పదవులతో పెద్దపీట వేసిన చంద్రబాబు
కేంద్రమంత్రిగా అబ్బాయి
రాష్ట్రమంత్రిగా బాబాయి
సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి అగ్రతాంబూలం
సీనియర్ ఎమ్మెల్యేగా కేబినెట్‌లోకి తీసుకున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్‌నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్‌లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు.
వారి ఆశలపై నీళ్లు..
వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్‌నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
హ్యాట్రిక్ విజయాలు..
టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment