Richard Hadlee
-
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్‌గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్‌గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్
Tim Southee Wins Sir Richard Hadlee Medal: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ.. తన దేశ క్రికెట్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2021-22 సీజన్ ఆధ్యాంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను అతను సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని గెలుచుకున్నాడు. సౌథీ తన 14 ఏళ్ల కెరీర్లో ఈ మెడల్‌ను గెలవడం ఇదే తొలిసారి. ఇవాళ (ఏప్రిల్ 14న) జరిగిన న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ ఈ మెడల్‌తో పాటు 2022 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. సౌథీ 2021-22 సీజన్లో 23.88 సగటున 36 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్‌పై సాధించిన ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. సౌథీ.. న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. సౌథీ ఇటీవలి భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టుకు సారధిగా (కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో) కూడా వ్యవహరించాడు. కెరీర్లో ఇప్పటివరకు 85 టెస్ట్‌లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2697 పరుగులు సాధించాడు. చదవండి: వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు -
నేటి తరంలో అతనే బెస్ట్ ఆల్‌రౌండర్..
వెల్లింగ్టన్: అల్ టైమ్ గ్రేట్ అల్ రౌండర్లలో ముఖ్యుడుగా చెప్పుకునే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీ.. ప్రస్తుత తరంలో అల్ రౌండర్లపై తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. జెంటిల్మెన్ గేమ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో రాణించే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారని, నేటి ఆధునిక క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ తన దృష్టిలో ఉత్తమ అల్ రౌండర్ అని పేర్కొన్నాడు. ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. అలాగే అతను ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అనేక సందర్భాలను పరిగణలోకి తీసుకొనే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాడు. ఇందుకు 2019 వన్డే ప్రపంచ కప్, హెడింగ్లే టెస్టులను(ఆసీస్ ఫై 135 నాటౌట్) ఉదహరించాడు. చరిత్రలో గ్రేట్ అల్ రౌండర్లుగా చెప్పుకునే గ్యారీఫీల్డ్ సోబర్స్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, జాక్ కలిస్ లాంటి ఆటగాళ్లకు ఉండిన లక్షణాలన్నీస్టోక్స్ లో పుష్కలంగా ఉన్నాయని, అతను మరికొంత కాలం రెండు విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్) రాణించగలిగితే, దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇది అతనికి అంత సులువు కాకపోవచ్చని, ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్‌కు ఫిట్నెస్ తో పాటు గాయాల బారిన పడకుండా నిలకడ రాణించడం చాలా ముఖ్యమని, ఈ రెండు అంశాలపై అతను దృష్టి కేంద్రీకరించగలిగితే, ఈ తరంలోనే కాదు.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ అల్ రౌండర్ గా నిలిచిపోతాడని సూచించాడు. నేటి తరం అల్ రౌండర్లైన షకీబ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్ అల్ రౌండర్లు కావడంతో వారిని పరిగణలోకి తీసుకోలేమని, ఏదిఏమైనప్పటికే వారు కూడా అల్ రౌండర్లేనని వివరించాడు. జేసన్ హోల్డర్, హార్దిక్ పాండ్యా , క్రిస్ వోక్స్, కోలిన్ గ్రాండ్ హోమ్ తదితరులకు ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్లుగా రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా, 70 80 దశకాల్లో మేటి అల్ రౌండర్ గా నిలిచిన హ్యాడ్లీ.. న్యూజిలాండ్ తరఫున 3124 పరుగులతో పాటు 431 వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చాలాకాలం తర్వాత అతని రికార్డును కపిల్ తిరగరాసాడు. చదవండి: ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు.. -
మరోసారి విలియమ్సన్‌కే...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ వార్షిక అవార్డులలో ఆ దేశ కెప్టెన్ కేన్ విలిమయ్సన్ మరోసారి దూకుడు కనబర్చాడు. 2020–21 క్రికెట్ సీజన్ అవార్డుల్లో ప్రతిష్టాత్మక రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ను గెల్చుకోవడంతో పాటు ‘టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచాడు. రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ను విలియమ్సన్ గెల్చుకోవడం ఇది నాలుగోసారి. గతంలో అతను 2016, 2017, 2019లలో ఈ అవార్డు పొందాడు. సొంతగడ్డపై వెస్టిండీస్, పాకిస్తాన్లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో విలియమ్సన్... కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం విశేషం. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ.. -
రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం లభించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌ను వరించింది. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ అవార్డును టేలర్ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. తాజా అవార్డుపై టేలర్ స్పందిస్తూ.. ‘ గడిచిన ఏడాది నా కెరీర్లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తు-పల్లాలతో నా కెరీర్ ఇంకా సాగుతుండటం ఆనందంగా ఉంది. (ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా) 2023లో భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటమే నా ముందున్న లక్ష్యం. వరుసగా రెండు వరల్డ్‌కప్‌ల్లో మా జట్టు ఫైనల్ చేరడంలో భాగస్వామ్యం అయ్యా. ఇక వరుసగా మూడోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా. పరుగులు చేయాలనే దాహం. మానసికంగా ధృడంగా ఉండటమే నా సానుకూలాంశం. వయసు అనేది ప్రామాణికం కాదు. అది కేవలం నంబర్ మాత్రమే. నాకు కివీస్ తరుఫున ఇంకా ఆడాలని ఉంది’ అని 36 ఏళ్ల టేలర్ పేర్కొన్నాడు. 2006లో కివీస్ తరఫున అరంగేట్రం చేసిన టేలర్.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు.ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్ వెటోరి(112), స్టీఫెన్ ఫ్లెమింగ్(111), బ్రెండన్ మెకల్లమ్(101)లు టేలర్ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్ ఆటగాళ్లు.(మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే కదా అలా అనేది!) -
డేనైట్ టెస్టులదే భవిష్యత్తు
అభిమానులను స్టేడియానికి రప్పించడంలో, టెలివిజన్ వీక్షకులను పెంచడంలో డేనైట్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తు వీటిదేనని న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ అభిప్రాయపడ్డారు. పింక్ బంతి అనుకున్నదానికంటే మెరుగ్గా ఉందని, అయితే మంచు ప్రభావం ఈ బంతిపై ఎలా ఉంటుందో చూడాలని ఆయన అన్నారు. అన్ని దేశాలూ డేనైట్ టెస్టుల పట్ల ఆసక్తి చూపుతుండటం మంచి పరిణామమని హ్యాడ్లీ అన్నారు.