శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ | YSRCP To Appeal In Court Over Gungur, Srikakulam Lok Sabha Results | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్‌ఆర్‌సీపీ

Published Mon, May 27 2019 7:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రధానంగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మంగళగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ  ఎల్లుండి (బుధవారం) న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement