
టెక్కలి: దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు వేసిన ఓట్లతో రాజకీయంగా అభివృద్ధి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇప్పుడు అదే ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రచారకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.
ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో మద్రాసు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఒకే రాజధాని ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా సీఎం వైఎస్ జగన్ ఉన్నత ఆశయంతో శ్రీకృష్ణ కమిటీ చెప్పిన ప్రకారం పాలన వికేంద్రీకరణకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. టీడీపీ హయాంలో రాజధాని పేరుతో రైతులను నిలువునా మోసం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment