సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. ఇందులో అచ్చెన్న అనుచరుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ‘ఏం ఫర్వాలేదు.. నేను చూసుకుంటా.. సీఐతో మాట్లాడాను.. గ్రామస్తులంతా ఒకటే మాట మీద ఉండండి...’అన్న అచ్చెన్న మాటల వెనుక మర్మం ఏమై ఉంటుందని టెక్కలి నియోజకవర్గమంతా చర్చ నడుస్తోంది. అసలు సీఐతో ఏం మాట్లాడారు...? ఆ వ్యక్తి మరణానికి ఎవరు కారకులు..? మృతి వెనుక గల కారణాలు ఏమిటి? అన్నవి తేలాలి.
వివరాల్లోకి వెళితే...
గత నెల 27న కోటపాడు–కొత్తూరు గ్రామాని కి చెందిన కొండాల గున్నయ్య, చాట్ల రమేష్ తదితరులు ఇంటి రేకులు ఇప్పిస్తామంటూ కొండాల బాలకృష్ణను బయటకు తీసుకువెళ్లారు. కొంత సమయం తర్వాత గున్నయ్య, రమేష్‌లు మాత్రమే గ్రామానికి తిరిగి వచ్చారు. తన భర్త ఇంకా ఇంటికి రాలేదని కల్యాణి గున్నయ్య భార్యను ప్రశ్నించింది. బాలకృష్ణ పవర్‌ప్లాంట్ సమీపంలో గల కడప లంక వైపు వెళ్లాడని చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజున అసలు విషయం బయటపడింది. గున్నయ్య, రమేష్లను గట్టిగా నిలదీయడంతో పవర్‌ప్లాంట్ సమీపంలో గల కాలువ వద్దకు వెళ్లి వెతుకులాట ప్రారంభించారు. అదే కాలువలో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహా న్ని ఇంటికి తీసుకురాకుండా అంత్యక్రియలు చేసేశారు.
ఇదంతా జరిగిన కొన్ని రోజులకు అచ్చెన్నాయు డు ఓ వ్యక్తితో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఆ సంభాషణలో ఆసక్తికరమైన మాటలు ఉన్నాయి. కాకరాపల్లి గ్రామానికి చెంది న పల్లి చిన్నబాబు అనే వ్యక్తి ప్రాధేయపడగా ‘ఏం ఫర్వాలేదు.. నేను సీఐతో మాట్లాడాను. మీరంతా ఒక మాట అనుకుని చెప్పండి’ అని అచ్చెన్న చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో ఆ మృతుని భార్య కల్యాణి బయటకు వచ్చి హత్య వెనుక కుట్ర ఉందని బాధ్యులైన వారిని రక్షించేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త బాలకృష్ణను గున్నయ్య, రమే‹Ùలు హత్య చేశారని, దీనికి కొండాల గణేశ్వరరావు సహకరించాడని, నిందితుల్ని అచ్చెన్నాయుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడను ఆశ్రయించారు.
మొత్తానికి ఈ ఆడియో లీక్ వ్యవహారం టెక్కలి నియోజకవర్గంలో సంచలనమైంది. అసలు సీఐతో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారు.. అందరూ ఒక మాట మీద ఉండాలని చెప్పడం వెనుక అసలు విషయమేమిటో.. తేల్చాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ అచ్చెన్నాయుడు ఆడియో సంభాషణ బట్టి చూస్తే.. హత్య జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment