
ప్రపంచ క్రికెట్‌లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు.
వన్డే వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్‌గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్‌కు దక్కింది.