'లింగి లింగి లింగిడి' పాట.. 30 మిలియన్ వ్యూస్ సెలబ్రేషన్స్ | Lingi Lingi Lingidi Video Song Kotabommali PS Movie | Sakshi
Sakshi News home page

'లింగి లింగి లింగిడి' పాట.. 30 మిలియన్ వ్యూస్ సెలబ్రేషన్స్

Published Fri, Nov 10 2023 5:15 PM | Last Updated on Fri, Nov 10 2023 5:19 PM

 Lingi Lingi Lingidi Video Song Kotabommali PS Movie - Sakshi

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పాట బాగా పాపులర్ అయింది. 'లింగి లింగి లింగిడి' అంటూ సాగే ఈ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. తాజాగా 30 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీంతో ఈ పాట ఉన్న 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా టీమ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!)

30 మిలియ‌న్ వ్యూస్ వచ్చిన సందర్భంగా కేక్‌ కట్ చేసిన మూవీ టీమ్.. తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడితో పాటు నటీనటులు రాహుల్ విజయ్, శివాజీ రాజశేఖర్, దర్శకుడు తేజ మర్ని పాల్గొన్నారు. జీఏ 2 సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మలయాళ సూపర్‌హిట్ 'నాయట్టు' చిత్రానికి రీమేక్.  న‌వంబ‌రు 24న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement