Kotabommali
-
'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ
టైటిల్: కోటబొమ్మాళి పీఎస్ నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు దర్శకుడు: తేజ మార్ని సంగీతం : మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్ నిర్మాత : బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్ విడుదల తేదీ: 2023 నవంబరు 24 రీమేక్ అనేది సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్టయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజై ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం 'నాయట్టు'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లలో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) కథేంటి? శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి. ఈ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ(శ్రీకాంత్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్లో రవికుమార్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్. కోటబొమ్మాళిలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్.. ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంటపడతారు? మరి హత్య చేసిన ముగ్గురిను.. పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. సినిమా ఎలా ఉందంటే? రీమేక్ సినిమా తీయడం అనేది ఎంత సేఫో? అంత డేంజర్ కూడా! ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వులపాలైపోవడం గ్యారంటీ. ఈ విషయంలో 'కోటబొమ్మాళి పీఎస్' ఫస్ట్ క్లాస్‌లో పాసైపోయింది! రెండున్నర గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే.. మైనర్ బాలికని రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాళ్లని పోలీసులు ఎన్కౌంటర్ చేసే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్ కోసం రామకృష్ణ(శ్రీకాంత్), ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎష్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉపఎన్నికకు సంబంధించిన స్టోరీ నడుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అదికాస్త రాజకీయం అవుతుంది. రెండు స్టోరీలకు లింక్ ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్స్.. ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్లు పోలీసులకు దొరికారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. 'నాయట్టు' చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌కి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా ఓ నాలుగైదు పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్, పోలీసులు మధ్య ఛేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మెయిన్ లీడ్స్‌లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే మంచి థ్రిల్ ఇస్తాయి. ఆల్రెడీ పోలీసోడు కాబట్టి తనని ఛేజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్స్ ఇస్తుంటాడు. సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందా? పోలీసులు.. హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్స్‌ని పట్టుకుంటారా? లేదా అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్‌లో జరుగుతాయి. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కథే హీరో. మిగిలిన వాళ్లంత పాత్రధారులు మాత్రమే. అలానే స్టార్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్‌కి పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్‌కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని.. స్టోరీ అంతా ఉంటుంది కానీ యాక్టింగ్‌కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఎస్పీ రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్.. పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళీ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఫరిది మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'లింగి లింగి లింగిడి' పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజిక్ హిట్. పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది. పాటలేం లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథకు తగ్గట్లు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. చివరగా డైరెక్టర్ తేజ మార్ని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాసైపోయారు. ఓవరాల్‌గా 'కోటబొమ్మాళి పీఎస్'.. ఓ మంచి మూవీ చూసిన ఫీల్ ఇస్తుంది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ) -
ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!
ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24 ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149) అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 -
‘కోట బొమ్మాళి పీఎస్’లో హీరోలు లేరు: అల్లు అరవింద్
‘పోలీసులనే పోలీసులు వెంటాడే విచిత్రమైన కథ ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమాలో హీరోలు లేరు.. కథే హీరోగా వెళుతుంటుంది. ఈ చిత్రం ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి తీయలేదు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లింగిడి లింగిడి..’ పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పారు’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
Kotabommali PS Pre Release Photos: ‘కోట బొమ్మాళి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది'.. శివాని క్రేజీ కామెంట్స్!
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివాని రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. గ్లామరస్ పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే వాటి గురించి ఆలోచించడం లేదు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడమే నా పని. రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. మా కథల విషయంలో అమ్మా, నాన్న జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది.' అని అన్నారు. శ్రీకాంత్ సార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపింది. -
ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా కోట బొమ్మాళి పాట
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుంచి ‘ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ్మ తల్లి సన్నిధానంలో ఈ పాటను విడుదల చేశారు. రంజన్ రాజ్ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తేజా మార్ని, చిత్రసహ నిర్మాత భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
'లింగి లింగి లింగిడి' పాట.. 30 మిలియన్ వ్యూస్ సెలబ్రేషన్స్
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పాట బాగా పాపులర్ అయింది. 'లింగి లింగి లింగిడి' అంటూ సాగే ఈ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. తాజాగా 30 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీంతో ఈ పాట ఉన్న 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా టీమ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 30 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసిన మూవీ టీమ్.. తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడితో పాటు నటీనటులు రాహుల్ విజయ్, శివాజీ రాజశేఖర్, దర్శకుడు తేజ మర్ని పాల్గొన్నారు. జీఏ 2 సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మలయాళ సూపర్‌హిట్ 'నాయట్టు' చిత్రానికి రీమేక్. నవంబరు 24న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
'నాయట్టు' రీమేక్.. తెలుగులో ఇన్నాళ్లకు
2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్‌కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) ఈ ప్రాజెక్ట్‌కు 'కోటబొమ్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. 'నాయట్టు' కథేంటి? రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
మహిళా అధికారిపై అచ్చెన్నాయుడి చిందులు
సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో దందాలు చేసిన అచ్చెన్నాయుడికి ఇంకా పాత వాసనలు వదిలినట్టు లేదు.. ఏకంగా మహిళా ఎంపీడీఓ మీదే దండెత్తారు. గత ప్రభుత్వంలో అక్రమంగా సంక్షేమ పథకాలను అందుకున్న అనర్హులను అధికార యంత్రాంగం తొలగిస్తుండడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. సాక్షాత్తు తన సొంత మండలంలోనే ఇటువంటి పారదర్శక పాలన కొనసాగుతుండడంతో తన మార్క్‌కు భంగం కలుగుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. దీంతో శనివారం కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఇన్చార్జి ఎంపీడీఓ ఎస్.రాజేశ్వరమ్మతోపాటు మిగిలిన అధికారులను బెదిరిస్తూ చిందులు వేశారు. మండల పరిషత్ కార్యాలయానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువవుతోందని, దీనిని కట్టడి చేయాలంటూ ఆమెను హెచ్చరించారు. దంత పంచాయతీలో పింఛన్ల తొలగింపుపై చిందులు తొక్కారు. తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఇన్చార్జి ఎంపీడీఓను అచ్చెన్నాయుడు బెదిరించారు. దీంతో మండల పరిషత్ కార్యాలయ సిబ్బందితోపాటు మిగిలిన అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
అచ్చెన్నాయుడుది నేర చరిత్ర: వైఎస్సార్ సీపీ
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం): కోటబొమ్మాళిలో పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని పేర్కొంది. ఈ దాడికి నిరసనగా శుక్రవారం కొత్తపేట నుంచి కోటబొమ్మాళి మార్కెట్ వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీనియర్ నేతలు తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణ దాస్, టెక్కలి అసెంబ్లీ సమన్వయ కర్త పేరాడ తిలక్, పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞతతో ఉండాలని, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నేర చరిత్ర కలిగిన వారని, ఆయనను తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అచ్చెన్నాయుడుని ఈడ్చి ఈడ్చి కొట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు కవ్వింపులకు పాల్పడటం తగదని, కోటబొమ్మాళి ఎస్ఐ, టెక్కలి సీఐలు అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. అచ్చెన్నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోటబొమ్మాళి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యాలయంపై టీడీపీ నేతల దాడి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం రెచ్చిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి... ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు వైఎస్సార్ కార్యకర్తలపై కర్రలు, ఐరన్ రాడ్లుతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా రక్తం వచ్చేలా కొట్టారు. ఈ దాడిలో సుమారు 120మంది పాల్గొన్నట్లు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి శ్యామలరావు ’సాక్షి’కి వివరించారు. కాగా దాడి జరిగిన ప్రాంతానికి ...కేవలం అయిదు వందల మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా దాడి చేసుకునేందుకే మీరంతా ఇక్కడ ఉన్నారా అంటూ సీఐ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. దాడిలో గాయపడ్డ కార్యకర్తలు : నేతింటి నగేష్ బోయిన నాగేశ్వరరావు అన్నెపు రామారావు బుబ్బ వెంకటరావు కొర్ల ఆదినారాయణ పాతుల శ్యామలరావు -
తమ్ముడు చేతిలో అన్న హత్య
శ్రీకృష్ణాపురంలో దారుణం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు తనే హత్య చేసినట్టు అంగీకరించిన తమ్ముడు ఆ ఇంట ఆదివారం వివాహ వేడుక జరగాల్సి ఉంది. అంతా ఆ పనుల్లోనే తిరుగుతూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై పని చేస్తున్నారు. అయితే మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఏటో వెళ్లిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి నెల రోజుల కిందటే ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆస్తులకు సంబంధించి తరచూ ఇంట్లో వివాదాలు సృష్టిస్తున్నాడు. ఆస్తుల సంగతి తేల్చకుంటే వివాహం జరిగిన వెంటనే కొత్త జంటను చంపేస్తానని స్వయూన తమ్ముడినే బెదిరిస్తూ వచ్చాడు. దీనిని తట్టుకోలేని తమ్ముడు అన్న బెదిరింపులకు పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించాడు. వివాహం జరగడానికి ఇంకా రెండు రోజుల గడువుందనగా శుక్రవారం రాత్రి అన్నను రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆ విషయూన్ని పోలీసుల ముందు కూడా అంగీకరించాడు. వివరాల్లోకి వెళ్తే... కోటబొమ్మాళి (సంతబొమ్మాళి) : సంతబొమ్మాళి మండలం పాలతలగాం పంచాయతీ శ్రీకృష్ణాపురం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురయ్యూడు. తోబుట్టిన వాడనే విచక్షణ మరచి రాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయూడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, వీఆర్వో సంతబొమ్మాళి పోలీసులకు సమాచారం అందజేశారు. హతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం... భూపతి శ్రీనివాస్, బాలరాజుకు స్వయూన అన్న. శ్రీనివాస్ మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఎటో వెళ్లిపోరుు నెల రోజుల కిందటే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఆస్తుల పేరిట రోజూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మానసికంగా వేధించేవాడు. కాగా ఈ నెల 24న శ్రీనివాస్ తమ్ముడు బాలరాజుకు వివాహం జరగాల్సి ఉంది. శ్రీనివాస్ రోజూలాగే శుక్రవారం రాత్రి కూడా వివాహం జరిగిన వెంటనే బాలరాజు దంపతులను చంపేస్తానని బెదిరించాడు. వీటిని భరించలేని బాలరాజు చివరకు అన్న శ్రీనివాస్ పెట్టే మానసిక హింసను భరించలేక ఆయన నిద్రిస్తున్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాడ్‌తో కొట్టి చంపేశానని బాలరాజు స్వయంగా పోలీసులకు తెలిపాడు. ఇదిలా ఉండగా హతుడు శ్రీనివాస్‌కు ఒడిశాలోని కొన్ని దొంగతనాలు, రైలు దోపిడీ కేసులతో సంబంధాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. హత్యకు సంబంధించి క్లూస్ టీం, జాగిలాలు తెప్పించినప్పటికీ బాలరాజు తనే అన్నను హత్య చేసినట్టు నేరం అంగీకరించడంతో పోలీసులకు శ్రమ తప్పింది. బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని టెక్కలి ఆసుపత్రికి పోస్టుమార్టంకు పంపారు. కాశీబుగ్గ డీఎస్పీ కె.దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ భవానీప్రసాద్ పర్యవేక్షణలో సంతబొమ్మాళి ఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలగ కుల పిక్నిక్లో రాజకీయ చిచ్చు
మంత్రి అచ్చెన్నకు ఆహ్వానంపై రగడ దూరంగా ఉన్న రొక్కం దొరలు కోటబొమ్మాళి: తెలగ కుల వనసమారాధనకు రాజకీయ రంగు పులుముకుంది. ఏటా ప్రశాంతంగా జరిగే ఈ పిక్నిక్ ఈ ఏడాది పేవలంగా మారింది. కోటబొమ్మాళిలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలగ కుల సంక్షేమ సంఘ పిక్నిక్కు ఇటు రొక్కం దొరలు, అటు మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకాలేవు. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం భోజనాలు తర్వాత నీరసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుని సంఘ ప్రతినిధులు ఆహ్వానించడంతో జీర్ణించుకోలేని కురుడు దొరలుగా గుర్తింపు పొందిన సంఘ గౌరవ అధ్యక్షుడు రొక్కం మధుబాబు, గౌరవ సలహాదారులు రొక్కం అచ్చుతరావు, మండపాక నర్సింగరావు, రొక్కం సూర్యప్రకాశరావు, రొక్కం సత్యనారాయణ, వంటి ప్రముఖులు వనసమారాధనకు హాజరు కాలేదు. తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలని గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న తరుణంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన తెలగ కుల సంఘ ప్రతినిధులు మంత్రి, ఎంపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రిని సన్మానించేందుకు నిర్ణయించారు. దీనికి ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు అడ్డుచెప్పడంతో తెలగ కులంలో సంక్షోభం చెలరేగింది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ఆహ్వానాన్ని జీర్ణించుకోలేని కురుడు, చిన్నసాన, వల్లేవలస తదితర గ్రామాల పెద్దలు పిక్నిక్కు హాజరు కాలేదని తెలిసింది. తప్పించుకున్న అచ్చెన్న ఇదిలావుండగా తెలగకుల సంక్షేమం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని పిక్నిక్కు ఆహ్వానించడం ఆనవాయితీ అని, అంతమాత్రాన ఈ కార్యక్రమానికి రాజకీయ బురద అంటకట్టడం సమంజసం కాదని కింది స్థాయి తెలగ కుల సంఘ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంతో ఆదరాభిమానాలతో అచ్చెన్నాయుడిని వనసమారాధనకు ఆహ్వానిస్తే తెలగ కులాన్ని బీసీల్లో కలపమని కోరుతారేమోనన్న భయంతోనే ఆయన హాజరుకాకుండా తప్పించుకున్నారని తెలగ కులానికి చెందిన నిరుద్యోగ యువకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు పుణ్యమా అని జిల్లాలో తెలగ కుల సంఘం రెండు ముక్కలుగా చీలిపోయిందని చెప్పక తప్పదు. -
ప్రత్యేక హోదాపై ఆందోళనొద్దు
కోటబొమ్మాళి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర కార్మిక, క్రీ డల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి గోవిందరాజుల కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం అని, దీనిపై మోదీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సాధించారన్నారు. టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కుమ్మక్కయ్యారని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై రాజకీయం చే స్తోందని.. అందులో భాగమే తిరుపతిలో శనివారం జరిగిన మునుకోటి అనే కార్యకర్త ఆత్మహత్య సదుద్దేశమని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చకొడుతున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసు కేసునమోదు చేయాలన్నారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని, ఆ విషయం సోనియాకు, రాహుల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. గ్రామ కమిటీల సమావేశానికి శ్రీకారం: టీడీపీ గ్రామ, మండల, జిల్లా కమిటీల కార్యాచరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని.. అందుకు క్యాలెండర్ రూపొందించారని మంత్రి తెలిపారు. ప్రతి నెల 9న గ్రామ కమిటీ, 17న మండల కమిటీ, 24న జిల్లా కమిటీలు సమావేశమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరుగుతుందని మంత్రి వివరించారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, ఎంపీపీ తర్ర రామకృష్ణ, మండల అధ్యక్షుడు బి.రమేష్, మాజీ ఎంపీపీ వి.విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు కె.నాగయ్యరెడ్డి పాల్గొన్నారు. -
అచ్చెన్న ఇలాకాలో అవినీతి చీడ!
కోటబొమ్మాళి: సాక్షాత్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంతమండలమైన కోటబొమ్మాళిలోని తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి చీడపురుగులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రంలో పలు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ కార్యాలయంలో సిబ్బంది అక్రమాలకు అడ్డులేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఇద్దరు వీఆర్వోలే ప్రధాన సూత్రధారులుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ బాలాజీ శ్రీనివాస్ ఉదంతం ఈ కార్యాలయం అవినీతికి నిదర్శనం. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగళ్లు, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, జనన మరణ ధ్రువపత్రాలు తదితర వాటికి సంబంధించి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడుకు బంధువులమని చెప్పుకుంటూ ఇద్దరు వీఆర్వోలు ఇలా లంచాలు దండుకుంటున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. పాస్‌పుస్తకానికి రూ.3 వేలు, అడంగళ్లల్లో తప్పులు సరిదిద్దడానికి, వెబ్ ల్యాండ్‌లో నమోదుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు, జనన ధ్రువపత్రానికి రూ.రెండు వేలచొప్పున వసూలు చేస్తున్నారని, ముడుపులు చెల్లించేందుకు నిరాకరించిన వారికి చుక్కలు చూపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ కార్యాలయం బాగోతం వెళ్లినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం ఉంటుందేమోనన్న భయంతో సిబ్బంది అవినీతికి కళ్లెం వేయలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బహిరంగ సభల్లో అవినీతి అక్రమాలపై మాట్లాడే మంత్రి అచ్చెన్నాయుడు తన ఇలాకాలోనే ఇంత అవినీతి జరుగుతుండడంపై సర్వత్రీ తీవ్రవిమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతిపై ఫిర్యాదులు అందలేదు ఈ ఆరోపణలపై స్థానిక తహశీల్దార్ వై.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సాంకేతిక పరమైన ఇబ్బందులు వల్ల కొన్ని ధ్రువపత్రాల జారీలో జాప్యం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తమ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఇప్పటి వరకు తనకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు. -
పింఛన్లపై హైకోర్టు తాఖీదు
కోటబొమ్మాళి: మండలంలోని జర్జంగి పంచాయతీలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తమ పింఛన్లును అధికారులు తొలగించారంటూ పలువురు హైకోర్టులో పిటీషన్ వేయగా విచారణకు స్వీకరించింది. కోర్టు జనవరి 19న స్వయం గా గాని, వారి తరఫున న్యాయవాది గాని కోర్టుకు హాజరుకావాలని రాష్ట్ర పం చాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్‌కు, కోటబొమ్మాళి ఎంపీడీఓ, జర్జంగి సర్పంచ్‌కు కోర్టు తాఖీదులు ఇచ్చింది. జర్జంగిలోని గుంజిలోవకు చెందిన కవిటి మల్లయ్యతో పాటు మరో 10 మంది పింఛనుదారులు తామంతా అర్హులమైనా తమ అధికారులు పింఛన్లు తొలగించారని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు హాజరుకమ్మని ఆదేశించింది. -
220 మంది ఉద్యోగుల బదిలీ
కోటబొమ్మాళి: ఇటీవల జిల్లా పరిషత్ పరిధిలోని 220 మం ది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేసినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీరఘట్టం, నందిగాం, హిరమండలం, పాతపట్నం మండలాల ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశామన్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాలో 9 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.రాజు పాల్గొన్నారు. కురుడు హైస్కూల్లో విచారణ మండలంలోని కురుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుద్‌హుద్ తుపానుకు పాఠశాల ఆవరణలో 8 నీలగిరి చెట్లు కూలిపోగా వాటిని హెచ్.ఎం ఎల్వీ ప్రతాప్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారంటూ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మణరావు ఇటీవల జిల్లా పరిషత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ రవీంద్ర, ఎంపీడీఓ బి.రాజులతో కలసి శని వారం పాఠశాలలో విచారణ జరిపారు. చెట్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెచ్.ఎం ప్రతాప్‌ను, ఫిర్యాదు దారుడు లక్ష్మణరావుల నుంచి వివరాలు సేకరించారు. -
బంగారు తల్లికి బెంగ
ఆడపిల్లంటే సమాజంలో ఇప్పటికీ చిన్నచూపే. నగరాలు, పట్టణాల్లో పరిస్థితి కొంత మారుతున్నా.. గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్లను గుదిబండగా భావిస్తున్నారు. పెంచి, చదివించి, పెళ్లి చేయడం ఆర్థిక భారమన్న భావన తల్లిదండ్రుల్లో పాతుకుపోయింది. ఈ అపవాదును పోగొట్టి ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆలంబన కల్పించి.. ఆమెను బంగారు తల్లిగా మార్చేందుకు ఉద్దేశించిన బంగారు తల్లిపథకాన్ని కొత్త ప్రభుత్వం దాదాపు మూలన పడేసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పథకం పేరు మార్చి కొనసాగిస్తామని ప్రకటించినా.. అదీ చేయకుండా.. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయకుండా పథకాన్ని..దానిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను డోలాయమానంలో పడేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఈ పథకం స్థితిగతులపై ‘సాక్షి’ ప్రొగ్రెస్ రిపోర్ట్.. వీరఘట్టం, కోటబొమ్మాళి: బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న బెంగ పేద తల్లిదండ్రులను వేధిస్తోంది. పేదవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెళ్లీడుకు వచ్చేనాటికి ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రిలో కాన్పు అయిన వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించి తొలివిడతగా పాప పేరిట బ్యాంకు ఖాతాల్లో రూ.2500 జమ చేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఏటా విడతల వారీగా నగదు జమ చేస్తూ 21 ఏళ్లు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు అందజేస్తారు. పథకం ప్రారంభమై ఈ ఏడాది మే ఒకటో తేదీకి ఏడాది గడిచిపోయినా లబ్ధిదారుల ఖాతాలకు రెండో ఏడాది జమ చేయాల్సిన సొమ్ము విడుదల చేయలేదు. కొత్త దరఖాస్తుదారులనూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 38 మండలాల్లో ఇప్పటివరకు 13,931 మంది ఈ పథకం కింద పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 659 మందిని అనర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిలో 6637 మంది ఖాతాలకు రూ.2500 చొప్పున జమ చేశారు. ఇందులోనూ 5688 మందికే సర్టిఫికెట్లు(బాండ్లు) అందాయి. మిగతావారు బాండ్ల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 6635 మంది దరఖాస్తుదారులకు పథకం మంజూరు నిలిచిపోయింది. మార్చి నుంచి నిధులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉ న్న లబ్ధిదారులకు 5 నెలలుగా నిధులు కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే తమకు ఉత్తర్వు లు లేవంటున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇదీ పథకం లక్ష్యం ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించేం దుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే తగిన ధ్రువపత్రాలతో పేదవర్గాల వారు దరఖాస్తు చేసుకుంటే అర్హతలను గుర్తించి వెంటనే ఆ పాప పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2500 జమ చేస్తారు. టీకాలు అన్నీ సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది వెయ్యి రూపాయలు జమ చేస్తారు. ఆ తర్వాత చదువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విడతల వారీగా నగదు జమ చేస్తూ ఆడపిల్లకు 21 ఏళ్లు.. అంటే పెళ్లి వయసు వచ్చేనాటికి గరిష్టంగా రూ.2.16 లక్షలు ఆ కుటుంబానికి అందించాలన్నది లక్ష్యం. అత్యధికంగా రణస్థలంలో.. పథకం మంజూరుకు దరఖాస్తు చేయడంలో రణస్థలం అగ్రస్థానంలో ఉంది. ఈ మండలం నుంచి 668 మంది దరఖాస్తు చేయగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా గార(637), ఎచ్చెర్ల(570), రేగిడి(559), లావేరు(538), కోటబొమ్మాళి(519), వీరఘట్టం(507) మండలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం తెల్లకార్డు కలిగిఉన్న పేదవర్గానికి చెందిన వారికి తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుడితే బంగారు తల్లి పథకం కింద లబ్ధి పొం దే అవకాశం ఉండటంతో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొద్ది నెలల క్రితం వరకు ప్రజలు ఆసక్తి చూపేవారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకా న్ని పట్టించుకోకపోవడం.. కొన్ని నెలలుగా డబ్బులు కూడా జమ కాకపోవడంతో కొన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. నిధులు విడుదల కాలేదు ఎస్.తనూజారాణి, పీడీ, డీఆర్డీఏ జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. అయితే పథకానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. అందువల్ల ఇప్పటివరకు గుర్తించిన లబ్ధిదారులకు ఖాతాలకు సొమ్ము జమ చేయలేకపోతున్నాం. పథకం పేరును మా ఇంటి మహా లక్ష్మిగా మార్చుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణ యం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుకే బోలెడు తంతు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవడమే పెద్ద తంతు. ఆడపిల్ల పుట్టిన వెంటనే వైద్య సిబ్బంది ఇచ్చే కాన్పు ధ్రువపత్రం, ఆ తర్వాత జనన ధ్రువపత్రం తీసుకోవాలి. గ్రామైక్య సంఘం వద్ద మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటితోపాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, మరికొన్ని పత్రాలు జతచేసి ఐకేపీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి రూ. 3 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఆడపిల్ల పుడితే బంగారుతల్లి పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నారు. ఎంతో ఆశతో దరఖాస్తు చేశాం. తీరా 5 నెలల తర్వాత లిస్టులో నాపేరు లేదన్నారు. నాలుగు నెలలు క్రితం మళ్లీ దరఖాస్తు చేశాను. అయినా ఇంతవరకు బాండ్ రాలేదు. -భోగాది భారతి, వీరఘట్టం పాప పుట్టిన వెంటనే బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేశాను. కానీ ఇంతదాకా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమకాలేదు. అధికారులను అడిగితే అదిగో వచ్చేస్తాది .. ఇదిగో వచ్చేస్తాది అంటున్నారు. - కసింకోట సంతు, వీరఘట్టం గత సంవత్సరంలో జూన్‌లో పాప పుట్టింది. బంగారుతల్లికి దరఖాస్తు చేస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలో రూ.2500 పడుతుందని అధికారులు చెప్పారు. ఏడాదైనా పైసా రాలేదు -మయిగాపు చంద్ర, వీరఘట్టం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కోటబొమ్మాళి : జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులు, క్షతగాత్రుడు పశ్చిమగోదావరి జిల్లావాసులు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం గురించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపారానికి చెందిన తిరుమల నాగస్వామి (27), నాతరెడ్డి లక్ష్మినారాయణ అలియాస్ నాని(28), నర్సాపురానికి చెందిన శివభవానీ ఆ జిల్లాలో ఆక్వా పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి చేప పిల్లలు తెచ్చేందుకు వారు మంగళవారం రాత్రి కారులో బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న తిరుమల నాగస్వామి, ముందు సీట్లో కూర్చున్న నాతరెడ్డి లక్ష్మినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న శివభవానీ కాళ్లు విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోవడంతో బయటకు తీయలేకపోయారు. దీంతో స్థానిక పోలీసులు క్రేన్‌ను తెప్పించి లారీ నుంచి కారును వేరు చేసి మృతదేహాలను వెలికి తీశారు. గాయాల పాలైన శివభవానీని 108 అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీని రోడ్డు పక్కన ఆపి సిబ్బంది టీ తాగేందుకు వెళ్లారు. వారు వచ్చేలోగా జరిగిన ప్రమాదంలో లారీ వెనుక టైరు దెబ్బతింది. టెక్కలి సీఐ పి.శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుల బంధువులకు సమాచారమిచ్చిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.నారాయణస్వామి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కోటబొమ్మాళి (శ్రీకాకుళం) : జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయూలయ్యూయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన తిరుమల నాగస్వామి (27), నాతరెడ్డి లక్ష్మీనారాయణ (నాని,(28)), నరసాపురానికి చెందిన శివభవాని ఆ జిల్లాలోనే ఆక్వా పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి చేపపిల్లలు తెచ్చేందుకు మంగళవారం రాత్రి కారులో బయల్దేరారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కారు రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో కారు నడుపుతున్న తిరుమల నాగస్వామి, ముందు సీట్లో కూర్చున్న నాతరెడ్డి లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న శివభవాని కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కారును బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును వేరుచేసి మృతదేహాలను వెలికితీశారు. గాయాలపాలైన శివభవానిని 108 అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టెక్కలి సీఐ పి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుల బంధువులకు సమాచారమిచ్చిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.నారాయణస్వామి తెలిపారు. -
షాకిచ్చిన సెలైన్!
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: అనారోగ్యం చేసి ఆస్పత్రికి వెళితే.. కొత్త సమస్య తెచ్చిపెట్టాయి అక్కడి సెలైన్ బాటిళ్లు. వారిని మరింత అస్వస్థత పాల్జేసి ఆందోళనకు గురిచేశాయి. సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో రోగులకు ఇచ్చిన సెలైన్ వికటించడంతో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోటబొమ్మాళి మండలం బలరాంపురం, లఖందిడ్డి, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 15 మంది డయేరియాతో బాధ పడుతూ రెండు రోజులుగా స్థానిక సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా శనివారం ఉదయం అక్కడి నర్సులు రోగులకు సిప్రాఫ్లాక్ససిన్ ఆర్ఎల్, మెట్రోజల్ ఎన్ఎస్ సెలైన్ ఎక్కించారు. వాటిని ఎక్కించి ఐదు నిమిషాల వ్యవ ధిలో రోగుల్లో విపరీత మార్పు ప్రారంభమైంది. ఒళ్లంతా చెమటలు పట్టి, చలిజ్వరం కమ్మేయడంతో వారంతా లబోదిబోమంటూ విలపించడం ప్రారంభించారు. రోగుల కుటుం బీకులు కొందరిని వేరే ఆస్పత్రులకు తరలించగా, మరికొందరిని ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించకుండా విరుగుడు చికిత్స అందించారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చికిత్స కోసం వస్తే నాసి రకం సెలైన్లు ఎక్కించి కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టించడంపై రోగులు, వారి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై ఆస్పత్రి వైద్యుడు గణేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సెలైన్లు రియాక్షన్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. 15 రోజుల కిందట హైదరాబాద్ నుంచి సెలైన్ బాటిళ్ల స్టాకు వచ్చిందని, వీటి కాలపరిమితి కూడా చాలా ఉందన్నారు. ఆ ధీమాతోనే రోగులకు ఎక్కించామన్నారు. ఇప్పటికే కొంత స్టాకు వినియోగించామని, అయితే తాజా సంఘటనతో మిగిలిన 1500 సెలైన్ బాటిళ్లను సీజ్ చేశామని వివరించారు. పక్క ఆస్పత్రుల నుంచి సెలైన్ బాటిళ్లు తెప్పించి రోగులకు ఇచ్చామని చెప్పారు. ఈ సంఘటన గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారికి సమాచారం అందజేశామని చెప్పారు. చాలా భయమేసింది డయేరియా చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే సెలైన్ ఎక్కించారు. అంతే ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. చలిజ్వరం రావడంతో చాలా భయమేసింది. దీంతో ప్రభుత్వాసుపత్రులంటే భయమేస్తోంది. -తిర్లంగి శారద, లఖందిడ్డి సంఘటనపై విచారణ జరపాలి సెలైన్ ఎక్కించిన 5 నిమిషాల్లోనే చలి జ్వరం వచ్చింది. ఏమైపోతానో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇక్కడకు వస్తే ఇలా జరిగింది. ఈ సంఘటనపై విచారణ జరపాలి -కూన సోమేశ్వరరావు, హరిశ్చంద్రపురం -
‘బంగారు తల్లి’కి బెంగ
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సుమారు ఏడాది క్రితం.. మే ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు దశలవారీగా ఆర్థికంగా చేయూత అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికైన వారికి ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.16 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నది లక్ష్యం. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో హడావుడిగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ ఎన్నికల పథకమేనన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చేందుకే దీన్ని ప్రారంభించారన్న విమర్శలు కూడా వినిపించాయి. అందుకు తగినట్లే ఇప్పుడు ఈ పథకానికి గ్రహణం పట్టుకుంది. జిల్లాలోని 31 మండలాల నుంచి 9014 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,613 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.1.40 కోట్లు కూడా జమ చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా 3,401 దరఖాస్తులను అధికారులు పెండింగులో పెట్టారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయినా దరఖాస్తుదారులు కొత్త అనుమానాలతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ప్రభుత్వం రద్దయ్యింది. కొత్తగా అధికారంలోకి రానున్న టీడీపీ ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఏ వైఖరి అవలంభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే టీడీపీ ప్రభుత్వం కిందా మీదా పడాల్సిన పరిస్థితులు ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన ఈ పథకం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పథకం అమలు, పెండింగు దరఖాస్తుల విషయంలో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా డీఆర్డీఏ అధికారులు ఏవరూ అందుబాటులో లేరు. -
నాన్నా... నీ పేరు నిలబెడతా..!
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్ : నాన్నా నీ పేరు నిలబెడతా అంటూ.. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మెహన్ నాయుడు అన్నారు. శనివారం తల్లి విజయలక్ష్మితో కలసి ఆయన నిమ్మాడ వచ్చారు. తొలుత ఎర్రంనాయుడి సమాధికి నమస్కరించి అనంతరం నిమ్మాడ జంక్షన్‌లోని ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. రామ్మెహన్ నాయుడు వచ్చారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలూ అధిక సంఖ్యలో నిమ్మాడ చేరుకోవడంతో వీధులన్నీ కిటకిటలాడాయి. రామ్మెహన్ నాయుడుకి మద్దతుగా అందరూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అంతా ఐక్యమత్యంతో కలసి అభివృద్ధి చేసుకుందామని అందుకు మీరంతా సహకరించాలని కోరారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు ప్రసాదరావు, డీఎస్పీ కింజరాపు ప్రభాకరరావు తదితరులు కూడా ఎర్రంనాయుడు సమాధికి నమస్కరించి నివాళులర్పించారు. -
ఢిల్లీకి చేరిన జర్నలిస్టుల ‘సమైక్య’ ఉద్యమ స్ఫూర్తి
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం కోటబొమ్మాళిలో జర్నలిస్టు 172 రోజులుగా చేస్తున్న ఉద్యమం అభినందనీయమని, ఈ స్ఫూర్తి ఢిల్లీ వరకూ వెళ్లిందని ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు అన్నారు. దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయతోపాటు జర్నలిస్టు నాయకులు సందర్శించారు. దీక్షలో ఉన్న జర్నిలిస్టులు ఎన్.హరిప్రభాకర్, రవికుమార్, ఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు వలసయ్య, శాంతారావు, న్యాయవాది ఎల్.శ్రీనివాసుల మెడలో పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రులు ఆరంభశూరులు కారు.. దేన్నయినా సాధిస్తారని రుజువు చేశారన్నారు. అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరుగుతోందని, ఈ అంశాన్ని ఏపీజేఎఫ్ ఢిల్లీదాకా తీసుకెళ్లిందన్నారు. విశాఖ, హైదరాబాద్‌లలో పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పార్లమెంటులోనూ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. సమాజానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెప్పడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి ఊరకనే పోదన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుదుర్గారావు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దనరావు, రవిచంద్ర, ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, రాజేంద్రనాయుడు, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.