కోటబొమ్మాళి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర కార్మిక, క్రీ డల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి గోవిందరాజుల కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం అని, దీనిపై మోదీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సాధించారన్నారు. టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై రాజకీయం చే స్తోందని..
అందులో భాగమే తిరుపతిలో శనివారం జరిగిన మునుకోటి అనే కార్యకర్త ఆత్మహత్య సదుద్దేశమని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చకొడుతున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసు కేసునమోదు చేయాలన్నారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని, ఆ విషయం సోనియాకు, రాహుల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. గ్రామ కమిటీల సమావేశానికి శ్రీకారం: టీడీపీ గ్రామ, మండల, జిల్లా కమిటీల కార్యాచరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని.. అందుకు క్యాలెండర్ రూపొందించారని మంత్రి తెలిపారు. ప్రతి నెల 9న గ్రామ కమిటీ, 17న మండల కమిటీ, 24న జిల్లా కమిటీలు సమావేశమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరుగుతుందని మంత్రి వివరించారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, ఎంపీపీ తర్ర రామకృష్ణ, మండల అధ్యక్షుడు బి.రమేష్, మాజీ ఎంపీపీ వి.విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు కె.నాగయ్యరెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక హోదాపై ఆందోళనొద్దు
Published Mon, Aug 10 2015 1:53 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement