శ్రీకృష్ణాపురంలో దారుణం
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
తనే హత్య చేసినట్టు అంగీకరించిన తమ్ముడు
ఆ ఇంట ఆదివారం వివాహ వేడుక జరగాల్సి ఉంది. అంతా ఆ పనుల్లోనే తిరుగుతూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై పని చేస్తున్నారు. అయితే మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఏటో వెళ్లిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి నెల రోజుల కిందటే ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆస్తులకు సంబంధించి తరచూ ఇంట్లో వివాదాలు సృష్టిస్తున్నాడు. ఆస్తుల సంగతి తేల్చకుంటే వివాహం జరిగిన వెంటనే కొత్త జంటను చంపేస్తానని స్వయూన తమ్ముడినే బెదిరిస్తూ వచ్చాడు. దీనిని తట్టుకోలేని తమ్ముడు అన్న బెదిరింపులకు పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించాడు. వివాహం జరగడానికి ఇంకా రెండు రోజుల గడువుందనగా శుక్రవారం రాత్రి అన్నను రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆ విషయూన్ని పోలీసుల ముందు కూడా అంగీకరించాడు. వివరాల్లోకి వెళ్తే...
కోటబొమ్మాళి (సంతబొమ్మాళి) : సంతబొమ్మాళి మండలం పాలతలగాం పంచాయతీ శ్రీకృష్ణాపురం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురయ్యూడు. తోబుట్టిన వాడనే విచక్షణ మరచి రాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయూడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, వీఆర్‌వో సంతబొమ్మాళి పోలీసులకు సమాచారం అందజేశారు. హతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం... భూపతి శ్రీనివాస్, బాలరాజుకు స్వయూన అన్న. శ్రీనివాస్ మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఎటో వెళ్లిపోరుు నెల రోజుల కిందటే ఇంటికి తిరిగి వచ్చాడు.
ఈ క్రమంలో ఆస్తుల పేరిట రోజూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మానసికంగా వేధించేవాడు. కాగా ఈ నెల 24న శ్రీనివాస్ తమ్ముడు బాలరాజుకు వివాహం జరగాల్సి ఉంది. శ్రీనివాస్ రోజూలాగే శుక్రవారం రాత్రి కూడా వివాహం జరిగిన వెంటనే బాలరాజు దంపతులను చంపేస్తానని బెదిరించాడు. వీటిని భరించలేని బాలరాజు చివరకు అన్న శ్రీనివాస్ పెట్టే మానసిక హింసను భరించలేక ఆయన నిద్రిస్తున్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాడ్‌తో కొట్టి చంపేశానని బాలరాజు స్వయంగా పోలీసులకు తెలిపాడు.
ఇదిలా ఉండగా హతుడు శ్రీనివాస్‌కు ఒడిశాలోని కొన్ని దొంగతనాలు, రైలు దోపిడీ కేసులతో సంబంధాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. హత్యకు సంబంధించి క్లూస్ టీం, జాగిలాలు తెప్పించినప్పటికీ బాలరాజు తనే అన్నను హత్య చేసినట్టు నేరం అంగీకరించడంతో పోలీసులకు శ్రమ తప్పింది. బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని టెక్కలి ఆసుపత్రికి పోస్టుమార్టంకు పంపారు. కాశీబుగ్గ డీఎస్పీ కె.దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ భవానీప్రసాద్ పర్యవేక్షణలో సంతబొమ్మాళి ఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడు చేతిలో అన్న హత్య
Published Sun, Apr 24 2016 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement
Advertisement