brother murder
-
అన్నపై ఒక్కసారిగా.. పదునైన ఆయుధంతో.. తమ్ముడి వీరంగం!
మహబూబ్‌నగర్: దామరగిద్ద పోలీస్‌స్టేషన్ పరిధిలో అన్నను చంపిన తమ్ముడిపై యావజ్జీవ కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2021 ఏప్రిల్ 7న గుండు స్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ గోవర్ధన్ నిందితుడు బ్యాగరి బుగ్గప్పపై కేసు నమోదు చేశారు. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన బ్యాగరి బుగ్గప్పకు తన అన్న హన్మంతుకు భూతగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో మాట్లాడిన బ్యాగరి బుగ్గప్ప రాజీకి వచ్చారు. అదే ఏడాది ఏప్రిల్ 6 బొంబాయి హన్మంతు అలియాస్ బ్యాగరి హన్మంతు (55) రాత్రి పొలం వద్ద వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. గమనించిన బుగ్గప్ప వరి పొలం వద్ద వెళ్లి తన అన్నతో గొడవపడుతుండగా పక్క పొలంలో ఉన్న బ్యాగరి బాలప్ప గమనించి విడిపించేందుకు ప్రయత్నించాడు. అతనిని పక్కకు నెట్టి తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో హన్మంతును పొడవగా స్పృహతప్పి పడిపోయినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై అప్పటి సీఐ శ్రీకాంత్‌రెడ్డి నేర పరిశోధన చేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరము రుజువు కావడంతో జిల్లా జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. -
తమ్ముడి వేధింపులు: చున్నీతో హత్యచేసిన అన్నలు
జియాగూడ: కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అన్నదమ్ములైన రవీందర్, మహేందర్, ప్రసాద్ (21) తల్లితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్ తరచుగా డబ్బు విషయమై అన్నలతో, తల్లితో గొడవ పడుతుండటంతో రవీందర్ జీడిమెట్లకు మకాం మార్చాడు. అయినప్పటికీ ప్రసాద్ మద్యం సేవించి వచ్చి తరచుగా మరో అన్న మహేందర్, వదిన, తల్లితో గొడవ పడుతుండటంతో వారు కూడా ఇల్లు మారారు. ఇంట్లో ఒక్కడే ఉంటున్న ప్రసాద్ తన ప్రవర్తన మార్చుకోకుండా మహేందర్ వద్దకు వెళ్లి తల్లిని, అన్నను తరచుగా తిడుతుండడంతో మహేందర్ జీడిమెట్లలో ఉన్న రవీందర్‌కు ఫోన్‌చేసి మాట్లాడేందుకు రావాలని కోరాడు. ఆదివారం రాత్రి రవీందర్, మహేందర్ కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్లగా మద్యం సేవించి ఉన్న ప్రసాద్ వారితో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రవీందర్, మహేందర్, ప్రసాద్ మెడను చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: కరోనాతో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కుమార్తె మృతి -
తమ్ముడిని చంపిన అన్న
అచ్యుతాపురం: తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతో తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జాలరిపాలెంలో జరిగింది. వివరాలు.. పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మడ్డు పోలమ్మ పెద్ద కుమారుడు రాజుకు పెళ్లి చేయడానికి ఇటీవల భీమిలికి చెందిన అమ్మాయిని చూశారు. కానీ ఆ అమ్మాయి పోలమ్మ చిన్న కుమారుడు యర్లయ్య(21)ను చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు మరో సంబంధం చూస్తానని నచ్చచెప్పింది. మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. యర్లయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడంతో రాజు అసహనానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం యర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులడిగాడు. ఆమె రూ.2 వేలు ఇవ్వగా.. అవి సరిపోవని రూ.4వేలు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇంతలో యర్లయ్యను అడ్డుకున్న రాజు.. వలను అల్లడానికి ఉపయోగించే ఒరుగు అని పిలిచే కత్తిని అమాంతం తమ్ముడి గొంతులో దించాడు. వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతోనే తమ్ముడిని హత్య చేసినట్లు రాజు అంగీకరించాడని సీఐ నారాయణరావు, ఎస్ఐ లక్ష్మణరావు వెల్లడించారు. -
తూర్పుగోదావరిలో దారుణ హత్య
సాక్షి, చింతూరు: తూర్పుగోదావరి ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడినే అన్న హత్య చేయించిన ఘటన చింతూరు మండలం తుమ్మల గ్రామంలో జరిగింది. సోదరులైన సోడే ముత్తయ్య, నాగిరెడ్డిల మధ్య పొలం వివాదం నడుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎలాగైనా తమ్ముడిని చంపాలని అన్న సోడే ముత్తయ్య నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కిరాయి వ్యక్తులతో తమ్ముడు నాగిరెడ్డిని హత్య చేయించాడు. మృతదేహాన్ని నిందితులు వాగులో పూడ్చిపెట్టారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
దారుణం
మద్యానికి బానిసై రోజూ ఇంట్లోతగువులాడుతున్న తమ్ముడి తీరుతోవిసుగెత్తిపోయిన అన్న సహనంకోల్పోయాడు. తోడబుట్టిన వాడని కూడాచూడకుండా గుండ్రాయితో తలపై మోది ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అరిటాకులో మృతదేహాన్ని చుట్టి చెరువులో పడేశాడు. హృదయ విదారక ఘటనరొళ్ల మండలంలో జరిగింది. అనంతపురం, రొళ్ల: ఎల్కే పల్లి వడ్రహట్టిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వడ్డే నాగేష్, ఆనంద్ (30) అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సత్యమ్మ, ఈరప్పతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం ఆనంద్ భార్య గంగమ్మ ప్రసవ సమయంలో మరణించింది. భార్య మృతితో జీవితంపై విరక్తి చెందిన ఆనంద్ తాగుడుకు బానిసయ్యాడు. తాగి ఇంటికి వచ్చినపుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో తూలుతూ అన్న నాగేష్‌ను దూషించాడు. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. తల్లి జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పింది. కాసేపటి తర్వాత ఇంటి బయట నిద్రిస్తున్న ఆనంద్‌పై అన్న వడ్డే నాగేష్ గుండ్రాయి వేశాడు. తలపై బలంగా మోదడంతో మెదడు బయటకు వచ్చి రక్తస్రావం జరగడంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం విసిరివేత.. నాగేష్ తన తమ్ముడి మృతదేహాన్ని అరిటాకులో చుట్టి.. భుజాన వేసుకుని కె.బ్యాడిగెర చెరువు వద్దకు చేరుకున్నాడు. చెరువు గట్టుపై నుంచి మృతదేహాన్ని ముళ్లపొదల్లోకి విసిరాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వ్యక్తులు ఆనంద్ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారమందించారు. మడకశిర సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ మస్తాన్, సిబ్బందితో కలసి ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడని, తీరు మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతో తానే హత్య చేసి పడేశానని వడ్డే నాగేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అనాథలైన పిల్లలు ఏడాది కిందట తల్లి గంగమ్మ.. ఇప్పుడు తండ్రి ఆనంద్ మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు గౌతమి, జీవిత అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అన్నను చంపిన తమ్ముడు
కురిచేడు: ఆస్తి వివాదంతో అన్నను తమ్ముడు చంపిన సంఘటన మండలంలోని ఆవులమంద పంచాయతీ ప్రతిజ్ఞాపురి కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కాలనీకి చెందిన చలమాల వెంకటేశ్వర్లు(40)ను ఆయన తమ్ముడు చెంచారావు బరిసెతో దాడి చేయగా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అంగన్వాడీ కార్యకర్త చలమాల అల్లూరమ్మకు ముగ్గురు కుమారులు. ఆమెకు సుమారు 10 ఎకరాల సాగు భూమి ఉంది. అయితే ముగ్గురు కుమారులకు మూడు ఎకరాల ప్రకారం పంపిణీ చేసింది. మిగతా ఎకరం అల్లూరమ్మకు కేటాయించారు. అయితే అల్లూరమ్మను చిన్న కుమారుడు చెంచారావు పోషిస్తున్నాడు. అల్లూరమ్మ పెద్ద కుమారుడు ఇంటి పక్కనే ఉండటం వలన చిన్న చిన్న అవసరాలకు పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు డబ్బు సర్దుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అవసరం కోసం తల్లి బంగారు ఆభరణాలు తనఖా పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. అవి తనకు ఇవ్వాలని, తల్లి పేరున ఉన్న ఎకరం భూమి కూడా తనకే చెందాలని ఇరువురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో చెంచారావు బరిసెతో వెంకటేశ్వర్లుపై దాడి చేయటంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై బి.ఫణిభూషణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
తమ్ముడిని కడతేర్చిన అన్న
తిరువళ్లూరు : అన్నాతమ్ముళ్ల మద్య ఏర్పడిన గొడవలో మద్యం మత్తులో ఉన్న అన్న కత్తితో పొడిచి తమ్ముడిని హత్య చేశాడు. ఈ సంఘటన తిరువళ్లూరులోని మాపోసి నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని మాపోసి నగర్‌కు చెందిన మదన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతనికి జయబుద్ధన్, సిద్ధార్థన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు జయబుద్ధన్ కెమెరా మెకానిక్‌గా పనిచేస్తుండగా చిన్న కొడుకు సిద్ధార్థన్ తిరుపతిలోని లా కళాశాలో బీఎల్ చదువుతున్నాడు. మద్యానికి బానిసైన జయబుద్ధన్ నిత్యం ఘర్షణ పడేవాడని తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అన్నాదమ్ముళ్లు ఇద్దరు ఘర్షణ పడ్డారు. దీంతో సిద్ధార్థన్ జయబుద్ధన్‌పై దాడి చేయడంతో ఆగ్రహించిన జయబుద్ధన్ తమ్ముడు సిద్ధార్థన్‌పై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మద్యం మత్తులో తమ్ముడిని హత్య చేసిన జయబుద్ధన్‌ను పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
తమ్ముడు చేతిలో అన్న హత్య
శ్రీకృష్ణాపురంలో దారుణం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు తనే హత్య చేసినట్టు అంగీకరించిన తమ్ముడు ఆ ఇంట ఆదివారం వివాహ వేడుక జరగాల్సి ఉంది. అంతా ఆ పనుల్లోనే తిరుగుతూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై పని చేస్తున్నారు. అయితే మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఏటో వెళ్లిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి నెల రోజుల కిందటే ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆస్తులకు సంబంధించి తరచూ ఇంట్లో వివాదాలు సృష్టిస్తున్నాడు. ఆస్తుల సంగతి తేల్చకుంటే వివాహం జరిగిన వెంటనే కొత్త జంటను చంపేస్తానని స్వయూన తమ్ముడినే బెదిరిస్తూ వచ్చాడు. దీనిని తట్టుకోలేని తమ్ముడు అన్న బెదిరింపులకు పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించాడు. వివాహం జరగడానికి ఇంకా రెండు రోజుల గడువుందనగా శుక్రవారం రాత్రి అన్నను రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆ విషయూన్ని పోలీసుల ముందు కూడా అంగీకరించాడు. వివరాల్లోకి వెళ్తే... కోటబొమ్మాళి (సంతబొమ్మాళి) : సంతబొమ్మాళి మండలం పాలతలగాం పంచాయతీ శ్రీకృష్ణాపురం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురయ్యూడు. తోబుట్టిన వాడనే విచక్షణ మరచి రాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయూడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, వీఆర్వో సంతబొమ్మాళి పోలీసులకు సమాచారం అందజేశారు. హతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం... భూపతి శ్రీనివాస్, బాలరాజుకు స్వయూన అన్న. శ్రీనివాస్ మూడేళ్ల కిందట భార్యకు విడాకులిచ్చి ఎటో వెళ్లిపోరుు నెల రోజుల కిందటే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఆస్తుల పేరిట రోజూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మానసికంగా వేధించేవాడు. కాగా ఈ నెల 24న శ్రీనివాస్ తమ్ముడు బాలరాజుకు వివాహం జరగాల్సి ఉంది. శ్రీనివాస్ రోజూలాగే శుక్రవారం రాత్రి కూడా వివాహం జరిగిన వెంటనే బాలరాజు దంపతులను చంపేస్తానని బెదిరించాడు. వీటిని భరించలేని బాలరాజు చివరకు అన్న శ్రీనివాస్ పెట్టే మానసిక హింసను భరించలేక ఆయన నిద్రిస్తున్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాడ్‌తో కొట్టి చంపేశానని బాలరాజు స్వయంగా పోలీసులకు తెలిపాడు. ఇదిలా ఉండగా హతుడు శ్రీనివాస్‌కు ఒడిశాలోని కొన్ని దొంగతనాలు, రైలు దోపిడీ కేసులతో సంబంధాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. హత్యకు సంబంధించి క్లూస్ టీం, జాగిలాలు తెప్పించినప్పటికీ బాలరాజు తనే అన్నను హత్య చేసినట్టు నేరం అంగీకరించడంతో పోలీసులకు శ్రమ తప్పింది. బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని టెక్కలి ఆసుపత్రికి పోస్టుమార్టంకు పంపారు. కాశీబుగ్గ డీఎస్పీ కె.దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ భవానీప్రసాద్ పర్యవేక్షణలో సంతబొమ్మాళి ఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతో అన్నను చంపాడు
- కత్తితో పొడిచి - అంతం చేసిన తమ్ముడు - తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని హత్య - మద్యం మత్తులో దారుణం - కీసర మండలం చీర్యాలలో ఘటన కీసర: ఓ వ్యక్తి అనుమానంతో మద్యం మత్తులో అన్నను కత్తితో పొడిచి చంపేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తర్వాత కీసర మండల పరిధిలోని చీర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బాలానగర్ చింతల్ ప్రాంతానికి చెందిన దుర్గారావు(40), నాగేందర్ అన్నదమ్ములు. వీరు కొన్ని రోజుల క్రితం బతుకుదెరువు కోసం చీర్యాల గ్రామానికి వలస వచ్చారు. స్థానిక అటవీ ప్రా ంతంలో జంతువులను వేటాడి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాల నేపథ్యంలో దుర్గారావుకు భార్యాపిల్లలు దూరంగా ఉంటున్నారు. నాగేందర్‌కు ముగ్గురు భార్యలు. వారిలో ఒకరు విడాకులు తీసుకొని భర్త నుంచి దూరంగా ఉంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు పక్కపక్కనే ఉంటున్నారు. తన భార్యతో అన్న దుర్గారావు వివాహేతర సంబం ధం నెరుపుతున్నాడని కొంతకాలంగా నాగేందర్ అనుమానించసాగాడు. ఈనేపథ్యంలో తరచూ అతడు అన్నతో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో బుధవారం అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన అర్ధరాత్రి దాటిన తరువాత అన్న దుర్గారావుతో గొడవపడ్డాడు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో నాగేందర్ తన వద్ద ఉన్న కత్తితో దుర్గారావును పొడిచి చంపేశాడు. స్థానికుల సమాచారంతో కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు నిందితుడు నాగేందర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. -
అన్న హత్యకు తమ్ముడి కుట్ర
పోలీసులకు చిక్కిన నిందితులు ఆయుధాలు స్వాధీనం మహబూబ్‌నగర్ క్రైం : అన్నను చంపేందుకు తమ్ముడు పథకం పన్నగా చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేయడమేగాక మారణాయుధాలను స్వాధీనపరచుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాత్రి ఇక్కడ సీఐ సోమ్‌నారాయణసింగ్ వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఇసాక్, అజీం అన్నదమ్ములు. వీరికి గతంలో మూన్ పౌల్ట్రీఫారం చికెన్ సెంటర్ ఉండేది. ఇద్దరూ కలిసి కొన్నేళ్లపాటు వ్యాపారం చేశారు. కొన్ని నెలల తర్వాత మనస్పర్థలు, గొడవలు రావడంతో చికెన్ సెంటర్‌ను ఇసాక్ సొంతం చేసుకున్నాడు. దీంతో మూడునెలల క్రితం తన అన్నను తుదముట్టించాలని తమ్ముడు అజీం పథకం పన్నాడు. ఇందులోభాగంగా మహబూబ్‌నగర్‌కు చెందిన ఇలియాస్‌కు *నాలుగు లక్షలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే కొన్నిరోజుల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన అలీ, షకీల్‌ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి జడ్చర్లకు చెందిన పాత నేరస్తులైన పాలకొండ కృష్ణయ్య, బోయ మహేష్, నవాబ్‌పేట మండంలోని కామరం వాసి సుంకరి కృష్ణను సంప్రదించారు. ఇసాక్‌ను హత్య చేస్తే *మూడున్నర లక్షలు ఇస్తామని ముందుగా *లక్ష అడ్వాన్స్‌గా చెల్లించారు. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరికి నిందితులు *25 వేలు చెల్లించారు. రెండురోజుల క్రితం ముగ్గురు కలిసి బోయపల్లిగేట్ సమీపంలోని ఇసాక్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇది తెలుసుకుని అప్రమత్తమైన బాధితుడు సోమవారం రాత్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి అజీంను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలించి మంగళవారం ఉదయం జడ్చర్లలో ఉన్న నిందితుల ఇళ్లపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇలియాస్, అలీ, షకీల్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.