thermal plants
-
మరో 1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో మరో రెండు కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల మరో 1,600 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఈ ప్లాంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తుండగా కొత్తవి అందుబాటులోకి వస్తే జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 6,100 మెగావాట్లకు పెరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగినా సొంతంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి జెన్కో ఎదిగింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గురువారం ‘సాక్షి’కి వివరించారు. ► రాష్ట్ర అవసరాల కోసం ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ యూనిట్ (800 మెగావాట్లు), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రెండోదశ (800 మెగావాట్లు)ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018లోనే పూర్తవ్వాల్సినా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో వ్యయం పెరిగింది. ► గత ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ సంస్థల ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించి అప్పులున్నాయి. ఫలితంగా కొత్తగా అప్పు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు మందగించాయి. ► ఈ రెండు ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఆరు నెలల్లో రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్లాంట్ల వ్యయం ఇలా రూ.కోట్లలో -
ఆర్టీపీపీకి కోల్ కష్టాలు
సాక్షి, కడప: ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోవడం, తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి నుంచి అరకొరగా మాత్రమే వస్తుండటంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుదుత్పత్తి పడిపోయింది. 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 6వ యూనిట్లో శనివారం రాత్రి నుంచి విద్యుదుత్పత్తి నిలిపేశారు.ఆరుయూనిట్లలో ఇప్పటికే 2,5 యూనిట్లు పనిచేయడంలేదు. ప్రస్తుతం 1,3,4 యూనిట్ల పరిధిలో ఆదివారం నాటికి 510 మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఆరు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1650 మెగావాట్లు. ఆరు యూనిట్లకు కలిపి ప్రతిరోజూ 20 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఒరిస్సా రాష్ట్రం తాల్చేరు ప్రాంతంలోని మహానది బొగ్గుగనుల నుంచి ప్రతిరోజూ 4 నుండి 5 రేక్స్(వ్యాగన్లు) బొగ్గు సరఫరా అయ్యేది. ఒక్కో రేక్ 3500 టన్నుల లెక్కన రోజూ 14 వేల నుంచి 16 వేల టన్నులు వచ్చేది.తెలంగాణలోని సింగరేణి నుంచి నిత్యం 3 రేక్స్(వ్యాగిన్లు) చొప్పున 10 వేల టన్నులకు తగ్గకుండా సరఫరా అయ్యేది. దీంతో ఆర్టీపీపీలో బొగ్గు సమస్య ఎప్పుడో కానీ తలెత్తేది కాదు. ఇక్కడ లక్ష టన్నుల వరకు బొగ్గు నిల్వలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. వర్షాలు, సమ్మెతో కష్టాలు ఒరిస్సాలో కార్మికుల సమ్మెకు వర్షాలు తోడుకావడంతో ఆర్టీపీపీకి రెండు వారాలుగా బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. తెలంగాణ నుంచి వెయ్యి టన్నులు మాత్రమే వస్తోంది.దీంతో 20 వేల టన్నులు అవసరమైన ఆర్టీపీపీలో పలు యూనిట్లలో విద్యుత్పత్తి నిలిపి వేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఆరో యూనిట్లో శనివారం నుంచి అధికారులు ఉత్పత్తి నిలిపి వేశారు. జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో సింగరేణి నుంచి రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మరింత పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ సీఎంను కోరారు. ఉన్నత స్థాయి అధికారులు సైతం సింగరేణి నుంచి మరింత బొగ్గును తీసుకు వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఐదు వేల టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. సింగరేణి నుంచి వచ్చే బొగ్గును శుభ్రం చేయకుండానే యూనిట్లకు తరలించాల్సి వస్తోంది. ఏ ఒక్కరోజు బొగ్గు సరఫరాకు ఆటంకం కలిగినా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఆర్టీపీపీ 1991లో ప్రారంభమైంది. 1995లో 1, 2 యూనిట్లలో విద్యుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్ 210 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించారు. తర్వాత రెండవ దశలో 2004లో ఇదే సామర్థ్యంతో 3, 4 యూనిట్లకు విస్తరించారు. 2008లో 5వ యూనిట్‌ను ప్రారంభించారు. 600 యూనిట్ల సామర్థ్యంతో 6వ యూనిట్‌ను ఏడాది కిందట ప్రారంభించారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ నుంచి బొగ్గు సరఫరా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీపీపీ అధికారులు, కార్మికులు కోరుతున్నారు. -
ఏపీలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత నెలకొంది. సింగరేణి, మహానంది బొగ్గు గనుల నుంచి బొగ్గు సరఫరా తగ్గడంతో ఈ పరిస్థతి తలెత్తింది. భారీ వర్షాలు, కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్రభావం రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్లపై పడింది. 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరుతుంది. రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణ చర్యలకు ఉపక్రమించారు. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. బొగ్గు సరఫరా కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని.. సీఎం వైఎస్ జగన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాశారు. బొగ్గు కొరతతోనే సమస్య ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉత్పత్తిలో సమస్యల వలన సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయని..విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం నుండి పవర్ ఎక్సైంజ్ లో అదనంగా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. బొగ్గు సమస్య వల్ల ఇతర రాష్ట్రాలతోపాటు మనకి సమస్య ఏర్పడిందన్నారు. జెన్ కో ద్వారా 3500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉందన్నారు. కానీ బొగ్గు కొరతతో 1500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు. వర్షాలు, ఇతర సమస్యల వల్ల రోజు 75వేల మెట్రిక్ టన్నులకు గాను, 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే బొగ్గు వస్తోందన్నారు. మహానది నుంచి రావాల్సిన బొగ్గు ఆగిపోవడం వల్లనే సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారని..సింగరేణి నుంచి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అలాగే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతపై ఏపీజెన్కో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్రానికి బొగ్గు సరఫరా 57 శాతానికి పైగా తగ్గింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు కాగా, అందుకోసం మహానది కోల్ లిమిటెడ్(ఎంసీఎల్) 17.968 మిలియన్ మెట్రిక్ టన్నులు, సింగరేణి సంస్థ 8.88 మిలియన్ మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే భరత్‌పూర్‌లోని ఎంసీఎల్లో జూలై చివరి వారంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో ఏపీ థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో భారీగా కొత పడింది. సింగరేణిలో కూడా వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆగస్టులో డొంకరాయి-సీలేరులో పవర్ కెనాల్‌కు గండి పడింది.. అయితే భారీ వర్షాలతో పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడింది. తద్వారా బొగ్గు కొరత ఎదుర్కొవాల్సి వస్తోంద’ని తెలిపింది. అలాగే 2018 నవంబర్ నుంచి 2019 ఏప్రిల్ వరకు ఏపీ ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు అప్పు తీసుకుందని.. 2019 జూన్ 15 నుంచి ఆ అప్పు తీరుస్తుందని తెలిపింది. ఇది సెప్టెంబర్ 30తో పూర్తి కానుందని పేర్కొంది. పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని చెప్పింది. ఇప్పటికే సింగరేణి నుంచి బొగ్గు సరఫరా పెంచాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని వెల్లడించింది. అలాగే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని.. ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పింది. -
పర్యావరణం పేరుతో థర్మల్ ప్లాంట్లలో దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. గతంలో పర్యావరణ అనుమతులు లభించినా.. ఇప్పుడు అదే సాకుతో దోపిడీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం రచించింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015లో టెండర్లు పిలిచింది. బాయిలర్, టర్బైన్ జనరేటర్ (బీటీజీ) పనులను బీహెచ్ఈఎల్కు ఇచ్చారు. కృష్ణపట్నంలో టాటా పవర్‌కు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ కంపెనీలకు బీవోపీ (బ్యాలన్స్ ఆఫ్ ప్లాంట్) అప్పగించారు. ఈ రెండు సంస్థలకు అనుకూలంగా నిబంధనలు పెట్టినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో రూ. 2,600 కోట్ల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. పర్యావరణంపై 2015 పారిస్ ఒడంబడికలో భాగంగా థర్మల్ ప్లాంట్లలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను తగ్గించాలని నిర్ణయించారు. కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇది జరిగిన తర్వాతే ఏపీ జెన్కో రెండు థర్మల్ ప్లాంట్లకు టెండర్లు ఖరారు చేసింది. కాంట్రాక్టులో ఈ ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా పాదరసం తగ్గించడం, నీటి వినియోగం అదుపులో ఉంచడం, చిమ్నీ ఎత్తు తదితరాలు కాంట్రాక్టులో పెట్టారు. వీటిద్వారా కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల మేరకు ప్లాంట్ నిర్మాణం చేపట్ట వచ్చు. ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం పర్యావరణ హితంగా రెండు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం రూ. 9,720 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు రెండు ప్లాంట్లలోనూ ఫ్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టెండర్ల నిబంధనలు టీడీపీ నేతల కంపెనీలకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు థర్మల్ ప్లాంట్లలో ప్రధాన కాంట్రాక్టు సంస్థలు ఇచ్చిన సబ్ వర్క్స్ చేసి ఉండాలనే నిబంధనను పెడుతున్నారు. ఈ ప్లాంట్లలో సబ్ కాంట్రాక్ట్ పనులన్నీ టీడీపీ నేతల కంపెనీలకే ఇచ్చారు. అయితే, ఇతర రాష్ట్రాలు కాంట్రాక్టులను ఏక మొత్తంలో ఇచ్చాయి. కానీ ఏపీ జెన్కో మాత్రం విడివిడిగా ఇచ్చింది. బీవోపీ వ్యయాన్ని పెంచడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల సాకుతో.. ఎఫ్‌జీడీ ప్లాంట్ల నిర్మాణం పేరు చెప్పి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ వ్యయాన్ని మరో రూ. 3 వేల కోట్లు పెంచేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. వ్యయం పెరుగుతుంది...ఎంతో చెప్పలేను : విజయానంద్ కొత్త థర్మల్ ప్లాంట్ల వ్యయం పెరుగుతున్న మాట నిజమేనని జెన్కో ఎండీ విజయానంద్ చెప్పారు. అయితే ఏమేర పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల వల్లే ఎఫ్‌జీడీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అసలేంటీ ఎఫ్‌జీడీ పర్యావరణాన్ని దెబ్బతీసేలా థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి విషకారకాలు గాల్లోకి వెళ్తాయి. వీటిని నిరోధించడానికి కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లు విధిగా ఐదు మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం సూచించింది. ప్లాంట్ల నుంచి వచ్చే పాదరసాన్ని తగ్గించాలి. థర్మల్ ప్లాంట్లకు వాడే నీటిని పునర్వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. చిమ్నీ ఎత్తు పెంచడం ద్వారా విషవాయువులను ఎత్తులో విడిచిపెట్టాలి. పొగద్వారా వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ను తగ్గించాలని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి జెన్కో ప్లాంట్లలో ఈ దిశగా తొలిదశలోనే కాంట్రాక్టులో పెట్టారు. అయితే ఇప్పుడు లైమ్‌స్టోన్ ప్లాంట్, రియాక్టర్ పెట్టాలని, జిప్సమ్ అన్‌లోడింగ్‌కు ఏర్పాట్లు చేయాలని జెన్కో అధికారులు చెబుతున్నారు. అయితే రెండు థర్మల్ ప్లాంట్లకు 2016 తర్వాతే పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్లాంట్లలో ఎఫ్‌జీడీ ప్లాంట్ అవసరమైతే కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు అప్పుడే సూచించలేదనేది అంతుబట్టని ప్రశ్న. ఎన్నికల ముందు ప్రజాధనాన్ని దొడ్డిదారిన ఎన్నికల నిధిగా మార్చడమే ప్రభుత్వం ఎత్తుగడగా కన్పిస్తోందని జెన్కో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏ ఇంజనీర్ సూచించకున్నా, కొత్త మార్పులకు సంబంధించిన డిజైన్లు ప్రైవేటు వ్యక్తులు తయారు చేసి, తమను ఆమోదించమంటున్నారని థర్మల్ ప్లాంట్లు పర్యవేక్షించే ఓ అధికారి తెలిపారు. -
జగన్‌తోనే థర్మల్ ప్లాంట్ల రద్దు
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే..థర్మల్ ప్లాంట్లను రద్దు చేస్తారని ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకరాపల్లి తంపరలో నిర్మితమవుతున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్పనులకు వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు హెచ్‌ఎన్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సహాయ నిరాకరణ శిబిరం వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. ఇన్నాళ్లూ ఎంతో ఓపికతో ఉద్యమించామని..మరో వంద రోజులు ఉద్యమిస్తే..కలలు నెరవేరుతాయన్నారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొత్తకుంటున్నా..ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ప్లాంట్ యాజమాన్యం ఎగ్గొట్టేం దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్లాంట్‌ను రద్దు చేయిస్తానని చెప్పిన కృపారాణి..కేంద్ర మంత్రి అయిన తరువాత థర్మల్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. కింజరాపు సోదరుల వల్లే.. ఇక్కడ ప్రజా వినాశకర ప్లాంట్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు వచ్చిన ప్లాంట్ సిబ్బంది వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 2 వేల మందితో రోడ్డుపైనే సహపంక్తి భోజ నాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుగ్గురామిరెడ్డి, పి.మేనకేతనరెడ్డి, గిన్ని ప్రకాష్, నర్సింహమూర్తి, పి.శ్రీను, జి.కామరాజు, రామారావు, తేజారెడ్డి, నీలాపు అప్పలస్వామితో పాటు 34 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
ఆర్‌అండ్‌బీకి కోర్నెట్ గ్రాంట్ మంజూరు
=పరకాల పట్టణ రహదారికి రూ.4.85కోట్లు =జనగామ పట్టణ పరిధి =రహదారి అభివృద్ధికి రూ.2కోట్లు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం కోర్నెట్ గ్రాంట్ కింద జిల్లాకు రూ.6.85కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ-సూర్యపేట రహదారిలోని 1/0 కిలోమీటరు నుంచి 10/0 కిలోమీటరు వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు, పరకాల-హుజూరాబాద్ రహదారిలో ని 30/5 కిలోమీటర్ నుంచి 32/4 కిలోమీట రు వరకు ఉన్న రోడ్డు కోసం రూ.4.85 కోట్లు కేటాయించారు. జనగామ-సూర్యపేట, జనగామ-దుద్దెడ స్టేట్ హైవేలు రెండూ హైదారాబాద్ నుంచి ఏటూరునాగారం మీదుగా భూ పాలపట్నం వరకున్న జాతీయ రహదారిని కలుపుతున్నాయి. మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రయాణికులు జాతీయ రహదారితోపాటు రాజీవ్ రహదారిపై వెళ్లేందుకు ఈ రెండు రహదారుల నుంచి ప్రయాణం చేస్తుం టారు. ఈ రెండు హైవేల మధ్య ఉన్న ప్రాం తంలో వాహనాల రద్దీ ఎక్కువ. దీంతో జనగా మ పట్టణ పరిధిలోని పది కిలోమీటర్ల నిడివి లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిని అభివృద్ధి చేయడమే కాకుండా పేవ్మెంట్లు నిర్మించాలని, అందుకు నిధులు మంజూరు చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఈ మేరకు జనగామ పట్టణ పరిధిలోని రహదారిని వెడ ల్పు, పేవ్మెంట్(ఫుట్‌పాత్) నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. హుజూరాబాద్-పరకాల మధ్య ఉన్న పరకాల పట్టణ పరిధిలోని రహదారిని వెడ ల్పు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసింది. పరకాల నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతా లైన భూపాలపల్లి, రామగుండం, గోదావరిఖ ని, సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం, ఎన్టీపీసీ, ఎపీజెన్‌కో థర్మల్ కేంద్రాలకు వెళ్లే వాహనాల రద్దీ ఇటీవల పెరిగిపోయింది. పరకాల ఇటీవలే మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో పట్టణానికి వచ్చే వాహనాలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వచ్చే గ్రామీ ణ ప్రజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయిం ది. ఈ రహదారిలో 30/0 కిలోమీటర్ల నుంచి 30/6 కిలోమీటర్ల వరకు 7మీటర్లు, 30/6 నుంచి 32/2 వరకు 10 మీటర్లు, 32/2 నుంచి 32/4 వరకు 14 మీటర్లు రోడ్డు వెడల్పు చేయా లని ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఎక్కువ వాహనాల రద్దీ ఉన్న 1.90 కిలోమీటర్ల రోడ్డును పటిష్టం చేయడంతోపాటు డివైడర్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తూ ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ రెండు రహదారుల అభివృద్ధితో జనగామ, పరకాల పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీరనుంది.