kinjarapu ram mohan naidu
-
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
చంద్రబాబు, లోకేశ్‌ల.. ఎమ్మెల్సీ మంత్రం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్పీ భంజ్‌దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్‌యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్‌పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది. మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్‌కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు. ఉన్నవెన్ని? వచ్చేవెన్ని? రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ.. ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'! -
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
నమ్ముకున్న వారికి వెన్నుపోటు.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలకు చాలా కాలం ఉన్నా పచ్చ పార్టీలో ఈ సీటు కోసం పోటీ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఇక్కడ చక్రం తిప్పుతున్న సీనియర్ నేత కుటుంబానికి ఈ సారి చెక్ పెట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించారట. అయితే తమ కుటుంబానికే శ్రీకాకుళం ఇవ్వాలని వారు గట్టిగా అడుగుతున్నారట. మరి పచ్చ పార్టీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో? అసలు అక్కడ ఏం జరుగుతోంది? 37 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చక్రం తిప్పుతున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి వచ్చే సారి సీటు ఇవ్వరాదని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుందట. నాలుగుసార్లు సూర్యనారాయణ, ఒకసారి ఆయన భార్య లక్ష్మీదేవి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో మరోసారి ఆమెకే టికెట్ ఇవ్వగా ధర్మాన ప్రసాదరావు చేతిలో పరాజయం పొందారు. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా తమలోనే ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కాని ఈసారి వీరిద్దరికి ఛాన్స్ లేదని జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ నుండి అసెంబ్లీకి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. తన బాబాయ్ అచ్చెన్నాయుడు ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే తాను కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనన్నది రామ్మోహన్ నాయుడు ఆలోచనగా ఉంది. ఇందు కోసం ఈయన నరసన్నపేట లేదా శ్రీకాకుళం అనే ఆప్షన్ తీసుకోనున్నారని ఎంపీ సన్నిహితులు చెబుతున్నారు. బాబు నిర్వాకం బట్టబయలు మరోవైపు గుండ అప్పల సూర్యనారాయణకు ముఖ్య అనుచరుడుగా ఉన్న గొండు శంకర్ కూడా శ్రీకాకుళం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గొండు శంకర్ ద్రోహం చేయడం వల్లే తమకు ఓటమి సంభవించిందని గుండ దంపతుల అనుమానం. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చంద్రబాబు, యర్రంనాయుడుల వైఖరిని విమర్శించారు గుండ అప్పలసూర్యానారాయణ. చంద్రబాబు వైఖరి వలన పార్టీ తీవ్రంగా నష్టపోనున్నదని, పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయంటూ.. తన బాధను చెప్పుకుంటున్న సందర్బంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందర్బంలో గొండు శంకర్ అక్కడే ఉన్నాడని, ఆయనే ఈ ఆడియో లీక్ చేసారని గుండ దంపతుల అనుమానం. అప్పటి నుండి గొండు శంకర్ ను వీరిద్దరూ దూరం పెట్టారు. దీంతో గొండు శంకర్ వీరిద్దరికి వ్యతిరేకంగా కొత్త శిబిరం పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్నారు. అచ్చెన్న మాటకు విలువుందా? మరో వైపు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయిన కొర్ను ప్రతాప్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు పోటీ చేయకపోతే శ్రీకాకుళంలో తనకు అవకాశం ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. ఈయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు కూడా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద గుండ దంపతులు అవుట్ డేటెడ్ కావడంతో కొత్తవారు ఈ స్థానం నుండి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్, కొర్ను ప్రతాప్ లలో ఎవరు ఈ టికెట్ ను ఎగరేసుకుపోతారో కొద్ది రోజుల్లో తేలిపోతోంది. కొత్తతరం హడావుడితో ప్రస్తుతానికి గుండ దంపతుల శిబిరం మాత్రం బోసి పోయి కనిపిస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఫలితాలు తారుమారై ఓటమి పాలయ్యారు. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోవడం అభ్యర్ధుల్ని ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన కొందరు అధికార పార్టీ సిట్టింగులు... ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి బయటపడ్డారు. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. మూడు లక్షల అయిదువేల పోస్టల్ బ్యాలెట్లు, అరవైవేల సర్వీస్ ఓట్లను జారీ చేశారు. వీటిలో 2లక్షల 20వేల ఓట్లు... పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం12 పూర్తి చేయడంలో చేసిన పొరపాట్లుతో చెల్లకుండాపోయాయి. కొన్ని చోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం కూడా వివాదాస్పదమైంది. అలాగే కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు ఆ బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్ పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ఓటమి బారి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. 6,653 ఓట్ల తేడాతో కింజారపు గెలిచారు. అలాగే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ కూడా ఇలాగే సేఫ్ అయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలోనూ భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై 4205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ గెలిచారు. పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. -
రైల్వే మంత్రికి ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైల్వే బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో పలు ప్రతిపాదనలను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు అందజేసినట్లు శ్రీకాకుళం ఎంపీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. గుణుపూర్ నేరోగేజ్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు దివంగత నేత ఎర్రన్నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. అదే విధంగా నవ్యాంధ్రలో ఇచ్ఛాపురం నుంచి కొత్త రాజధాని వరకు పాసింజర్ రైలు నడపాలని కోరినట్లు తెలిపారు. అన్ని స్టేషన్లను కలుపుతూ ఈ రైలు వెళ్లాలని జిల్లావాసుల కోరికగా పేర్కొన్నారు. స్థానిక స్టేషన్లలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండిం గ్లో ఉన్న పనుల కోసం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. వికలాంగుల కోసం ఎస్కలేటర్, పలాస, పొందూరు ప్రాంతాలకు మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రను ఆదుకోవాలి మార్చిలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలు ప్రస్తావించినట్లు తెలిపారు. తుపాను తర్వాత పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామికీకరణ, పన్ను రాయితీలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇటీవల ప్రకటించిన రూ.50 కోట్లు ఏ మూలకూ చాలవని, ఏపీ విభజన సమయంలో బిల్లులో పేర్కొన్న విధంగా సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. క్రికెట్ అభిమానుల కోసం.. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే వరల్డ్ కప్‌కు వెళుతున్న భారత్ జట్టు మంచి ఫామ్‌లో ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతతో సాగిందన్నారు. ఆదివారం సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ట్రాఫిక్ జాం, శాంతిభద్రతలు, కొందరు అభిమానుల దుందుడుకు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఫైనల్ మ్యాచ్‌కు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తానన్నారు. -
నాన్నా... నీ పేరు నిలబెడతా..!
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్ : నాన్నా నీ పేరు నిలబెడతా అంటూ.. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మెహన్ నాయుడు అన్నారు. శనివారం తల్లి విజయలక్ష్మితో కలసి ఆయన నిమ్మాడ వచ్చారు. తొలుత ఎర్రంనాయుడి సమాధికి నమస్కరించి అనంతరం నిమ్మాడ జంక్షన్‌లోని ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. రామ్మెహన్ నాయుడు వచ్చారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలూ అధిక సంఖ్యలో నిమ్మాడ చేరుకోవడంతో వీధులన్నీ కిటకిటలాడాయి. రామ్మెహన్ నాయుడుకి మద్దతుగా అందరూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అంతా ఐక్యమత్యంతో కలసి అభివృద్ధి చేసుకుందామని అందుకు మీరంతా సహకరించాలని కోరారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు ప్రసాదరావు, డీఎస్పీ కింజరాపు ప్రభాకరరావు తదితరులు కూడా ఎర్రంనాయుడు సమాధికి నమస్కరించి నివాళులర్పించారు. -
అంత ఎదిగిపోయావా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు లక్ష్యంగా కింజరాపు కుటుంబం వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించాలన్న వారి ప్రతిపాదనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాతపట్నం సీటును కాపాడుకునేందుకు కార్పొరేట్ లాబీ ద్వారా శత్రుచర్ల చేసిన యత్నాలు ఫలించినట్లే. మరోవైపు నరసన్నపేట నుంచి నామినేషన్ వేసేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బగ్గు రమణమూర్తి సన్నద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు నరసన్నపేట టీడీపీ శ్రేణులను తీవ్ర సందిగ్ధంలో పడేశాయి. రామ్మోహన్‌కు ఎదురుదెబ్బ జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఫాంలో ఉన్నానని భావి స్తున్న కింజరాపు రామ్మోహన్‌కు తొలిసారి ఆసలు రాజకీయమంటే ఏమిటో తెలిసివచ్చింది. తాను ఏం చెప్పినా చంద్రబాబు వింటారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రామ్మోహన్ తన పరిమితులు మరచిపోయారు. బీజేపీకి నరసన్నపేట కాకుండా పాతపట్నం కేటాయించేలా చంద్రబాబును ఒప్పించగలనని తనను తాను అతిగా అంచనా వేసుకున్నారు. ఆ ధీమాతోనే బాబును కలిసిన రామ్మోహన్ నేరుగా అసలు విషయానికి వచ్చేశారు. నరసన్నపేటను బీజేపీకి కేటాయించవద్దని కోరారు. బీజేపీ అభ్యర్థిని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా భుజాన వేసుకుని తిరిగినా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. చంద్రబాబు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. అదే ఫ్లోలో మాట్లాడుతూ నరసన్నపేటను బీజేపీకి కేటాయిస్తే శ్రీకాకుళం ఎంపీ సీటును కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని కాస్త తీవ్రస్వరంతోనే అన్నారు. దాంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఏం తమాషాలు చేస్తున్నావా?.. బీజేపీకి ఏ సీటు ఇవ్వాలో.. ఏదీ ఇవ్వకూడదో నాకు తెలీదా?’అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ‘అయినా నరసన్నపేట ఇస్తే మీకేంటి ఇబ్బంది? శ్రీకాకుళం ఎంపీగానీ టెక్కలి ఎమ్మెల్యే సీటుగానీ ఇవ్వలేదు కదా! 30 ఏళ్ల సీనియర్లు బుచ్చయ్య చౌదరి, కోడెల శివప్రసాద్‌ల సీట్లే బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. మీ పరిస్థితి అలా కాదు కదా!... ఇతరుల సీట్ల గోల మీకెందుకు? అప్పుడే ఇతర సీట్లను కూడా డిసైడ్ చేసేంతవాడివయ్యావా?’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో క్లాస్ పీకినట్లు తెలిసింది. దాంతో రామ్మోహన్నాయుడు బిక్కచచ్చిపోయి మారుమాట లేకుండా వెనక్కి వచ్చేశారు. ఫలించిన శత్రుచర్ల లాబీయింగ్ పాతపట్నం సీటును బీజేపీకి కేటాయించకుండా అడ్డుకోవడంలో శత్రుచర్ల విజయరామరాజు విజయం సాధించినట్లు కనిపిస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన ఆయన కార్పొరేట్ వర్గాల ద్వారా ముమ్మర లాబీ యింగ్ చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల ద్వారా చంద్రబాబు వద్ద తన వాదన వినిపించారు. ‘పాతపట్నం ఇస్తామనే హామీతోనే శత్రుచర్లను పార్టీలోకి తీసుకొచ్చాం.. ఇప్పుడా సీటు బీజేపీకి ఇవ్వడం సరికాదు’ అని వారిద్దరూ బాబు వద్ద సమర్థంగా వాదించినట్లు తెలుస్తోంది. అయినా సరే ‘బగ్గు’ నామినేషన్ సన్నాహాలు హైదరాబాద్ పరిణామాలు ఇలా ఉన్నప్పటికీ.. నరసన్నపేట నుంచి నామినేషన్ వేయడానికి బగ్గు రమణమూర్తి సన్నాహాలు చేసుకుంటుండటం అక్కడి టీడీపీ రాజకీయాలను రసకందాయంలో పడేస్తోంది. ఈ నెల 16న తాను నామినేషన్ వేస్తానని.. అందరూ రావాలని ఆయన పార్టీ నేతలకు కబురు పెట్టారు. నరసన్నపేటను బీజేపీకే ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడితే బగ్గు ఏం చేస్తారన్నది పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారా అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాము ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిణామాలు నరసన్నపేటతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ శ్రేణులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి తాజా పరిణామాలతో మరింతగా దిగజారుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. -
టార్గెట్!
టీడీపీ, కాంగ్రెస్‌లు సరికొత్త మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరతీశాయి. గుండ, కిల్లి కుటుంబాలు సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో కింజరాపు వికెట్టే టార్గెట్. ఇందుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గమే మైదానం. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొద్దిమంది నేతలతో ఈ మేరకు సంప్రదింపుల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒకవైపు సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడకుండా కేంద్రమంత్రి బుజ్జగిస్తుంటే.. మరోవైపు గుండ కుటుంబ సభ్యులు మంతనాలు సాగిస్తున్నారు. ఈ రెండు వర్గాలదీ ఉభయతారక మంత్రమే. ఒక ఓటు ఇటు... ఇంకో ఓటు అటు.. అని ప్రతిపాదిస్తున్నారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలసి పని చేస్తున్నట్లు నటిస్తూనే గుండ కుటుంబం తన దారి తాను చూసుకుంటోంది. కృపారాణి కూడా అదే బాటలో శ్రీకాకుళంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో నిమిత్తం లేకుండా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఈ సరికొత్త క్రీడ శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాన్ని రసవత్తరం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో పరస్పరం సహకరించకునే టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయ క్రీడలో తొలి అంకానికి గుండ కుటుంబం శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌లో మిగిలిన ఉన్న కొద్దిమంది నేతలకు కింజరాపు కుటుంబమంటే ఏమాత్రం పడదు. కానీ వారితో గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా మంతనాలు సాగిస్తుండటం విశేషం. గుజరాతిపేటలో కాంగ్రెస్ నేత దంతులూరి రమేష్‌బాబుతో కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత గుండ లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి రమేష్ బాబుపై గుండ కుటుంబం గత కొన్నేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల తరణంలో అవన్నీ వదిలేసి ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. లక్ష్మీదేవి ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరారు. గుజరాతిపేటలో పదేళ్లుగా టీడీపీ బాధ్యతలు చూస్తున్న కీలక నేతలకు కూడా సమాచారమివ్వకుండా ఆమె రమేష్‌బాబుతో సంప్రదింపులు జరపడం గమనార్హం. తాము టీడీపీలోకి రాలేమని ఆయన చెప్పగా.. పార్టీలోకి రాకపోయినా పర్లేదు ఎన్నికల్లో సహకరించాలని లక్ష్మీదేవి కోరారు. ఎమ్మెల్యే ఓటు వరకు సహకరిస్తాంగానీ ఎంపీ ఓటు గురించి మాత్రం అడగవద్దని రమేష్‌బాబు కరాఖండీగా చెప్పేశారు. ఇందుకు గుండ కుటుంబం సమ్మతించినట్లు తెలుస్తోంది. అంటే ఎంపీ ఓటు వేయకపోయినా పర్లేదు... ఎమ్మెల్యే ఓటు తమకు వేస్తే చాలన్న రీతిలో వారు మంత్రాంగం నడుపుతున్నారన్న మాట. అదే విధంగా కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సుంకరి కృష్ణ, తదితరులతో కూడా గుండ కుటుంబం మంతనాలు సాగిస్తోంది. సుంకరి కృష్ణను టీడీపీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పదవి హామీ ఇస్తే తప్ప తాను పార్టీలోకి రాలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రాకపోయినా ఎన్నికల్లో తమకు సహకరిచాల్సిందిగా గుండ కుటుంబం కోరింది. సుంకరి కృష్ణ కూడా ఎమ్మెల్యే ఓటు వరకు సహకారం అందిస్తాం.. ఎంపీ ఓటు గురించి మాత్రం ప్రస్తావించవద్దని చెప్పేశారు. దానికి అభ్యంతర చెప్పకుండా గుండ కుటంబం ఓకే అన్నట్లు సమాచారం. అంటే.. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌తో పని లేకుండా తమ ఓటు పదిలం చేసుకునే పనిలో పడిందన్న మాట. లక్ష్మీదేవి అడుగుజాడల్లో కృపారాణి ఇక మ్యాచ్ ఫిక్సింగ్ రెండో భాగాన్ని కేంద్రమంత్రి కృపారాణి తన భుజాన వేసుకున్నారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గుండ లక్ష్మీదేవి బాటలోనే ఆమె సాగుతున్నారు. లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపి వచ్చిన వెంటనే అదే నేతలతో కృపారాణి మంతనాలు సాగిస్తున్నారు. దంతులూరి రమేష్‌బాబుతో లక్ష్మీదేవి చర్చలు జరిపిన కొన్ని రోజులకే కృపారాణి ఆయనతో మంతనాలు సాగించి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. ఎంపీ ఓటు తనకు వేయాలని.. ఎమ్మెల్యే ఓటు లక్ష్మీదేవికి వేయాలని ప్రతిపాదించారు. అంటే లక్ష్మీదేవి ఏ ఒప్పందానికి వచ్చారో.. అదే ఒప్పందానికి కృపారాణి సై అన్నారు. ఆ తర్వాత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణ నివాసానికి కూడా వెళ్లి ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతిస్తే చాలు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికి సహకరించినా పర్లేదని చెప్పేశారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా లక్ష్మీదేవి, కృపారాణి ఇటువంటి ఒప్పందాలే కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ పరస్పర సహకార ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. అటు గుండ కుటుంబం తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గెలుపు కోసం పట్టించుకోవడం లేదు.. ఇటు కృపారాణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఫిక్సింగ్ రాజకీయం పర్యవసనాలు ఎలా ఉంటాయో మరి!