ఢిల్లీకి చేరిన జర్నలిస్టుల ‘సమైక్య’ ఉద్యమ స్ఫూర్తి
Published Tue, Feb 4 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం కోటబొమ్మాళిలో జర్నలిస్టు 172 రోజులుగా చేస్తున్న ఉద్యమం అభినందనీయమని, ఈ స్ఫూర్తి ఢిల్లీ వరకూ వెళ్లిందని ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు అన్నారు. దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయతోపాటు జర్నలిస్టు నాయకులు సందర్శించారు. దీక్షలో ఉన్న జర్నిలిస్టులు ఎన్.హరిప్రభాకర్, రవికుమార్, ఎన్‌జీవో అధ్యక్ష కార్యదర్శులు వలసయ్య, శాంతారావు, న్యాయవాది ఎల్.శ్రీనివాసుల మెడలో పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రులు ఆరంభశూరులు కారు.. దేన్నయినా సాధిస్తారని రుజువు చేశారన్నారు. అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరుగుతోందని, ఈ అంశాన్ని ఏపీజేఎఫ్ ఢిల్లీదాకా తీసుకెళ్లిందన్నారు.
విశాఖ, హైదరాబాద్‌లలో పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పార్లమెంటులోనూ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. సమాజానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెప్పడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి ఊరకనే పోదన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుదుర్గారావు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దనరావు, రవిచంద్ర, ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, రాజేంద్రనాయుడు, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
Advertisement
Advertisement