అచ్చెన్నాయుడికి అక్కడ మాట్లాడే దమ్ముందా..? | Duvvada Srinivas Fires On Kinjarapu Atchannaidu | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కూడా అదే భ్రమల్లో ఉన్నారు..

Published Sun, Dec 13 2020 12:30 PM | Last Updated on Sun, Dec 13 2020 1:09 PM

Duvvada Srinivas Fires On Kinjarapu Atchannaidu - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై టెక్కలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'నాడు-నేడు పథకం పనుల్లో నాణ్యత లోపం, అవకతవకలు ఎక్కడున్నాయో దమ్ముంటే అచ్చెన్నాయుడు ప్రకటించాలి. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేస్తాను. అక్కడికి వచ్చి మాట్లాడే దమ్ము అచ్చెన్నాయుడికి ఉందా..?.  చదవండి: (ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంది)

ఈ పథకం పనులు ఎంతో పారదర్శకంగా, నాణ్యతతో జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో అచ్చెన్న, ఆయన కుటుంబం కాంట్రాక్టర్‌ల అవతారం ఎత్తి వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్గగొట్టారు. ఇప్పుడు కూడా అదే భ్రమల్లో ఉన్నారు. నాడు-నేడు పనులు కాంట్రాక్టర్‌లు చేస్తున్నట్లు అచ్చెన్న భావిస్తున్నారు. ఈ పథకం పనులను చేస్తున్నది కూడా కాంట్రాక్టర్‌లు కాదన్న విషయాన్ని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలి' అంటూ దువ్వాడ శ్రీనివాస్‌ మండిపడ్డారు.  చదవండి: (రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement