మరోసారి విలియమ్సన్‌కే... | Kane Williamson Win Test Player Of The Year In NZC Awards | Sakshi
Sakshi News home page

మరోసారి విలియమ్సన్‌కే... 

Published Wed, Apr 14 2021 8:40 AM | Last Updated on Wed, Apr 14 2021 10:58 AM

Kane Williamson Win Test Player Of The Year In NZC Awards - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ వార్షిక అవార్డులలో ఆ దేశ కెప్టెన్‌ కేన్‌ విలిమయ్సన్‌ మరోసారి దూకుడు కనబర్చాడు. 2020–21 క్రికెట్‌ సీజన్‌ అవార్డుల్లో ప్రతిష్టాత్మక రిచర్డ్‌ హ్యాడ్లీ మెడల్‌ను గెల్చుకోవడంతో పాటు ‘టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా కూడా నిలిచాడు. రిచర్డ్‌ హ్యాడ్లీ మెడల్‌ను విలియమ్సన్‌ గెల్చుకోవడం ఇది నాలుగోసారి. గతంలో అతను 2016, 2017, 2019లలో ఈ అవార్డు పొందాడు. సొంతగడ్డపై వెస్టిండీస్, పాకిస్తాన్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో విలియమ్సన్‌... కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం విశేషం. 

చదవండి: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా భువీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement