మద్యం సిండికేట్లకు డాన్‌ చంద్రబాబు  | YSRCP MLAs Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

మద్యం సిండికేట్లకు డాన్‌ చంద్రబాబు 

Published Fri, Mar 25 2022 4:31 AM | Last Updated on Fri, Mar 25 2022 4:31 AM

YSRCP MLAs Comments On Chandrababu - Sakshi

మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులు

సాక్షి, అమరావతి:  మద్యం సిండికేట్లకు డాన్‌ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, పీవీవీ సూర్యనారాయణరాజు, రమేశ్‌ యాదవ్, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి దువ్వాడ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చేలా లోకేశ్‌ అండ్‌ కో ప్రవర్తించారన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాల వారికి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తే తమను మాట్లాడనీయకుండా పథకం ప్రకారం టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని అన్నారు. చివరికి మీ అంతు చూస్తామంటూ సభలో లోకేశ్‌ హెచ్చరికలు చేయడం చూస్తుంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందన్నారు. మైనా ర్టీకి చెందిన రుహుల్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోను ఆందోళనలు చేశారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉందా అన్ని ప్రశ్నించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement