క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో 33వ సెంచరీ మిస్ అయ్యాడు.
కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 47, డెవాన్ కాన్వే 2, రచిన్ రవీంద్ర 34, డారిల్ మిచెల్ 19, టామ్ బ్లండెల్ 17, నాథన్ స్మిత్ 3, మ్యాట్ హెన్రీ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథీ (10) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉండగా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే షోయబ్ బషీర్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు.
కాగా, గాయం కారణంగా కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్‌కు కోల్పోయింది.
ఆరేళ్లలో తొలిసారి..
ఈ మ్యాచ్‌లో కేన్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేన్ అట్కిన్సన్ బౌలింగ్‌లో టెంప్టింగ్ షాట్ ఆడి జాక్ క్రాలే చేతికి చిక్కాడు. కేన్ 90ల్లో ఔట్ కావడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. విలియమ్సన్ తన చివరి టెస్ట్ సెంచరీని ఇదే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment