'Nayattu' Telugu remake is titled as Kota Bommali - Sakshi
Sakshi News home page

Nayattu Telugu Remake: తెలుగులోకి మరో మలయాళ హిట్ మూవీ

Published Mon, Jul 31 2023 12:09 PM | Last Updated on Mon, Jul 31 2023 12:21 PM

Nayattu Telugu Remake Titled Kota Bommali - Sakshi

2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్‌కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు.

(ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్‌, సిస్టర్‌‌గా!)

ఈ ప్రాజెక్ట్‌కు 'కోటబొమ‍్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

'నాయట్టు' కథేంటి?
రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. 

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement