నాన్నా... నీ పేరు నిలబెడతా..! | Kinjarapu Ram Mohan Naidu Yerrannaidu Tomb Saluted | Sakshi
Sakshi News home page

నాన్నా... నీ పేరు నిలబెడతా..!

Published Sun, May 18 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

నాన్నా... నీ పేరు నిలబెడతా..!

నాన్నా... నీ పేరు నిలబెడతా..!

కోటబొమ్మాళి, న్యూస్‌లైన్ : నాన్నా నీ పేరు నిలబెడతా అంటూ..  శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మెహన్ నాయుడు అన్నారు. శనివారం తల్లి విజయలక్ష్మితో కలసి ఆయన నిమ్మాడ వచ్చారు. తొలుత ఎర్రంనాయుడి సమాధికి నమస్కరించి అనంతరం నిమ్మాడ జంక్షన్‌లోని ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. రామ్మెహన్ నాయుడు వచ్చారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలూ అధిక సంఖ్యలో నిమ్మాడ చేరుకోవడంతో వీధులన్నీ కిటకిటలాడాయి. రామ్మెహన్ నాయుడుకి మద్దతుగా అందరూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అంతా ఐక్యమత్యంతో కలసి అభివృద్ధి చేసుకుందామని అందుకు మీరంతా సహకరించాలని కోరారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కోటబొమ్మాళి  పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు ప్రసాదరావు, డీఎస్పీ కింజరాపు ప్రభాకరరావు తదితరులు కూడా ఎర్రంనాయుడు సమాధికి నమస్కరించి నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement