santabommali
-
ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!
సాక్షి, సంతబొమ్మాళి: ఓ వ్యక్తి మనసులో పుట్టిన ఆశ అతడిని హత్యకు ఉసిగొల్పగా.. దొంగతనం చేశానన్న అపరాధ భావం అదే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పింది. మండలంలోని బోరుభద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. పట్నాన జగన్నాథం, పార్వతి దంపతులు బోరుభద్రలో పకోడీలు, బజ్జీలు విక్రయిస్తూ బతుకుతున్నారు. శనివారం రాత్రి జగన్నాథం దుకాణం పని మీద బయటకు వెళ్లగా, భార్య పార్వతి ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన గుడ్ల ఆనందరావు జగన్నాథం ఇంటికి వచ్చారు. ఆనందరావు చదవండి: (ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి) తనకు రూ.10వేలు అప్పు కావాలని ఇంట్లో ఉన్న పార్వతిని అడగ్గా ఆమె తన వద్ద లేవని సమాధానమిచ్చింది. కానీ ఆనందరావు ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాగడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి పుస్తెల తాడుతో పారిపోయాడు. పార్వతి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూ సేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వారు జగన్నాథంకు సమాచారం అందించారు. అలాగే 108కు ఫోన్ చేయడంతో బాధితురాలిని కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సంతబొమ్మాళి ఎస్ఐ గోవింద కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే శనివారం రాత్రి ఇక్కడ చోరీ, హత్యాయత్నం చేసిన ఆనందరావు తనను ఎక్కడ పట్టుకుంటారో అన్న భయంతో పార్వతీపురం పారిపోయాడు. కుటుంబమంతా బోరుభద్రలోనే ఉండడం ఇకపై తనను గ్రామానికి రానివ్వరని భయపడడం, దొంగతనం చేశానన్న అపరాధ భావంతో ఆయన ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (కుమార్తెతో మద్యం తాగించి లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో) -
సపోర్టు లేదాయె..!
అమ్మాయి పెళ్లికి భూమి విక్రయిద్దామంటే వీలు పడదు. కొడుకు చదువుకు కాసింత స్థలాన్ని కుదవ పెట్టడానికీ కుదరదు. సొంత భూమే అయినా క్రయవిక్రయాలకు హక్కు లేదు. భావనపాడు ప్రతిపాదిత పోర్టు పరిధిలోని పలు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులివి. వంశపారంపర్య జాగాలను కూడా విక్రయించలేని స్థితికి సర్కారు తమను దిగజార్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులను హరించేసి వెక్కిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ అంశంలో చేయాల్సిన సవరణలు ఇంకా చేయకుండా తాత్సారం చేస్తూ చోద్యం చూస్తోందని ఆరోపిస్తున్నారు. టెక్కలి: సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో తలపెట్టిన పోర్టు నిర్మాణంలో మత్స్యకారులకు ప్రభుత్వం సపోర్టు ఇవ్వడం లేదు. వీరికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీలు కానరావడం లేదు. పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిమూడేళ్లవుతోంది. రెండు పర్యాయాలు పోర్టు అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో భా వనపాడు తీరాన్ని పరిశీలించారు తప్ప పోర్టు వల్ల భూములు కోల్పోతున్న బాధితులకు మా త్రం భరోసా కలిగించే విధంగా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోతున్నారు. మొదట 4708 ఎకరాల్లో భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత 2050 ఎకరాలకు కుదించారు. అయితే నోటిఫికేషన్లో మిగులు భూములను తొలగించకపోవడంతో పోర్టుకు అవసరం లేని మిగులు భూముల క్రయవిక్రయాలకు ఆటంకా లు ఎదురవుతున్నాయి. మొదటి నోటిఫికేషన్ భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం కోసం 2015 ఆగష్టు 28న సుమారు 4708 ఎకరాల భూ సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భావనపాడు, మర్రి పాడు, దేవునల్తాడ, పొల్లాడ, సూర్యమణిపురం, కొమరల్తాడ తదితర గ్రామాలను చేర్చారు. అప్పట్లో భూ సేకరణ కోసం అధికారులు గ్రా మాల్‌లోకి వెళ్లగా ప్రభావిత గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత 2274 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. అయినా వ్యతిరేకత తగ్గలేదు. చివరగా భావనపాడు, కొమరల్తాడ, తామాడపేట, దేవునల్తాడ, సీతా నగరం గ్రామాల్లో మాత్రమే 2050 ఎకరాల్లో భూ సేకరణ చేసేందుకు ప్రభుత్వం తుది ని ర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్లో ముందు పేర్కొన్న భూములను తొలగించలేదు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు పోర్టు నిర్మాణం వల్ల నష్టం వాటిల్లుతుందని తక్షణమే పోర్టు నిర్మాణం నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని భావనపాడు నుంచి 372 మంది, తామాడపేట, కొమరల్తాడ నుంచి 196 మంది, దేవునల్తాడ నుంచి 129 మంది, సీతానగరం నుంచి 16 మంది చొప్పున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీతానగరం నుంచి రిట్ పిటిషన్ వేసిన 16 మంది విత్ డ్రా కాగా మిగిలిన గ్రామ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. హామీలు లేవు భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయంలో బాధితులకు స్పష్టమైన హామీలను పక్కన పెట్టి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణం కోసం అనుమతులు దక్కించుకున్న అదాని సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు ఆదాయంలో 2.3 శాతం ఆ దాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు అదాని సంస్థ అంగీకరించడంతో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హడావుడేనా..? భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయమై పోర్టు అధికారులు రెండు పర్యాయాలు భావనపాడు గ్రామాన్ని పరిశీలించారు. రెండు రోజుల కిందట పోర్టు డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు భావనపాడు గ్రామానికి వెళ్లగా అక్కడ మత్స్యకారులు అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపించారు. పోర్టుకు అవసరం లేని భూములు నోటిఫికేషన్ ఆధీనంలో ఉండడం వల్ల వివిధ అవసరాలకు భూముల క్రయవిక్రయాలు జరగడం లేదని అంతే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా హడావుడి చేస్తున్నారని మత్స్యకారులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించబోమని అంతే కాకుండా పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్థానికులంటున్నారు. -
థర్మల్ కార్మికులను గెంటేశారు!
సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ యాజమాన్యం కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులను విధుల నుంచి తొలగించి వీధిన పడేశారు. దీంతో వీరంతా థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు ముందు గురువారం ధర్నాను చేపట్టి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగిస్తున్నట్టు బుధవారం సాయంత్రం నోటీస్ బోర్డులో పేర్లు అంటించి వెంటనే తొలగించడం అన్యాయమని కార్మికులు మండిపడుతున్నారు. రెండు నెలలుగా జీతం ఇవ్వక పోగా పనుల నుంచి తొలగించడం దారుణమని బాధితులు షణ్ముఖరావు, శ్యామలరావు, గంగయ్యరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పూనుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. విధుల నుంచి తీసేయాలనుకుంటే 15 రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉండగా..అలా కాకుండా థర్మల్ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి తొలగించారన్నారు. లేబ ర్ కాలనీలో ఉంటున్న బీహార్, ఒడిశా కార్మికులు మాట్లాడుతూ.. తిండి, నీరు ఇవ్వకుండా బయటకు గెంతేసారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుకు నిరసనగా ప్లాంటు గేటు ముందు కార్మికులు టెంట్ వేశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. టెక్కలి సీఐ భవానీప్రసాద్, నౌపడ ఎస్ఐ మంగరాజు సంఘటన స్థలానికి వచ్చి కార్మిక నాయకులతో చర్చించడంతో ఆందోళనను కార్మికులు తాత్కాలికంగా విరమించార. -
రగులుతున్న బీల
ప్రశాంత బీల మళ్లీ రగులుతోంది. ఉద్యమానికి కదం తొక్కుతోంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న అరుదైన చిత్తడి నేలల్లో పారిశ్రామిక నిర్మాణాలు వద్దని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా.. మెత్తబడని సర్కారు తీరుపై మండిపడుతోంది. ఇప్పటికే ఎన్సీసీ విద్యుత్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలంటూ ఉద్యమం జరుగుతోంది. 1107 జీవో రద్దు చేస్తామని ఎన్నికల ముందు.. ఆ తర్వాత కూడా మురిపిస్తూ వస్తున్న టీడీపీ సర్కారు.. దాన్ని విస్మరించి అవే చిత్తడి నేలల్లో మరో విద్యుత్ కుంపటి పెట్టడానికి సిద్ధం కావడం బీల పల్లెలను భయాందోళనలకు గురి చేస్తోంది. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సోంపేట, కవిటి మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటుకు చెందిన ఎమ్డీ, డెరైక్టర్లు, బ్యాంకు అధికారులు వచ్చారన్న సమాచారంతో వడ్డితాండ్ర థర్మల్ మెయిన్ గేటు ముందు మత్స్యకారులు శనివారం బైఠాయించి శాంతియుతంగా నిరసనను తెలిపారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ రమణమూర్తి, నౌపడ, సంతబొమ్మాళి ఎస్ఐలు రాజేష్, కృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది మెయిన్ గేటు ముందు మోహరించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు మాట్లాడుతూ ప్రజా వినాశనం చేసే థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా 2007 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఆర్డీవో నుంచి రాష్ట్రపతి వరకు వినతి పత్రాలందించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంపరలో థర్మల్ ప్లాంటు నిర్మాణం వ ల్ల రైతులు, మత్స్యకారులు, ఉప్పు కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. సోంపేట పోలీస్ కాల్పుల అనంతరం 2011 మార్చి 2న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వడ్డితాండ్ర వచ్చి థర్మల్ ప్లాంటును రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు సీఎం హోదాలో ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. సోంపేటలో థర్మల్ను రద్దు చేస్తానని చెప్పి బారువలో నాలుగు వేల మెగా ఓట్ల థర్మల్ ప్లాంటును నెలకొల్పుతానని బాబు చెప్పడం దారుణమన్నారు. ఇలా డీఎస్పీ దేవప్రసాద్ ముందు మత్స్యకారులు తమ వినిపించారు. అంతకుముందు ఒడ్డితాండ్ర రిలే దీక్షా శిబిరం నుంచి ప్లాంటు మెయిన్ గేటు వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పోరాట కమిటీ నాయకులు ఎన్.వెంకటరావు, కారుణ్య ఖత్రో, అనంతు దుర్యోధన, కారుణ్య కేశవ, మత్స్యకార మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జగన్‌తోనే థర్మల్ ప్లాంట్ల రద్దు
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే..థర్మల్ ప్లాంట్లను రద్దు చేస్తారని ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకరాపల్లి తంపరలో నిర్మితమవుతున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్పనులకు వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు హెచ్‌ఎన్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సహాయ నిరాకరణ శిబిరం వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. ఇన్నాళ్లూ ఎంతో ఓపికతో ఉద్యమించామని..మరో వంద రోజులు ఉద్యమిస్తే..కలలు నెరవేరుతాయన్నారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొత్తకుంటున్నా..ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ప్లాంట్ యాజమాన్యం ఎగ్గొట్టేం దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్లాంట్‌ను రద్దు చేయిస్తానని చెప్పిన కృపారాణి..కేంద్ర మంత్రి అయిన తరువాత థర్మల్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. కింజరాపు సోదరుల వల్లే.. ఇక్కడ ప్రజా వినాశకర ప్లాంట్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు వచ్చిన ప్లాంట్ సిబ్బంది వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 2 వేల మందితో రోడ్డుపైనే సహపంక్తి భోజ నాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుగ్గురామిరెడ్డి, పి.మేనకేతనరెడ్డి, గిన్ని ప్రకాష్, నర్సింహమూర్తి, పి.శ్రీను, జి.కామరాజు, రామారావు, తేజారెడ్డి, నీలాపు అప్పలస్వామితో పాటు 34 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.