
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ విమర్శలతో విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ గూండా, క్రిమినల్ అని మండిపడ్డారు. ఎందరినో హింసించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను హింసించిన ద్రోహి అచ్చెన్నాయుడు అని అన్నారు. నిమ్మాడలో నామినేషన్ వేస్తే చంపుతామని బెదిరించారని, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ నాపై దాడి చేశాడని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడి తండ్రి నుంచి హత్యా రాజకీయాలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఎందరినో చంపి రాజకీయంగా అడ్డు తొలగించుకున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చరిత్రంతా హత్యా రాజకీయాలే అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment