కోటబొమ్మాళి: ఇటీవల జిల్లా పరిషత్ పరిధిలోని 220 మం ది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేసినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీరఘట్టం, నందిగాం, హిరమండలం, పాతపట్నం మండలాల ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశామన్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాలో 9 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.రాజు పాల్గొన్నారు.
కురుడు హైస్కూల్‌లో విచారణ
మండలంలోని కురుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హుద్‌హుద్ తుపానుకు పాఠశాల ఆవరణలో 8 నీలగిరి చెట్లు కూలిపోగా వాటిని హెచ్.ఎం ఎల్‌వీ ప్రతాప్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారంటూ గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మణరావు ఇటీవల జిల్లా పరిషత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ రవీంద్ర, ఎంపీడీఓ బి.రాజులతో కలసి శని వారం పాఠశాలలో విచారణ జరిపారు. చెట్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెచ్.ఎం ప్రతాప్‌ను, ఫిర్యాదు దారుడు లక్ష్మణరావుల నుంచి వివరాలు సేకరించారు.
220 మంది ఉద్యోగుల బదిలీ
Published Sun, Nov 30 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement