
నేను అలా అనలేదు: అచ్చెన్నాయుడు
విజయవాడ : నిరుద్యోగ భృతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోలేదని, దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సమాచారం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రన్న పథకం ద్వారా 2 కోట్లమందికి బీమా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
కాగా నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.