టెక్కలి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పాలని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారని శ్రీకాకుళం ఎస్పీ సాయంత్రం ప్రకటించారని వివరించారు. వెంకటరావును పోలీసులు బెదిరించిన దాఖలాలే లేవన్నారు. ఔ వెంకటరావు ఎవరో తెలియదు.. పొత్తంగి గ్రామానికి చెందిన వెంకటరావు ఎవరో తనకు తెలియదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. రెండు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. తనపై 19 కేసులు పెట్టించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు... అందిస్తున్న సుపరిపాలన వల్ల టెక్కలిలో నేను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తన ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు భయపడుతున్నారు. అందుకే ఏడాదిగా నన్ను చంపడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అందుకు వెంకటరావును పావుగా వాడుకున్నాడు. కింజరాపు అప్పన్నను బెదిరించే క్రమంలో వెంకటరావు మాట్లాడిన మాటల ద్వారా నన్ను హత్య చేయడానికి అచ్చెన్నాయుడు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆ కుట్రకు ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటరావును అచ్చెన్నాయుడే హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని నాపై వేస్తున్నారు’ అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అచ్చెన్నాయుడుపై విచారణ చేయాలి వెంకటరావును హత్య చేయించింది అచ్చెన్నాయుడేనని.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీని దువ్వాడ శ్రీనివాస్ కోరారు. దర్యాప్తులో అచ్చెన్నాయుడు కుట్ర బట్టబయలు కావడం ఖాయమన్నారు. హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేసే అచ్చెన్నాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాశీబుగ్గలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వ్యక్తి బలవన్మరణం మందస/ కాశీబుగ్గ: మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కోన వెంకటరావు (38) బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఆఖరకు తన పొలంలోని పంపు డ్ వద్ద వెంకటరావు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వెంటనే పలాస ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కోట వెంకటేష్ కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతుడు టీడీపీ కార్యకర్త కావడంతో ఈ ఆత్మహత్యపై మంగళవారం హైడ్రామా జరిగింది. పోలీసుల వేధింపు వల్లే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉండగా.. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎస్పీ ఏమన్నారంటే.. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ విలేకరులతో కాశీబుగ్గలో మాట్లాడారు. వెంకటరావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని.. రాజకీయాల నేపథ్యంలో పోస్టింగులు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరిపై థ్రెటింగ్ పోస్టులు చేసినట్టు వివరించారు. ఈ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ చేసేందుకు పోలీసులు సోమవారం వెంకటరావు ఇంటికి వెళ్లారన్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో విచారణ కోసం టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు రమ్మని మాత్రమే కోరామని, ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో వెంకటరావు ఇంటిలో కూడా లేరని, ఇచ్ఛాపురంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారని వివరించారు. కేవలం ఒత్తిడితోనే వెంకటరావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని, ఇందులో పోలీసుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని పోలీసులే కారణమంటూ.. వెంకటరావు మృతదేహం పలాస ఆస్పత్రిలో ఉంచడంతో మంగళవారం టీడీపీ నాయకురాలు గౌతు శిరీష తన అనుచరులతో కలిసి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు బెదిరించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. -
‘నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిది’
సాక్షి, అమరావతి: సర్పంచ్‌లుగా నామినేషన్లు వేయటానికి వెళ్లిన నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నన్ను చంపుతానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జంటుగా నన్ను అరెస్టు చేయమని చంద్రబాబు, అచ్చెన్నాయుడు గోల చేస్తున్నారు. ఆ వెంకటరావు అనే వ్యక్తి ని నేను ఇంతవరకు చూడలేదు. అతను టీడీపీ సీనియర్ కార్యకర్త. అచ్చెన్నాయుడు.. ఓటమి తప్పదని ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారని’’ దువ్వాడ దుయ్యబట్టారు. చదవండి: ఈసారి ఆ 23 సీట్లు కూడా రావు: ఎమ్మెల్సీ పోతుల సునీత ‘‘నన్ను చంపమని అచ్చెన్నాయుడు ఈ వెంకటరావుతో ఒప్పందం కుదుర్చున్నాడు. ఈ విషయం బయట పడటంతో అచ్చెన్నాయుడే అతన్ని చంపించాడు. అసలు విషయం బయటకు రాకముందే నన్ను అరెస్టు చేయమని డిమాండ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి?. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌లను అరెస్టు చేసి విచారణ జరపాలి. నామీద ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు. కానీ మేము పట్టించుకోలేదు. టీడీపీ పని అయిపోయింది. మళ్ళీ సీఎం జగనే కావాలని జనం కోరుకుంటున్నారని’’ దువ్వాడ అన్నారు. ‘‘ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారి కార్యకర్తల్లో ఉత్సాహం కోసం అలా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైఎస్ జగనే కావాలనుకుంటున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎంత హడావుడి చేసినా జనం విశ్వసించే పరిస్థితి లేదని’’ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. -
‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’
సాక్షి, అమరావతి: తెలుగు దొంగల పార్టీకి, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తు వచ్చిందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత మహానేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ది ప్రారంభమైందని దువ్వాడ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తన పాదయాత్ర ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలని గుర్తించారని, ఉద్దానం సమస్యని చూసి ఆయన చలించిపోయారని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్దాన సమస్య పరిష్కారానికి 750 కోట్ల రూపాయలతో తాగునీటిని అందించబోతున్నారని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్‌తో పాటు రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తమ ప్రాంతానికి అన్యాయమే చేశారని, దోచుకోచడానికే చూశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేష్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు -
అధికారంలో ఉండగా టిడిపికి ఉత్తరాంద్ర అభివృద్ధి పట్టలేదు
-
వైఎస్ జగన్ పాలనా విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఎండీ కరీమున్నీసా తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు సీఎం జగన్ రాష్ట్రంలో అండగా ఉన్నారని చెప్పేందుకు నిదర్శనం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమేనని అన్నారు. పార్టీతో నడిచినవారికి తగిన గుర్తింపు వైఎస్సార్సీపీలో ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీకాకుళం : ఎమ్మెల్సీగా తనకు గుర్తింపు ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీకాకుళం నుంచి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం వైఎస్ జగన్ వరకు తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్‌కు, పార్టీకి తన సేవలు అంకితమన్నారు. ఇటీవలే టెక్కలి నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు మంచి మోజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ పదవికి తన పేరును ఎంపిక చేయడం హర్షనీయమన్నారు. అనంతపురం: వరుసగా రెండోసారి శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ధన్యవాదాలు తెలిపారు. కష్టపడేవారిని సీఎం జగన్ గుర్తిస్తారని.. అడక్కుండానే పదవులు ఇవ్వటం జగన్‌కే సాధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లి : సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పరని మరో మారు నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత జగనన్న తమకు అండగా నిలిచారని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తనను అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. జగనన్న అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, భవిష్యత్తులో జగనన్న ఇచ్చే ఏ ఆదేశాన్నైనా శిరసవహించడమే తన కర్తవ్యమని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. చదవండి: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన -
టెక్కలిలో అచ్చెన్న దౌర్జన్యాలెన్నెన్నో..
సాక్షి, అమరావతి: టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ప్రజల, ప్రభుత్వ ఆస్తులను అచ్చెన్నాయుడు లూటీ చేశారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రౌడీ, గూండా, క్రిమినల్ అయిన తెలుగు దొంగలపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతిలో కూర్చుని తాము నిజాయితీపరులమని, ప్రజాస్వామ్యవాదులమని నీతులు చెబుతుంటారని, ఆయన బతుకేంటో టెక్కలి, శ్రీకాకుళం జిల్లా ప్రజలనడిగితే చెబుతారన్నారు. అచ్చెన్నాయుడు రెండెకరాల నుంచి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తారని, ఇవన్నీ ఎక్కడినుంచి సంపాదించారో చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు దౌర్జన్యాలు, అక్రమాలపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయవిచారణ జరిపించాలన్నారు. అలా జరిపిస్తే.. సాక్ష్యాధారాలతోసహా తాను నిరూపిస్తానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడి తండ్రి హయాంనుంచే హత్యా రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. రిగ్గింగ్‌లు, రౌడీయిజంతో కింజరాపు బ్రదర్స్ ఇంతకాలం టెక్కలి ప్రాంతంలో ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో, ఆయన బంధువు కింజరాపు అప్పన్న నామినేషన్ వేయాలనుకుంటే చంపేస్తామని బెదిరించడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా తానక్కడికి వెళితే 500 మంది రౌడీలు కత్తులు, కర్రలు, బరిసెలతో దాడి చేశారని, తనను, అప్పన్నను చంపాలని చూశారని వివరించారు. అచ్చెన్న దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, మొదటిదశ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 135 పంచాయతీలకు 113 స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారని, టీడీపీవారు 22 స్థానాల్లోనే నెగ్గారన్నారు. రిగ్గింగ్‌కు అవకాశం లేకుండా చూడడంతో ప్రజలంతా స్వేచ్ఛగా ఓట్లు వేశారన్నారు. టెక్కలి ప్రజలు తిరగబడి తరిమికొట్టినా అచ్చెన్నాయుడుకు సిగ్గురాలేదన్నారు. వేల కోట్లకు పడగలెత్తారు.. కింజరాపు బ్రదర్స్ అక్రమాస్తులు వేల కోట్లకు చేరాయని దువ్వాడ ఆరోపించారు. ‘‘నిమ్మాడలో ప్రభుత్వ భూముల్లో ఎఫ్‌సీఐ గోడౌన్స్ నిర్మించి.. వారి కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజల భూముల్నిసైతం ఆక్రమించుకున్నారు. భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో 2014–19 మధ్య క్వారీల్లో రాళ్లను పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించి కట్ చేశారు. ఇలా రూ.39 కోట్ల రాయిని అక్రమంగా తరలించారు. టెక్కలిలో కాంట్రాక్టుల పేరుతో కోట్లు మింగేశారు. సారా కాంట్రాక్టర్‌గా అచ్చెన్నాయుడు 75 షాపులు బినామీగా పెట్టుకుని మద్యం అక్రమ వ్యాపారాన్ని నడిపారు. రైస్ మిల్లర్లు, మద్యం షాపులవద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. పీఏసీఎస్ అధ్యక్షునిగా ఉన్న అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్ దాన్నడ్డుపెట్టుకుని బినామీల ఆస్తులపై రుణాలు తీసుకుని రూ.18 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడ్డారు. సింగపూర్‌లో హోటళ్లు, షిప్‌లు కూడా ఉన్నాయి’’ అని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ న్యాయస్థానాల్లో సాక్ష్యాలతోసహా నిరూపిస్తామని దువ్వాడ చెప్పారు. -
అచ్చెన్న చరిత్రంతా హత్యా రాజకీయాలే: దువ్వాడ
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ విమర్శలతో విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ గూండా, క్రిమినల్ అని మండిపడ్డారు. ఎందరినో హింసించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను హింసించిన ద్రోహి అచ్చెన్నాయుడు అని అన్నారు. నిమ్మాడలో నామినేషన్ వేస్తే చంపుతామని బెదిరించారని, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ నాపై దాడి చేశాడని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడి తండ్రి నుంచి హత్యా రాజకీయాలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఎందరినో చంపి రాజకీయంగా అడ్డు తొలగించుకున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చరిత్రంతా హత్యా రాజకీయాలే అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. -
అచ్చెన్న చరిత్రంతా హత్యా రాజకీయాలే: దువ్వాడ
-
సర్పంచ్‌గా పోటీ చేస్తే చంపేస్తారా అచ్చెన్నా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేస్తే వారిని చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. జనవరి 31న కింజరాపు అప్పన్న నామినేషన్‌కు వెళితే ఆయన్ను, తనను చంపేందుకు కింజరాపు హరిప్రసాద్, సురేష్‌లతో పాటు 400 మంది మారణాయుధాలతో వెంటపడ్డారని శ్రీనివాస్ చెప్పారు. పోలీసులు, దేవుడి దయవల్ల బతికి బయటపడినట్టు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవా రం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట వేసిన నామినేషన్ చింపేశారని, ఆ తర్వాత మళ్లీ చివరి క్షణంలో పోలీసుల సమక్షంలో నామినేషన్ వేయించినట్టు చెప్పారు. ఎన్నికల నామినేషన్లలో గానీ, ఏకగ్రీవాల్లో గానీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెప్పారని, మరి అచ్చెన్న కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలన్నారు. ఎంతమంది ప్రాణం తీశారో చూడండి.. నిమ్మాడలో కింజరాపు కుటుంబాన్ని కాదని నామినేషన్లు వేసిన చాలామంది హత్యకు గురైనట్టు శ్రీనివాస్ ఆరోపించారు. కింజరాపు సూరయ్య, ఎచ్చెర్ల సూర్యనారాయణ, కింజరాపు భుజంగరావు(బుజ్జి), కొంచాడ బాలయ్యలను హత్య చేయించినట్టు చెప్పారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న కూన రామారావుని కత్తితో పొడిచి చంపారని వివరించారు. కోటబొమ్మాళితో పాటు 48 పంచాయతీల్లో ఎప్పుడూ రిగ్గింగ్ జరుగుతోందని, ఈ సారి దానిని అడ్డుకోవాలని అధికారులను కోరారు. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్, సురేష్లను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
కింజారపు కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడింది..
సాక్షి, శ్రీకాకుళం: కింజారపు సోదరుల కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడిందని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మాడలో ప్రతి పంచాయతీ ఎన్నికల్లో హత్యలు చేయించడం కింజారపు కుటుంబానికి పరిపాటిగా మారిందని దువ్వాడ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు కింజారపు అప్పన్న నామినేషన్ వేస్తానంటే, అతని చంపుతామంటూ కింజారపు సోదరుల అనుచరులు ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. అప్పన్నకు తోడుగా తానే వెళ్లి నామినేషన్ వేయిద్దామనుకుంటే, తనపై కూడా కత్తులతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన అనుచరులు, పోలీసులపై కూడా కింజారపు సోదరుల అనుచరులు దాడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు తమ వాహనాలు ధ్వంసం చేసి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా ఫోన్ చేసి అప్పన్న కుటుంబ సభ్యులను బెదిరించినా, ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. అసలు నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా అల్లరి మూకలు చెలరేగారన్నారు. అయినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
అచ్చెన్నాయుడికి అక్కడ మాట్లాడే దమ్ముందా..?
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'నాడు-నేడు పథకం పనుల్లో నాణ్యత లోపం, అవకతవకలు ఎక్కడున్నాయో దమ్ముంటే అచ్చెన్నాయుడు ప్రకటించాలి. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేస్తాను. అక్కడికి వచ్చి మాట్లాడే దమ్ము అచ్చెన్నాయుడికి ఉందా..?. చదవండి: (ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంది) ఈ పథకం పనులు ఎంతో పారదర్శకంగా, నాణ్యతతో జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో అచ్చెన్న, ఆయన కుటుంబం కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్గగొట్టారు. ఇప్పుడు కూడా అదే భ్రమల్లో ఉన్నారు. నాడు-నేడు పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నట్లు అచ్చెన్న భావిస్తున్నారు. ఈ పథకం పనులను చేస్తున్నది కూడా కాంట్రాక్టర్లు కాదన్న విషయాన్ని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలి' అంటూ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. చదవండి: (రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన) -
ఆత్మస్థైర్యంతో కరోనాను జయించాను..
టెక్కలి: ఆత్మస్థైర్యంతో కరోనాను జయించానని.. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ తాజాగా నిర్వహించిన నిర్థారణ పరీక్షల్లో గురువారం నెగిటివ్ రిపోర్టు రావడంతో స్థానిక విలేకరులతో మాట్లాడారు. తనకు పాజిటివ్ వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురి కాలేదని, మనోధైర్యంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న వైద్య, ఆరోగ్య సలహాలను పాటిస్తూ కరోనాను జయించానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు కరోనా వస్తుంది.. పోతుందని దువ్వాడ అన్నారు. సరైన పోషకాహారం, మందులు, రోజూ యోగా, ధ్యానం చేస్తే సులువుగా బయటపడవచ్చన్నారు. తాను వినియోగించిన వస్తువులు ఇతరులు తాకకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లను ధరిస్తూ హోంఐసోలేషన్ పాటించడం వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని శ్రీనివాస్ చెప్పారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రేపు లింగాలవలసలో మంత్రి పర్యటన టెక్కలి మండలం లింగాలవలసలో ఆగస్టు 1న రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటిస్తున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పశు పోషణ అభివృద్ధిలో భాగంగా ‘జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. -
తేల్చుకుందాం రండి..
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అడ్డంపడుతున్నారని శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌ను రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదో ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వైజాగ్ రాజధాని కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రజల నాయకుడని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. అమరావతి రాజధాని కావాలంటున్న టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అమరావతి పేరుతో కోట్ల రూపాయలు కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టిన అచ్చెన్నాయుడు వైజాగ్‌ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని దుయ్యబట్టారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండెకరాల స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి తలపై ఉన్న గాయాలే ఆయన రక్తచరిత్రకు సాక్ష్యాలని అన్నారు. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశాడని, అచ్చెన్నాయుడి అక్రమాలకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల రిగ్గింగ్‌తోనే రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తనపై టీడీపీ నాయకులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు చేతగాక తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను ఏనాడు భయపడలేదన్నారు. (‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’) -
దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం
సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వ హయాంలో నారాలోకేష్ బినామీ సంస్థ బ్లూఫ్రాగ్ రూపొందించిన ‘మన శాండ్ యాప్’ ద్వారా లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఇసుక దీక్షల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. టెక్కలిలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇసుక దోపిడీపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ప్రభుత్వంపై వందల కోట్ల రూపాయలు జరిమాన విధించడాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఇసుక సరఫరాలో సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారన్నారు. ఇసుక సరఫరాను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఎండీసీకి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీఠవేశారని అన్నారు. అయితే చంద్రబాబుకు బినామీగా ఉన్న బ్లూఫ్రాగ్ సంస్థ ద్వారా ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ చేసి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ జరగకుండా కుట్రలు పన్నారని దువ్వాడ ఆరోపించారు. కుట్రలు బయటపడడంతో సీఐడీ అధికారులు బ్లూఫ్రాగ్ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే బ్లూఫ్రాగ్ సంస్థ ద్వారా ఎన్నికల ముందు ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయకులు పాల్పడ్డారని అన్నారు. వీటన్నింటిపై ఏమాత్రం అవగాహన లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. పేదవారి పిల్లలు ఇంగ్లిష్‌లో చదవకూడదా..? పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దీనిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవచ్చు.. పేదోడి పిల్లలు ఇంగ్లి‹Ùలో చదవకూడదా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు.. పవన్‌కల్యాణ్ ప్యాకేజీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని దువ్వాడ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పేజీల కొద్దీ మేనిఫెస్టో విడుదల చేసిన మీకు, సింగిల్ పేజీ మేనిఫెస్టోతో.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన అనేక హామీలను అమలు చేసి చూపించిన జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబుది దొంగ దీక్ష : ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొత్తూరు: రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. అంగూరు వద్ద వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీచ్‌లో ఇసుక నిల్వల లభ్యత వివరాలను రీచ్ ఇన్చార్జి కూర్మరావు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఇసుక లభ్యత తగ్గిందన్నారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల ఇసుక సరఫరాలో కొంత జాప్యం నెలకొందన్నారు. అంగూరు ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయినప్పటికీ ప్రజలకు తగినంత ఇసుక సరఫర చేస్తున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో వంశధార నదిలో మరికొన్ని రీచ్‌లు ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు కూన రవికుమార్, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వారి అనుచరలు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.ప్రసాదరావు, మాజీ ఎంపీపీ చల్లం నాయుడు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు తోట నందకుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కన్నయ్య స్వామి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
అచ్చెన్నా... నీ బండారం బయటపెడతా...
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ అన్నింటిలో దందా చేసుకుని కమీషన్లు దండుకుని అవినీతిపరుడిగా పేరు సంపాదించుకున్న నువ్వా అవినీతిరహిత పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి పాలన గురించి మాట్లాడేది.. అంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏౖMðక సీఎం జగన్ అని అన్నారు. సీఎం రోజుకు 20 గంటలు కష్టపడి నవరత్నాల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అవినీతిరహిత, పారదర్శక పాలన అందించేందుకు పాటుపడుతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం నాణ్య మైన బియ్యం పంపిణీని చేపట్టారని.. ఒక్క రో జులో 92 శాతం పూర్తిచేశారని.. హర్షించాల్సింది పోయి అక్కసుతో టీడీపీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. ఎక్కడో ఒక చోట తడిసిన బి య్యాన్ని పట్టుకుని దాన్నే హైలెట్ చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగుల బాధలను తీర్చేం దుకు రూ.600 కోట్లతో తాగునీరు పంపిణీ, 200 పకడల సూపర్‌స్పెషాలటీ హాస్పటల్ ని ర్మాణానికి ఈ నెల 6వ తేదిన సీఎం శంకుస్ధాపన చేస్తే దానిపై విమర్శించడం సిగ్గులేని తనా నికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా ఉద్దాన ప్రాంతంలో గల బెంతు ఒరియాలు, బుడగ జంగాలు తమ సమస్యలు విన్నవించుకుంటే దానిపై ప్రత్యేక కమిషన్ వేసి ఆదుకున్నారన్నారు. మత్య్సకారుల అభివృద్ధికి జెట్టీలనిర్మానానికి, కోల్డ్ స్టోరేజీకి, భావనపాడు పోర్టు నిర్మానానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం హర్షనీయమన్నారు. అలాగే తిత్లీ తుపాన్లో నష్టపోయిన కొబ్బరి రైతులకు, జీడిమామిడి రైతులకు పరిహారాల పెంపు మాట నిలబెట్టుకుని బాధితులందరికీ న్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రధాన ప్రాజెక్టులైన వంశధార ప్రాజెక్టు, నేరడి బ్యారేజ్ నిర్మాణం, ఆఫ్‌షోర్ వంటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా ఐదేళ్ళు గడిపేశారన్నారు. జిల్లాలో కోడిరామ్మూర్తి స్టేడియం, టెక్కలిలో స్టేడియం, జూనియర్ కళాశాల నిర్మాణం, ఇలా అనేక హామీలను గాలికొదిలేశారన్నారు. అచ్చెన్నది నేర చరిత్ర అచ్చెన్నాయుడు తన రాజకీయ హవా చూపించి అధికారులను బెదిరించడం, ఎస్సీ కులస్తులపై దాడి చేయడం వంటి కేసుల్లో ఇరుక్కుని నేటికీ కోర్టుకు హాజరవుతున్నారని దువ్వాడ ధ్వజెమెత్తారు. నిమ్మాడలో తన మాట వినని వారికి గ్రామ బహిష్కరణ చేసి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నాడన్నారు. అలాగే నిత్యం గ్రానైట్ క్వారీల వద్ద నుంచి కమీషన్‌గా బ్లాక్‌లను తీసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న నాయకుడు అచ్చెన్నాయుడని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, వైన్స్, ధాన్యం, మినుములు అన్నింటిలో దోపిడీ చేసుకుని అవినీతిపరుడిగా ముద్ర పడ్డారన్నారు. ‘ నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతా.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. తేదీ, వేదిక నువ్వు చెప్పాలని’ సవాలు విసిరారు. అలాగే ఎన్నికల్లో 12 బూత్‌లలో రిగ్గింగ్ చేసి భయపెట్టి గెలవడం గొప్ప కాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
సిక్కోలు సమస్యలు కానరాలేదా ‘రామా’..?
మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉంది శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి పరిస్థితి అని జిల్లా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం సానుభూతితో వారసత్వంగా రాజకీయాలకు కొత్తవ్యక్తి అయినా తొలిసారే ఎంపీగా అవకాశమిచ్చిన జిల్లా ప్రజలకు ఆయన ఇచ్చిన బహుమానం ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండడమేనని ఆరోపిస్తున్నారు. సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుదిదశకు వచ్చేసింది. రాష్ట్రానికి చిట్టచివర్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా గ్రామాలన్నీ వలస బాట పడుతూ..నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం కోటలో ఈ సారి ఎన్నికల వార్ వన్‌సైడ్‌గా కనిపిస్తోంది. దివంగత ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడిగా జిల్లా ప్రజల సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి మొదటి చాన్స్‌గా ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు ఐదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా గెలిచిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు పూర్తిగా ప్రజల్లో లేరనే విమర్శలు ఉన్నాయి. ఆయన బాబాయ్ అచ్చిన్నాయుడు పెద్దరికం ముందు రామ్మోహన్నాయుడు ఎంపీ పదవి ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాకుండా కేవలం ఎంజాయ్ చేయడానికే ఎంపీ పదవిని అలంకరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని పక్కన పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రభంజనంతో శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని సైతం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కట్టబెట్టే ఆలోచనలో సిక్కోలు ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుల అనుకూల, ప్రతికూలాంశాలను ఓసారి గమనిస్తే ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడకు అనుకూలాంశాలు ♦ ప్రజలతో మమేకమయ్యే తత్వం. సమస్యలపై తక్షణమే స్పందించే గుణం. ♦ గతంలో కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రజల తరఫున ఉద్యమం చేసి, సుమారు నెలరోజులకు పైగా జైలు జీవితం గడపడం. ♦ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న అనుభవం, నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కూడా సాన్నిహిత్యంగా ఉండడం. ♦ ప్రజలు, కార్యకర్తలకు ఏ రాత్రి కష్టమొచ్చినా స్థానికంగా అందుబాటులో ఉండడం. ఆర్థికంగా సహకారం అందించడం. ♦ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే కుటుంబంగా ప్రజల్లో గుర్తింపు ♦ జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉండడం. ♦ ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు ♦ గ్రామగ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులకు పేరుపెట్టి పిలిచే చనువు ఉండడం ప్రతికూలాంశాలు ♦ దూకుడు తత్వం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు ప్రతికూలాంశాలు ♦ దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసి ఎంపీగా గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. ♦ జిల్లాలో వలసల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం. ♦ ఎంపీగా జిల్లా సమస్యలపై డిల్లీస్థాయిలో పోరాటాలు చేయకపోవడం. ♦ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపకపోవడం. ♦ జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించలేకపోవడం. ♦ రైతులకు ఉపయోగపడే విధంగా నదుల అనుసంధానం చేయడంలో ఘోరంగా వైఫల్యం. ♦ జిల్లాలో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం. ♦ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆసరాగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం. ♦ జీడి, కొబ్బరి రైతులకు ఆసరాగా అనుసంధానమైన పరిశ్రమలు నెలకొల్పలేకపోవడం. ♦ మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం. ♦ జిల్లాలో సమస్యలను పూర్తిగా విస్మరించడం. అనుకూల అంశం దివంగత ఎంపీ కె.ఎర్రన్నాయుడు తనయుడిగా పూర్తికాలం ఎంపీగా కొనసాగడం -
సిక్కోలు ప్రగతే మా పథం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘ఏదో అభివృద్ధి చేస్తారని ప్రజలు టీడీపీకి అవకాశం ఇస్తే... విలువైన ఐదేళ్ల పరిపాలనా కాలం బూడిదలో పోసిన పన్నీరైంది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి, గ్రానైట్ కొండలను కరిగించేసి దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ జిల్లా ప్రగతిపై పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవో చిన్నా చితకా సిమెంట్ రోడ్లు వేసి అదేదో తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. కానీ నాణేనికి మరోవైపు చూస్తే అక్రమాలు హోరెత్తాయి. చివరకు జన్మభూమి కమిటీలు సాగించిన అప్రజాస్వామ్య పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు. వారంతా మా నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో అడుగడుగునా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని ఆయన ఇచ్చిన భరోసా వారికెంతో ఊరట కలిగించింది. దీని ప్రభావంతో జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సానుకూల స్పందనలు కనిపించాయి. ఒక్క చాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం’’ అని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే... గత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చినప్పుడు అనేక హామీలు గుప్పించారు. ప్రజలు అడిగిందీ అడగనిదీ అన్నీ చేసేస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. చివరి మూడు నెలల్లో టీడీపీ ప్రజాప్రతినిధులకు మెలకువ వచ్చింది. ఎన్నికల వేళ హడావుడి చేస్తున్నారు. ప్రజలు వారిని ఈసారి నమ్మే పరిస్థితిలేదు. తుఫాను ముందు సముద్రంలా ప్రశాంతంగా ఉన్నారు. రానున్న ఎన్నికలలో ఉప్పెనలా మారి ఓటుతో తీర్పు ఇవ్వనున్నారు. టీడీపీ పాలనలో నిర్లక్ష్యం... ఐదేళ్ల పాలనలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కానీ, ఇద్దరు మంత్రులు కానీ, టీడీపీ ప్రజాప్రజాప్రతినిధులు కానీ జిల్లా అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులు తప్ప జిల్లాకు టీడీపీ ఇచ్చిన ప్రాజెక్టులు ఏవీ లేవు. ఒకటీ రెండు చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేసి తామేదో అపర భగీరథులమని చెప్పుకుంటున్నారు. జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందట్లేదు. జిల్లాలో ఈ ఐదేళ్లలో చెప్పుకోదగిన పరిశ్రమ ఏదీ ప్రారంభం కాలేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయి. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. వాటిని ఆపడానికి ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులన్నీ కమీషన్లకు కక్కుర్తిపడి సిమెంట్ రోడ్లకే మళ్లించారు. వాటివల్ల ప్రజలకు ఉపాధి కలగలేదు. కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిన టీడీపీ నాయకుల జేబులు మాత్రం గలగలలాడుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ప్రకటనలకే సరి... తండ్రి చనిపోయారన్న సానుభూతి ఓట్లతో గెలిచిన శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఈ ఐదేళ్లూ ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితమయ్యారు. జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారు. కేంద్ర రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడల్లా జిల్లాలోని రైల్వేస్టేషన్లను బాగుచేయడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎంపీ చెప్పడమే తప్ప ఐదేళ్లలో ఏ ఒక్కసారీ ఆచరణలోకి రాలేదు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రావాలి. కానీ ఇక్కడ కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. చివరకు వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళానికి రావాల్సిన నిధులను తెచ్చుకునే విషయంలోనూ ఎంపీ విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు వచ్చిన సుమారు రూ.275 కోట్ల నిధులకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపకపోవడంతో అవి కాస్తా మళ్లిపోయాయి. టీడీపీ నాయకులందరిదీ అదే దారి... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పాత కోడిరామ్మూర్తి స్టేడియాన్ని కూల్చేశారు. ఆధునిక స్టేడియం నిర్మించడానికి మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేశారు. దాని నిర్మాణం ఇంకా పునాది స్థాయి దాటలేదు. కిడ్నీ రోగులకు తగిన వైద్యం అందే పరిస్థితి లేదు. జీడి, కొబ్బరి రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి ఆసరాగా ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ను నీరుగార్చి ఆ నిధులను నీరు–చెట్టు పేరుతో టీడీపీ కార్యకర్తలు దోచుకునే విధంగా చేశారు. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించలేక చేతులెత్తేశారు. టెక్కలి మండలం రావివలసలో వందలాది కుటుంబాలకు ఆధారంగా ఉన్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమ మూతపడేలా చేశారు. జిల్లా సమస్యలపై అవగాహన ఉంది... జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. జిల్లాలో ప్రతీ సమస్యపై అవగాహన ఉంది. ప్రజా పోరాటాల్లోనూ ముఖ్య భూమిక పోషించాను. ప్రజలు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే జిల్లాను అభివృద్థి పథంలో నడిపిస్తాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనలో జగనన్నకు తోడుగా నిలుస్తాను. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తిచేయించి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా కృషి చేస్తాను. కిడ్నీ రోగులకు ఆసరాగా డయాలసిస్ కేంద్రాలు ఎక్కువ చోట్ల ఏర్పాటు చేయిస్తాను. మత్స్యకారులకు, కూరగాయల రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులోకి తెస్తాను. ఉప్పు కార్మికుల సమస్యలపైనా నాకు అవగాహన ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. గిరిజనులకు అవసరమైన నిధులను తెస్తాను. వంశధార నిర్వాసితులకు అండగా ఉంటాను. ప్రతీ ఒక్కరికీ విద్యా, వైద్యం అందేవిధంగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఆశలు రేపిన జగనన్న హామీలు... టీడీపీ పాలకులు చివరకు వంశధార నిర్వాసితులకూ తగిన న్యాయం చేయలేదు. అందుకే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారిని అన్నివిధాలా ఆదుకుంటానని జగనన్న రెండేళ్ల క్రితం హిరమండలంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే సమయంలో ఉద్దాన ప్రాంతంలోని జగతిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోనూ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. నెల నెలా రూ.10 వేలు పింఛను కూడా ప్రకటించారు. దీంతో ఉలిక్కిపడిన టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలు పింఛను ప్రకటించింది. కానీ జిల్లాలో కిడ్నీ రోగులు వేల సంఖ్యలో ఉంటే పింఛను ఇస్తుంది మాత్రం మూడొందల మందికి మించలేదు. ఇటీవల తిత్లీ తుఫానుతో దెబ్బతిన్న మత్స్యకారులు, జీడిమామిడి, కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. నష్టపరిహారం పంపిణీలోనూ టీడీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బాధితులకు న్యాయం జరగలేదు. వారందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని పలాస, టెక్కలి బహిరంగ సభల్లో జగనన్న హామీ ఇచ్చారు. -
భావోద్వేగానికి లోనైన దువ్వాడ శ్రీనివాస్
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : ఎన్నికల నేపథ్యంలో పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తినైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పలాస సభలో దువ్వాడ మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మంత్రి అచ్చెన్నాయుడు నా వ్యాపారాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఆర్థికంగా బాగా చితికి పోయా. అయినప్పటికీ నాపై నమ్మకం ఉంచి వైఎస్ జగన్ నాకు తోడుగా నిలబడ్డారు. నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇచ్చిన ఆయనకు జన్మజన్మలకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.(2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్ జగన్) కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తాం, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి.. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
పల్లె కన్నీరు పెడుతోంది
సాక్షి, టెక్కలి: ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేసిన అనుభవం. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేయడంతో జిల్లాపై సంపూర్ణ అవగాహన. జనం తరఫున మాట్లాడగలిగే దమ్ము.. వెరసి దువ్వాడ శ్రీనివాస్. వైఎస్సార్సీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ పల్లె కన్నీరు పెడుతోందని అంటున్నారు. ప్రచారమే తప్ప పనిచేయని అధికార పార్టీ తీరు వల్ల సి క్కోలు మరింత వెనుకబడిపోతోందని అంటున్నారు. ‘సాక్షి’తో తన మనోభావాలు ఇలా పంచుకున్నారు. సాక్షి: తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. జిల్లా వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దువ్వాడ : టీడీపీ పాలనలో జిల్లా మరింత వెనుకబడింది. గ్రామాల నుంచి యువత వలస పో తున్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో జనం తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూ ర్తిస్థాయిలో భరోసా లేదు. మ త్స్యకారులు, జీడి, కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. పేద, సామాన్య వర్గాలకు వి ద్య, వైద్యం అందడం లేదు. సాక్షి: గత ఎంపీ పనితీరు ఎలా ఉంది? దువ్వాడ : జిల్లా ప్రజలు ఎంతో ఆశతో కె.రామ్మోహన్నాయుడిని గెలిపించారు. కానీ ఆయన మాటలు తప్ప పని చేయలేకపోయారు. మంత్రిని కూడా దగ్గర ఉం చుకుని జిల్లాకు నిధులు తెప్పించలే దు. ఐదేళ్ల కాలంలో జిల్లా కేంద్రంలో కోడి రామ్మూర్తి స్టేడియాన్ని కూడా ని ర్మించలేకపోయారు. నదుల అనుసంధానం చేయలేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఊసేలేదు. కిడ్నీ రోగులు, జీడి, కొబ్బరి రం గంపై ఆయన దృష్టి పెట్టిన దాఖలా ఒక్కటి కూడా లేదు. అభివృద్ధి చేయడంలో ఎంపీ దారుణంగా విఫలమయ్యారు. సాక్షి: వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లా సమస్యలపై ఎలాంటి అవగాహన ఉంది? దువ్వాడ : గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అప్పటి నుంచి జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉంది. అంతే కాకుండా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు చేస్తున్నాను. ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యం లాంటి క్రీడాకారులు, మత్స్యకారులు, కిడ్నీ బాధితులు, జీడి, కొబ్బరి రైతులు, నిర్వాసితులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. సాక్షి: జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఆదరణ ఎలా ఉంది? దువ్వాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అంతే కా కుండా మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగా కా కుండా నిజాయితీ రాజకీయాలతో కొత్త అధ్యయనా నికి శ్రీకారం చుట్టారు. అందు కే అంతా ఆయన నాయకత్వం కోరుకుంటున్నాను. రాష్ట్రానికి అలాంటి యువ నాయకత్వం కావా లి. సాక్షి: మీరు ఎంపీగా గెలిస్తే జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? దువ్వాడ : జిల్లా ప్రజల దీవెనతో ఎంపీగా గెలిస్తే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా జలయజ్ఞం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందజేస్తాను. కిడ్నీ రోగులకు ఆసరాగా డయాలసిస్ కేంద్రాలను విస్తరించేలా చేస్తాను. మత్స్యకారులకు, కూరగాయల రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌లు, ఉప్పు కార్మికులను ఆదుకోవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. వంశధార నిర్వాసితులకు చట్టం ప్రకారం అందాల్సిన పూర్తి సదుపాయాలు కల్పిస్తాను. ప్రధానంగా వలసలు లేకుండా ఉపాధి మార్గాలు కల్పి స్తాను. జీడి, కొబ్బరి రైతులు, గిరిజనులను ఆదుకునే విధంగా ఆయా రంగాలను అభివృద్ధి చేస్తాను -
రాష్ట్రంలో రాక్షస పాలన
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. అన్ని వర్గాలను మోసగించిన సీఎం చంద్రబాబును ప్రజలు క్షమించరని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం పీఎన్‌కాలనీ రెండో లైన్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా ఉన్న నాయుకుడు ధర్మాన ప్రసాదరావు అని కొనియాడారు. ఇటువంటి నాయకుడు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఉండడం సిక్కోలువాసులు చేసుకున్న అదృష్టమన్నారు. చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని చెప్పి.. తర్వాత ప్రత్యేక ప్యాకేజీతోనే అనేక లాభాలుంటాయని యూటర్న్ తీసుకున్నారని గుర్తు చేశారు. తర్వాత మళ్లీ మాటమార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లతోనే ఓడిపోయామని, ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహనరసింహం (వరం), ఎం.వి.పద్మావతి, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, పి.జె నాయుడు, రేఖా తదితరులు పాల్గొన్నారు. ధర్మానకు అస్వస్థత ఆత్మీయ సదస్సుకి హాజరైన ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మాన జ్వరంతో ఉన్నప్పటికి మీ ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరయ్యారని చెప్పిన మరుక్షణంలోనే కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. -
మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్దార్
శ్రీకాకుళం ,టెక్కలి: ‘మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్డార్... ప్రజలంటే నీకంత చులకనభావమా... పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి తప్పదు... మహిళల పట్ల హీనంగా వ్యాఖ్యానించిన ఈయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’ అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలసి స్థానిక అంబేడ్కర్ కూడలిలో మానవహారం చేపట్టారు. స్థానికంగా మంత్రి అక్రమాలకు ప్రజలు విసిగిపోయారని, దీన్ని భరించలేక మహిళల్ని ఇష్టానుసారంగా ధూషిస్తున్నారని, ఈయనకు గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. మంత్రి అచ్చెన్న డౌన్‌డౌన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో సమస్యలు తెలుసుకుని, టీడీపీ ప్రభుత్వం చేతిలో బలైపోయిన సామాన్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులంతా స్థానిక చేరీవీధిలో కిల్లిపోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర కొనసాగించారు. ఇందులో భాగంగా చిన్నచేరీవీధి, పెద్దచేరీవీధి, గొడగలవీధి, గందరగోళంవీధి, కుమ్మరివీధి, రెడ్క్రాస్వీధి, అక్కపువీధి వరకు దారి పొడవునా సమస్యలు తెలుసుని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మండల కన్వీనర్ బీ గౌరీపతి, పట్టణాధ్యక్షుడు టీ కిరణ్, నాయకులు వై చక్రవర్తి, ఎన్ శ్రీరామ్ముర్తి, టీ జానకీరామయ్య, సత్తారు సత్యం, చింతాడ గణపతి, బీ హరి, రమణబాబు, ఎం రమేష్, గురునాథ్యాదవ్తోపాటు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి పాదయాత్ర జరిగే ప్రాంతాలు: పట్టణంలో కోదండరామవీధి, కండ్రవీధి, తెలుకలవీధి, బీసీకాలనీ, తదితర ప్రాంతాల్లో గురువారం పాదయాత్ర నిర్వహించనున్నట్లు పట్టణాధ్యక్షుడు టీ కిరణ్ తెలిపారు. -
ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం..
సాక్షి, శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి వైఎస్సార్సీపీ నేత, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్ సవాలు విసిరారు. అచ్చెన్నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సభలో వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టెక్కలి అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాసమక్షంలో తేల్చుకుందామని అన్నారు. అచ్చెన్నాయుడి రౌడీ రాజకీయాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటి గురించి త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. ఆయన ఆరోపణనలపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తేదీ మీరే నిర్ణయించుకోని చర్చకు రావాలన్నారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. -
‘మనీ మేనేజ్మెంట్తో గెలవలేమని గ్రహించాలి’
సాక్షి, శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు నేనున్నానంటూ భరోసానివ్వడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటూ జననేతకు బాసటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త ఇక్బాల్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ.. పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నికల్లో గెలవలేమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణంపై ప్రచారం తప్ప అమలు కనిపించడం లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ నిర్మిస్తానని ప్రకటించిన జననేతకు ఆయన రైతులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనందుకే.. ప్రజలు వైఎస్ జగన్ వద్దకు పోటెత్తుతున్నారని అన్నారు. తిత్లీ తుపాను ప్రభావ ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో బయటపడనుందని పేర్కొన్నారు. -
పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
ఆమదాలవలస రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామాల్లో బూత్ కమిటీ సభ్యులు, యువకులు సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. మండలంలో వంజంగి గ్రామంలో మాజీ సర్పంచ్ బెండి గోవిందరావు అధ్యక్షతన వైఎస్సార్ సీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో అరాచక పాలన సృష్టించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ధనం, మద్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి నుంచే యువత ఉద్యమించాలని సూచిం చారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ప్రజా బలమే వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారని అలాంటి లక్ష్యానికి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ తరఫున సమగ్ర సర్వే ఇంటింటా నిర్వహించి ప్రజా సమస్యలను నమోదు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాలను అందజేయడానికి వీ లుపడుతుందని అన్నారు. వైఎస్సార్ సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ దుష్ట పరిపాలన అంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. పార్టీ బలోపేతానికి యువజన విభాగం అత్యంత అవసరమని అన్నారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు, పార్టీలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటా సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తిచేయాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ మరింత దూసుకుపోయేందుకు బూత్ కమిటీ సభ్యులు పాటుపడాలని అన్నారు. అనంతరం యువతతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామూర్తి, ఎంపీటీసీ బెండి రమణ, చీమలవలస సర్పంచ్ గురుగుబెల్లి శ్రీనివాసరావు, నాయకులు తమ్మినేని మురళి, పొన్నాడ రాము, శ్రీరామ్, వంజంగి, వంజంగిపేట, తోటాడ పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అసలేమైంది...
టెక్కలి, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలవడం పలువురిని విస్మయానికి గురి చేసింది. వైఎస్సార్సీపీకి ఉన్న ప్రజాదరణతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న పరిశీలకులు దువ్వాడ గెలుపు ఖాయమని భావించారు. ఓట్ల లెక్కింపు సరళి గమనిస్తే దువ్వాడ గెలుస్తారని భావించినా చివరికి ఓటమి పాలయ్యారు. దువ్వాడ ఓటమిని తట్టుకోలేని పలువురు అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక సామాజిక వర్గం దూరమైందనే అనుమానం వ్యక్తం చేశారు. పలు ఊహా గానాలు వ్యక్తమవుతున్నా ప్రధా నంగా సామాజిక సమీకరణాల్లో తేడా రావడం వల్లే ఓటమి పాలయ్యారని భావిస్తున్నా రు. టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నం దిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు ఉన్నాయి. వీటిలో శ్రీనివాస్‌కు టెక్కలి మండల ప్రజలు గట్టి మద్దతు ఇచ్చారు. నందిగాం మండలం వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సంతబొమ్మాళి మండలంలో తీవ్రస్థాయిలో ఉద్యమం సాగింది. ఆ మండలంలో దువ్వాడను ప్రజలు ఆదరించినా పోలింగ్‌లో అది కనిపించకపోవడంతో ఏం జరిగిందనే ప్రశ్న తలెత్తిం ది. కోటబొమ్మాళి మండలంలో వెలమ సామాజిక వర్గానికి దీటుగా కాళింగ సామాజిక వర్గం ఉంది. కానీ కాళింగ సామాజిక వర్గానికి చెందన దువ్వాడకు ఆ వర్గం అండగా నిలవలేదని భావిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో 2,04,522 ఓట్లు ఉన్నాయి. అందులో 50 వేలకు పైగా కాళింగ సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. 29 రౌండ్లలో దువ్వాడకు 72,780 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడికి 81,167 ఓట్లు లభించాయి. నందిగాం మండలంలో తొమ్మిదో రౌండ్ వరకు దువ్వాడకు 1500 ఆధిక్యత వచ్చింది. తర్వాత టెక్కలి మండలంలో 3వేల ఆధిక్యతకు చేరుకున్నారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో వెనుకబడడంతో దువ్వాడ ఓట మి పాలయ్యారు. సంతబొమ్మాళి, కోట బొమ్మాళి మండలాల్లో ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు దువ్వాడకు పూర్తిస్థాయిలో ఓటు వేయకపోవడంతో ఓటమి పాలయ్యారని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడిపై అదే సామాజిక వర్గానికి చెందిన వారు అభిమానం ప్రదర్శిస్తే, దువ్వాడపై సామాజిక వర్గం వారు అభిమానం ప్రదర్శించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ప్రజాదరణ ఉన్నా కుల సమీకరణాల తోనే దువ్వాడ ఓటమి పాలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసుల అక్కసు
ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను ఇదేం పని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అంతే మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ అహం దెబ్బతిన్న పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌పై తమ అక్కసు వెళ్లగక్కారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై అక్రమంగా కేసు బనాయించారు. -
35 రోజుల్లో రాజన్న రాజ్యం
శ్రీకాకుళం (టెక్కలి),న్యూస్‌లైన్: మరో 35 రోజుల్లోనే మనమంతా కోరుతున్న రాజన్న రాజ్యం వచ్చేస్తుందని, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటవుతోందని ఆ పార్టీ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. గురువారం రాత్రి టెక్కలి రైట్వేగేట్ కూడలిలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితులను మార్చే శక్తి, సీమాంధ్ర అభివృద్ధి. రాజధాని నిర్మాణం వంటి పనులన్నీంటినీ సమర్ధవంతంగా చేసే దమ్మున్న నేత జగన్ అన్నారు. ఇక జగ న్ ముఖ్యమంత్రి కాగానే మనందరి కోరిక మేరకు ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడం ఎంతో ధైర్యమైన నిర్ణయమన్నారు. జిల్లాలో ప్రజలంతా ఏఎన్నికల్లోనైనా ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్సార్సీపీని గెలిపించి జగనన్నకు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. స్థానిక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకు వెళ్తే వెంటబెడుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల నాశనానికి కారణంగా ఉన్న థర్మల్ ప్లాంట్‌ను నిర్మించేందుకు పూనుకున్నారని, ఈ దుష్టశక్తులైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులకు ఘోర ఓటమి తప్పదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు దారుణపరిస్థితుల్లో ఉన్నాయని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ సారధ్యం కావాలన్నారు. ఇందుకోసం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలవలస రాజశేఖరం కుమార్తెగా, జిల్లా ఆడపడుచుగా తాను పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్నానని.. అందరూ ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందని, అలాగే రానున్న ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోనుందని జోస్యం చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బయటకొస్తే సార్వత్రిక ఎన్నికలకు ముందే దుకాణం బంద్ అవుతుందన్నారు. -
జగన్‌తోనే థర్మల్ ప్లాంట్ల రద్దు
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే..థర్మల్ ప్లాంట్లను రద్దు చేస్తారని ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకరాపల్లి తంపరలో నిర్మితమవుతున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్పనులకు వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు హెచ్‌ఎన్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సహాయ నిరాకరణ శిబిరం వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. ఇన్నాళ్లూ ఎంతో ఓపికతో ఉద్యమించామని..మరో వంద రోజులు ఉద్యమిస్తే..కలలు నెరవేరుతాయన్నారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొత్తకుంటున్నా..ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ప్లాంట్ యాజమాన్యం ఎగ్గొట్టేం దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్లాంట్‌ను రద్దు చేయిస్తానని చెప్పిన కృపారాణి..కేంద్ర మంత్రి అయిన తరువాత థర్మల్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. కింజరాపు సోదరుల వల్లే.. ఇక్కడ ప్రజా వినాశకర ప్లాంట్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు వచ్చిన ప్లాంట్ సిబ్బంది వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 2 వేల మందితో రోడ్డుపైనే సహపంక్తి భోజ నాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుగ్గురామిరెడ్డి, పి.మేనకేతనరెడ్డి, గిన్ని ప్రకాష్, నర్సింహమూర్తి, పి.శ్రీను, జి.కామరాజు, రామారావు, తేజారెడ్డి, నీలాపు అప్పలస్వామితో పాటు 34 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.