సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే..థర్మల్ ప్లాంట్లను రద్దు చేస్తారని ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకరాపల్లి తంపరలో నిర్మితమవుతున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్‌పనులకు వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు హెచ్‌ఎన్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సహాయ నిరాకరణ శిబిరం వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. ఇన్నాళ్లూ ఎంతో ఓపికతో ఉద్యమించామని..మరో వంద రోజులు ఉద్యమిస్తే..కలలు నెరవేరుతాయన్నారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొత్తకుంటున్నా..ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు.
వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ప్లాంట్ యాజమాన్యం ఎగ్గొట్టేం దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్లాంట్‌ను రద్దు చేయిస్తానని చెప్పిన కృపారాణి..కేంద్ర మంత్రి అయిన తరువాత థర్మల్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. కింజరాపు సోదరుల వల్లే.. ఇక్కడ ప్రజా వినాశకర ప్లాంట్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు వచ్చిన ప్లాంట్ సిబ్బంది వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మధ్యాహ్నం 2 వేల మందితో రోడ్డుపైనే సహపంక్తి భోజ నాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుగ్గురామిరెడ్డి, పి.మేనకేతనరెడ్డి, గిన్ని ప్రకాష్, నర్సింహమూర్తి, పి.శ్రీను, జి.కామరాజు, రామారావు, తేజారెడ్డి, నీలాపు అప్పలస్వామితో పాటు 34 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.