chandranna kanuka
-
భారీ కానుక ఇస్తామంటూ నిలువెత్తు నయవంచన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కానుకలంటూ ఆశ పెట్టి రప్పించిన అక్క చెల్లెమ్మల్లకు వెన్నుపోటు పొడిచారు.. రూ.300 నాసిరకం వస్తువులను రూ.వేల విలువైనవంటూ ఊరించారు.. చివరకు అవి కూడా ఇవ్వకుండా ఐదు గంటల పాటు నిర్బంధించారు.. ఆ మోసాన్ని భరించలేక కుప్పకూలిన మహిళల చావుకు చంద్రబాబు కారకుడయ్యారు! ప్రచార వ్యామోహం.. పేదల ప్రాణాలంటే లెక్కలేనితనం.. నిలువెత్తు నిర్లక్ష్యానికి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరులో ఆదివారం టీడీపీ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఆ పార్టీ కనుసన్నల్లోనే జరిగింది. సభ నిర్వహణకు పోలీస్‌శాఖకు దరఖాస్తు చేసుకోవటం నుంచి సంబంధిత చలాన్ల చెల్లింపు వరకు ఏర్పాట్లన్నీ టీడీపీ నేతలే స్వయంగా పర్యవేక్షించారు. ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో తెరచాటున వ్యవహారాలు నడిపించారు. చంద్రన్న కానుక పంపిణీలో పాల్గొనాలంటూ పది రోజులు ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిత్యం సభా ప్రాంగణాన్ని సందర్శిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. రెండు రోజుల ముందు ఇంటింటికి తిరిగి మహిళలకు కూపన్లు ఇవ్వడంతో పాటు ఆధార్ జిరాక్స్‌లు తీసుకున్నారు. రూ.మూడు వేల విలువైన కానుకలు అందచేస్తున్నామంటూ ఊరించారు. చివరకు తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన మరుక్షణమే అది ఓ ప్రైవేట్ కార్యక్రమమని, స్వచ్చంద సంస్థను ప్రోత్సహించేందుకు వెళ్లానని, తమ పార్టీకి దాంతో సంబంధం లేదంటూ స్వరం మార్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు. తాను స్వయంగా పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడితే కనీసం పరామర్శించేందుకు కూడా ఆయనకు మనసు రాలేదు. కందుకూరులో బాధితుల వద్దకు వెంటనే వెళ్లిన ఆయన గుంటూరులో మాత్రం చనిపోయింది పేద మహిళలు కావడంతోనే మొహం చాటేసి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం రాత్రి నుంచి పరారీలో ఉన్న ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘సంక్రాంతి కానుక’ ప్రస్తావన లేకుండా సభకు అనుమతి కోరుతూ టీడీపీ నేత శ్రావణ్‌కుమార్ రాసిన లేఖ దరఖాస్తులో కానరాని ‘‘కానుకలు’’ గుంటూరు ఓల్డ్ వికాస్ క్యాంపస్‌లో మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సభకు అనుమతుల కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ స్వయంగా గుంటూరు సౌత్ డీఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ పది వేల మందితో సభ నిర్వహించుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే అందులో ఎక్కడా చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొనలేదు. అది కేవలం చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం అయితే అన్నగారి జనతా వస్త్రాలు – చంద్రన్న సంక్రాంతి కానుక అని ఎందుకు పేరు పెట్టారు? సభ నిర్వహణ అనుమతుల కోసం టీడీపీ తరపున పోలీస్ శాఖకు ఎలా దరఖాస్తు చేశారు? పార్టీ కార్యక్రమంగా ఎందుకు మార్చారు? స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి టీడీపీ నాయకులు జన సమీకరణ ఎందుకు చేశారని బాధితులు నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీకి కొమ్ము కాసే ట్రస్టుల గుర్తింపును రద్దు చేయడంతోపాటు నిధుల సేకరణపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల సూచనలు బేఖాతర్.. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. క్యాంపస్‌కు ఎంట్రన్స్, ఎగ్జిట్ ఒకే గేటు ఉండటంతో మూడు చోట్ల ప్రహరీ పగలగొట్టించి ద్వారాలు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బ్యారికేడ్లు ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత కార్యక్రమానికి నిర్వాహకులే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులు వాటిని పరిశీలించి పలు సూచనలు చేసినా నిర్వాహకులు పట్టించుకోలేదు. మధ్నాహ్నం ఒంటి గంట నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మహిళలను కానుకలు పంపిణీ చేస్తామంటూ వాహనాల్లో మీటింగ్ ప్రదేశానికి తరలించారు. రాగానే వాటిని అందచేస్తే తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదు. కానుకలు ఇస్తే మహిళలు వెళ్లిపోతారనే భయంతో చంద్రబాబు సభ ముగిసేవరకు సాయంత్రం ఆరు గంటల దాకా బలవంతంగా కూర్చోబెట్టారు. చంద్రబాబు సభ జరుగుతున్న సమయంలో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే కిట్ల పంపిణీ ప్రారంభించాలని వేదికపై ఉన్న నాయకులను ఫోన్లో కోరారు. ఓ ట్రాఫిక్ సీఐ వేదికమీదకు వెళ్లి మరీ పరిస్థితిని వివరించినా ఆలకించలేదు. బ్యారికేడ్లు సరిగా లేకపోవడంతో తొక్కిసలాటలో ఒరిగిపోయాయి. పోలీసులు సకాలంలో స్పందించి కానుకల పంపిణీని నిలిపివేసి తొక్కిసలాటలో చిక్కుకున్నవారిని కాపాడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే పదుల సంఖ్యలో మరణాలు ఉండేవని బాధితులు చెబుతున్నారు. 237 మందితో బందోబస్తు.. నూతన సంవత్సర వేడుకలతోపాటు మంగళగిరి, తెనాలిలో వైకుంఠద్వార దర్శనం బందోబస్తుకి పెద్ద సంఖ్యలో పోలీసులను సమకూర్చాల్సి వచ్చినా చంద్రబాబు సభకు ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో 207 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పరిస్థితి గమనించి మరో 30 మంది సిబ్బందిని అదనంగా రప్పించారు. వీరంతా ఉండబట్టే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. ముందు జాగ్రత్తగా పోలీసులు రెండు అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో బందోబస్తు కోసం పోలీసుశాఖకు యూజర్ చార్జీలను చెల్లించాలి. టీడీపీ నాయకులు ఆ పని చేయకపోగా పోలీసులపైనే ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస పశ్చాత్తాపం కరువు చంద్రబాబు అరగంటకు పైగా మాట్లాడి నలుగురికి చంద్రన్న కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ సమయానికి చంద్రబాబు కాన్వాయ్ మంగళగిరి కూడా చేరుకోలేదు. కొందరు నేతలు ఈ విషాదం గురించి ఆయనకు సమాచారం ఇవ్వడంతో మీరే చూసుకోవాలని స్పష్టం చేసి విమానాశ్రయానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాత్రి 7.02కి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అయన 7.59 నిముషాలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు మహిళలు చనిపోవడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసి కూడా కనీస మానవత్వం, పశ్చాత్తాపం లేకుండా చంద్రబాబు వెళ్లిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలను జీజీహెచ్‌లో స్థానిక నేతలు మినహా అధినాయకత్వం పరామర్శించిన పాపాన పోలేదు. పోలీసుల అదుపులో నిందితుడు గుంటూరు ఘటనలో తల్లిని కోల్పోయిన ఏటీ అగ్రహారం 4వ లైనుకు చెందిన గోపిదేశి నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ శ్రీనివాసరావుపై 304 క్లాజ్ 2, 34 ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఫోన్ సిగ్నల్స్, నెట్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన సీసీఎస్ పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాబు కీలుబొమ్మ ‘ఉయ్యూరు’ తమకు అత్యంత సన్నిహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ద్వారా సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు, లోకేశ్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా తెరపైకి తెచ్చిన ఉయ్యూరు శ్రీనివాస్ టీడీపీలో క్రియాశీల నేత. పార్టీ జెండా మోసిన నేతలను పక్కనబెట్టి విదేశాల నుంచి డబ్బు సూట్‌కేసులతో దిగే ఎన్నారైలను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న చంద్రబాబు కొంతకాలంగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాల్లో టికెట్ ఆశ చూపిస్తూ ఆయన ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబుకు మీడియాలో ప్రచారం కల్పించేందుకు గుంటూరులో తాజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌పై విద్వేషపూరిత పోస్టులు టీడీపీ తరపున సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉయ్యూరు శ్రీనివాస్.. సీఎం జగన్, మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలపై విద్వేషపూరిత పోస్టులు పెడుతుంటాడు. లోకేశ్ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా విభాగం సూచనల మేరకు వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా, ఘర్షణలను ప్రేరేపించేలా వ్యవహరిస్తుంటాడు. -
Andhra Pradesh: కాటేసిన కానుక!
డ్రోన్ ఫొటోల కోసం.. చంద్రన్న కానుకలున్న లారీల వైపు అక్క చెల్లెమ్మలు ఆశగా పరుగులు తీస్తుంటే డ్రోన్ ఫొటోలు బాగా వస్తాయని టీడీపీ నేతలు, నిర్వాహకులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరి ఆడక వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని నిలిపివేసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్రికల్లో ఫొటోలు, టీవీల్లో వీడియోలు, డ్రోన్ కెమెరా షాట్లు లక్ష్యంగా టీడీపీ ఆదివారం గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ ముగ్గురు పేద మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. అధికారంలో ఉండగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని బలిగొన్న చంద్రబాబు ప్రచారార్భాటం... గతవారం కందుకూరు ఇరుకు సందుల్లో నిర్వహించిన కార్యక్రమం 8 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరచిపోకముందే నూతన సంవత్సరం తొలిరోజే మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి ముగ్గురు పేద మహిళలు బాబు వికృత రాజకీయ క్రీడకు బలయ్యారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తన రాజకీయ ప్రచార పదఘట్టనల కింద సామాన్యులు నలిగిపోతూ ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోతున్నా చంద్రబాబు తీరు మారడం లేదు. ఏమాత్రం పశ్చాత్తాపం కానరావడం లేదు. మంచినీళ్లూ ఇవ్వలేదు.. సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పేద మహిళలను వికాస్ కాలేజీ మైదానానికి తరలించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వేదిక వద్దకు చేరుకుని స్వయంగా పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పేదలను తరలించగా చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు వేదిక వద్దకు రావడం గమనార్హం. అప్పటికే దాదాపు ఐదు గంటలకుపైగా నిరీక్షించాల్సి రావడం, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో మహిళలు అల్లాడారు. అంత ఆలస్యంగా వచ్చినా చీరల పంపిణీని ప్రారంభించలేదు. చీరల పంపిణీ మొదలుపెడితే చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఎవరూ ఉండరనే భయంతో టీడీపీ నేతలు వాటిని మహిళలకు అందించలేదు. సాయంత్రం 5.35 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి 6.15 గంటలకు ముగించారు. కొంత మందికి మాత్రం చంద్రబాబు సంక్రాంతి కానుకలు అందచేయగా మిగతావారికి టీడీపీ నేతలు ఇస్తారంటూ వెళ్లిపోయారు. కానుక పంపిణీ కోసం సన్నగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఐదు నిమిషాల్లోనే... అప్పటివరకు కానుకల పంపిణీ గురించి గొప్పగా చెప్పిన నిర్వాహకులు చంద్రబాబు నిష్క్రమించగానే మాట మార్చారు. నామమాత్రంగా కొందరికి అందించి చేతులు దులిపేసుకోవాలని భావించారు. మిగిలిన వారందరికీ డివిజన్లలోకి వచ్చి పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలు నిర్ఘాంతపోయారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ వలంటీర్లు కూడా బాబు ప్రసంగం ముగియగానే జారుకోవడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. చీరలు పంపిణీ చేస్తామని మభ్యపుచ్చి బలవంతంగా తీసుకొచ్చి గంటల తరబడి పడిగాపులు కాశాక తీరా మొహం చాటేయడంతో వారిలో ఆక్రోశం నెలకొంది. కానుకల కోసం తోసుకుంటూ తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. తోపులాటలో ఒకరిపై ఒకరు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో గుంటూరు కన్నావారితోటకు చెందిన సయ్యద్ ఆసియా (48), ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి (50), మారుతీనగర్ నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్ బీబీ (55) తొక్కిసలాటలో ఊపిరి ఆడక మృతి చెందారు. వీరిలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 30 కౌంటర్లంటూ.. 12 లారీల్లో చంద్రన్న సంక్రాంతి కానుకలను 30 కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ కేవలం 12 మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా కానుకలతో కూడిన లారీలను నేరుగా మైదానంలోకి తరలించి వాటి నుంచే పంపిణీ చేశారు. వాహనాలను దూరంగా కాకుండా దగ్గరగా ఇరుకుగా నిలబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన 5 నిముషాల్లోనే కానుకల పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో లారీలు కదలడానికి సిద్ధమవుతున్నాయని పసిగట్టిన పేదలు కానుకల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసి అమాయక మహిళలు మృత్యువాత పడ్డారు. ఇదేం మానవత్వం! గుంటూరు: చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన సయ్యద్ ఆసియా (48)ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. టీడీపీ నేతలు, ఉయ్యూరు ఫౌండేషన్ వారు ఆసియా మృతదేహాన్ని వాహనంలోని సీటులో కాకుండా, డిక్కీలో పడేసి తీసుకు రావడం బాధితులను, చూపరులను ఎంతో బాధకు గురి చేసింది. కొంచెమైనా కనికరం లేకుండా, కనీసం మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరించడం దారుణం అని పలువురు విమర్శించారు. ఆసియాను కారు డిక్కీలో హాస్పిటల్‌కు పంపిస్తున్న టీడీపీ నాయకులు పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారి తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సభాప్రాంగణం 8 వేల మందికి మాత్రమే సరిపోతుందని పోలీసులు ముందుగానే హెచ్చరించినా నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఘటన చోటు చేసుకుంది. బ్యారికేడ్లు పటిష్టంగా లేవని కూడా ముందుగానే హెచ్చరించామని, వారి నిర్లక్ష్యమే ఘటనకు దారి తీసిందని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జీజీహెచ్ వద్ద ఆర్తనాదాలు.. షేక్ రజియా, ప్రసాదం సీతామహాలక్ష్మి, మస్తాన్‌బీ, తెల్లమేకల మంగమ్మ, పెందుర్తి ప్రియాంక, కమాదుల సరోజని, ఎస్.భూలక్ష్మి, హిమంది ఉమాదేవి, తెల్లమేకల రంగమ్మ, హుస్సేన్‌బీ, గుంటముక్కల సౌందర్య, జానా దుర్గ, పఠాన్ ఆస్మా, నిర్మల తదితరులు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గుంటూరు నగరానికి చెందిన పల్లపుకుమారి, సాయికృష్ణనగర్కు చెందిన ఇరుగు కోటేశ్వరమ్మ, కె.ఇవలమ్మ, సీతమ్మకాలనీకి చెందిన సొప్పర కీర్తన, స్వర్ణాంధ్రనగర్కు చెందిన చిట్టాల శివపార్వతి, చైత్యపురి సుగాలీకాలనీకి చెందిన ధనావత్ అలివేలు తోపులాటలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు జీజీహెచ్‌కు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మిన్నంటాయి. కొత్త ఏడాది తొలిరోజే తమ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని విలపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మార్కెట్‌యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తదితరులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి రజిని ప్రకటించారు. నాసిరకం కిట్లతో హంగామా గుంటూరు రూరల్: చంద్రన్న కానుకలంటూ సభా ప్రాంగణం వద్ద పంపిణీ చేసిన కిట్‌లో అరకిలో కందిపప్పు, ప్యాకెట్ పామాయిల్, అరకిలో చింతపండు, అరకిలో గోధుమపిండి, కిలో ఉల్లిపాయలు, అరకిలో బెల్లం, చీర ఉన్నాయి. కిట్‌లో మొత్తం సరుకుల విలువ రూ.300కి మించి ఉండదని వాటిని తీసుకున్న మహిళలు చెబుతున్నారు. పది వేల మందికి మాత్రమే చీరలు కొనుగోలు చేసి గుంటూరులోని నగరం, పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం మహిళల ఆధార్ జిరాక్స్‌లను నిర్వాహకులు తీసుకున్నారు. వారి పేర్లతో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసేందుకే ఆధార్ సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బాజా మోగింది.. కానుక ఆగింది!
కడపలోని శంకరాపురానికి చెందిన ఓ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన యువ జంటకు ఇటీవలే వివాహమైంది. చంద్రన్న పెళ్లికానుక పథకం గురించి తెలియక ..వెబ్సైట్లో ఎలా దరఖాస్తు చేయాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారు. అయితే పథకానికి అర్హులుగా గుర్తించాలంటూ మీ కోసం కార్యక్రమానికి హాజరై అధికారులకు మొర పెట్టుకున్నారు. సాక్షి కడప : పేదల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంత నగదు ఇచ్చి పెళ్లి కానుక పేరుతో ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో అమలు కనిపించడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పరిస్థితిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018 ఏప్రిల్ 20 నుంచి చంద్రన్న పెళ్లి కానుక పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసినా పాలకుల నిర్లక్ష్యం....ప్రభుత్వం అశ్రద్ధతో ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో..మరెన్నో ఆకాంక్షలతో పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. చంద్రన్న పెళ్లి కానుక అందుకోవడానికి అనేక రకాల సమస్యలను అధిగమిస్తేనే ఫలితం కనిపించే అవకాశం ఉండగా...అన్నీ దాటుకుని ముందుకు వచ్చినా ఇంతవరకు సొమ్ములు అందడం లేదు. నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక వర్గాల వారీగా కానుకను నిర్ణయించి ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. అయితే పేదలు ఉన్నంతలో పెళ్లి చేసుకుని....తర్వాత కానుక కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో కనికరం కరువైంది. పైగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కానుకలన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. హడావుడిగా బాబు సర్కార్ ఫిబ్రవరి 19న పెండింగ్‌లో నెలల తరబడి ఉన్న దరఖాస్తుల్లో కొన్నింటికి క్లియరెన్స్ ఇచ్చి, తద్వారా ఓట్లు పొందవచ్చని పథక రచన చేసినట్లు తెలుస్తోంది. కష్టాలు తప్పడం లేదు 2018 ఏప్రిల్ 20వ తేదీన చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీంతో ఏప్రిల్ 20 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారు.. అన్ని అర్హతలు ఉన్నవారు జిల్లాలో 4,678 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివాహాలు ముగిసి నెలలు అవుతున్నా ఇంతవరకు కానుక అందలేదు. పెళ్లిళ్ల తంతు ముగిసింది.. ఇంతవరకు సొమ్ములు జత చేయలేదు. సవాలక్ష ఆంక్షలను దాటుకుని ముందుకుపోయినా.. కానుక కోసం కష్టాలు తప్పడం లేదని పలువురు లబోదిబోమంటున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఏదీ.. జిల్లాలో 4,678 జంటల వారు పెళ్లి కానుకల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు 3,328 మందికి ఇటీవలేæ అందించారు. కేవలం రూ. 15 కోట్లు మేర సోమ్మును సర్కార్ అందించింది. మరో 1,350 మందికి మొండిచేయి చూపింది. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా పెళ్లికానుక కోసం ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకోని దంపతులకు అక్టోబరులో ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో 1,307 మంది దరఖాస్తు చేశారు. అందులో 1,127 మందికి ఎన్నికలకు ముందు ఆదరాబాదరా అందించినా వారిలో కూడా దాదాపు 187 మంది ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాలకు తోడు నిబంధనల ప్రకారం లేవని కారణాలు చూపుతూ దాదాపు 90–100 మందిని రిజెక్ట్ చేశారు. ఏది ఏమైనా నెలల తరబడి నిరీక్షిస్తున్న జంటలకు ఫలితం లభించడం లేదు. దుల్హన్, గిరిపుత్రికకు మంగళం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముస్లిం మైనార్టీలతోపాటు గిరిజనులకు సంబంధించి ఉన్న రెండు పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముస్లిం మైనార్టీలు వివాహం చేసుకుంటే దుల్హన్ పథకం కింద రూ. 50వేలు అందించేవారు. గిరిజనులకు సంబంధించి ఎవరు పెళ్లి చేసుకున్నా సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకుంటే రూ. 50 వేలు అందించేవారు. అయితే దుల్హన్, గిరిపుత్రిక పథకాలకు మంగళం పాడి...చంద్రన్న పెళ్లి కానుకలోకే విలీనం చేశారు.దీంతో ప్రస్తుతం గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలు కూడా ఆన్లైన్ ద్వారా చంద్రన్న పెళ్లి కానుక పథకం కిందనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.గతంలో ఈ పథకాలకు సంబంధించి పెళ్లి అయిన తరువాత వచ్చి జంట దరఖాస్తు చేసుకున్నా వారికి కేటాయించిన మెత్తాలు అందించే వారు. పెళ్లి కానుక పథకంలోకి మార్చిన తరువాత వివాహానికి 15 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే లబ్ధి చేకూరేలా మర్పులు చేశారు. పనిచేయని సాధికారిక సర్వే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి కానుక రావడం దాదాపు అనుమానంగా మారింది. ఎందుకంటే ఎన్నికల అనంతరం మార్పులు, చేర్పుల పరిస్థితిని బట్టి ఇప్పటికిప్పుడు చెప్పడం కూడా గగనమే. అయితే మొత్తం మీద వందలాది మందికి పెళ్లి కానుక మాత్రం అందని ద్రాక్ష అని చెప్పవచ్చు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చిన నాటినుంచి ప్రజా సాధికారిక సర్వే పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పథకంపై పూర్తి స్దాయిలో అవగాహన లేకపోవడంతో ప్రజలు పెళ్లిళ్లు అయిపోయిన తరువాత కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారు: 4678 ఎదురుచూస్తున్న జంటలు: 1350 తిరస్కరించిన దరఖాస్తులు : 100 అక్టోబరులో స్వీకరించినదరఖాస్తులు: 1307 ఇప్పటివరకు లబ్ధిçపొందిన వారు: 1134 చంద్రన్న పెళ్లి కానుక ప్రారంభమైంది: 20–04–2018 -
బాజా మోగింది.. కానుక మూగబోయింది!
అనంతపురం టౌన్: చంద్రన్న పెళ్లి కానుకకు గ్రహణం పట్టింది. బడుగు, బలహీన వర్గాల తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ 20, 2018లో ఈ పథకం రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ప్రచార ఆర్భాటమే తప్పిస్తే.. ఆచరణలో చిత్తశుద్ధి కొరవడింది. పెళ్లిళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కానుకలు అందని లబ్ధిదారుల సంఖ్య వెయ్యికి పైమాటే. విచారణ పేరిట జాప్యం.. వివాహ ధ్రువీకరణ పత్రం అందక నవ వధూవరులు కానుక కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 7వేల మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇప్పటికే 6,397 మంది వివాహం చేసుకున్నారు. అయితే అధికారులు మాత్రం సుమారు 5వేల మందికి మాత్రమే కానుకను వివిధ దశల్లో మంజూరు చేశారు.విచారణలో జాప్యం: చంద్రన్న పెళ్లికానుక దరఖాస్తు లవిచారణలో అధికారులు జాప్యం చేస్తుండడం లబ్ధిదారులకు శాపంగా మారింది. జిల్లావ్యాప్తంగా 1,345 మంది వధూవరులు కానుక కోసం నిరీక్షిస్తున్నారు. పెళ్లికానుక జాప్యంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సిబ్బంది ఏ స్థాయిలో పని చేస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. చంద్రన్న పెళ్లికానుక వివరాలను నమోదు చేయడంతో పాటు వధూవరుల ధ్రువీకరణ పత్రాలను వెరిఫికేషన్ చేసి ధ్రువీకరించేందుకు మండలానికి ఇద్దరు చొప్పన 126 మంది కళ్యాణ మిత్రలను నియమించారు. మెప్మా కింద 50 మందికి పైగా సిబ్బందిని కేటాయించారు. అయినప్పటికీ విచారణ నత్తనడకన సాగుతుండటం విమర్శలకు తావిస్తోంది. సకాలంలో అందని వివాహ ధ్రువీకరణ పత్రాలు పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి కానుక అందుకునే వరకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో వరుస కరువు నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ భాగం పెళ్లిళ్లను పుణ్యక్షేత్రాలతో పాటు దేవాలయాల వద్ద నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా దేవాలయాలు ఏ పంచాయతీ పరిధిలోకి వస్తే ఆ పంచాయతీ కార్యాలయంలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడం, ఇతరత్రా కారణాలతో సర్టిఫికెట్ల కోసమే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. మొత్తంగా చంద్రన్న పెళ్లి కానుక నూతన వధూవరులకు సకాలంలో అందకపోవడం వల్ల పథకం ఉద్దేశం నీరుగారుతోంది. చర్యలను వేగవంతం చేశాం క్లస్టర్ల వారీగా కల్యాణమిత్రలతో సమావేశం నిర్వహించి చంద్రన్న పెళ్లికానుకలు లబ్ధిదారులకు చేరేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నాం. మ్యారేజ్ సర్టిఫికెట్ల జారీలో ఎక్కువ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.– శ్రీకాంత్, డీఆర్డీఏ ఏపీడీ -
పేదల కంచంతో ‘‘పరాచకం’’
సాక్షి, రాజమండ్రి : ‘తెల్ల రేషన్ కార్డుదారులకు చౌక ధరలకే పంపిణీ చేస్తున్న బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ పథకాలను మరింత మెరుగ్గా అమలుచేస్తాం’. – 2014 ఎన్నికల సందర్భంగా చంద్ర బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోని 43వ పేజీలో పొందు పరిచిన హామీ ఇది. ‘మరింత మెరుగ్గా’ అంటే.. మరింత తక్కువ ధరకు సరుకులు పంపిణీ చేస్తారని పేదవర్గాల వారు ఆశించారు. తీరా అధికారంలోకి వచ్చాక వారి ఆశలను అడియాసలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వచ్చింది చంద్రబాబు సర్కారు. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి కోటా సరుకులకు కోత పెట్టింది. ‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ఆ పండుగల్లో బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకం సరుకులు పేదలకు అంటగట్టి కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అండ్ కో అడ్డగోలుగా దోచేసింది. నాలుగేళ్ల పాటు బియ్యం మాత్రమే పంపిణీ చేసిస సర్కారు ఎన్నికలకు ఏడాది ముందు ఓటర్లకు గేలం వేసే పనిలో పంచదార, కందిపప్పు పంపిణీని పునరుద్ధరించింది. మండపేట: పేదవర్గాల వారికి చవక ధరకే బియ్యం, పప్పు దినుసులు, నూనె, పంచదార, ఇతర నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని వీలైనంత మెరుగ్గా అమలుచేస్తూ వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ‘కోటాకు కోత.. పేదల నోటికి వాత’ అన్నట్టు వ్యవహరించింది. జిల్లాలో 51.51 లక్షల జనాభా ఉండగా దాదాపు 17,89,183 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర కేటగిరీల్లో 16,44,178 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,659 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు రూ. 200.25లకే పంచదార, పామాయిల్, కందిపప్పు, గోధుమలు, చింతపండు తదితర పది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవారు. బయటి మార్కెట్లో ధరలతో పోలిస్తే ఒక్కో కార్డుదారునికి రూ.440 నుంచి రూ.500 వరకూ లబ్ధి చేకూరేది. వీటితో పాటు రూపాయికి కిలో బియ్యాన్ని అందజేసేవారు. ఒకటొకటిగా సరుకులకు ఎసరు అయితే 2014లో అధికారం చేపట్టిన వెంటనే నిత్యావసర వస్తువుల పంపిణీలో భారీగా కోత విధించడం మొదలు పెట్టింది చంద్రబాబు సర్కారు. మొదట్లో బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమల పంపిణీ జరిగేది. గ్యాస్ కనెక్షన్లేని వారికి లీటరు రూ. 15 చొప్పున నాలుగు లీటర్లు, ఉన్న వారికి రూ. 19కు లీటరు కిరోసిన్ ఇచ్చేవారు. గద్దెనెక్కిన ఏడాదికే కందిపప్పు, గోధుమలు, పామాయిల్‌లను ఎత్తేసిన సర్కారు మూడేళ్ల క్రితం పంచదార, కిరోసిన్‌లను నిలిపివేసి బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తూ వచ్చింది. ఇలా పేదల కడుపు కొట్టడానికి నిర్దాక్షిణ్యంగా పూనుకున్న చంద్రబాబు సర్కారే.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఏడాది క్రితం సరుకుల పునరుద్దరణ ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చే ఎత్తుగడ వేసింది. గత ఏడాది జనవరి నుంచి చక్కెర పంపిణీని తిరిగి నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించింది. భయపెడుతున్న బయటి మార్కెట్ ధరలు రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయడంతో బయటి మార్కెట్లో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పేదవర్గాల వారు బెంబెలెత్తుతున్నారు. రేషన్ కార్డుపై అరకేజీ పంచదార రూ.6.75కు సరఫరా చేయగా మార్కెట్లో పంచదార కిలో రూ.40 వరకూ ఉంది. అలాగే లీటరు కిరోసిన్ రూ.15కు సరఫరా చేస్తే బయట రూ.60 పలుకుతోంది. రేషన్ గోధుమ పిండి రూ.16 కాగా బయటి దుకాణాల్లో రూ.40 ఉంది. మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయి పేద వర్గాల వారికి చుక్కలు చూపిస్తున్నాయి. కానుకల్లో నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి ‘చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా’ అంటూ ప్రభుత్వం ఆయా పండుగల్లో నాసిరకం సరుకులను తూకం తక్కువగా ప్యాకింగ్ చేసి లబ్ధిదారులకు అంటగడుతోంది. పురుగులు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు వంటి నాసిరకం వస్తువులను అంటగట్టడం ద్వారా కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలను చంద్రబా బు, ఆయన అనుచరులు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏం తిని బతకాలి? గతంలో ఆయిల్, చింతపండు ఇతర నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల్లో చౌకగా ఇచ్చేవారు. బయటి మార్కెట్లో వాటి ధరలు మండిపోతున్నాయి. చౌక డిపోల్లో సరుకులు ఆపేస్తే పేద ప్రజలు ఏం తిని బతకాలి? రేషన్ సరుకులు ఆపేయడమంటే పేద ప్రజలను ఇబ్బందులు పాలుచేయడమే. – విత్తనాల శ్రీనివాసరావు, ఐ.పోలవరం. పేదలకు పెద్ద ఇబ్బంది గత ప్రభుత్వంలో అన్ని రకాల సరుకులు ఇచ్చేవారు. ఇద్దరు, ముగ్గురు ఉండే కుటుంబానికి 15 నుంచి 20 రోజుల వరకు సరిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు ఆపేయడం వలన పేదవర్గాల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – మనువర్తి ఏసురాజు, కేశవరం, మండపేట రూరల్ అన్నీ బయట కొనుక్కోవాల్సిందే.. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం పేదల ఇచ్చే రేషన్‌లో కోటా పెట్టింది. గతంలో రూ.200 పట్టుకుని వెళితే రేషన్‌లో పది రకాలకు పైగా సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నీ బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. – బొడ్డపాటి మంగరాజు, మండపేట -
అందని పెళ్లికానుక!
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తామని, చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థిక ఆసరా కల్పిస్తామని టీడీపీ పాలకులు చెప్పిన మాటలకు కేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులకు పొంతనలేదు. ప్రభుత్వ సాయం అందుతుందని ఎదురు చూస్తున్న జంటలకు నిరాశే మిగులుతోంది. బడుగు, బలహీన వర్గాల వారికి ఈ పథకంపై ప్రభుత్వం ఎన్నో అశలు కల్పించించి. అధికారులు ఎప్పుడు వచ్చిన దరఖాస్తులు అప్పుడు అప్లోడ్ చేస్తున్నా.. ఏదో ఒక కారణం చూపి ఆ నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతాలకు ఒక్క రూపాయి జమ చేస్తోంది. మిగిలిన మొత్తం కోసం ఎవరైనా ప్రశ్నిస్తే.. అకౌంటు సరిగా ఉందో, లేదో చెక్ చేయడానికి జమ చేశామని అధికారులు చెబుతున్నారు. అందని ద్రాక్షలా.. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. 2018 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహ మిత్రలను నియమించారు. పెళ్లికి 15 రోజుల ముందుగా చంద్రన్న పెళ్లికానుకకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లి రిజిస్ట్రేన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటుగా 100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపర్చాలి. వాటిని ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చుతారు. ఇప్పటి వరకు చాలా మంది ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల మాత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని చెబుతున్నారు. మూడు నెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలేదు. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమకావడంతో వారంతా విస్తుపోయారు. దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు.. జిల్లాలో చంద్రన్న పెళ్లికానుక పథకానికి ఇప్పటివరకు 4,820 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 3,890 జంటలకు చెందిన దరఖాస్తులు మాత్రమే ఇప్పటి వరకు పరిశీలిన పూర్తి చేసి ఆర్హులుగా గుర్తించారు. వీరికి 16.80 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 930 జంటలకు ఈ కానుకకు సుమారుగా రూ.3.5 కోట్లు చెల్లించాల్సింది. వీటిలో 492 జంటలకు చెందిన దరఖాస్తులను అనర్హులుగా గుర్తించారు. ఆధార్ లింక్ కాలేదని, కుల ధ్రువపత్రాలు లేవని, పుట్టిన తేదీ ధ్రవపత్రం జత చేయలేదని, రెండో వివాహం, వరుడు ఉద్యోగి అనే కారణాలతో నిలిపివేశారు. గతేడాది అక్టోబర్ నుంచి వరుడు ఉద్యోగి అయినా, వధువు కుటుంబం బీపీఎల్ పరిధిలో ఉంటే వారికి పెళ్లికానుక మంజూరు చేయవచ్చనే నిబంధనలు మారినా.. ఆ నిబంధనలు అమలులోకి రాలేదు. పెళ్లి కానుక మొత్తం జమఅవుతుంది పెళ్లి కానుక మొత్తం జమ అవుతుంది. లబ్ధిదారులు అందోళన చెందవద్దు. దరఖాస్తులు వెరిఫికేషన్ పూర్తియిన జంటలకు కానుకలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్నవాటికి కూడా తగిన ధ్రువపత్రాలు అందజేస్తే.. వారి కూడా చెల్లిస్తాం. పంచాయతీ కార్యదర్శులు పెళ్లి ధ్రువపత్రాలు అన్లైన్లో జమ చేయడం ఆలస్యం వల్ల అక్కడక్కడా జాప్యం జరుగుతోంది. కొన్ని బ్యాంకు ఖాతాలు పనిచేయడంలేదు. వాటిని సరిచేయాలని సంబంధిత మండల అధికారులకు సూచించాం. – ఎ.కల్యాణచక్రవర్తి, డీఆర్డీఏ పీడీ చంద్రన్న పెళ్లికానుక ఇలా.. (కులాలవారీగా) ♦ ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకొంటే రూ.50వేలు, ♦ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ♦ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలైతే రూ.50వేలు, ♦ విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారైనా రూ.లక్ష వంతున అందజేస్తారు. -
పెళ్లికానుక.. లేదిక..
ఈ చిత్రంలో నూతన వధూవరులు కురిటి అచ్యుతరావు, సాయికుమారిల స్వగ్రామం రేగిడి మండలం చిన్నపుర్లి. వీరు చంద్రన్న పెళ్లికానుక నిమిత్తం ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. కల్యాణమిత్రలు వచ్చి ఫొటోలు తీసుకెళ్లడంతోపాటు వివరాలన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత వీరి ఖాతాలో రూ. 10 వేలు జమయ్యాయి. మరో రూ. 25 వేలు ఇంతవరకూ రాలేదు. ఇప్పటికే ఐదు పర్యాయాలు రేగిడి వెలుగు కార్యాలయానికి వచ్చారు. తిరిగే ఓపిక లేక అధికారుల నుంచి భరోసా లేక ఊరుకున్నారు శ్రీకాకుళం, రాజాం: పొరుగున తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వెనుకబడిన వర్గాలను మైనార్టీలను ఆకట్టుకోవడానికి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లికానుక అభాసు పాలవుతోంది. జిల్లాలో వేలాది మంది నూతన వధూవరులకు ఈ కానుక అందక ఉసూరుమంటున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతాల్లో నిధులు జమవుతాయని అధికారులు చెప్పడంతో ఇప్పటికీ ఎంతోమంది ఆశగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అంతా గాలివాటం.. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అర్హులుగా ప్రకటించారు. నూతన వధూవరులు 15 రోజులు ముందు కల్యాణమిత్రలకు సమాచారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రతీ మండలానికి ఇద్దరు కల్యాణ మిత్రలను నియమించారు. వీరు వధూవరులు పెళ్లికార్డులతోపాటు ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఉన్నతాధికారులు అందిస్తారు. పెళ్లి సమయంలో ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ తంతు ముగియగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆరంభంలో కొంతమందికి మాత్రమే తూతూమంత్రంగా అందించారు. ఆ తర్వాత దరఖాస్తులు పేరుకుపోతున్నా కానుక మాత్రం అందలేదు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల కోడ్ రానుంది. ఈ లోపు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లుగా దాఖలాలు లేవు. దీనిబట్టి చూస్తే.. కానుక దరఖాస్తులు బుట్టదాఖలవుతాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా బూటకమే.. చంద్రన్న పెళ్లికానుక అంతా బూటకమే. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏవో పథకాలు పెట్టి లబ్ధిదారులకు ఆశ చూపించడమే సీఎం చంద్రబాబు పని. వీటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు. పెళ్లి చేసుకున్న జంటలకు ఏడాది వరకూ కానుక ఇవ్వకపోవడం దారుణం.– కంబాల జోగులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాజాం త్వరలో వచ్చే అవకాశం ఉంది చంద్రన్న పెళ్లికానుక అమలులో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో ఉంది. గతేడాది మే వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో నిధులు వచ్చాయి. అనంతరం రూ. 8 కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో వీటిని విడుదలచేసే అవకాశం ఉంది. నిధులు కూడా వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. – జీ దేవుడునాయుడు, చంద్రన్నపెళ్లికానుకల పథకం జిల్లా సమన్వయకర్త, శ్రీకాకుళం నిధులు వస్తాయో రావో... మా గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన నూతన జంటలకు చంద్రన్న పెళ్లికానుక అందలేదు. వీటికితోడు టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు అనుమతి ఉంటేనే కొంతమందికి ఇవి వస్తున్నాయి. లేకుంటే రాని పరిస్థితి ఉంది.– కెంబూరు సూర్యారావు, మాజీ సర్పంచ్, కొండగూడేం, సంతకవిటి మండలం -
పెళ్లి కానుక కోసం.. కళ్లు కాయలు
సాక్షి, అమరావతి: పెళ్లి నాటికి పెళ్లి కానుక అందిస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఆచరణలో అది అమలుకావడం లేదు. పెళ్లి సమయంలో కల్యాణ మిత్రలు వచ్చి ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాకే కానుకను ఆన్లైన్ ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. పెళ్లి కానుక అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు వారి అధికారుల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. ఇవి కాకుండా మండలానికి ఇద్దరు చొప్పున స్వయం సహాయక సంఘాల నుంచి నియమితులైన కల్యాణ మిత్రలు.. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇంటికెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి పత్రికను తీసుకుంటారు. వీరిద్దరికి పెళ్లి జరుగుతుందని తెలిసిన వారి నుంచి సాక్ష్యం తీసుకుంటారు. పెళ్లి సమయంలో అక్కడికెళ్లి ఫొటోలు తీసుకుని ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయితేగానీ పెళ్లి కానుక అందని పరిస్థితి. ఆంక్షలతో ఆలస్యం ఈ పథకాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి 45,875 జంటలు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోగా కానుక ఇచ్చింది మాత్రం 16,956 జంటలకే. అంటే ఇంకా 28,919 జంటలకు అందాల్సి ఉంది. పథకం ప్రారంభానికి ముందు.. 15 రోజులు ముందుగా పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. వీరందరికీ అక్టోబర్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలు 29,834 ఉన్నాయి. అంటే ఇంకా కానుక అందుకోవాల్సిన జంటలు మొత్తం 58,753 మంది ఉన్నాయి. పెళ్లి కానుక గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం రకరకాల ఆంక్షలు పెడుతోంది. మంజూరు చేయగానే పంపిణీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే మంజూరు చేశాక నెలకు కూడా కానుక అందడం లేదు. పెళ్లి కానుకను కూడా రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉండటంపై నూతన వధూవరులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రకరకాలుగా.. పెళ్లికానుక కింద షెడ్యూల్డ్ కులాల వారికి రూ.40 వేలు, షెడ్యూల్డ్ తెగల వారికి రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనార్టీలకు రూ.50 వేలు ఇస్తున్నారు. ఈబీసీలకు ఇవ్వడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు.. రూ.1,00,116 చెల్లిస్తున్నారు. -
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
-
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
సాక్షి, నంద్యాల(కర్నూలు) : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఉచితం అంటూ పండుగకు పురుగులు పట్టిన సరకులు పంపిణీచేస్తున్నారని రాష్ట్రమంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన సరుకులన్నీ నాసిరకంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పిండి, బేడలు, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి తింటే పండుగ రోజున ఆస్పత్రిలో చేరాల్సివస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. ఉచితం అంటూ సంక్రాంతి పండుగకు ఇలా పురుగులు, బూజు పట్టిన నాసిరకం సరుకులు ఇస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలతో కాంట్రాక్టు పొందిన వ్యక్తులకే మేలు కలుగుతోందని.. కార్డుదారులు నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పొందిన వ్యక్తులు తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు సరఫరా చేశారనే ఆరోపణలు కార్డుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా చంద్రన్న కానుకల్లో నాసిరకం సరుకులు
-
చంద్రన్న కానుకల్లో బూజుపట్టిన బెల్లం,పురుగు పట్టిన గోధుమ పిండి
-
కానుక.. అందక..
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీ గందరగోళంగా తయారైంది. పోర్టబులిటీ సౌకర్యాన్ని ఈ సరుకులకు ఎత్తివేయడంతో చాలా మందికి చంద్రన్న కానుక అందకుండా పోతోంది. పశ్చిమగోదావరి,దేవరపల్లి: ఈ– పోస్ యంత్రంలో పోర్టబులిటీ సదుపాయం కల్పించకపోవడంతో పండుగ కానుకలు అందక వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఇతర జిల్లాల ప్రజలు జిల్లాకు వలస వచ్చి ఉపాధి పొందుతూ జీవనం గడుపుతున్నారు. శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అనేక కార్మిక కుటుంబాలు వలస వచ్చి దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లోని నల్లరాతి క్వారీల్లో పనిచేస్తున్నాయి. ప్రతినెల స్థానికంగా ఉండే రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు పోర్టబులిటీలో పొందుతున్నారు. అలాగే భీమవరం ప్రాంతంలో విస్తరించి ఉన్న రొయ్యలు, చేపలచెరువుల వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది కుటుంబాలు వలసలు వెళ్లి ఉంటున్నాయి. చంద్రన్న కానుకలకు పోర్టబులిటీ సదుపాయం నిలుపుదల చేయడంతో రేషన్ దుకాణా లకు వెళ్లిన కార్డుదారులు నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రతినెల రేషన్ సరుకులు ఇస్తుండగా, కానుకలు ఎందుకు ఇవ్వరని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరుకు వెళ్లి పండగ చేసుకోవాలనడం ఎంత వరకు సమంజసమని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కార్డుదారులకు సమాధానం చెప్పలేక డీలర్లు తల పట్టుకుంటున్నారు. చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఇవ్వాలనే ఉద్దేశంతో తొలుత 50 శాతం కార్డుదారులకు కానుకలను సరఫరా చేశారు. అయితే సంక్రాంతి కానుకలను కూడా ఈ నెలాఖరుకు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెండు రోజుల నుంచి అధికారులు గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు ఆగమేఘాలపై సరుకులను సరఫరా చేస్తున్నారు. నూరు శాతం కార్డులకు కానుకలను అందించాలని అధికారులు డీలర్లకు ఆదేశాలు ఇవ్వడంతో కానుకల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. నూరుశాతం కానుకలు రేషన్ దుకాణాలకు సరఫరా చేసినందున పోర్టబులిటీ ఇవ్వకపోతే కానుకలు మిగిలిపోతాయని డీలర్లు అంటున్నారు. మిగిలిపోయిన కానుకలు సకాలంలో తిరిగి అప్పగించకపోతే పాడైపోయే ప్రమాదం ఉందని డీలర్లు అంటున్నారు. కానుకల కోసం రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. పోర్టబులిటీ విషయాన్ని పలువురు డీలర్ల సంఘాల ప్రతినిధులు మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. అయినప్పటికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని డీలర్లు తెలిపారు. ఒక్కొక్క రేషన్ దుకాణంలో 30 నుంచి 100 వరకు పోర్టబులిటీ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం పోర్టబులిటీకి అనుమతి ఇవ్వకపోతే కార్డుదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికారపార్టీ నాయకులు అంటున్నారు. కానుకల్లో తరుగుదల..డీలర్లు లబోదిబో గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల్లో తరుగులు రావడంతో డీలర్లు లబోదిబో మంటున్నారు. శనగపప్పు, కందిపప్పు, గోధుమపిండి ప్యాకెట్లు బస్తాల్లో తక్కువగా ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. ప్యాకెట్లు బస్తాలో వేసి తూకం వేసి ఇచ్చారని.. బరువు 50 కిలోలు ఉంటున్నప్పటికి ప్యాకెట్లు మాత్రం 44, 45 కిలోలు ఉంటున్నాయని డీలర్లు తెలిపారు. ఈ విధంగా తరుగులు ఉంటే కార్డుదారులకు ఏవిధంగా సరిపెట్టగలమని, నష్టం ఎవరు భరిస్తారని డీలర్లు వాపోతున్నారు. గిడ్డంగి అధికారులను అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని డీలర్లు తెలిపారు. కార్డుదారులకు ప్యాకెట్ల లెక్కన ఇచ్చి... డీలర్లకు తూకం ద్వారా ఇవ్వడం వల్ల డీలర్లు నష్టపోవలసి వస్తోందని పలువురు డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తగ్గిన ప్యాకెట్లకు డీలర్లకు ఇవ్వాలని కోరుతున్నారు. -
పైకమిస్తేనే చంద్రన్న సరుకులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు ఎం.పైడయ్య. నివాసముండేది మున్సి పాలిటీలోని 8వ వార్డు అమ్మిగారి కోనేటిగట్టు. చంద్రన్న రేషన్ సరుకుల కోసం అతని కార్డు ఉన్న 307వ నంబర్ రేషన్ షాపునకు వెళ్లగా అక్కడున్న డీలర్ రూ.10లు ఇచ్చి సరుకులు తీసుకెళ్లాలని ఓ కార్డు కూడా చేతిలో పెట్టాడు. దీంతో వృద్ధుడు రూ.10 ఇచ్చి కార్డు చూపించుకుంటూ సరుకులు తీసుకెళ్లాడు. ఇక్కడ వినియోగదారుడు నిజమైనా.. డీలర్ బినామీ కావడం విశేషం. విజయనగరం, బొబ్బిలి: రాష్ట్రంలో చంద్రన్న సరుకులు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో కమీషన్లు చాలక రేషన్ డీలర్లు చిలక్కొట్టుళ్లకు పాల్పడుతున్నారు. చంద్రన్న సరుకులు ఇచ్చేందుకు రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, వాటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు రేషన్ డీలర్ల డిమాండ్లను పక్కన పెట్టేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా తయారైంది. జిల్లాలో 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రెండో అంచెగా రేషన్ షాపులకు సరుకులను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1456 రేషన్ దుకాణాల్లో అధిక సంఖ్యలో బినామీ డీలర్లు వ్యవహరిస్తున్నారు. వీరు గతంలోలా ఈ వెయింగ్‌లో బియ్యం, సరుకులు ఇవ్వడం లేదు. వాస్తవానికి ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న ఈ వెయింగ్ మెషీన్లనే వినియోగించడం లేదు. దీంతో వీరు కూడా డబ్బాలతోనూ, లేదా రాళ్లను ఈ వెయింగ్ మెషీన్లు పెట్టి చీటీలు ఇస్తున్నారు. ఈ స్లిప్‌లు పట్టుకుని డబ్బులు తీసుకువెళితే బియ్యం ఇస్తారు. ఇలా చేయడం వలన ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లతో పాటు డీలర్ల వద్దా తూకం తరుగు మిగులుతోందని వినియోగదారులు వాపోతున్నారు. నిలిచిపోయిన డిజిటల్ చెల్లింపులు .. జిల్లాలో గతంలో చేపట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం నిలిచిపోయింది. దీంతో అందరు డీలర్లూ డబ్బులు తెస్తేనే సరుకులు ఇస్తున్నారు. ఏటీఎం కార్డు పట్టుకుని రేషన్ షాపునకు వెళితే అక్కడున్న డీలర్ ఆశ్చర్యంగా వినియోగదారుల వైపు చూస్తున్నారు. గతంలో ఈ విధానం అమలుకోసం డీలర్ల చేత కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేయించారు. ఈ అకౌంట్లు ఇప్పుడు పడకేసినట్టున్నాయి. అంతే కాదు ప్రతీ నెలా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారికి బహుమతులు అందించే వారు సెల్‌లను డీఎస్ఓ, జేసీల చేతుల మీదుగా అందజేసి ప్రోత్సహించేవారు. ఇప్పుడా విధానం మానేసి దాదాపు రెండేళ్లు పైనే అయిందని పౌరసరఫరాల అధికారే ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. -
కానుక..పొందలేక
చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందుకు నేందుకు లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్డు వేరే చోట ఉన్నా పోర్టబులిటీ విధానం ద్వారా తాముం టున్న ప్రాంతంలోనే లబ్ధిదారులు రేషన్ తీసుకొనేవారు. అయితే, క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్న కానుకలను కార్డు ఉన్న చోటే తీసుకోవాల్సి రావడంతో సమస్య నెలకొంది. దీనిపై లబ్ధిదారులు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు రూరల్: జిల్లాలో 2,896 రేషన్‌షాపులు ఉన్నాయి. వీటి కింద 11.16 లక్షల కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా ప్రజా పంపిణీ పేరుతో నిత్యావసర సరుకులను అంది స్తోంది. ప్రస్తుతం ఈ–పాస్ విధానం ద్వారా పంపిణీ జరుగుతోంది. ఈ విధానానికి ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. దీంతో కార్డు ఉన్న ప్రాంతంలోనే కాకుండా వేరే చోట కూడా సరుకులు పొందేందుకు పోర్టబులిటీ సిస్టం ప్రవేశపెట్టింది. జిల్లాలో సుమారు 2.50 లక్షల కార్డుదారులు పోర్టబులిటీ ద్వారా కార్డు ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సరుకులు తీసుకుంటున్నారు. పోర్టబులిటీ లేక ఇక్కట్లు చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీకి మాత్రం పోర్టబులిటీ ఆప్షన్ లేకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికి ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాతి కానుకలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో కార్డుకు కిలో గోధుమ పిండి, కిలో కంది పప్పు, అరకిలో శనగపప్పు, 100 గ్రాముల నెయ్యి, అరలీటరు వంట నూనె, అరకిలో బెల్లం అందజేయాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు 994.108 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, కందిపప్పు 306.950 మెట్రిక్ టన్నులు, శనగపప్పు 221.110 మెట్రిక్ టన్నులు, బెల్లం 352.712 మెట్రిక్ టన్నులు, పామాయిల్ 552.426 కిలో లీటర్లు, నెయ్యి 106.431 కిలో లీటర్లు సరఫరా అయ్యాయి. 3 రోజుల క్రితమే సరుకులు చౌకదుకాణాలకు చేరుకున్నాయి. శనివారం నుంచి పంపిణీ ప్రారంభించారు. కానీ పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకునే వారికి బ్రేకులు పడ్డాయి. ఈ–పాస్‌లో పోర్టబులిటీ ఆప్షన్ లేకపోవడంతో లబ్ధిదారులు తమ రేషన్ కార్డు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్రిస్మస్ కానుక పొం దేందుకు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. షాపు వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కానుకలు తీసుకునేందుకు కూడా పోర్టబులిటీ విధానం అమలుచేయాలని వారు కోరుతున్నారు. పేదలకే కష్టం సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చం టూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బాగుంది. పేదప్రజలకు ఊరట కలిగింది. కానీ పండుగ సరుకులు తీసుకోవడంలో ఆంక్షలు పెట్టడం సరికాదు. ప్రభుత్వం స్పందించాలి. పోర్టబులిటీ ద్వారా సరుకులు అందించాలి. – రాజారత్నంరెడ్డి, చిత్తూరు -
కానుక.. కినుక..
పశ్చిమగోదావరి , కొవ్వూరు రూరల్: పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఈ పద్ధతిని చంద్రన్న కానుకలకు మాత్రం రద్దు చేసింది. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఏ రేషన్ షాపు పరిధిలో ఉన్న కార్డుదారులు అక్కడే చంద్రన్న కానుకలు పొందాలని పేర్కొనడంతో చాలా మంది లబ్దిదారులు అయోమయంలో పడ్డారు. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే షాపుల పరిధిలో ఈ పాస్ యంత్రంలో పోర్టబులిటీ సౌకర్యాన్ని తొలగించడంతో షాపుల నిర్వాహకులు సైతం ఏమీ చేయలేమని చేతులెత్తేడంతో సొంత గ్రామాల్లో కానుక సరుకులు తీసుకోవడానికి కొంతమంది పయనమవుతున్నారు. ఉపాధి, ఉద్యోగం, ఇతర పరిస్థితుల దృష్ట్యా మండలం, పట్టణ పరిధి నుంచి వలస వెళ్లి రేషన్ లబ్ధిదారులు పోర్టబులిటీ సౌకర్యాన్ని వినయోగించుకుని రేషన్ సరుకులు, కానుక సరుకులు పొందేవారు. జిల్లాలో 2020 రేషన్ షాపుల పరిధిలో 12,39,721 రేషన్ కార్డులకు గాను 3,06,853 మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు పొందినట్టు ఆన్లైన్లో నమోదై ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రన్న కానుక సరకులకు పోర్టబులిటీ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,44,002 కార్డులకు చంద్రన్న కానుకలు ఇవ్వగా, జిల్లాలో 1,77, 205 కార్డులకు పంపిణీ చేసి ఆదివారం రాత్రికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 11.46 శాతం, జిల్లాలో 14.26 శాతం పంపిణీ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కొత్త షాపుల నేపథ్యంలో ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా ఇటీవల కొత్త షాపులు ఇవ్వడంతో ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకే గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నా ఆ ఇబ్బందులు తప్పడం లేదు. పోర్టబులిటీ అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న షాపుల్లో సరుకులు పొందేవారు. అయితే ఇప్పుడు పోర్టబులిటీ లేకపోవడంతో, ఏ షాపు పరిధిలో తన కార్డు ఉంటుందో అక్కడికి వెళ్లి కార్డుదారుడు రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అనుమతులు ఇచ్చిన కొత్త షాపులకు పాత షాపుల నుంచి బైపరిగేషన్ చేసి కార్డులు బదిలీ చేయడంతో కార్డు ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. పోర్టబులిటీ లేకపోవడంతో డీలర్లతో పాటు, కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన నేపథ్యంలో, జనంలో డీలర్లను చులకన చేయడానికే ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు చేపట్టినట్టు పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల పోర్టబులిటీ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న రాష్ట్రవ్యాప్తంగా 12,39,721, జిల్లాలో 3,06,853 మందిని చంద్రన్న కానుకలకు దూరం చేయాలని ప్రభుత్వ పన్నాగమని పేదలు ఆరోపిస్తున్నారు. -
అరకొర సరుకులే..
విజయనగరం గంటస్తంభం: ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పంట వరి పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకురావడమే కష్టంగా భావిస్తున్న తరుణంలో పండుగలు జరుపుకోవడం తలకు మించిన భారమే. ఇలాంటి దీనస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పండగ పూట కంటితుడుపుగా గతంలో ఇచ్చిన సరుకులే చంద్రన్న కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి నాలుగేళ్లగా ఇస్తున్న సరుకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండగా.. ఇప్పుడూ అవే సరుకులు ఇవ్వడంతో మరింత అసంతృప్తికి గురికావడం ఖాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇవీ సరుకులు ప్రభుత్వం ప్రతి ఏటా రంజాన్ సమయంలో ముస్లింలు, క్రిస్మస్ సమయంలో క్రిష్టియన్లకు, సంక్రాంతి పండుగ సమయంలో హిందువులకు చంద్రన్న కానుక పేరుతో సరుకులు సరాఫరా చేస్తున్న విషయం విధితమే. ఈ ఏడాది కూడా అదేవిధంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసుగా ఉండడంతో సరుకులు సరఫరాకు చర్యలు తీసుకుంది. ఈ ఏడాది కాసింత ముందుగా జిల్లాకు సరుకులు చేరుతున్నాయి. అయితే సంక్రాంతి, క్రిస్మస్లకు ఒక్కో కార్డుదారునికి అర కిలో పామాయిల్, అర కిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అర కిలో బెల్లం, కిలో గోధుమపండి, 100 గ్రాముల నెయ్యి సరఫరా చేయాలని నిర్ణయించింది. గత నాలుగేళ్లగా ఇవే సరుకులు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఉపశమనం నామమాత్రమే.. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేయాలని నిర్ణయించిన సరుకులు ధరలు రిటైల్ మార్కెట్లో చూస్తే ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు.ఆరు రకాల సరుకులు కిరాణా దుకాణానికి వెళ్లి చిల్లరగా కొనుగోలు చేస్తే రూ.230లకు వచ్చేస్తాయి. ప్రభుత్వం టోకుగా కొనుగోలు చేయడం వల్ల రూ.200 లోపే వస్తాయి. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో కార్డులున్న 7.04 లక్షల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి సంక్రాంతి కానుక, క్రిస్మస్ పేరుతో కలిగే ప్రయోజనం నామమాత్రమే అని చెప్పుకోవాలి. ప్రచారం కోసమే.. ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకులతో ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదు. ఆరు సరుకులతోనే పండగ అయిపోదు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రచారం కోసమే ఇదంతా చేస్తుందన్న విషయం లబ్ధిదారులు ఎప్పుడో గుర్తించారు. అందుకే నాలుగేళ్లుగా ఇస్తున్నా, ప్రభుత్వం ఎంతో చేస్తున్నామని సభలు, సమావేశాల్లో గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత ప్రభుత్వం హాయాంలో నెయ్యి మినహా మిగతా సరుకులన్నీ నెలనెలా సరఫరా చేసేవారు. వీటితోపాటు అదనంగా కొన్ని సరుకులు ఇచ్చేవారు. దీంతో కోటా దుకాణానికి వెళితే సంచి నిండా ఇంటికి ఉపయోగపడే సరుకులు వచ్చేవి. వీటన్నింటికీ కోత వేసిన ప్రభుత్వం ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏడాదికోసారి ఇచ్చి చేతులు దులుపుకోవడంపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఫొటోలు దూరం ఈసారి సరుకుల సరఫరాలో కొంతవరకు ప్రచారం తగ్గించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి జిల్లాకు 25 శాతం సరుకులు చేరాయి. ఇందులో దాదాపు అన్ని రకాల సరుకులు ఉన్నాయి. ప్యాకెట్ల రూపంలో సరుకులున్నా వాటిపై గతంలో మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి ఫొటోలు లేవు. సరుకులు తీసుకెళ్లే గోనె సంచులపై మాత్రం వారి ఫొటోలు ముద్రించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో ప్యాకెట్లపై ఫొటోలు ముద్రించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం పౌరసరఫరాలసంస్థ డీఎం డి. షర్మిల వద్ద ప్రస్తావించగా.. ఆరు రకాల సరుకులు మాత్రమే వచ్చాయన్నారు. డిసెంబర్లో సగం కార్డుదారులకు సరిపోయే సరుకు డిపోల్లో అందుబాటులో ఉంచాలన్నది ఉన్నతాధికారుల ఉద్దేశమన్నారు. మిగతా సగం లబ్ధిదారులకు జనవరిలో ఇస్తామన్నారు. -
పెళ్లి కానుక.. కానరాక..
నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన మట్టా వరలక్ష్మి, లకంసాని శ్రీను జూన్ 23న కులాంతర వివాహం చేసుకున్నారు. వధువు బీసీ కావడంతో వీరికి చంద్రన్న పెళ్లికానుక కింద రూ.50 వేలు ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ చేయాలని వెలుగు అధికారులు సూచించడంతో ఆ పని పూర్తిచేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ నవజంట పెళ్లికానుక కోసం ఆశగా ఎదురుచూస్తోంది. నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల స్వప్నకు, పురుషోత్తపల్లికి చెందిన సాలి లక్ష్మణరావుకు పరిశుద్ధ వివాహం జరిగింది. వీరికి చంద్రన్న పెళ్లికానుక కింద రూ.40 వేలు అందాల్సి ఉండగా వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం అందలేదని వెలుగు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేయాల్సిన గ్రామ పంచాయతీ అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో పెళ్లికానుక మంజూరులో జాప్యం జరుగుతోంది. పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఆడపిల్ల పెళ్లికి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20న చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించింది. పెళ్లిచేసుకున్న రోజునే నవవధువు ఖాతాలో ప్రోత్సాహం వేస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న నవదంపతులకు లబ్ధి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అమలులోనే చిక్కులు చంద్రన్న పెళ్లికానుక అమలులో చిక్కులు ఎదురవుతున్నాయి. నమోదులో సాంకేతికపరమైన సమస్యలతో లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో ముస్లింలకు అందించే దుల్హన్ పథకాన్ని, కులాంతర వివాహ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుక కిందకు తీసుకొచ్చి ప్రత్యేక సాఫ్ట్వేర్, వెబ్సైట్ రూపొందించారు. ఆన్లైన్ విధానంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా, వెలుగు, మెప్మా, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులుసరైన పత్రాలు సమర్పించిన కారణంగా ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన వధువులకు ఆర్థిక ఆసరా కలుగుతుందని భావించినా సక్రమంగా అందడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 5,662 మంది పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అన్ని అర్హతలూ ఉన్న∙3,718 జంటలు పెళ్లికానుకలు అందుకున్నారు. మిగిలిన వారందరినీ వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేయని కారణంతోనూ, ప్రజాసాధికారక సర్వేలో పేర్లు లేవనే నెపంతోనూ పెండింగ్ పెట్టారు. మొత్తం 1,944 అర్జీలను పెండింగ్‌లో పెట్టారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా వివాహాలు జరిగినా సగం మంది సాంకేతిక చిక్కులు కారణంగా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ప్రధానంగా పెళ్లికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండటంతో పాటు రకరకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండడం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండటంతో, పెళ్లికానుకపై సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వం ఇకపై పెళ్లికి పది రోజుల ముందు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మరోసారి గడువు పెంచినా.. ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు వివాహాలు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో అర్హులు నమోదు చేసుకోలేదు. జిల్లాలో 2,285 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో కల్యాణమిత్ర పరిశీలించిన తర్వాతే చంద్రన్న పెళ్లికానుక వెబ్‌పోర్టల్‌లో పొందుపర్చాలనే నిబంధన పెట్టారు. దీంతో నవవధువులు పెళ్లిచేసుకున్న ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులు 10 మంది పెళ్లిచేసుకోగా ఒక్కరికీ పెళ్లికానుక ప్రోత్సాహకం అందలేదు. కానుక ఇలా.. గిరిపుత్రికలకు రూ.50 వేలు, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్సీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ముస్లింలకు (దుల్హన్) రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, బీసీ కులాంతర వివాహాలకు రూ.50 వేలు, విభిన్న ప్రతిభావంతుల వివాహాలకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులు, కార్మికుల సంక్షేమ మండలి సభ్యులు ఎస్టీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. మీసేవ జారీ చేసిన కులము, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, అంగవైకల్యం ఉన్నవారైతే సదరం సర్టిఫికెట్, వధువు, వరుడు పెళ్లి కార్డులు, ఆధార్ కార్డులు, ఆధార్‌తో సీడ్ చేయబడిన వధువు బ్యాంక్ ఖాతా వివరాలు, ఏపీ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యత్వం ఉన్న వారైతే రిజిస్ట్రేషన్ నంబర్, కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉన్నవారైతే ఐడీ కార్డు, పెళ్లికి సంబంధించిన మూడు ఫొటోలు అందించాల్సి ఉంది. అర్హతలివీ.. ♦ పెళ్లి తేదీ నాటికి పెళ్లి కుమార్తె వయస్సు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. ♦ మొదటి వివాహం చేసుకునే వారు మాత్రమే ఈ పథకంలో అర్హులు. ♦ భర్త చనిపోయిన వితంతువులకు మాత్రమే రెండో వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. ♦ నమోదు చేసుకునే సమయానికి ఆధార్ నంబర్ ఉండాలి. వివాహం రాష్ట్రంలో మాత్రమే జరగాలి. ♦ వధువు, వరుడు ప్రజాసాధికారక సర్వేలో నమోదై ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహ తేదీ, వేదిక నిర్ణయించాల్సి ఉంది. -
చంద్రన్న పెళ్లికానుకకు నెలాఖరు వరకు గడువు
ప్రకాశం, చీరాలటౌన్: పేద కుటుంబాలకు చెంది ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెళ్లి చేసుకున్న దంపతులకు ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న పెళ్లికానుక పొందేందుకు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పి.ఝాన్సీరాణి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న నూతన ముస్లిం దంపతుల ధృవీకరణ పత్రాలు, వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెళ్లిళ్లు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల దంపతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చంద్రన్న పెళ్లికానుకను ప్రవేశపెట్టిందన్నారు. గతంలో చాలామంది ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోకపోవడంతో ప్రభుత్వం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన వారు చీరాల మండలంలో ఐదుగురు, జిల్లాలో 45 మంది ఇప్పటి వరకు పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, ఇంకా మిగిలిన వారు కూడా తగిన ధృవీకరణ పత్రాలతో పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం టి.మోహనరావు, సిబ్బంది, అర్జీదారులు ఉన్నారు. -
అందని కానుక
గరివిడి మండలం గెడ్డపువలసకు చెందిన ఈమె పేరు యడ్ల జయమ్మ. కోనూరు గ్రామానికి చెందిన సీహెచ్.గణపతితో ఈ ఏడాది మే నెల ఒకటో తేదీన ఈమెకు వివాహమైంది. వీరు చంద్రన్న కానుకకోసం దరఖాస్తు చేస్తే ఇప్పటివరకూ ఆ మొత్తం అందలేదు. రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. స్థానిక నాయకులు ఎవరైనా అడ్డుపడుతున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఏ విషయం తెలియజేయడం లేదని చెబుతున్నారు. బాడంగి మండలం చినభీమవరానికి చెందిన ఈమె పేరు గొట్టాపు శ్రీదేవి. ఈమెకు సాలూరు పట్టణం గుమడాం వీధికి చెందిన సబ్బాన శ్రీనివాసరావుతో ఈ ఏడాది మేనెల 3వ తేదీన పెళ్లయింది. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు బీసీకి వర్గీయులు. ఈమెకు రూ. 35వేలు చంద్రన్న పెళ్లికానుకకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ మొత్తం మంజూరు కాలేదు. అసలు అందుతుందో లేదో తెలియడం లేదని వారు వాపోతున్నారు. విజయనగరం అర్బన్:పేద కుటుంబాలకు చెందినవారు పెళ్లి చేసుకుంటే వారికి కులాల ప్రాతిపదికన ప్రభుత్వం తరఫున పెళ్లి కానుక అందజేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. తీరా పథకాన్ని అర్హులందరికీ అందించడంలో సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. దీనివల్ల పేర్లు నమోదు చేసుకుని చేతికి వచ్చేవర కూ అసలు వస్తుందా రాదాఅన్న సందేహం లబ్ధిదారుల్లో కలుగుతోంది. ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలోశ్రద్ధ చూపకపోవడంతో ఎవరికీ అందడం లేదు. వేలల్లో నమోదు... వందల్లో లబ్ధి! జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి అమలవుతున్న ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా ఇంతవరకు 2,589 జంటలు నమోదు చేసుకున్నాయి. వీరిలో 1,227 మంది వరకు మాత్రమే అర్హులైనట్లు నివేదికలు చెపుతున్నాయి. అయితే పెళ్లిళ్లు పూర్తి చేసుకొని మూడు నుంచి నాలుగు నెలలు కావస్తున్నా నగదు విడుదల కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు కేవలం 977 జంట లకు మాత్రమే రూ.3.83 కోట్లు విడుదల చేసిన ట్లు నివేదికలు చెపుతున్నాయి. నిబంధన ప్రకా రం పెళ్లికి ముందే నగదు విడుదల చేయాలి. పెళ్లి చేసుకొని మూడు నుంచి నాలుగునెలల ఆలస్యం గా నగదు విడుదలవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మాఘమాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇలా ఫిబ్రవరి, మార్చినెలల్లో దాదాపు 2,500 పెళ్లిళ్లు జిల్లాలో జరిగినట్టు ఒక అంచనా. కానీ పథకం ఏప్రిల్ 20 నుంచి అమలులోకి రావడంతో వారందరూ అవకాశం కోల్పోయినట్టయింది. కేవలం లబ్ధిదారులను కొంతమందికైనా తగ్గించాలన్న వ్యూహంతోనే ఆలస్యంగా పథకాన్ని ప్రారంభించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అందుబాటులోలేని ‘కాల్ సెంటర్లు’ ఏప్రిల్ నెల 20న ప్రారంభించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం అమలు తీరుపై ఆది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పెళ్లి సీజన్ అయిపోయిన తరువాత అమలు చేయడం ఒక కారణమైతే అసలు పథకంలో నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పేదలకు అవగాహన కలిగించే వ్యవస్థ నిర్వీర్యంగా ఉండడం మరో కారణం. గ్రామాణాభివృద్ధి శాఖ, వెలుగు విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పథకం తొలుత మీ–సేవా కేంద్రం ద్వారా నమోదు ప్రక్రియను చేపట్టడం వల్ల సాంకేతికంగా పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా ఆ విధానాన్ని రద్దు చేసి మండల కేంద్రాల్లోని మండల సమాఖ్య కార్యాలయాల్లో ‘చంద్రన్న పెళ్లి కానుక’ నమోదు కేంద్రాలు, కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నమోదు చేయడానికి ప్రత్యేకించిన సిబ్బంది లేకపోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన అభ్యర్థులు పేర్ల నమోదు కోసం రోజంతా నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ప్రదర్శన బోర్డు ప్రచారం కోసమే అన్నట్టు సమావేశ మందిర గదికి పెట్టారు. పెళ్లికానుక ప్రోత్సాహం ఇలా... చంద్రన్న పెళ్లికానుక కింద ఇస్తున్న ప్రోత్సాహకాలు కులాలవారీగా నిర్ణయించారు. ఎస్టీలు, మైనార్టీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ సాయం కోరేవారు పెళ్లికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వధూవరులు తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ దుకాణాల ద్వారా పల్స్, ఈ–కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. -
పెళ్లికానుక ప్రశ్నార్థకం ?
ఎంతో హంగూ ఆర్భాటంతో ప్రభుత్వం ఆరంభిస్తున్న పథకాలు ఆచరణలో అర్హులకు అందడం లేదనే విమర్శలొస్తున్నాయి. రకరకాల స్కీంలు ప్రవేశపెడుతూ ప్రకటనలిస్తున్నారేగానీ క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తామని గొప్పగా ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల నుంచి పథకం వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం ఉండటంలేదని అంటున్నారు. పటమట (విజయవాడ తూర్పు): ప్రచార ఆర్భాటానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరటంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పేదింటి ఆడపిల్లకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారికి అండగా ఉంటామంటూ ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకం అస్తవ్యస్తంగా తయారైంది. నిరంతరం అందుబాటులో ఉండాల్సిన సేవలు అర్ధంతరంగా నిలిపేయటంతో కొన్ని వర్గాల వధూవరులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముహూర్తాలు లేవనే కారణంతో క్రిస్టియన్లు, ముస్లిం వర్గాల ప్రజలు పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులు కొర్రీలు వేస్తున్నారు. దీంతో పలువురు కాబోయే వధూవరులు, పెళ్లిళ్ల కుటుంబాలు విజయవాడ నగర పాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నమోదయ్యే కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయటంతో ఆయా ప్రాంతాలకు చెందిన 36 కుటుంబాలు ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి యత్నించినా అ«ధికారులు తమ గోడు పట్టించుకోకపోవటంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. అక్టోబర్ 10 వ తేదీ తర్వాతే రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్... అక్టోబర్‌లో ముహుర్తాలు ఉండటంతో వెబ్‌సైట్‌ను నిలుపదల చేయాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ముహుర్తాలతో పనిలేని క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ మతస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల మేరకు పెళ్లికి 15 రోజుల ముందు చంద్రన్న పెళ్లికానుక పథకానికి మీ సేవలో అర్జీ పెట్టుకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారి/కళ్యాణ మిత్రలు పెళ్లికి సంబంధించి వధూవరుల వయస్సు, ఆధార్ నంబర్, బ్యాంక్ ఎకౌంట్, పెళ్లికార్డు తదితర వివరాలతో ఫీల్డ్ వెరిఫికేషన్ సమర్పించిన తర్వాత పెళ్లిరోజు పెళ్లి కుమార్తెకు 20 శాతం, మిగిలిన సొమ్ము 80 శాతం బ్యాంక్ ఎకౌంట్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 15 రోజుల ముందు నమోదు చేసుకోవాల్సి ఉంటే వెబ్సైట్ నిలుపుదల చేయటంతో నమోదుకు సమస్య ఉత్పన్నమయ్యింది. అక్టోబర్ 10వతేదీ లోగా పెళ్లి చేసుకునే 36 కుటుంబాలకు పథకం వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు పరిశీలిస్తున్నాం చంద్రన్న పెళ్లికానుక వెబ్‌సైట్‌పై సమస్య వస్తుంది. ఇదంతా ఆన్లైన్ విధానం. మేం వెరిఫికేషన్ మాత్రమే చేస్తాం. మిగిలిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.ఎంవీవీ సత్యనారాయణ, యూసీడీ ప్రాజెక్ట్ అధికారి -
కానుక కానరాదే..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చంద్రన్న పెళ్లి కానుక పథకం జిల్లాలో కినుక వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడి వివాహాలు చేసుకున్న పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వందలాది మంది లబ్ధిదారులు చంద్రన్న పెళ్లి కానుకల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని నెలలు గడుస్తున్నా కానుకలు అందకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొందరు అవి వస్తాయా.. రావా అన్న సందేహంలో కొట్టిమిట్టాడుతుంటే.. మరికొందరు అవి వచ్చి చచ్చేవి కాదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువగా ఈ పథకంలో దరఖాస్తులు చేసుకుంది టీడీపీ కార్యకర్తల పిల్లలే కావడంతో, వారు విషయాన్ని బయటకు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పేద, మధ్యతరగతి వారి వివాహాలకు పెళ్లికానుకలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ పెళ్లి కానుకల కోసం మొత్తం 2,510 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 458 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మిగిలిన వారు కానుకల కోసం ఎదరుచూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ద్వారకాతిరుమల మండలంలో 348, ఏలూరులో 176, భీమవరంలో 102, పాలకొల్లులో 109, పెదవేగిలో 110 మంది ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆదిలోనే హంసపాదు చంద్రన్న పెళ్లి కానుక పేరుతో 2018 ఏప్రిల్ 20న ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం సామాజికవర్గాల వారీగా పెళ్లి కానుకలను అందించాలని నిర్ణయించింది. అయితే పాలకుల నిర్లక్ష్యం.. ఈ పథకానికి శాపంగా మారింది. దీంతో ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టైంది. చంద్రన్న పెళ్లి కానుక పథకంలో ఉన్న అనేక సమస్యలను లబ్ధిదారులు అధిగమించినా, చివరకు నగదు అందక డీలా పడుతున్నారు. కానుకల కోసం వెలుగు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పెళ్లి చేసుకునే నూతన వధూవరులు 15 రోజుల ముందే అధికారులకుసమాచారమిచ్చి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పథకం వర్తిస్తుంది. ఆ తరువాత బర్త్ సర్టిఫికెట్, తెల్లరేషన్ కార్డు, కుల సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. పెళ్లి జరిగే రోజున సంబంధిత కల్యాణ మిత్రలు వచ్చి, పెళ్లి లైవ్ (జియో ట్యాగింగ్) ఫొటో అప్లోడ్ చేస్తేనే కానుక అందుతుంది. అయితే అష్టకష్టాలు పడి, ఈ నిబంధనలన్నింటినీ దాటి ముందుకెళ్లినా కానుకలు అందక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. సామాజిక వర్గాన్ని బట్టి కానుక చంద్రన్న పెళ్లి కానుకను ఒక్కో సామాజికవర్గానికి ఒక్కోలా అందించాలని ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో ముస్లింలు, గిరిజనులు, మైనారిటీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ. 40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు అందిస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, బీసీలలో కులాంతర వివాహానికి రూ.50 వేలు, దివ్యాంగులకైతే రూ.లక్ష ఇస్తామన్నారు. వీటికి అనుగుణంగానే అన్ని సామాజికవర్గాల వారు ఈ కానుక కోసం దరఖాస్తులు చేసుకుని, నెలల తరబడి వేచిచూస్తున్నారు. దుల్హన్, గిరిపుత్రిక పథకాలు విలీనం గతంలో ముస్లిం మైనారిటీలకు, అలాగే గిరిజనులకు సంబంధించి దుల్హన్, గిరిపుత్రిక అనే రెండు పథకాలు ఉండేవి. ముస్లిం, మైనారిటీలు వివాహాలు చేసుకుంటే దుల్హన్ పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు. అలాగే గిరిజనుల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా గిరిపుత్రిక పథకంలో రూ.50 వేలు అందించేవారు. అయితే ప్రభుత్వం ఈ రెండు పథకాలకు చరమగీతం పాడి, వాటిని చంద్రన్న పెళ్లి కానుకలోకి విలీనం చేసింది. దీంతో ముస్లిం, మైనారిటీలు, గిరిజనులు సైతం చంద్రన్న పెళ్లి కానుకలను అందుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆధార్ మార్చకూడదట.. వివాహానంతరం భార్య తన ఆధార్ కార్డును భర్త అడ్రస్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే చంద్రన్న పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం నగదు అందిన తరువాతే ఆధార్ మార్పు చేసుకోవాలని వెలుగు సిబ్బంది చెబుతున్నారట. దీంతో అటు కానుక అందక, ఇటు రేషన్‌కార్డు పొందేందుకు వీలులేక నూతన వధూవరులు నానా పాట్లు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తే ఇవ్వరట..! నా పేరు బోడ కృష్ణ. మాది ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి. నా కుమార్తె వెంకటలక్ష్మిని, బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన మరపట్ల రాజేష్కిచ్చి ఈ ఏడాది మే 3న పెళ్లిచేశాం. ముందుగానే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాం. వివాహం జరిగి నాలుగు నెలలుపైగా గడిచినా ఇంత వరకు కానుక అందలేదు. అధికారులు అదిగో.. ఇదిగో అన్నారు. చివరకు నా అల్లుడు రాజేష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నందున కానుక ఇవ్వమంటున్నారు. – బోడ కృష్ణ, జి.కొత్తపల్లి, ద్వారకాతిరుమల మండలం -
చంద్రన్న పెళ్లి కానుక అడిగితే పెళ్లైందంటున్నారు!
సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్న ఆ నిరుపేద కుటుంబాలకు అధికారులు చుక్కలు చూపించారు. కానుక మాట అటుంచి వరుడికి ఇదివరకే పెళ్లయిందనే నిందను మోపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో నివసిస్తున్న బాల ఓబులేసు, నాగలక్షుమ్మ కుమారుడు ఓబులేసుకు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న రాజు, గుర్రమ్మల కుమార్తె రామాంజనమ్మను ఇచ్చి సెప్టెంబర్ 19న గండి క్షేత్రంలో వివాహం జరపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇరువురి కుటుంబీకులు స్థానిక ఇటుకల పరిశ్రమల్లో పనిచేస్తూ సమీపంలోనే నివసిస్తున్నారు. నిరుపేదలైన వీరు సీఎం చంద్రబాబు ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక కోసం ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఆన్లైన్లో వివరాల నమోదు సందర్భంగా ఓబులేసుకు ఇదివరకే వివాహం అయిందని సర్వే జాబితాలో ఉంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను సంప్రదించగా ప్రజాసాధికార సర్వేలో ఆ విధంగా నమోదైందని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం శుక్రవారం గ్రామదర్శినిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికాకుండానే పెళ్లి అయిందని ఎలా రాస్తారని అధికారులను ఓబులేసుతో పాటు బంధువులు ప్రశ్నించారు. అధికారులు మాత్రం ఇది తమ తప్పిదం కాదని బదులిచ్చారు. తప్పును సరిదిద్దితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటామని బాధితులు చెప్పగా రెండేళ్ల క్రితం జరిగిన ప్రజాసాధికార సర్వే సమయంలో ఉన్న సూపర్వైజర్ మాత్రమే దీనిని సరిచేసే అవకాశం ఉందని, తామేమి చేయలేమని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఎవరు సర్వే చేశారు అనే వివరాలు అధికారుల వద్ద లేవు. ఇదే విషయాన్ని 1100 ద్వారా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. -
చంద్రన్నా..ఇదేందన్నా..!
సాక్షి కడప: పేదల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి కానుక పేరుతో ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలు ఆచరణలో అమలు కావడంలేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పరిస్థితిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018 ఏప్రిల్ 20 నుంచి చంద్రన్న పెళ్లి కానుక పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసినా పాలకుల నిర్లక్ష్యం..ప్రభుత్వం అశ్రద్ధతో ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో..పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. చంద్రన్న పెళ్లి కానుక అందుకోవడానికి కూడా అనేక రకాల సమస్యలను అధిగమిస్తూనే ఫలితం కనిపించే అవకాశం ఉండగా.. అన్నీ దాటుకుని ముందుకు వచ్చినా ఇంతవరకు సొమ్ములు అందడం లేదు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక వర్గాల వారీగా కానుకను నిర్ణయించి ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. అయితే పేదలు ఉన్నంతలో పెళ్లి చేసుకుని..తర్వాత కానుక కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాప్రభుత్వంలో కనికరం కరువైంది. ఆరు నెలలుగా ఎదురుచూపులు 2018 ఏప్రిల్ 20వ తేదీన చంద్రన్న పెళ్లికానుక పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఏప్రిల్ 20 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో సుమారు 1,210 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివాహాలు ముగిసి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు కానుక అందలేదు.వివాహానికి ముందు 20 శాతం సొమ్ము ఇవ్వాల్సి ఉండగా 58 మందికి మాత్రమే అందించారు.1,210 మందిలో ఇప్పటివరకు కేవలం 30 మందికి మాత్రమే పూర్తి మొత్తం అందించగా, మరో 1,180 జంటలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సామాజిక వర్గాన్ని బట్టి కానుకల కేటాయింపు చంద్రన్న పెళ్లి కానుకలో సామాజిక వర్గాలకు అనుగుణంగా నిర్ణయించి మొత్తాలను ప్రకటించారు. గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు పెళ్లి కానుక కింద రూ. 50 వేలు, ఎస్సీలకైతే రూ. 40 వేలు, బీసీలకు రూ. 35 వేలు, ఓసీలకు రూ. 20 వేలు చొప్పున నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలలో కులాంతర వివాహమైతే రూ. 75 వేలు, బీసీలలో కులాంతర వివాహానికి రూ. 50 వేలు అందించనున్నారు. ఇక వికలాంగులకు సంబంధించి పెళ్లి కానుక కింద రూ. లక్ష అందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే అన్ని సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది నూతన వధూవరులు చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్నారు. దుల్హన్, గిరిపుత్రికకు మంగళం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముస్లిం మైనార్టీలతోపాటు గిరిజనులకు సంబంధించి ఉన్న రెండు పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముస్లిం మైనార్టీలు వివాహం చేసుకుంటే దుల్హన్ పథకం కింద రూ. 50వేలు అందించేవారు.గిరిజనులకు సంబంధించి ఎవరు పెళ్లి చేసుకున్నా సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకుంటే రూ. 50 వేలు అందించేవారు. అయితే దుల్హన్, గిరిపుత్రిక పథకాలకు మంగళం పాడి...చంద్రన్న పెళ్లి కానుకలోకే విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలు కూడా ఆన్లైన్ ద్వారా చంద్రన్న పెళ్లి కానుక పథకం కిందనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్యాణ మిత్రలు క్షేత్ర పరిశీలన పథకం అందడానికి నూతన వధూవరులకు అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్, తెల్లరేషన్‌కార్డు, కుల సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. వివాహానికి 15 రోజుల ముందే అధికారులకు తెలిపి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటేనే అవకాశం ఉంటుంది.లేకపోతే చంద్రన్న పెళ్లికానుక అందడం గగనం.పెళ్లి జరిగే రోజు స్థానికంగా ఎక్కడికక్కడ ఎంపిక చేసి కల్యాణ మిత్రలు వచ్చి పెళ్లి లైవ్ (జియో ట్యాగింగ్) ఫోటో అప్లోడ్ చేస్తేనే కానుక అందుతుంది. ఇలా అన్నిరకాల నిబంధనలు అధిగమించిన తర్వాత కూడా కానుక సొమ్ము రాలేదు.. ఆరు నెలలు గడుస్తున్నా రాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందని వివాహం చేసుకున్న కొత్త జంటలు ప్రశ్నిస్తున్నాయి. వివాహమైన పదిహేనురోజులు, నెలకో, రెండు నెలలకైనా వేసినా బాగుంటుంది గానీ ఇలా నెలల తరబడి తిప్పుకోవడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇదేమి పెళ్లి కానుక!
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లు ఆయా కుటుంబాల వారికి భారం కాకుండా ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఆదుకుంటామంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి పలు షరతులు, పరిమితులు విధిస్తూ ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. ఇంతకుముందు పెళ్లికుమార్తెకు తెల్లరేషన్ కార్డు ఉంటే పెళ్లికానుక వర్తింపజేసేవారు కాగా.. ఇప్పుడు వధూవరులిద్దరికీ తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే పెళ్లి కానుక వర్తిస్తుందని నిబంధన పెట్టడం ఇందుకు నిదర్శనం. దీంతో వధూవరుల్లో ఏ ఒక్కరికి తెల్ల కార్డు లేకపోయినా కానుక రాదన్నమాట. పెళ్లికానుకను పెళ్లికుమార్తె అకౌంట్‌కు జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇందుకోసం పెళ్లికి 15 రోజులు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీన్నిబట్టి పెళ్లయ్యాక పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం ఉండబోదు. అంతేకాదు.. పది రోజుల్లో పెళ్లి కుదుర్చుకుని లగ్నాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. నిబంధనల ప్రకారం 15రోజుల ముందు మాత్రమే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి పెళ్లి పత్రిక కూడా రెడీగా ఉండాలి. అప్పుడే ఈ కానుక వర్తిస్తుంది. దీనినిబట్టి పేద కుటుంబాలలోని వారికి ఆడపిల్లల పెళ్లి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టమవుతోంది. గతంలో ఎలా ఉండేది... గతంలో దుల్హన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు, గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజనులకు ఆర్థిక సాయం అందేది. వీరి పెళ్లికార్యానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందించేది. ఆ మేరకు గిరిజన వధువు, ముస్లిం వధువు అకౌంట్‌కు డబ్బులు జమయ్యేవి. పెళ్లికుమార్తెకు తెల్ల రేషన్‌కార్డు ఉంటే సరిపోయేది. పైగా పెళ్లికి నెలరోజుల ముందు నుంచి పెళ్లిరోజు వరకు కానీ, పెళ్లయిన రెండు నెలల వరకు ఎప్పుడైనా పెళ్లి కానుకకోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడిది రద్దయ్యింది. మూడు నెలలుగా ‘కానుక’ లేదు ఇదిలా ఉంటే.. పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకునేందుకు జ్ఞానభూమి వెబ్సైట్లో లింక్ ఇవ్వగా.. ఇది మూడు నెలలుగా పనిచేయట్లేదు. దీంతో మూడునెలలుగా పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే వీల్లేకపోయింది. ఫలితంగా ఐదువేల మంది ముస్లింలు పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయారు. ఇక గిరిజనుల్లో దాదాపు పదివేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఎస్సీ, బీసీల్లో సుమారు 25వేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయినట్లు అధికారులే చెబుతుండడం గమనార్హం. మరోవైపు వెబ్సైట్ లోపాల వల్ల దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ సుమారు 25వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెళ్లి కానుక అందలేదని సమాచారం. ఈ విధంగా పేదరికంలో ఉన్న ఆడపిల్లల పెళ్లికోసం ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పెళ్లి కానుక పథకం ప్రభుత్వం పెట్టిన తిరకాసులతో వారికి ఏమాత్రం అందకుండా పోతోంది. -
అందని ‘చంద్రన్న పెళ్లి కానుక’
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం. చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆర్థికంగా ఆసర కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. ఆర్భాటంగా ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం ప్రకటించి.. కానుకలివ్వకుండా సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చేసి వధూవరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో తొలిసారిగా నమోదైన పెళ్లికే కానుక అందని పరిస్థితి విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 18న చంద్రన్నపెళ్లి కానుక జీవో విడుదలైంది. నగరంలో ఏవీఎన్ కళాశాల సున్నపు వీధికి చెందిన రావులపూడి నందిని(ఎస్సీ)కి హరీష్(కాపు)నకు సింహాచలం పుష్కరిణి కల్యాణ మండపంలో అదే నెల 21న కులాంతర వివాహం జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు నందిని తల్లిదండ్రులు 1100కి ఫోన్ చేసి ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో తొలిసారి చంద్రన్న పెళ్లి కానుకకు అర్హులయ్యారని ప్రభుత్వం భారీగానే ప్రచారం చేసుకుంది. వీరిని లబ్ధిదారులుగా ప్రకటించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అధికార యంత్రాంగంతో పెళ్లికి హాజరయ్యారు. కులాంతర వివాహం.. అందులోనూ వధువు నుంచి గానీ, వరుడు నుంచి గానీ పిలుపు లేకుండానే అతిరథమహాశయులు వచ్చారని అంతా ఆశ్చర్యపోయారు. తాము చంద్రన్న పెళ్లి కానుక నేపథ్యంలో వచ్చామని చెప్పి వివాహ శుభాకాంక్షల పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చి ఆశీర్వదించారు. అయితే చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఈ దంపతులకు రూ. 75 వేల నగదు కానుక అందాల్సి ఉంది. వివాహ తంతు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి దంపతుల ఖాతాలో రూపాయి కూడా పడలేదు. దీంతో వధువు తల్లిదండ్రులు రవి, లలిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 1100 కి ఫోన్ చేస్తే వెలుగు ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళ్తే జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలని పంపేస్తున్నారు. అక్కడికి వెళితే సర్వర్ సమస్య చెబుతున్నారు. ఇలా అధికారులు తమను బంతాట ఆడుకుంటున్నారని రవి, లలిత ఆవేదన చెందుతున్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించే రవి భార్యతో కలిసి చంద్రన్న పెళ్లికానుక పత్రంతో ప్రదక్షిణలు చేస్తుండడం అందరికీ జాలి గొలుపుతోంది. -
కదలిక లేని కానుక!
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జం టలకు అండగా నిలుస్తాం అంటూ చంద్రన్న పెళ్లి కానుకకు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కారు సకాలంలో సాయం మాత్రం అందించలేకపోతోంది. పెళ్లి చేసుకుని ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జంటలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. పెళ్లికానుక మాత్రం వారికి ఇంకా చేరడం లేదు. బడుగు, బలహీన వర్గాల వారు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నా అధికార వర్గాల్లో స్పందన కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతా లకు టెస్టింగ్ కోసమంటూ ఒక రూపాయి జమ చేయడం విస్మయాన్ని గురిచేస్తోంది. ఒక్క రూపాయి మత్రమే జమైందని ఎవరైనా ప్రశ్నిస్తే, అకౌంటు సరిగా ఉందో లేదో చెక్ చేయడానికి జమ చేశామని అధికారులు చెబుతున్నారు. త్వరలో మొత్తం ఒకే సారి చెల్లిస్తామంటున్నారు.పథకం పేరు చెప్పడం, దాని గురించి రాత్రి పగలు ప్రచారం చేయడం, సమయం వచ్చే సరికి డబ్బులు ఇవ్వకపోవడం టీడీపీకి పరిపాటిగా మారిపోయింది. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ, వికలాంగులు కులాంతర వివా హాలు చేసుకొన్న జంటలకు ఈ పథకం కింద ఆర్థి క సాయం అందించాలి. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహమిత్రలను నియమించారు. పెళ్లి కుదిరిన 15 రోజుల ముందే చంద్రన్న పెళ్లికానుకకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటుగా 100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. జిల్లాలో కొందరు తమ వివరాలు అప్లోడ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వివాహమిత్రలు వెళ్లి వివారాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. వాటిని ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చుతారు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి ఈ కానుకలు పడకపోవడంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల మాత్రం లబ్ధిదారులకు నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని వారికి నచ్చజెప్పుతున్నారు. మూడు నెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలే దు. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమైం ది. దీంతో వారంతా విస్తుపోయారు. దరఖాస్తు చేసుకొన్న వారు... జిల్లాలో ఈ చంద్రన్న పెళ్లికానుక పథకానికి మూడు నెలల్లో 1857 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 1637 జంటలను మాత్రమే ఇప్పటి వరకు పరిశీలన పూర్తి చేసి అర్హులుగా గుర్తించారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందినవి 1291 జంటలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి 234, ఎస్టీకి చెందిన వారు 06 జంటలు, ముస్లింలు 1, దివ్యాంగులు 39 జం టలు ఉన్నాయి. కులాంతర వివాహాలు చేసుకొన్న వారు 56 జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో ఎస్సీ నుంచి ఇతర కులాల ఇంటర్ కులాల వివాహం చేసుకొన్న వారు 18, ఎస్టీ నుంచి ఇతర కులాల వివాహం చేసుకున్న వారు 6, బీసీల నుంచి ఇతర కులాలను వివాహం చేసుకొన్నవారు 32 జంటలు ఉన్నారు. అయితే వీటిలో ఇప్పటికీ వెరిఫికేషన్ కాని వారు 220 జంటలు ఉండగా, బ్యాంకు ఖాతాలు సరిపోనివి 350 జంటలు ఉన్నాయి. వీరికి ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉంది. చంద్రన్న పెళ్లికానుక ఇలా (కులాలవారీగా) ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం చేసుకొంటే రూ75వేలు. బీసీలు కులాంతర వివాహం చేసుకొంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలైతే రూ.50వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారైనా రూ.లక్ష వంతున అందజేస్తారు. 151 జంటలకు మాత్రమే చెల్లింపులు ఈ పథకం ద్వారా మూడు నెలల్లో ఇప్పటి వరకు కేవలం 151 మందికి కానుకలు చెల్లిం చారు. వాస్తవానికి పెళ్లిరోజునే వారి బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమకావాల్సింది. అయితే ప్రకటనకు, అమలుకి మధ్య సంబంధం లేకుండా పోతోంది. వివిధ కేటగీరీలకు చెందిన 151 జంటలకు గాను ఇప్పటివరకు చెల్లించా రు. అయితే మిగిలిన 1486 జంటలకు నగదు చెల్లించలేదు. వీరికి ఇంకా సుమారుగా రూ. ఏడు కోట్లు వరకు చెల్లించాల్సింది. ఇలా చేస్తామన్నారు.. పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాల్సిన మొత్తంలో 20 శాతం పెళ్లి నిశ్చయం అయిన రోజున, మిగిలిన 80 శాతం పెళ్లి రోజున కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఆందోళన అనవసరం పెళ్లికానుక నగదు మొత్తం జమవుతుంది. ఇప్పటికే సుమారుగా 151 జంటలకు చెల్లించాం, పంచాయతీ కార్యదర్శులు పెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో పెట్టడం ఆలస్యం అయినందు వల్ల జాప్యం జరుగుతోంది. కొన్ని బ్యాంకు ఖాతాలు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి. వీటిని సరిచేయాలని సూచించాం. టెస్టింగ్‌లో వివరాలు తీసుకొని, వారందరికీ నగదు జమ చేస్తాం. – జీసీ కిషోర్ కుమార్, డీఆర్డీఏ పీడీ -
పీటలెక్కని పెళ్లికానుక
నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం.. చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థికంగా ఆసరా కల్పిస్తామని చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. పెళ్లి చేసుకుని ప్ర«భుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెళ్లి కానుక మాత్రం వారికి ఇంకా చేరడం లేదు. బడుగు, బలహీన వర్గాలు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నా అధికారవర్గాల్లో స్పందన కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతాలకు టెస్టింగు కోసమంటూ ఒక రూపాయిజమ చేయడం వారిని విస్మయానికి గురి చేస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే జమయిందని ప్రశ్నిస్తే అకౌంటు సరిగా ఉందోలేదో చేక్ చేయడానికి జమ చేశామని అధికారులు తెలుపుతున్నారు. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తామంటున్నారు. చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక అందని ద్రాక్షలా తయారైంది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు సర్కారు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, కులాం తర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహ మిత్రలను నియమించారు. పెళ్లి కుది రిన 15 రోజుల ముందే చంద్రన్న పెళ్లి కానుకకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. కొందరు తమ వివరాలను అప్లోడ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 804 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 604 మాత్రం ఇప్పటికి పరిశీలన పూర్తి చేసి అర్హులుగా గుర్తించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 327, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 208, ఎస్టీలు 27, ముస్లింలు 30, వికలాంగులు 12 జంటలు ఉన్నారు. కులాంతర వివాహం చేసుకున్న 87 జంటల నుంచి దరఖాస్తులు అందాయి. అందించాల్సిన మొత్తాలు.... ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతేరూ.50వేలు, బీసీలైతే రూ.35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ముస్లిం జంటలకు రూ.15 లక్షలు, ఎస్టీ జంటలకు రూ.12.50 లక్షలు, బీసీ జంటలకు రూ.1.02 కోట్లు, ఎస్సీ జంటలకు రూ.62.80లక్షలు, వికలాంగ జంటల కు రూ.12లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.38.25 లక్షలు, ఎస్టీలకు రూ.1.50లక్షలు, బీసీలకు రూ.17 లక్షల మేరకు అందించాల్సి ఉంది. రూ.2.61 కోట్లు జమ చేయాల్సి ఉంది. మూడునెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలేదు. వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. అకౌంట్లోకే జమవుతాయనే సమాధానం వారికి వినిపిస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమైంది. దీంతో వారంతా విస్తుపోయారు. తీరా అధికారులను అడిగితే కంగారు పడకండి టెస్టింగ్ అని చెప్పారు. పెళ్లి కానుక మొత్తాలు జమవుతాయి చంద్రన్న పెళ్లికానుక మొత్తాలు ఈ వారంలోనే జమవుతా యి. ఖాతాకు ఒక్క రూపాయి టెస్టింగ్ కోసం జమచేశాం. ఇప్పటికి 375 ఖాతాలకు జమచేసి టెస్టింగ్ చేయగా 60ఖాతాలు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. తిరిగి వాటిని యాక్టివేషన్ చేసి ని ధులు జమచేస్తాం. యాక్టివ్‌గా ఉన్న ఖాతాల కు రెండు రోజుల్లో జమ చేయనున్నాం. – రవిప్రకాష్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
చంద్రన్న‘పెళ్లి’ కానుక.. ఒక్క రూపాయే!
సాధారణంగా ఏదైనా సంక్షేమ పథకానికి ప్రభుత్వం నిధులు విదల్చకపోతే ఎవరైనా ఏమంటారు.పైసా కూడా విదల్చలేదు.ఇదేమి ప్రభుత్వమంటారు. కానీ చంద్రన్న పెళ్లి కానుక విషయంలో మాత్రం ఆ విమర్శ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి జంట ఖాతాలో సొమ్ములు జమ చేశారు. కానీ చెప్పినట్టుగా అర్హతను బట్టి కాదు.. అందరికి ఒకేలా.. అదీ ఎంతో తెలుసా..అక్షరాల ఒక్క రూపాయి. నిజంగా నిజం.ఇదేమిటి ఒక్క రూపాయి జమ చేయడం ఏమిటని ప్రశ్నిస్తే అబ్బే అదేం లేదు అకౌంట్ సరిగా ఉందో లేదో చెక్ చేయడానికే వేశాం.. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తాం అంటూ నమ్మబలుకుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక ఆదిలోనే అబాసు పాలవుతోంది. పథకం ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లి కానుక జమ చేయని పరిస్థితి నెలకొంది. విచిత్రమేమిటంటే విమర్శించడానికి వీల్లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో రూపాయి చొప్పున జమ చేశారు. మిగిలిన సొమ్ముల కోసం ఎప్పుడుపడతాయో తెరపై వేచి చూడండి అని ఊరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినా.. చంద్రన్న పెళ్లి కానుక...రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న అమలులోకి తీసుకొచ్చిన పథకం. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహమిత్రలను నియమించారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తో పాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేసిన జంటల వివరాలను అప్లోడ్ చేశారు. వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికారిత సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడిచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 1323 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. బీసీ సామాజిక చెందానికి చెందిన 910, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 159, ఎస్టీలు 58, ముస్లీంలు ఏడుగురు, వికలాంగులు 29, ఇతరులు 12 మంది దరఖాస్తు చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న 29 మంది ఎస్సీ, 13 ఎస్టీ, 106 బీసీ జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో 1096 మందికి సంబంధించి పరిశీలన పూర్తి చేశారు. వీరిని అర్హులుగా గుర్తించి మంజూరుకు అప్లోడ్ చేశారు. కేటగిరీల వారీగా.. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏకులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ముస్లిం జంటలకు రూ.3.50లక్షలు, ఎస్టీ జంటలకు రూ.29లక్షలు బీసీ జంటలకు 3.19 కోట్లు,ఎస్సీ జంటలకు రూ.63.60లక్షలు, వికలాంగ జంటలకు రూ.29లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.21.75లక్షలు, ఎస్టీలకు రూ.9.75లక్షలు, బీసీలకు రూ.79.50 లక్షలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన జంటలకు రూ.2.40లక్షలు జమ కావాల్సి ఉంది. ఇలా మొత్తమ్మీద జిల్లాలో గడిచిన మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రూ.5.57 కోట్లు జమ చేయాలి. అప్లోడ్ చేసి దాదాపు మూడునెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లికానుక జమకాలేదు. దరఖాస్తు చేసుకున్న కొత్తజంటలు, వారి కుటుంబ సభ్యులు కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. మీ అకౌంట్లోకే నేరుగా సొమ్ములు జమవుతాయని చెబుతున్నారు. అర్హుల ఎంపిక విషయంలో వివాహ మిత్రలతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రూపాయే జమ నిజమే ఒక్క మన జిల్లాకే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెళ్లికానుకకు తొలి విడత సొమ్ములు విడుదల చేయలేదు. టెస్టింగ్ కోసం అందరి ఖాతాలకు ఒక్క రూపాయి చొప్పున జమ చేశారు. త్వరలోనే డబ్బులు రిలీజ్ కాగానే అందరి అకౌంట్‌కు పూర్తి స్థాయిలో కానుక జమ అవుతుంది. కానుక విషయంలో ఎవరికి ఎలాంటి మామూళ్లు ఇవ్వనసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే యాక్షన్ తీసుకుంటాం. –సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్డీఏ -
పెళ్లైనా అందని కానుక!
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక పథకం ప్రహసనంగా మారింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నుంచి వివాహం వరకు అనేక కొర్రీలు వేసే విధంగా ఈ పథకం రూపొందించారు. చివరకు పెళ్లి జరిగి మూడు నెలలైనా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్రోత్సాహక నగదు ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కర్నూలు(హాస్పిటల్): దుల్హన్ , గిరిపుత్రిక, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, కులాంతర వివాహాలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పెళ్లి చేసుకుంటే ఆయా శాఖల కింద ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. ఈ మేరకు 11 శాఖల్లో ఈ పెళ్లి తంతు నడిచేది. లబ్ధిదారులు అనేక పథకాల ద్వారా ఎక్కువ సార్లు ప్రోత్సాహకం అందుకుంటున్నారని అనుమానిస్తూ పెళ్లి కానుక అంతా ఒకే వేదిక(సింగిల్ డెస్క్)పై ఉండాలన్న ఉద్దేశంతో చంద్రన్న పెళ్లి కానుక తీసుకొచ్చారు. దీని బాధ్యతను 11 శాఖలను వదిలేసి డీఆర్డీఏ–వెలుగు శాఖకు అప్పగించారు. అందులో పనిచేసే అధికారులతో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు గ్రామాల్లో వెయ్యి మందికి పైగా కల్యాణ మిత్రలు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. కల్యాణ మిత్రలుగా స్వయం సహాయక సంఘాల(పొదుపు మహిళలు)ను ఎంపిక చేశారు. పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.40వేలు, బీసీలకు రూ.35వేలు, ఎస్టీలకు రూ.50వేలు, మైనార్టీలకు రూ.50 వేలు, వికలాంగులకు రూ.1లక్ష, ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు ప్రోత్సాహక నగదుగా అందజేస్తారు. లబ్ధిదారులకు సవాలక్ష ఆంక్షలు వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఉండాలి. వదువుకు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండాలి. ఆధార్‌కార్డు బ్యాంకుకు అనుసంధానమై ఉండాలి. వధువరులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అయి ఉండాలి. వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం చేయబడిన ప్రజాసాధికార సర్వే జాబితాలో నమోదై ఉండాలి. ఇప్పటి వరకు నమోదు కాకపోతే మీ సేవాలో, ప్రజాసాధికార వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి, వివాహం తేదీ, వివాహం వేదిక నిర్ణయించి ఉండాలి. వివాహం సైతం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరపాలి. నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ ఉండాలి. కార్మికులైతే ఏపీ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యత్వంతో పాటు గుర్తింపుకార్డు పొంది ఉండాలి. కల్యాణ మిత్రలచే విచారణ లబ్ధిదారులు వివాహానికి 15 రోజులు ముందు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ వివరాలు తెలుపుతూ కల్యాణ మిత్రలకు సమాచారం పంపిస్తారు. వధువు/వరుడు ఇంటికి వెళ్లి కళ్యాణ మిత్రలు వివరాలు సేకరించాలి. క్షేత్రస్థాయిలో వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని కల్యాణ మిత్ర ధ్రువీకరించిన తర్వాత వారి వివరాలు వివాహ అధికారి లాగిన్లోకి వెళతాయి. ఏపీ నిర్బంధ వివాహ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వివరాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత అధికారి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత వివాహం రోజున కల్యాణ మిత్రలు వెళ్లి వివరాలు సేకరించి, పెళ్లిఫోటోలు అప్లోడ్ చేయాలి. పెళ్లి రోజున వధువు బ్యాంకు ఖాతాలో 20 శాతం, పెళ్లి రిజిస్టర్ అయిన వెంటనే మిగిలిన 80 శాతం నగదును ఖాతాలో వేస్తారు. ఒక్కరి ఖాతాలోనూ నగదు వేయలేదు జిల్లాలో చంద్రన్న పెళ్లి కానుక కింద ఇప్పటి వరకు 1600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే 543 జంటలు ఒక్కటయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఒక్క రూపాయి నగదు వారి ఖాతాల్లో ప్రభుత్వం వేయలేదు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ ఏ ఒక్కరికి కూడా నగదు వేయలేదని సమాచారం. దీనికితోడు కల్యాణ మిత్రల్లో చాలా మందికి ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు నిర్వహించే పరిజ్ఞానం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్లో వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేయడం, లాగిన్ కావడం వంటి అంశాలు సరిగ్గా రాక వారు సతమతమవుతున్నారు. -
అందని చంద్రన్న పెళ్లికానుక
లక్కవరపుకోట : సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెడుతుందే తప్ప ఆచరణలో మాత్రం విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో 114 పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో చాలా పథకాల పేర్లు అటు అధికారులకు గాని ఇటు పాలకులకు గాని తెలియవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల్లో కనీసం 20 శాతం కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు అర్హులకు అందని ద్రాక్షగా మిగులుతోంది. ఈ సరసన ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ‘చంద్రన్న పెళ్లికానుక’ చేరింది. చంద్రబాబునాయుడు ఇప్పటివరకు తన బూటకపు హామీలతో కర్షక, కార్మిక, ఉద్యోగస్తులు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇప్పుడు నవ వధువులను సైతం మోసం చేసేందుకు సిద్ధపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న యువతుల కుటుంబాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం నిర్వహణకు బడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఎంతో ప్రచార ఆర్భాటలతో తీసుకొచ్చిన ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీనికి తోడు ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెనకడుగువేస్తున్నారు. 1193 దరఖాస్తులు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో గల 34 మండలాల నుంచి 1193 మంది వధువులు దరఖాస్తు చేసుకున్నారు. గరివిడి మండలం నుంచి అత్యధికంగా 56 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రోత్సాహకంలో 20 శాతం సొమ్మును ముందుగా వధువు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని.. మిగిలిన మొత్తాని పెళ్లి అయిన తర్వాత అన్ని ధ్రువపత్రాలు సమర్పిస్తే బ్యాంక్ ఖాతకు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఇంతవరకు లబ్ధిదారులెవ్వరికీ ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. దీంతో పథకం అమలు తీరుపై నూతన వధూవరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంగు ఆర్భాటాలే... ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ముఖ్య లక్ష్యం.. వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో బాల్యవివాహాలను నిరోధిచడం. ఆయా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లుల్లు భారం కాకూడదనే ఉద్దేశంతో పాటు పెళ్లైన వారు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ. 75వేలు.. తమ కులంలోనే వివాహ చేసుకునే ఎస్సీలకు రూ. 40వేలు, ఎస్టీలకు రూ. 50 వేలు అందిస్తామని పథకంలో పేర్కొన్నారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకునే బీసీలకు రూ. 50 వేలు..తమ కులస్తులనే వివాహం చేసుకుంటే రూ. 35 వేలు అందజేస్తారు. దుల్హన్ పథకం కింద మైనారిటీలకు రూ. 50 వేలు, దివ్యాంగులకు రూ. లక్ష, ఓసీలకు రూ. 20 వేలు చొప్పున అందజేస్తారు. అవగాహన కరువు చంద్రన్న పెళ్లికానుక పథకంపై గ్రామీణులకు అవగాహన కరువైంది. అబ్బాయికి 21 సంవత్సరాలు.. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే వరుడికి తొలివివాహం, వధువుకి రెండో వివాహం (వితంతువు) అయినా ఈ పథకానికి అర్హులే. ముఖ్యంగా రెండో సంబంధం మహిళకు తొలి సంబంధం వరుడు లభించాలని నిబంధన విధించారు. ఇది సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వివాహం చేసుకునే ఇరుకుటుంబాలు తెలుపు రేషన్‌కార్డు కలిగి ఉండి, ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. అలాగే ఇరువురూ ఒకే రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వివాహానికి 15 రోజుల ముందు మీసేవా కేంద్రాల్లో గాని మండల సమైక్య ద్వారా గాని 1100 కాల్ సెంటర్లో గాని పేర్లు నమోదు చేసుకోవాలి. పైసా రాలేదు.. నాకు మే రెండో తేదీన వివాహం జరిగింది. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. అధికారులు ఒక అభినందన పత్రం మాత్రమే ఇచ్చారు. అధికారులను అడిగితే ఇదుగో వస్తాయి.. అదుగో వస్తాయని చెబుతున్నారు. – నెక్కల దీపిక, మార్లాపల్లి గ్రామం,లక్కవరపుకోట మండలం ఆన్లైన్ చేసాం మాకు వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో పొందుపరిచాం. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమవుతుంది. అలాగే ఈ పథకంపై గ్రామాల్లో చంద్రన్న పెళ్లికానుక మిత్రల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – రొంగళి శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, లక్కవరపుకోట మండలం. -
చంద్రన్న.. పెళ్లికానుక ఏదన్నా..?
ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ చాలా పథకాలకు టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత మంగళం పాడేసింది. హామీలు గుప్పించి అమలు చేయకుండా ప్రజలను మోసగించిన పథకాల్లో చంద్రన్న పెళ్లికానుక ఒకటి. పథకం లబ్ధిని ఆశించిన అర్హులు నిరాశ చెందుతున్నారు. ప్రకటనలు చూసి మోసపోయామని నిట్టూరుస్తున్నారు. పాకాల : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లకు ఎరవేసేందుకు గత ఏడాది అక్టోబర్‌లో చంద్రబాబునాయుడు ఆర్భాటంగా చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయా వర్గాల్లో కుటుంబంలోని యువతుల వివాహానికి నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. అయితే పదవీ కాలం దాదాపుగా పూర్తి కావస్తున్నా నేటికీ ఆ పథకం జాడ కనపించడం లేదని అర్హులు వాపోతున్నారు. పథకం వివరాలు... చంద్రన్న పెళ్లికానుక పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. తగిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనారిటీలకు రూ.30 వేలు పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ పథకం గురించి తెలుసుకున్న పెళ్లి చేసుకునే యువతీ యువకులు దరఖాస్తు అందజేసేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విధివిధానాలు రూపొందించకపోవడంతో దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోవాలో తెలియక, దరఖాస్తుదారులకు ఏ చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెళ్లి ముహూర్తాల జోరు.. ఈనెలలో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు చేసి ఉంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉండేదని అర్హులు అంటున్నారు. పథకాన్ని ప్రవేశ పెట్టిన తరువాత అమలు చేయకుండా ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాగా ఈ పథకానికి కూడా గ్రహణం పట్టిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాల్లేవ్.. చంద్రన్న పెళ్లికానుక పథకానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అందిన వెంటనే ప్రచారం నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు మండలంలో ఇద్దరు కల్యాణమిత్రలను ఏర్పాటు చేశాం, వారికి శిక్షణ కూడా ఇచ్చాం. -
బడ్జెట్లో కంటే ఎక్కువే ఖర్చు చేశాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అదనంగా మరో 36 కొత్త పథకాలను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక, ఆదరణ పథకం, నిరుద్యోగ భృతి, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి కొత్త పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. 2018-19 బడ్జెట్ గురించి మంగళవారం యనమల శాసనమండలిలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత మూడేళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. బడ్జెట్ పెద్దదైనా ఖర్చుచేయడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విమర్శలు చేసేముందు బడ్జెట్లో కేటాయింపులు, జరిగిన ఖర్చులు గమనించాలన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుందని కాగ్ చెప్పింది. రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.4వేలకోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం. రైతులకు, మహిళలకు రుణమాఫీ చేస్తే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడంతో మన రాష్ట్రానికి అప్పులు ఎక్కువచ్చాయి. విభజనకు ముందు చేసిన అప్పుకు రూ.10వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. భారతదేశంలోని రాష్ట్రాలన్నీ 9శాతం వడ్డీకి అప్పు తెస్తే మన రాష్ట్రం 7.9కే అప్పు తెస్తోంది. 2018-19 లో రైతులకు, మహిళలకు చెల్లించాల్సిన అప్పును మొత్తం తీరుస్తాం..నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది’ అని తెలిపారు. -
చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతి కానుకగా ఇస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి బయటపడింది. కానుకల పేరుతో రేషన్ కార్డుదారులకు రేషన్ డీలర్లు నాశిరకం, నీరుగారిన బెల్లం పంపిణీ చేస్తున్నారు. కిలో రూ. 48 చొప్పున 70 లక్షల కిలోల బెల్లాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏపీలో కిలో బెల్లం రూ.37కు దొరుకుతున్న రేషన్ షాపుల్లో కిలో రూ. 48 చెల్లించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ ధర చెల్లించినా నాశిరకపు వస్తువు పంపిణీ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండి నెయ్యి కూడా దుర్వాసన వస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు. అదేవిదంగా కురుపాం మండలం శివన్నపేటలో చంద్రన్న కానుకల్లో పంపిణీ చేసిన బెల్లం లో పురుగులు.. నీరుగారిన బెల్లం... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. -
నాసిరకం ‘కానుకలు’
కర్నూలు (అగ్రికల్చర్): చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు నాసిరకంగా ఉన్నాయి. ఏ మాత్రమూ నాణ్యత లేనివి పంపిణీ చేసి రూ.కోట్లు కొల్లగొట్టడానికి టీడీపీ మద్దతుదారులైన సరఫరాదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో కమీషన్ల పర్వం కూడా జోరుగా నడుస్తోంది. నాణ్యత లేని వీటిని తాము రేషన్‌కార్డుదారులకు ఇవ్వలేమని అధికారులే కుండబద్దలు కొడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకొని కార్డుదారులందరికీ చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు 27,847 ఉన్నాయి. వీటి పరిధిలో 1,38,88,547 రేషన్ కార్డులు ఉన్నాయి. వివిధ జిల్లాలకు వచ్చిన గోధుమ పిండి, నెయ్యిలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. వాటిని తిరస్కరించడం కలకలం రేపుతోంది. గుజరాత్ నుంచి గోధుమ పిండి.. నాణ్యత లేని గోధుమ పిండి కర్నూలు జిల్లాతోపాటు కోస్తా జిల్లాలకు చేరింది. కర్నూలు జిల్లాకు 963 టన్నుల గోధుమ పిండి ప్యాకెట్లు మంగళవారం వచ్చాయి. కాసుల కక్కుర్తితో గుజరాత్ నుంచి నాసిరకం గోధుమ పిండిని దిగుమతి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ తేదీ నుంచి వ్యాలిడిటీ మూడు నెలలు ఉండాలి. కానీ కొన్ని ప్యాకెట్లపైన వ్యాలిడిటీ 2 నెలలు ఉండగా, కొన్నిటికి తయారీ తేదీ, వ్యాలిడిటీ డేట్ లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోవడం, నాసిరకంగా ఉండటంతో మొత్తం ప్యాకెట్లను అధికారులు వెనక్కి పంపారు. కోస్తా జిల్లాల్లో కూడా తిప్పిపంపినట్టు సమాచారం. కంపుకొడుతున్న నెయ్యి.. కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలకు సరఫరా చేసిన నెయ్యి కంపు కొడుతోంది. కర్నూలు జిల్లాకు 6.13 లక్షల ప్యాకెట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ నాణ్యతతో లేదని అధికారులే నిర్ధారించారు. నెయ్యి ప్యాకెట్లను వాపసు తీసుకొని.. తిరిగి మంచివి ఇవ్వాలని కోరారు. అయితే.. అధికారులు మాత్రం ఆవు నెయ్యి వచ్చింది.. అందువల్లే తిరస్కరించామని బయటికి చెబుతున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా బెల్లం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అర కిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇస్తున్నారు. ఇది బంకలా సాగుతోంది. అది కూడా నల్లగా సారాయి బెల్లాన్ని తలపిస్తోంది. శనగ, కందిపప్పుల్లోనూ కల్తీ స్పష్టంగా కనిపిస్తోంది. నాసిరకం సరుకులనే పంచాలి! చంద్రన్న కానుకల పేరుతో జిల్లాకు వచ్చిన సరుకులనే పంచాలని, వాటి స్థానంలో వేరేవి ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్వాకంతో పండగ పూట కార్డుదారుల నుంచి తాము తిట్లు తినాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న కానుకల సరఫరా బాధ్యతను అధికార పార్టీ నేతలు తీసుకున్నట్లు సమాచారం. ‘మేం పంపిన వాటినే తిరస్కరిస్తారా? అక్కడ మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం’ అని అధికారులను బెదిరిస్తున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా కార్డుదారులకు ఏడు రకాల సరుకులను పంపిణీ చేస్తున్నారు. 500 గ్రాముల బెల్లం, కిలో చొప్పున కందిపప్పు, శనగపçప్పు, గోధుమ పిండి, 500 ఎం.ఎల్ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్, 100 ఎం.ఎల్ నెయ్యి ఇవ్వాల్సి ఉంది. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనేది లక్ష్యం క్రిస్మస్, సంక్రాంతి కానుకలను నాణ్యమైనవి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన గోధుమ పిండి, నెయ్యి తిరస్కరించాం. జిల్లాకు ఆవు నెయ్యి వచ్చింది. గోధుమ పిండి ప్యాకెట్లపై వ్యాలిడిటీ డేట్ లేదు. కొన్నిటికి ఉన్నా తక్కువగా ఉంది. వ్యాలిడిటీ 3 నెలలు ఉండాలి. గోధుమపిండి ప్యాకెట్లను తిరస్కరించాం. బెల్లం, ఇతర సరుకుల నాణ్యత బాగానే ఉంది. – ప్రసన్న వెంకటేశ్, జేసీ, కర్నూలు -
సంక్రాంతి సరుకుల టెండర్లలో గోల్మాల్
-
పెద్దలకే ‘చంద్రన్న కానుక’!
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు పేదల చేతుల్లో పప్పు, బెల్లాలు పెడుతూ పెద్దలు మాత్రం కోట్లు నొక్కేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయనున్న ‘చంద్రన్న కానుక’ టెండర్ల దశలోనే గోల్మాల్ జరిగింది. తమ జేబులు నింపుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు నిబంధనలనే మార్చేశారు. చిన్న వ్యాపారులు టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసేశారు. భారీగా ముడుపులు ఇచ్చేవారికి అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. గతంలో 5 నుంచి 10% కమీషన్లతో హోల్‌సేల్ వ్యాపారులకు ఈ కాంట్రాక్టులు కట్టబెట్టేవారు. ఆ కమీషన్ సరిపోక ఈసారి చిన్న ట్రేడర్స్‌ను తప్పించి బడా పారిశ్రామికవేత్తలకు టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారు. అది చాలదన్నట్లు మార్కెట్ రేటు కంటే అధికంగా కోట్ చేయించి మరీ వారికి కాంట్రాక్టులు అప్పజెబుతున్నారు. తద్వారా రూ.80 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ చేస్తున్నారని పౌరసరఫరాల శాఖలో వినిపిస్తోంది. ఇదీ స్కీమ్.. చంద్రన్న కానుక పేరిట రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల తెల్ల రేషన్ కార్డులున్న పేదలకు కొన్ని వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక్కో లబ్ధిదారుడికి అర కిలో బెల్లం, అర కిలో శెనగపప్పు, కిలో గోధుమపిండి, అర లీటర్ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం 7,115 మెట్రిక్ టన్నుల శనగపప్పు, 7,115 మెట్రిక్ టన్నుల బెల్లం, 14,230 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 7,115 కిలో లీటర్ల పామాయిల్, 1,432 కిలో లీటర్ల నెయ్యి అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విధించి ఆ మేరకు సరఫరా చేయాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. నిబంధనలు మార్చి బడా సంస్థలకు రెడ్‌కార్పెట్ గతేడాది రూ.ఐదు కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారికి బెల్లం, రూ.10 కోట్ల టర్నోవర్ చేసే ట్రేడర్స్‌కు ఇతర సరుకుల టెండర్లను ఖరారు చేసేవారు. కానీ ఈ ఏడాది ఆ ట్రేడర్స్‌ను కాదని మొత్తం టెండర్లన్నీ బడాబాబులకు కట్టబెట్టారు. ఈసారి రూ.50 కోట్ల టర్నోవర్ చేసే సంస్థ నెయ్యి, రూ.30 కోట్ల టర్నోవర్ చేసే సంస్థలు మాత్రమే సరుకుల టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొంటూ టెండర్ షెడ్యూల్లో మార్పులు చేశారు. అలాగే తమ వద్ద ఉన్న శెనగలు, కందులను మిల్లింగ్ చేయడం ద్వారా 100 కిలోలకు 64 కిలోల చొప్పున మిల్లింగ్‌కు ఇచ్చేందుకు వీలుగా టెండర్ పిలిచారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఈ నెల 11వ తేదీన పిలిచిన ఈ టెండర్లన్నీ దాదాపు ఖరారయ్యాయని, భారీగా ముడుపులు ఇచ్చే బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని తెలిసింది. కందులు, శెనగలు వంద కిలోలు మిల్లింగ్ చేస్తే 75 కేజీల వరకు వస్తాయి. కానీ 64 కిలోలు ఇస్తే సరిపోతుందని టెండర్లో వెసులుబాటు ఇవ్వడం వెనుక కూడా భారీగానే ముడుపులు చేతులు మారాయని సమాచారం. ఇతర సరుకుల విషయంలో కూడా బహిరంగ మార్కెట్ కన్నా అధిక ధరకు టెండర్లు పిలవడం ద్వారా భారీగా ముడుపులు తీసుకున్నారని తెలుస్తోంది. అన్ని టెండర్లు రాష్ట్రేతర సంస్థలకే... రూ.30 కోట్ల నుంచి రూ.50కోట్ల టర్నోవర్ చేసేవారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా మార్పులు చేయడంతో రాష్ట్ర పరిధిలోని ట్రేడర్స్ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు టెండర్లన్నీ హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన ఇండస్ట్రీస్ దక్కించుకున్నాయి. నెయ్యి కిలో రూ.450లకు కోట్ చేసిన కోసం గుజరాత్‌కు చెందిన ఎస్డీపీ ఇండస్ట్రీస్‌కు, గోధుమ పిండి రూ.38.50కు కోట్ చేసిన హైదరాబాద్‌కు చెందిన క్లారియన్ ఆగ్రోకు, బెల్లం టెండర్‌ను రూ.49లకు కోట్ చేసిన గుజరాత్‌కు చెందిన మిలాప్ ఎంటర్‌ప్రై జెస్ దక్కించుకోగా, కందులు, శెనగలు మిల్లింగ్ ఆడించే టెండర్ మహారాష్ట్రకు చెందిన సోనూమోనో కంపెనీకి కట్టబెట్టారు. ఇక పామాయిల్ సరఫరా కిలో రూ.69ల చొప్పున కోట్ చేసిన కాకినాడకు చెందిన సంతోషీమాత ఆయిల్స్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్స్ దక్కించుకున్నాయి. పామాయిల్ ధర మార్కెట్లో రూ.61లు ఉండగా... టెండర్‌ను రూ.69లకు కట్టబెట్టారు. ఆ తర్వాత 20 శాతం డ్యూటీ పెరిగిందన్న సాకుతో మరో రూ.7లు పెంచాలని టెండర్ దక్కించుకున్న సంతోషిమాత, బాలాజీ గ్రౌండ్‌నట్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరోవైపు జ్యూట్ సంచులను కూడా మహారాష్ట్ర, హైదరాబాద్ కంపెనీలకే ఖరారు చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ సరుకుల రేట్లను బట్టి చూస్తే రూ.370 కోట్లకే వచ్చే ఈ సరుకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా రూ.450 కోట్లను ఖర్చు చేస్తోంది. గతేడాది ఇదే సరుకులను సుమారు 360 కోట్లకే టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. కానీ ఈసారి ఏకంగా రూ.450 కోట్లకు టెండర్లు ఖరారు చేయనుండడంతో రూ.80 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సొమ్ములు సరిపోవంటూ ఎప్పటిలాగే 10 శాతం కమీషన్ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలియవచ్చింది. కమీషన్ విషయం కొలిక్కి వస్తే రెండు మూడు రోజుల్లో వర్క్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి బెల్లం వ్యాపారులకు అన్యాయం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. అనకాపల్లి బెల్లం వ్యాపారులు గత ఏడాది టెండర్లలో పాల్గొని బెల్లంసరఫరా చేశారు. దీనివల్ల విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చెరుకు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యాపారులు, కూలీలు కూడా కొంతవరకు ప్రయోజనం పొందారు. ఈ ఏడాది రూ.30 కోట్లకు పైబడి టర్నోవర్ ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులని నిబంధన విధించారు. అంటే ఒక్కసారిగా ఆరు రెట్లు పెంచేశారన్నమాట. అధిక టర్నోవర్ నిబంధన తొలగించి తమకు న్యాయం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అనకాపల్లి వ్యాపారులు విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకపోయింది. మహారాష్ట్ర మిల్లర్‌తో ముందస్తు ఒప్పందం టెండర్ మీకు దక్కేలా చూస్తాం...సరుకు రవాణాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి...ఇలా ఒక కాంట్రాక్టర్‌కు నేరుగా సీఎంఓలో పని చేసే ఒక అధికారి హామీ ఇచ్చి దానిని నెరవేర్చడం పౌరసరఫరాల సంస్థలో చర్చనీయాంశంగా మారింది. చంద్రన్న కానుక సరుకులలో భాగమైన కందిపప్పు సరఫరాకు సంబంధించిన టెండర్‌ను మహారాష్ట్రకు చెందిన ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ఇలా టెండర్ పూర్తయిందో లేదో ఆ కాంట్రాక్టర్ అలా రేషన్ షాపులకు చకచకా కందిపప్పును సరఫరా చేసేశారు. అధికారుల నుంచి ముందుగా సమాచారం ఉండడం వల్లే ఆ కాంట్రాక్టర్ అంత వేగంగా కందిపప్పును సరఫరా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణల్లో వాస్తవం లేదు: పౌరసరఫరాల ఎండీ చంద్రన్న కానుక సరుకుల సరఫరాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాంగోపాల్ తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. టెండర్లలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియమనిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. -
చంద్రబాబుకు ఆ భయం పట్టుకుంది: రోజా
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ షాపులను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానో...లేదో అనే భయంతోనే 21 పథకాలకు చందన్న పేరు పెట్టించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఆహార భద్రత కల్పించేందుకే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చౌక దుకాణాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పేదలపై ప్రేమతో నాడు ఎన్టీ రామారావు రూ.2 కిలో బియ్యం ఇచ్చారని, చంద్ర బాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు, నోట్ల కట్టలకు పుట్టిన బిడ్డగా ఈ ప్రభుత్వ పాలన ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో పేదల పొట్టి కొట్టి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటును ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, సామాన్యులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందడం లేదని రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సీఎం పదవి అడ్డుపెట్టుకొని.. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారుల పొట్టి కొట్టేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మార్చారని రోజా మండిపడ్డారు. ఈ మాల్స్ స్వయంగా చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉన్న ఫ్యూచర్ గ్రూప్‌కు, వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్న రిలయన్స్ గ్రూప్‌లకు కట్టబెట్టారన్నారు. దీని అర్థం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మాల్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని నిలదీశారు. రేషన్‌షాపులో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, వాటన్నింటిని రద్దు చేసి, తీరా తన దోపిడీని విస్తరింపజేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. 5 నుంచి 35 శాతం తగ్గించి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఈ రోజు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన సంస్థకు లాభాలు లేకుండా పేదలకు ఎందుకు చౌకగా ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో రిలయన్స్, ఫ్యూచర్ సంస్థలు వంద నుంచి 200 శాతం ప్రజల నుంచి గుంజుకున్నదన్నారు. రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్‌షాపుల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు ఇస్తే పేదలకు లాభం ఉంటుందని, చంద్రన్న మాల్స్ పేరుతో వేల కోట్లు దండుకోవాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. మీకు పేదలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గింవచ్చు అన్నారు. పేదవాళ్లు ఏమైతే నాకేంటి అన్నట్లుగా చంద్రబాబు తాను, తన కొడుకు బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బాబు తన సీఎం పదవిని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారన్నారు. 21 పథకాలకు చంద్రన్న పేర్లు చంద్రబాబును భవిష్యత్తులో మరిచిపోతారన్న భయం ఉందని, అందుకే ఈ నాలుగేళ్లలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి ఖర్జురపు నాయుడు వాటా తీసుకొని వచ్చి ఇస్తున్నారా అని నిలదీశారు. అంతగా పేర్లు పెట్టుకోవాలంటే ప్రజలకు మేలు చేసిన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెట్టుకోవాలి కానీ, ఇలా తన పేరు పెట్టుకోవడం ఎక్కడ చూడలేదన్నారు. భవిష్యత్తులో చంద్రబాబును పట్టించుకోరనే భయంతో ఇప్పుడే తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చంద్రన్న కానుకలో నెయ్యి ఇస్తామన్నారు. ఆ నెయ్యిని హెరిటేజ్ కంపెనీ నుంచి తెప్పించారన్నారు. చంద్రన్న చలివేంద్రాలకు హెరిటేజ్ నుంచి పెరుగు తెప్పించారన్నారు. భవిష్యత్తులో దోచుకోవడానికి అవకాశం ఉంటుందో? లేదో అన్న భయంతో చౌకదుకాణాలను రిలయన్స్ సంస్థకు ఇచ్చి దోచుకునే కుట్ర చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ కార్పోరేట్ దోపిడీకి పుల్ స్టాఫ్పెట్టాలని, ప్రభుత్వమే గతంలో మాదిరిగా 10 రకాల సరుకులు రేషన్‌షాపుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని రోజా హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు రాజకీయ అవగాహన లేని లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని చేశారో అప్పటి నుంచి ప్రతిది సూట్‌కేసు గురించే చంద్రబాబు పని చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడం లేదని రోజా విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. పోలవరంలో అవినీతి నెలకొందని, పట్టిసీమలో రూ.350 కోట్లు దోచుకున్నారని కాగ్ రిపోర్టు ఇచ్చిందన్నారు. బొగ్గు, మట్టి, మద్యం, ఇసుక వ్యాపారాలతో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచిన నీకు ప్రజలను మోసం చేయడం ఓ లేక్కా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్న పేరు పెట్టి పేదలకు నీరు ఇవ్వలేకపోయావంటే మీ మామపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలిసి పోయిందన్నారు. నీ లొసుగులన్ని బయట పెట్టి ప్రజల చేత తరిమికొట్టిస్తామని రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ప్రభుత్వ పెద్దలకే ‘కానుక’
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు పేదల చేతుల్లో పప్పు, బెల్లాలు పెడుతూ తాము మాత్రం రూ.కోట్లు నొక్కేస్తున్నారు. ప్రభుత్వ పెద్ద లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నా అడిగేవారే లేకుండా పోయారు. చంద్రన్న కానుక పేరిట సంక్రాంతి పండుగకు ప్రభుత్వం రెండేళ్లుగా 5 రకాల సరుకులను రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులున్న 1.40 కోట్ల కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలి సిందే. నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు టెండర్లను పిలుస్తున్నారు. వాస్తవానికి అధికారుల చలవతో ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే ఈ టెండర్లు దక్కు తున్నాయి. వారు నాసిరకం సరుకులు సర ఫరా చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అన్ని సరుకుల ధరలకు రెక్కలు వచ్చే సంక్రాంతి పండుగకు తెల్లరేషన్ కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో గోధుమ పిండి, అర కిలో చొప్పున పామాయిల్, బెల్లం, శనగపప్పు, కందిపప్పతోపాటు 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్ రూపంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా 10,330 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 7,115 మెట్రిక్ టన్నుల చొప్పున బెల్లం, శనగపప్పు, కంది పప్పు, 7,115 కిలో లీటర్ల పామాయిల్, 1,432 కిలో లీటర్ల నెయ్యి సరఫరా చేసేం దుకు టెండర్లు ఆహ్వానించారు. చంద్రన్న కానుక కోసం నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ సేకరించిన కందులను ఒక టన్ను రూ.5,050 ప్రకారం 12 వేల టన్నులను పౌరసరఫరాల సంస్థ కొనుగో లు చేసింది. కందులను మర ఆడించి కంది పప్పును సరఫరా చేసేందుకు తొలుత టెండర్లను పిలిచారు. రైతులు పండించిన కందిపప్పును మిల్లుకు తీసుకెళ్తే వస్తు మార్పిడి కింద 100 కిలోల కందులకు 74 కిలోల కందిపప్పు ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే టెండర్ దక్కేలా నిబంధనల్లో మార్పు చేయడం తోపాటు వారికి లబ్ధి చేకూర్చేందుకు 100 కిలోల కందులకు 64 కిలోల కందిపప్పు ఇస్తే చాలంటూ టెండర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నాగపూర్‌కు చెందిన ఒక మిల్లర్‌కు టెండర్ దక్కింది. బహిరంగ మార్కెట్లో రిటైల్‌గా కిలో కంది పప్పు ధర రూ.50 నుంచి రూ.55 వరకు ఉంది. కిలో రూ.80 చొప్పున సరఫరా చేసేలా టెండర్ కట్టబెట్టారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ఇలా అన్ని సరుకుల ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు రూ.60 కోట్లు మింగేసే అవకాశం ఉందని సమాచారం. -
బూజు పట్టిన చంద్రన్న కానుకలు
-
వసతి గృహాలకు చంద్రన్న సరుకులు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని కేజీబీవీ విద్యాలయాల్లో విద్యార్థినులు కొద్ది నెలల కిందట అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. నాసిరకం సరుకులు సరఫరా చేయడం.. వాటిని వండి వడ్డించడం వల్లే ఇలా జరిగిందంటూ జిల్లాలోని సంక్షేమ శాఖలన్నింటినీ సమావేశపరచి రాష్ట్ర మంత్రి మృణాళిని, కలెక్టర్ వివేక్‌యాదవ్‌లు పలువురికి మెమోలు జారీ చేశారు. శాంపిళ్లు తీయించి మరీ హెచ్చరించారు. ఇది కేవలం కాంట్రాక్టర్ తప్పిదం కనుక. మరి చంద్రన్న సంక్రాంతి సరుకుల్లో నాణ్యత లేదని సాక్షాత్తూ ఆ శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. డిసెంబర్లో వివిధ కాంట్రాక్టుదారుల నుంచి పంపించిన సరుకులు అప్పటికే నాణ్యత బాగాలేదన్నారు. ఇప్పుడు అవే సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో పంపిణీ చేసిన సరుకుల్లో చాలా వరకు మిగిలిపోయాయి. బాగాలేవని కొందరు, కార్డుదారుల కన్నా అధికంగా పంపిణీ చేయడంతో మరికొందరు డీలర్ల వద్ద సరుకులు ఉండిపోయాయి. ఇప్పుడీ సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 వేల ప్యాకెట్లను ఇలా ఆయా వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడంతో ఉన్నతాధికారుల ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మిగిలిపోయిన బెల్లం, నెయ్యి, గోధుమ పిండి సరుకులను జిల్లాలోని 42 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ, ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాలకు సంబంధిత సమాచారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏఏ సరుకులు ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలకు నాసిరకం సరుకులను పంపిణీ చేసిన రెండు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టిన యంత్రాంగం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే ఫరవాలేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసి చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని కోరుతున్నారు. -
90 వేల మందికి అందని చంద్రన్న కానుక
ముగిసిన పంపిణీ గడువు కాకినాడ సిటీ: రేష¯ŒS కార్డుదారులకు ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక పేరుతో అందజేసిన సరుకుల పంపిణీ గడువు బుధవారం రాత్రితో ముగిసింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆయావర్గాల కార్డుదారులకు 15వ తేదీలోపు కానుక కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆదివారం రాత్రి ఈ పోస్ సర్వర్‌లో పంపిణీ చేసే ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆ గడువు నాటికి జిల్లాలో సరుకుల పంపిణీ పూర్తికాకపోవడంతో జిల్లా అధికారులు ప్రభుత్వానికి తెలియజేసి మరో రెండు రోజుల గడువు పొడిగించగా మంగళ, బుధవారాల్లో తిరిగి పంపిణీని కొనసాగించారు. కానీ జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల మంది రేష¯ŒSకార్డుదారులు సరుకులు పొందలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 16 వేల 381 మంది కార్డుదారులుండగా, వీరిలో 13 లక్షల 72 వేల 750 మంది సరుకులను తీసుకున్నారు. ఇంకా 43 వేల 631 మంది సరుకులను తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఈ నెలలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంజూరు చేసిన 89 వేల 203 కార్డుల్లో 42 వేల మంది కార్డుదారులు చంద్రన్న కానుకలను తీసుకున్నారు. ఇంకా 47 వేల 203 మంది సరుకులను తీసుకోలేకపోయారు. అయితే మంజూరైన కొత్త కార్డుల్లో లబ్ధిదారులకు ఇప్పటి వరకు 75 వేల కార్డులు పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 14 వేల మంది లబ్ధిదారులకు కార్డులు అందాల్సి ఉంది. మంజూరైన కొత్త కార్డుల పంపిణీ జాప్యంతో అర్హులైప లబ్థిదారులు 50 శాతం మంది చంద్రన్న కానుక సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కొంత మంది లబ్థిదారుల వేలిముద్రలు, ఐరీస్లను ఈ–పోస్ మిషన్లు తీసుకోకపోవడంతో వారుకూడా సరుకులు అందుకోలేకపోయారు. -
సంక్రాంతికి ‘చంద్రన్న’ శఠగోపం
అమరావతి: జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది. వీటి లబ్ధిదారులకు సైతం చంద్రన్న కానుక ఇస్తామని అట్టహాసంగా ప్రకటించింది. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతనుంచి సీఎం వరకూ సంక్రాంతికి ఇది నజరానా అన్నారు. అయితే కార్డులిచ్చిన ప్రభుత్వం ఆ మేరకు రేషన్ డీలర్లకు సరుకులు పంపలేదు. నూతనంగా కార్డులు పొందిన వారు సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకను తీసుకుందామని చౌక ధరల దుకాణాల వద్దకు వెళితే కొత్త వాటికి సరుకులు రాలేదని డీలర్లు చెబుతున్నారు. అందరికీ చంద్రన్నకానుక అందేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్వయానా పేర్కొన్నా క్షేత్ర స్థాయిలో పట్టిచుకున్న నాధుడు లేడు. పండుగ పేరుతో ఊరించి మొండిచేయి... పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు కూడా పిండి వంటలు చేసుకోవాలనే ఉద్దేశంతో తెల్లరేషన్ కార్డులున్న ప్రతి లబ్ధిదారుడికి కిలో గోధుమపిండి, అర కిలో ప్రకారం బెల్లం, కందిపప్పు, శనగపప్పు, అర లీటర్ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఒక బ్యాగులో వుంచి చంద్రన్న కానుక పేరిట సరుకులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.30 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని ఆమేరకు రేషన్ షాపులకు సరుకులను సరఫరా చేశారు. వీరితో పాటు ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన జన్మభూమిలో 1.66 లక్షల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వీరికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందజేస్తామని ప్రకటించి ఆ మేరకు రేషన్‌షాపులకు సరుకులను పంపక పోవడంతో లబ్ధిదారులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు కానుక కోసం డీలర్ల వద్దకు వెళ్తుంటే ఇంకా సరుకులు పంపలేదని కొందరు డీలర్లు వెనక్కు పంపుతుండగా మరికొందరు డీలర్లు ఈ–పాస్ మిషన్‌లో మీ పేర్లు ఇంకా నమోదు కాలేదని చెబుతున్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధి్దదారులు రేషన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప కానుక మాత్రం అందడం లేదు. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొందరు డీలర్లు ఈ విషయమై నేరుగా పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా గోడౌన్లకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. రవాణా చార్జీల భారమే ప్రధాన సమస్య... గోడౌన్ల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటే వాటికయ్యే రవాణా చార్జీల భారం తమపై పడతాయనే ఉద్దేశంతో డీలర్లు సరుకులు తెచ్చుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు చంద్రన్న కానుక ఇవ్వాలనుకుంటే గోడౌన్ల నుంచి సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం రేషన్‌డీలర్లకు సరుకులు పంపకపోతే కొత్తగా రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు కానుక అందే పరిస్థితి కన్పించడం లేదు. -
నోట్ల కష్ట నష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి
వృద్ధాప్య పింఛన్లను ఇళ్లకు వెళ్లి నగదు రూపంలోనే చెల్లించాలి చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు అమలాపురం టౌన్ : పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి నేనే లేఖ రాశానని, అది నా సూచనేనని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న ప్రజల కష్ట నష్టాలకు కూడా ఆయనే బాధ్యత వహించి ఆ సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురంలోని నల్లా గార్డె¯ŒSకు చెందిన టీడీపీ నాయకుడు నూకల షణ్ముఖరావు నివాసంలో కన్నబాబు పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలతో కలిసి గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన కమిటీకి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు మన రాష్ట్రంలో నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారని కన్నబాబు విమర్శించారు. చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీనని కన్నబాబు అభివర్ణించారు. చంద్రన్న పేరుతో ప్రజలకు కానుకలా లేదని.. అది చంద్రన్నకే కానుకగా ఉందన్నారు. సరుకుల సంఖ్య...ధరలు పెరగలేదు... గత ఏడాది చంద్రన్న కానుకల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయిస్తే..అదే ఈ ఏడాది రూ.416 కోట్లు కేటాయించటంలోనే అవినీతి దాగి ఉందని ఆరోపించారు. పండుటాకులను ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ తిప్పటం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న దాదాపు అయిదున్నర లక్షల సామాజిక పింఛన్లు ఈ నెల 23వ తేదీ వచ్చినా ఇంకా 50 శాతం మందికి కూడా పింఛ¯ŒS అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో వేయటం... అవి విత్ డ్రా ఆంక్షలతో అవసరాలకు అందకపోవటంతో జిల్లా రైతులునానా కష్టాలు పడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు నూకల... అమలాపురానికి చెందిన టీడీపీ జిల్లా కమిటీ సభ్యుడు నూకల షణ్ముఖరావుతో పాటు దాదాపు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో స్థానిక నల్లా గార్డె¯ŒSలో గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండగుదిటి మోహన్, బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 9వ వార్డులో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో కన్నబాబు, రాజా పాల్గొన్నారు. -
నేను అలా అనలేదు: అచ్చెన్నాయుడు
విజయవాడ : నిరుద్యోగ భృతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోలేదని, దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సమాచారం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రన్న పథకం ద్వారా 2 కోట్లమందికి బీమా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఇదేం తోఫా
జిల్లాలో 1,310 ముస్లిం కుటుంబాలకు అందని రంజాన్ తోఫా సరుకులు ఆన్లైన్లో కొన్ని పేర్లు గల్లంతు మండలాల వారీగా మరోసారి జాబితాలు పంపిన అధికారులు రంజాన్ తోఫా పేరిట పేద ముస్లింలను రాష్ట్ర సర్కారు మరోసారి దగా చేసింది. గత ఏడాది రంజాన్ సందర్భంగా నాసిరకం సరుకులు అందించి అభాసు పాలైన సర్కారు ఆ తరువాత అయినా పాఠాలు నేర్చుకోలేదు. ఈసారి కూడా పాత పద్ధతిలోనే పలువురికి నాసిరకం సరుకులను అంటగడుతోంది. కొందరికి సరుకులే లేకుండా చేసింది. మరీ ముఖ్యంగా.. ముస్లింలు ఆవునెయ్యి ఉపయోగించరని తెలిసి కూడా దానిని సరఫరా చేసి మరీ వారి మనోభావాలను దెబ్బతీసింది. కొవ్వూరు/దేవరపల్లి/ఏలూరు (ఆర్ఆర్ పేట) : రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో పేద ముస్లింలకు రంజా న్ తోఫా పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న సరుకులు సక్రమంగా అంద టం లేదు. జిల్లాలో తెల్లరేషన్ కార్డులు గల 26,749 పేద ముస్లిం కుటుంబాలకు ‘చంద్రన్న తోఫా’ పేరిట నాలుగు నిత్యావసర సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ అంది స్తామని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. జూలై 1వ తేదీన వీటిని అందించాల్సి ఉండగా, శనివారం నాటికి కనీసం 10శాతం మందికి కూడా సరుకులు అందలేదు. మరోవైపు 1,310 మంది కార్డుదారులకు అసలు సరుకులే కేటాయించలేదు. ఒక్కొక్క కుటుంబానికి ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి చొప్పున ఒక సంచిలో వేసి అందించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో కొందరి పేర్లు ఆన్లైన్లో రాకపోవడంతో సరుకులు పొందే అవకాశం లేకుండాపోయింది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి పంపిన జాబితాల్లో కొందరు లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో వారికి సరుకులు కేటాయించలేదు. దేవరపల్లి మండలంలో 450 మంది కార్డుదారులకు గాను 132 మందికి అందలేదు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 2,144 పేద ముస్లిం కుటుంబాలు ఉండగా, 168 కుటుంబాలకు సరుకులు కేటాయించలేదు. కొవ్వూరులో 21 కార్డుదారులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. శనివారం దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో శనివారం రంజాన్ తోఫా సరుకుల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులను ముస్లిం మహిళలు నిలదీశారు. కొంతమందికే సరుకులు మంజూరు చేశారని, మిగిలిన వారికి తర్వాత ఇస్తామని చెబుతున్నారని, పండగ వేళ ఇదేం దారుణమని ప్రశ్నించారు. దీనిపై సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీ ల్దార్ పోతురాజును ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రశ్నిం చగా, ప్రభుత్వానికి పంపించిన జాబితా ప్రకారం సరుకులు విడుదల కాలేదని చెప్పారు. శుక్రవారమే వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, జిల్లాలో చాలాచోట్ల శనివారం మొదలుపెట్టారు. సోమ, మంగళవారాల్లో సరుకుల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆవు నెయ్యి ఇస్తున్నారు ఇదంతా ఒక ఎత్తయితే రేషన్ దుకాణాల ద్వారా ఆవునెయ్యి సరఫరా చేశారు. ఆవు నెయ్యిని ముస్లిం లెవరూ ఆహార పదార్థాల్లో కనీస మాత్రంగానైనా వినియోగించరని తె లిసి కూడా దీనిని సరఫరా చేసి తమ మనోభావాలను దెబ్బతీశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని సరుకులు కొన్ని మండలాల్లో పంపిణీ చేసిన సరుకులు కొంత బాగానే ఉన్నప్పటికీ చాలాచోట్ల నాసిరకం సరుకులు ఇచ్చారని ముస్లింలు ఆవేదన చెందుతున్నారు. గోధుమ పిండిలో పొట్టు అధికంగా ఉందని, అందులో కల్తీ జరిగిందని పలువురు తెలిపారు. గోధుమ పిండిలో మైదా కలిసి ఉందని చెబుతున్నారు. సేమియా కూడా నాణ్యంగా లేదని పెదవి విరుస్తున్నారు. రెండో రకం పంచదార సరఫరా చేశారని విమర్శిస్తున్నారు. రెండు రోజుల్లో ఇస్తాం జిల్లాలో ఇంకా 1,310 కార్డుదారులకు తోఫా సరుకులు అందలేదని మాకు సమాచారం అందింది. తహసీల్దార్లు పంపిం చిన జాబితాల్లో కొందరి పేర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సరుకులు అందని వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. వారందరికీ సోమవారం నాడు సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. -పి.శివశంకర్‌రెడ్డి, డీఎస్వో -
రంజాన్ తోఫాఅందేనా?
గత ఏడాదికన్నా 10 వేల కార్డుల కుదింపు ♦ కొత్త కార్డుల సంగతి అంతేనా? ♦ ఎర్రగుంట్లలో తహసీల్దార్‌ను నిలదీసిన లబ్ధిదారులు ♦ నేడు కడపలో లాంఛనంగా పంపిణీ ప్రారంభం రాష్ర్టప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ ఈసారీ సక్రమంగా అమలయ్యేలా కనిపించడం లేదు. డీలర్ల వద్ద ఉన్న కీరిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో అర్హులందరికీ తోఫా అందడం అనుమానంగా మా రింది. కడప మినహా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ‘తోఫా’ పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే పలుచోట్ల సరుకులందని లబ్ధిదారులు డీలర్లపై ఎదురుదాడులకు దిగుతుండడంతో పంపిణీ గందరగోళంగా మారుతోంది. కడప సెవెన్‌రోడ్స్: పవిత్ర రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం, దూదేకుల వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘చంద్రన్న రంజాన్ తోఫా’ కార్డుదారులందరికీ సక్రమంగా అందుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతేడాది లక్షా 36 వేల 336 కుటుంబాలకు తోఫా పంపిణీ చేశారు. ఈ ఏడాది లక్షా 47 వేల కార్డులకు కానుకలు అందజేయనున్నట్లు పౌరసరఫరాల అధికారులు తొలుత ప్రకటించారు. ఇప్పుడేమో 1,26,564 కార్డులకే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే, సివిల్ సప్లైస్ కమిషనరేట్ లోని జాబితాలో కార్డుల సంఖ్య ఇలాగే ఉందని పేర్కొంటున్నారు. డీలర్ల వద్ద ఉన్న కీ రిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. అయినప్పటికీ మిస్ అయిన కార్డుల వివరాలు తహసీల్దార్లకు సమర్పిస్తే డీలర్లకు ఆ మేరకు తోఫా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పలువురు డీలర్లు మిస్ అయిన కార్డుల వివరాలను సమర్పించారు. తలలు పట్టుకుంటున్న డీలర్లు.. మిస్ అయిన జాబితాలోని కార్డులకు సంబంధించి ఇప్పటివరకు సరుకులు అందలేదు. తెల్లకార్డులున్న ముస్లిం లబ్ధిదారులు వచ్చి తమకు కానుకలు ఇవ్వాలని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ బోగస్ కార్డులను తొలగించారని అనుకున్నప్పటికీ, జన్మభూమి కార్డులు పంపిణీ చేశారు. దీంతో గత సంవత్సరం కంటే తోఫా లబ్దిదారుల సంఖ్య తగ్గే సమస్యే ఉత్పన్నం కాదని పలువురు అధికారులే గుసగుసలాడుతున్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, టెక్నికల్ అధికారి మాత్రం లక్షా 47 వేల కార్డులకు సరిపడు సరుకులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఘంటా పథంగా చెబుతున్నారు. తోఫా లబ్ధిదారుల సంఖ్యపై అధికారుల మధ్య పొంతన లేకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో అర్హులందరికీ రంజాన్ తోఫా అందడంపై సందేహాలు నెలకొన్నాయి. సరుకుల వివరాలు గోధుమపిండి 632.824 మెట్రిక్ టన్నులు, చక్కెర 253.128 టన్నులు, సేమియాలు 126.564 టన్నులు, నెయ్యి 12.656 టన్నుల మేరకు జిల్లాకు చేరాయి. సరుకులన్నీ ఇప్పటికే జిల్లాలోని 1736 ప్రభుత్వ చౌక దుకాణాలకు చేరుకున్నాయి. ఒక్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియాలు, వంద గ్రాముల నెయ్యి చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తారు. సరుకులను వేటికవే సపరేటుగా ప్యాకింగ్ చేశారు. వీటిని క్యారీ బ్యాగ్‌లో ఉంచి లబ్ధిదారులకు అందిస్తారు. బ్యాగుపై కూడా గ తేడాది తోఫా మాన్యువల్‌గా పంపిణీ చేశారు. ఈ ఏడాది మాత్రం ఈ-పాస్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లబ్దిదారులు ఎఫ్పీ షాపు వద్దకు ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకుని అందులో వారి రేషన్‌కార్డు నెంబరు, మొబైల్ నెంబరు రాసి డీలర్‌కు అందజేయాల్సి ఉంటుంది. కడపలో నేడు ప్రారంభం.. కడప నగరం మినహా జిల్లా అంతటా శుక్రవారమే తోఫా పంపిణీ ప్రారంభమైంది. కడప నగరంలో మాత్రం శనివారం ఉదయం 9.30 గంటలకు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని 24 వేల 101 కార్డులకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు. తోఫా పంపిణీ వివక్ష చూపకూడదు.. ‘రంజాన్ పండుగను ముస్లింలు, దూదేకులు చాలా పవిత్రంగా జరుపుకుంటారని.. చంద్రన్న కానుకల పేరు మీద ఇస్తున్న రంజాన్ తోఫా సరకులు ఇవ్వడంతో పక్షపాతం చూపకూడదని’ మహిళలు అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన రంజాన్ తోఫా పంపిణీలో సరుకులంద ని అర్హులు అధికారుల తీరుపై తూర్పార బట్టారు. అందరికీ ఇవ్వలేనప్పుడు రంజాన్ తోపా ఎందుకు ప్రవేశపెట్టారని మండిపడుతున్నారు. కదిరిలో అదుపులోకి .... ఎర్రగుంట్ల పోలీసులు ప్రసాద్‌రెడ్డిని కదిరిలో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న క్రమంలో నకిలీ కరెన్సీ ఉండాలి. లేదంటే మరెక్కడైనా పక్కాగా నిందితుడు దొరికి అతను సమాచారమైనా ఇచ్చి ఉండాలి. ఇవేవి లేకుండానే గతంలో మీ కుటుంబసభ్యులు నకిలీ కరెన్సీ విక్రయాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎక్కడ నకిలీ కరెన్సీ ఉందో చెప్పాలంటూ పోలీసులు మానసిక హింసకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచి అవమానకరమైన రీతిలో వ్యవహరించడంతో ప్రసాద్‌రెడ్డి మనోవేదనకు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇదివరకూ జిల్లాలో టాస్క్ఫోర్సులో పనిచేసిన అధికారులు కొందరు ఎర్రచందనం నిందితులను పోలీసు ట్రైనింగ్ సెంటర్లో విచారణ పేరుతో వేధింపులు కొనసాగించేవారు. ఆపై దుంగలతోపాటు, డబ్బులు రాబట్టుకునే అలవాటు అధికంగా ఉండేదని పలువురు వెల్లడిస్తున్నారు. అందులోభాగంగానే దయ్యాల ప్రసాద్‌రెడ్డిని కూడ అదుపులో ఉంచుకొని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపులే ప్రసాద్‌రెడ్డి మృతికి వందశాతం కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
కానుకలు కక్కిస్తున్నారు!
ఒక్కో కిట్‌కు రూ.242 వసూలు రేషన్ డీలర్లుకు నోటీసులు చంద్రన్న కానుకలను దిగమింగిన రేషన్ డీలర్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఒక్కోకిట్టుకు రూ.242 చెల్లించాలని డీలర్లకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరు దిగమింగిన కానుకల సంబంధించిన నగదు తిరిగి చెల్లించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. గుడివాడ : పట్టణంలో చంద్రన్న కానుకలు బొక్కేసిన రేషన్ డీలర్ల నుంచి నగదును కక్కిస్తున్నారు. ఇప్పటికే కిట్లు లెక్కతేల్చని రేషన్ డీలర్లకు నోటీసులు ఇచ్చి వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం నగదు వసూలుకు రంగం సిద్ధం చేశారు. కొందరు డీలర్లు నగదు చెల్లించగా మరికొందరు ఇంకా చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు పండగ కానుకగా పౌర సరఫరాల శాఖ ద్వారా అందించిన చంద్రన్న కానుకలను కొందరు డీలర్లు దిగమింగారు. బెల్లం కారిపోయిందని, కొన్ని సరుకులు ఎలుకలు , పందికొక్కులు తిన్నాయని సమాధానం చెప్పి సరిపెట్టేశారు. ఈవిషయాన్ని గతంలోనే సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో రేషన్ డీలర్లకు నోటీసులు ఇచ్చారు. దీనిపై డీలర్లు రకరకాల కారణాలతో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రజాధనం దుర్వినియోగమైందని ఉన్నతాధికారులు నిగ్గు తేల్చినా మనవారే వదిలేయమని అధికార పార్టీ నేతలు నుంచి ఒత్తిడి తెచ్చారు. వీరి స్వార్థం కోసం తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోలేమని రెవెన్యూ అధికారులు తెగేసి చెప్పడంతో దిగమింగిన చంద్రన్న కానుకలకు ఒక్కో కిట్టుకు రూ.242 చెల్లించాలని ఇప్పటికే డీలర్లుకు నోటీసులు జారీ చేశారు. గుడివాడ పట్టణంలో 45మంది రేషన్ దుకాణాలను డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు నడుపుతున్నారు. ఒక్కొక్క డీలరు వద్ద దాదాపు 10నుంచి 20కిట్లుకు పైగా చంద్రన్న కానుకలు లెక్కతేలలేదు. ఈపోస్ యంత్రాలు ఉన్నా లెక్కలేనితనంతో డీలర్లు వ్యవహరించి ఇవి తిరిగి చెల్లించాలని అడిగిన రెవెన్యూ అధికారులపై వత్తిడి తీసుకు రావడం ప్రారంభించారు. మూడు నెలల అనంతరం వీరివద్ద వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే కొందరు డీలర్లు తిరిగి చెల్లించగా మరికొందరు మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం. -
తృటిలో తప్పిన ఎన్కౌంటర్!
జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో తృటిలో ఎన్కౌంటర్ తప్పింది. ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ చంద్రన్న వర్గం దళ సభ్యులు సుమారు 10 మంది సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. నిఘా విభాగం సమాచారం మేరకు బుట్టాయగూడెం మండలంలో చంద్రన్న వర్గందళ సభ్యులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు గత నెల 29న రాత్రి ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామంలో అర్ధరాత్రి తనిఖీలు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో దళ సభ్యులు ఉన్నారని తెలుసుకుని సాయుధ బలగాలు విసృ్తత కూంబింగ్ జరిపాయి. అదే సమయంలో ఉప్పరిల్ల అటవీప్రాంతంలో 9 మంది చంద్రన్న వర్గం దళ సభ్యులు రహస్య స్థావరంలో మకాం వేసినట్టు పోలీసులకు ఉప్పందింది. 9 మంది దళ సభ్యుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో దళ సభ్యులంతా నిద్రిస్తుండగా ఒకరు మాత్రం కాపలా కాస్తున్నట్టు తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులను కాపలా కాస్తున్న దళ సభ్యుడు గుర్తించి దళంలోని మిగతా వారందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారంతా కిట్ బ్యాగ్ ఆయుధాలను ధరించి గుంపుగా కాకుండా విడివిడిగా తలో వైపునకు తప్పించుకున్నట్టు సమాచారం. పోలీసులు ఆప్రాంతమంతా గాలించి వెనక్కి వచ్చినట్టు తెలిసింది. కూంబింగ్ చేస్తున్న పోలీసులు దళం ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉంటే పెద్ద ఎన్‌కౌంటరే జరిగి ఉండేదని చెబుతున్నారు. ముగ్గురి అరెస్ట్ : బుట్టాయగూడెం : అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు బుధవారం తెలిపారు. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన దళ కమాండర్ పల్లాల ప్రకాష్‌రెడ్డి, కొరియర్లుగా పనిచేస్తున్న మడకం రామారావు, నడపన సోమరాజు పట్టుబడ్డారని చెప్పారు. ఈ నెల 1వ తేదీన రాత్రి బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం ఉప్పరిల్లలో చంద్రన్న వర్గం దళ సభ్యులు సంచరిస్తున్నట్టు సమాచారం అందటంతో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఇన్చార్జి, ఆర్ఎస్ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపారన్నారు. పోలీసులను చూసి కొంతమంది పారిపోయారని, ప్రకాష్‌రెడ్డి, రామారావు, సోమరాజు పట్టుబడ్డారని తెలిపారు. వారినుంచి ఒక నాటు తుపాకీ, 6 రౌండ్ల బుల్లెట్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
అడవిలో అన్వేషణ
- ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో భారీ ఎన్కౌంటర్ - చంద్రన్న వర్గం దళ సభ్యుల సంచారం! - అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు - ప్రాధాన్యత సంతరించుకున్న ఓఎస్డీ పర్యటన - పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు జంగారెడ్డిగూడెం :రాష్ట్ర సరిహద్దులోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరగటం, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో చత్తీస్‌గఢ్ సరిహద్దు భాగంలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందగా, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో మావోయిస్ట్ ఖమ్మం జిల్లా కార్యదర్శి, దళ కమాండర్ లచ్చన్న , తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ సోనీ ఉన్నారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మిగిలిన మావోయిస్టు దళ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలోకి ప్రవేశించి తలదాచుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం ఏజెన్సీ మండలాల పోలీసులు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. గతంలో పశ్చిమ ఏజెన్సీలో.. ప్రధానంగా పోలవరం , బుట్టాయగూడెం మండలాల్లో పలు ఎన్కౌంటర్లు జరిగాయి. జనశక్తి క్రాంతి వర్గం, దళిత బహుజన శ్రామిక విముక్తి దళాలు ఎన్కౌంటర్లలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతానికి పశ్చిమ ఏజెన్సీలో న్యూడెమోక్రసీ ఆత్మరక్షణ దళాలు సంచరిస్తున్నాయి. గతంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న కూడా ఎన్కౌంటర్లో మృతిచెందారు. తాజాగా న్యూడెమోక్రసీలో చీలిక రావడంతో చంద్రన్న వర్గం ఏర్పడింది. చంద్రన్న వర్గం కూడా దళాలను ఏర్పాటు చేసుకుని ఏజెన్సీలో సంచరిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అచ్చెన్నపాలెంలో గ్రామస్తులతో చంద్రన్నవర్గ దళ సభ్యులు సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇదిలావుంటే మావోయిస్టులు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోకి వస్తున్నప్పటికీ.. కేవలం షెల్టర జోన్‌గా మాత్రమే వాడుకుంటున్నారే తప్ప ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. తాజాగా చర్ల సమీపంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో, చంద్రన్న దళాల సంచారంతో పశ్చిమ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం అర్ధరాత్రి బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామానికి పెద్దఎత్తున వెళ్లిన పోలీసులు గ్రామాన్ని తనిఖీ చేసినట్టు సమాచారం. ఓఎస్డీ పర్యటన ఒక పక్క ఎన్కౌంటర్, మరో పక్క చంద్రన్న దళాల సంచారం నేపథ్యంలో ఏజెన్సీ మండలాలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఓఎస్డీ పకీరప్ప పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పకీరప్ప మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం వచ్చారు. సమాచారం చెప్పేందుకు ఆయన అంగీకరించలేదు. ఏజెన్సీ పోలీస్స్టేషన్లను కూడా ఆయన పరిశీలించినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దళ కమాండర్ ధర్మన్న అనారోగ్యం పాలవడంతో గతనెల 26న జంగారెడ్డిగూడెం వచ్చి వైద్యం చేయించుకున్నట్టు సమాచారం. ఆయన వెంట చంద్రన్న వర్గం లీగల్ ఆర్గనైజేషన్ అయిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు రామన్న, ఆ వర్గం పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజు సహాయంగా వచ్చినట్టు తెలిసింది. ధర్మన్నకు వైద్యం చేయించి తిరిగి వెళుతుండగా ఆ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు తరలించి విచారిస్తున్నట్టు భోగట్టా. వెంటనే కోర్టులో హాజరుపర్చాలి పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం ప్రతినిధులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ఆ వర్గం రాష్ట్ర కమిటీ నాయకుడు ఎస్.రాజారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ వైద్యంచేయించుకుని వెళుతున్న దళ కమాండర్ ధర్మన్నను, అరుణోదయ నాయకుడు రామన్నను, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అప్పటినుంచి వారి జాడ తెలియలేదని, పోలీసులు వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఆ ముగ్గురినీ పోలీసులు ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణం కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. -
ఆ ‘కానుక’ తింటే తంటాయే..
సాక్షి ప్రతినిధి కాకినాడ / పిఠాపురం: చంద్రన్న పండుగ కానుకలు.. ఇప్పుడు వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి పరీక్ష పెడుతున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం, బలవర్ధకమైన కూరలు, పప్పుదినుసులు వండి వడ్డిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందనడానికి చంద్రన్న కానుకలే తార్కాణం. గత క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు తూర్పు గోదావరి జిల్లాలో 16.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు కిలో గోధుమపిండి, అర కిలో చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు, వంటనూనె, 100 గ్రాముల చొప్పున నెయ్యిలతో కూడిన కిట్లు సిద్ధం చేశారు. క్రిస్మస్కు 4.15 లక్షల మందికి సరుకులు అందాయి. మిగతా సరుకులు సంక్రాంతి పండుగ సమయానికి ముందు పంపిణీ చేయాలని అధికారులు భావించారు. సర్వరు పనిచేయకపోవడం, ఇ-పాస్ యంత్రాలు మొరాయించడం, లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడం తదితర కారణాల వల్ల 1.30 లక్షల మందికి సరుకులు అందలేదు. ఈ లెక్కన 1.30 లక్షల కిలోల గోధుమ పిండి, 65 వేల కిలోల చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు మిగిలిపోయాయి. వంట నూనె, నెయ్యి ప్యాకెట్లు కూడా ఆ మేరకు పంపిణీ కాలేదు. వాటిని చౌకడిపోల డీలర్లు వెనక్కి పంపేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మిగిలిపోయిన కిట్లను ఎలాగైనా వినియోగించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కానుకల కిట్లను జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలకు ఈనెల 1న పంపిణీ చేశారు. తాకడానికే భయం.. జనవరి 7, 8 తేదీల్లో జిల్లాలోని రేషన్ దుకాణాలకు న చంద్రన్న కానుక కిట్లలోని సరుకులు నాసిరకం కావడంతో అప్పటికే పాడైపోయాయి. అందుకే ఉచితంగా ఇచ్చేవే అయినా చాలామంది లబ్ధిదారులు తీసుకోవడానికి వెనుకాడారు. పంపిణీ నాటికే బెల్లం నీరుకారిపోయి ముద్దగా మారింది. పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయినా అధికారులు మాత్రం మిగిలిపోయిన సరుకులు వసతి గృహాలకు పంపిణీ చేయడానికి వెనుకాడలేదు. అలా వచ్చిన బెల్లంతో పిఠాపురంలోని బాలికల వసతిగృహంలో ఇటీవల పరమాన్నం వండించారు. ఇది తిన్న విద్యార్థినుల్లో కొంతమందికి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంద్రన్న కానుక సరుకులేవీ వాడకుండా స్టోర్‌రూమ్‌లో మూలన పడేశారు. ఇప్పుడవి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాటిని ఏంచేయాలో తెలియక హాస్టల్ వార్డెన్లు తలపట్టుకుంటున్నారు. -
ఐదు దాటితే అంతే...
ఈ-పాస్ విధానంతో ఇంకా తప్పని ఇక్కట్లు రేషన్ పంపిణీలో కొత్త నిబంధనతో కష్టాలు సూళ్లూరుపేట: చౌకడిపో దుకాణాల్లో సరుకులు పొం దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో ఎంతోమంది లబ్ధిదారులకు సరుకులు అందకుండా ఇబ్బందులుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నెలా 5వ తేదీ లోపే సరుకులు పొందాలి అనే నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఇచ్చి బియ్యం, కిరోసిన్, కంది పప్పు, చక్కెర తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పండగలు వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పేరుతో మరో ఐదు రకాలు వస్తువులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు ప్రతి నెలా 20వ తేదీవరకు సరుకులు ఇస్తూ వచ్చారు. నకిలీకార్డులు ఏరివేతకు సంబంధించి ఇటీవల ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన సామెతలా తయారైంది పరిస్థితి. నకిలీ కార్డులు పట్టుబడ్డాయో లేదో గాని నిజంగా నిరుపేదలైన వారికి వేలిముద్రలు సరిపోక సరుకులు అందడం లేదు. చాలా మంది బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. ఈ విధంగా లబ్ధిదారులు సతమవుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తవిధానాన్ని తీసుకొచ్చి పేదవాళ్ల కడుపుమీద వాత పెట్టే పనికి ప్రభుత్వం పూనుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా ఐదో తేదీలోపు సరుకులు తీసుకోవాలనే నిబంధనను లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాంబట్టు, మేనకూరు, శ్రీసిటీ సెజ్‌ల్లోని పలు కంపెనీలో పనిచేసే కార్మికులు చాలామందికి ఐదో తరువాత నెల జీతాలు వస్తాయి. జిల్లాలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఐదో తేదీలోపు సరుకులు పొందలేని పరిస్థితులున్నా యి. ఐదో తేదీని ఆఖరు తేదీగా పెడితే చౌకడిపో దుకాణాల్లో సరుకులు ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ-పాస్‌తో రూ.10 కోట్లు ఆదా సరుకుల పంపిణీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ- పాస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు రూ.10 కోట్లు విలువచేసే సరుకులు ఆదా చేసినట్టుగా అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షలున్న తెల్ల రేషన్ కార్డులు నేడు 7,70,359కి చేరినట్లు సమాచారం. వీటిని కూడా వడపోసేందుకు సరుకుల పంపిణీని ఐదో తేదీకి కుదించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే సరుకులు ఇంకా మిగిలిపోయే అవకాశంఉంది. మొత్తానికి నూతన విధానలతో ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీని 15 తేదీని ఆఖరు రోజుగా ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
4,200 హెక్టార్లలో చంద్రన్న రైతు క్షేత్రాలు
• పంటల్లో అధిక దిగుబడి, ఉత్పాదకత పెంపునకు చర్యలు రబీలో 860 హెక్టార్లలో అమలు రూ.43 లక్షలకు గాను రూ.39.50 లక్షల ఖర్చు వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ ఒంగోలు టూటౌన్: జిల్లాలో చంద్రన్న రైతు క్షేత్రాల పథకంను 4,200 హెక్టార్లలో అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ జె .మురళీకృష్ణ తెలిపారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో చంద్రన్న రైతు క్షేత్రాల పథకం గురించి శనివారం ‘సాక్షి’కి వివరించారు. వివిధ పంటల్లో అధిక దిగుబడి, ఉత్పాదకత, ఉత్పత్తి, విస్తీర్ణం పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ పథకంను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గ్రామానికి పది హెక్టార్ల లక్ష్యం కాగా.. 10 హెక్టార్లకు ఒక ప్రదర్శనా క్షేత్రం ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. 33 శాతంపై మేలు రకాల విత్తనాలు, జిప్సం, జింక్, వేపనూనె, వేపపిండి, సస్యరక్షణ మందులను సరఫరా చేస్తారని తెలిపారు. ఒక్కొక్క హెక్టారుకు రూ.5 వేల విలువైన ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారి, ఏవో, ఏడీఏ, ఎంపీఈవో ఒక్కొక్కరూ ఒక్కో ప్రదర్శనా క్షేత్రం చేయాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా మొత్తం మీద 420 ప్రదర్శనా క్షేత్రాలు లక్ష్యమన్నారు. ప్రస్తుతం రబీలో 860 హెక్టార్లలో ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులకు రైతు శిక్షణ కార్యక్రమాలు, మేలైన యాజమాన్యం, పథకం వివరాలను డిస్ప్లే బోర్డుల ద్వారా తెలియజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.43 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.39.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
రూ.47 కోట్ల సరుకును గాలికొదిలేసారు
-
మంత్రిగారూ...మీరిచ్చిన హామీ ఏమైంది?
పాలకొండ రూరల్ : ‘పార్టీలకు అతీతంగా నూతన కార్డులు పంపిణీ చేశాం.. సీఎం ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా చంద్రన్న కానుకలు అందించండి.. దయచేసి డీలర్లు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.. మీలో కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించండి...’ ఇది సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత వారం రోజుల క్రితం పాలకొండ పట్టణ ంలో చెప్పిన మాటలు. పట్టణంలోని 6వ వార్డు జన్మభూమి సభలో పాల్గొన్న ఆమె ఈ విషయూన్ని సభా ముఖంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో దాదాపు మండల వ్యాప్తంగా 32 పంచాయతీల పరిధిలో 16 వేలకు పైబడి కార్డులు మంజూరు కాగా పట్టణానికి సంబంధించి 2,200 పైచిలుకు కార్డులు మంజూరయ్యాయి. అయితే వీటికి సంబంధించి చంద్రన్న కానుకల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగంటి పూట... ఇప్పటికే చంద్రన్న కానుకల పేరిట ఆరు వస్తువులతో కూడిన సరుకుల సంచిలో వచ్చిన సరుకుల్లో డొల్లతనం బయట పడింది. దీనికి తోడు డీలర్లు ఈ సంచిని లబ్ధిదారులకు అందించేందుకు చలాన పేరిట రూ.10, పండగ మామూళ్లు అంటూ మరో రూ.20 బహిరంగంగానే వసూలు చేశారు. ఇంత జరిగినా మళ్లీ వేలిముద్రలు పడలేదంటూ, నూతన కార్డుదారులు తమ పాత కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉన్నాయంటూ లేనిపోని నిబంధనలు సృష్టించి సరుకులు ఇచ్చేందుకు అయిష్టాన్ని వ్యక్తం చేయడంతో పాటు అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు స్పష్టంగా నూతన కార్డులకు సంబంధించి సంక్రాంతి కానుకలు అందించాలని జాబితాలను డీలర్లకు అందించినప్పటికీ ఆ తరహా లబ్ధిదారులకు కూడా సరుకులు అందించడం లేదు. ఆఖరి నిమిషంలో... ఇప్పటికే ఐరిష్‌లు, వేలిముద్రలు పడక ఇవ్వకపోవడం ఒకెత్తయితే దీనిపై వచ్చిన ఆరోపణలపై వీఆర్ఒ, సంబంధిత పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణానికి వచ్చేసరికి కౌన్సిలర్ల సమక్షంలో సరుకులు అందించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలా కాకుండా డీలర్లు సరుకులు పంపిణీ చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ సరుకులు ఇవ్వకపోతే మిగిలిన సరుకులను వారే రికార్డుల్లో నమోదు చేసి చేతివాటం కనపర్చే అవకాశం ఉందని అందుకే సరుకులు అందించడం లేదంటూ పలువార్డుల్లో లబ్ధిదారులు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కార్డుల పంపిణీ విషయంలో జంబ్లింగ్ కారణంగా వార్డులు మారిపోవడంతో ప్రతి డీలరుకు 10శాతం బ్యాగులు అదనంగా ఇచ్చారని అయినప్పటికీ పం పిణీ విషయంలో వీరు వెనుకడుగు వేయ డం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నా రు. దీంతో ప్రతి రేషన్ డిపో వద్ద ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం నాటికి పాలకొండ పట్టణంలో ఈ తరహా ఘటనలు అధికం కావడం కొసమెరుపు. ఇదే విషయమై సీఎస్‌డీటీ సోమేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎటువంటి నిబంధనలు లేకుండా సరుకులు అందించాలని డీలర్లును ఆదేశించామని, సమస్యలుంటే సరి చే స్తామన్నారు. -
సంకు‘రాత్రి జాగారాలు’
♦ 4.18 లక్షలమందికి అందని ‘చంద్రన్న కానుక’ ♦ సాంకేతిక లోపాలతో పంపిణీలో విపరీత జాప్యం ♦ రేషన్‌డిపోల ముందు కార్డుదారుల బారులు ♦ సరుకుల కోసం అర్ధరాత్రి వరకూ పడిగాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆడామగా, పిన్నాపెద్దా పడిగాపులు పడుతూ ఉన్న పై ఫొటో అంబాజీపేటలోని ఓ రేషన్‌షాపు వద్ద తీసింది. అప్పుడు సమయం ఎంతో తెలుసా.. ఆదివారం రాత్రి 11 గంటలు! పాపం.. వారి నిరీక్షణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఊరించిన చంద్రన్న సంక్రాంతి కానుక కోసం! ఆ చౌక దుకాణం వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచీ అదే పరిస్థితి. అలాగని పంపిణీలో డీలరు నిర్లక్ష్యం వహించాడని కాదు.. అలా పూటలుపూటలు.. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ‘కానుక’ చేతికి అందకపోవడానికి కారణం.. ఈ-పాస్ యంత్రం సరిగా పనిచేయకపోవడమే. ఒక్క అంబాజీపేటలోనే కాదు.. జిల్లా అంతటా చంద్రన్న సంక్రాంతి కానుల పంపిణీలో ఇదే పరిస్థితి. అమలాపురంలో గత మూడురోజులుగా పంపిణీ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో కానుక సరుకులు అందలేదు. రోజూ కార్డుదారులు చౌకడిపోల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకూ నిరీక్షించి చివరకు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఎదురుతెన్నులు.. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చౌక డిపోల్లో ఆరు రకాల సరకుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ ఈ-పాస్ యంత్రాల పుణ్యాన తాబేలు నడక కన్నా మందకొడిగా మారింది. దీంతో వృద్ధులు కూడా ఎముకలు కొరికే చలిలో వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం నుంచి రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో పంపిణీ కాస్త మెరుగుపడింది. మంగళవారం సాయంత్రానికల్లా జిల్లాలోని తెల్లరంగు కార్డుదారులందరికీ చంద్రన్న కానుక అందజేస్తామని అధికారులు చెబుతున్నా కనీసం బుధవారం నాటికైనా పూర్తవుతుందా అన్న సందే హం వ్యక్తమవుతోంది. జిల్లాలో పాత కార్డులు, ఇటీవల మంజూరు చేసినవి కలిపి మొత్తం 16.43 లక్షల తెల్ల రేషనుకార్డులు ఉన్నాయి. ఇప్పటికే వాటిలో 4.15 లక్షల మంది కార్డుదారులకు క్రిస్మస్కు చంద్రన్న కానుక పేరుతో సరుకులు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 12.28 లక్షల కార్డుదారులకు ఈనెల 7 నుంచి సంక్రాంతి కానుక పంపిణీ ప్రారంభించారు. అయితే కలెక్టరేట్లో ఉన్న సర్వరు కాలిపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించినా నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో లబ్ధిదారుల వేలిముద్రలు ఇ-పాస్ యంత్రంలో సరిగా నమోదవడం లేదు. దీంతో ఒక్కో చౌక దుకాణం వద్ద రోజుకు 50 కార్డులకు మించి పంపిణీ జరగలేదు. సోమవారం రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో ప్రక్రియ కాస్త మెరుగుపడింది. సోమవారం సాయంత్రానికి క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కలిపి మొత్తం 12.25 లక్షల కార్డులకు పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై కలెక్టరు అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. మంగళవారం సాయంత్రం నాటికి కానుకల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. భోగి నాటికైనా అందేనా? సంక్రాంతి కానుక సరుకులు ఇంకా దాదాపు 4.18 లక్షల తెల్లకార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం భోగి నాటికైనా చేతికందుతాయో లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. రోజుల తరబడి చౌక దుకాణాల వద్ద వరుసలో ఉండటం వల్ల అటు కూలి కోల్పోతున్నామని, ఇటు సరుకులు చేతికి అందట్లేదని లబోదిబోమంటున్నారు. ఇక వృద్ధులైతే నీరసించి, డిపోల ముందే కుప్పకూలిపోతున్నారు. కొందరు కార్డుదారులైతే పిల్లలను సైతం క్యూల్లో నిలబెడుతున్నారు. కొత్తకార్డుదారులకు కానుకే దిక్కు... జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వం ఘనంగా పంపిణీ చేసింది ఏవైనా ఉన్నాయంటే కొత్త రేషన్‌కార్డులు ఒక్కటే. అయితే అవి చేతికొచ్చాయనే సంతోషం లబ్ధిదారులకు ఉండడం లేదు. వారికి జనవరి నెల రేషన్ సరుకులు ఉండవు. కేవలం చంద్రన్న కానుకతో సరిపెట్టుకోవాల్సిందే. అయితే రెండు నెలల క్రితమే రేషనుకార్డు అర్హుల జాబితా ఖరారు చేసిన అధికారులు ఆమేరకు సరుకులను ఎందుకు సిద్ధం చేయలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతినెలా రేషను సరుకులు ఇస్తామని అధికారులు సరిపెడుతున్నారు. నేటి సాయంత్రానికి పూర్తి... క్రిస్మస్తో కలుపుకొని చంద్రన్న కానుకగా సరుకులు జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి మొత్తం 12.25 లక్షల కార్డుదారులకు అందజేశాం. ఇంకా దాదాపు నాలుగు లక్షల కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒకే సర్వరు ఉండటం, అదీ సరిగా పనిచేయకపోవడం వల్ల పంపిణీ జాప్యమైంది. సోమవారం నుంచి రెండు సర్వర్లు అందుబాటులోకి తెచ్చాం. మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేస్తాం. - జి.ఉమామహేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
చుక్కలు చూపిస్తున్న ‘చంద్రన్న’ కానుక
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా లబ్ధిదారులకు చంద్రన్న కానుక పేరుతో ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఈ-పాస్ మిషన్లు సరిగా పని చేయడం లేదు. ప్రజలు రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్నా రోజుకు 20 నుంచి 30 కార్డులకు మించి సరుకులు అందడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పండుగ రోజుకు లబ్ధిదారుల్లో సగం మందికి కూడా సరుకులు పంపిణీ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. సంక్రాంతి పండుగకు రూ. 270 విలువ చేసే అరకిలో కందిపప్పు, అరలీటర్ పామాయిల్, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన సరుకులను తెల్లరేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజు కూలీ రూ. 300 వదిలిపెట్టుకున్నా ఈ ఉచిత సరుకులు అందడం లేదని పేదలు వాపోతున్నారు. శుక్రవారం 7 లక్షల మందికే కానుక మూడు రోజులుగా చంద్రన్న కానుకను సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 28,254 రేషన్ షాపులు ఉంటే వీటిలో సర్వర్ సమస్య కారణంగా శుక్రవారం 8,388, శనివారం 5,175 షాపుల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. కానుక కోసం 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల లబ్దిదారులకు మాత్రమే సరుకులు అందాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసి సరుకులు తీసుకోకుండానే వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగలోపు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ-పాస్‌తో సంబంధం లేకుండా రికార్డుల్లో సంతకం(మాన్యువల్) తీసుకొని సంక్రాంతి సరుకులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ షాపులకు తాళం వేస్తాం.. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లపై లబ్ధిదారులు దాడులు చేశారు. వాటిని దృష్టిలో ఉంచుకొని అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీలర్లు వాపోతున్నారు. మున్ముందు సర్వర్ సమస్య ఇలాగే కొనసాగితే డీలర్లందరూ రేషన్ షాపులకు తాళాలు వేసి వాటి తాళం చెవులను జాయింట్ కలెక్టర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని రేషన్ డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. వెంటనే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించి ఇటు లబ్ధిదారులకు అటు రేషన్ డీలర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చుక్కలు చూపిస్తున్న చంద్రన్న కానుక
-
కొత్త రేషన్ కార్డులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
అనంతపురం: కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని, వీటి పంపిణీపై జిల్లాలో ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004256401కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో రేషన్ దుకాణం డీలర్లు ఏమైనా చేతివాటాన్ని ప్రదర్శిస్తే.. వారిపై సస్పెన్షన్ వేటు వేసి.. క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. -
చంద్రన్నా.. మా మొర ఆలకించన్నా..
నల్లజర్ల రూరల్ : ‘మేమంతా అర ఎకరం.. ఎకరం.. రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్న దళిత, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలం. దశాబ్దాలుగా పోడు భూములను వ్యవసాయూనికి అనుగుణంగా బాగు చేసుకుని వాటిని సాగు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మా కష్టానికి తగిన ఫలాలు అందుకోబోతున్నాం. ఈ లోగా పరిశ్రమల స్థాపన అంటూ తరతరాలుగా మేం సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కొని మా నోటి దగ్గర ముద్దను దూరం చేసేందుకు మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రన్నా.. నీవన్నా మా మొర ఆలకించి ఆ భూములను లాక్కోవద్దనా’.. అంటూ నల్లజర్ల మండలంలోని రైతులు వాపోతున్నారు. నల్లజర్ల మండలం దూబచర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌కు 586.25 ఎకరాల భూమిని తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై రైతులు మూకుమ్మడిగా ఆరు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ భూముల్లో 58.25 ఎకరాలు జిరాయితీ భూమి కాగా 18 ఎకరాలు ప్రభుత్వం పోరంబోకు,510 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. తాతలు, దండ్రుల నాటి నుంచి పోడు భూమిని అభివృద్ధి చేసి చదును చేసి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో నిమ్మ, ఆయిల్‌పామ్, జీడిమామిడి, సీతాఫలం వంటి పంటలతో పాటు సంవత్సరానికి మూడు పంటలు పండే విధంగా బోర్లు వేశారు. వాటి ఫలాలు ఇప్పుడిప్పుడే వారికి చేతికి అందబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ భూములను పరిశ్రమలకు కేటాయించాలంటూ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నేడు సీఎం దృష్టికి సమస్య ప్రభుత్వం నిర్ణయం కనుక అమలు జరిగితే దాదాపు దళిత, బీసీ వర్గాలకు చెందిన 500 కుటుంబాలు వీధిన పడనున్నాయి. భూములు పోతే ప్రత్నామ్నాయం లేక వలసలు పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి-మా ఊరు సభలో పాల్గొనేందుకు శుక్రవారం నల్లజర్ల వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నట్టు రైతులు నందమూరి సుబ్రహ్మణ్యం, తాడిగడప శ్రీనివాసరావు, కారెం రాంబాబు, కారెం అచ్చియ్య, బోడిగడ్ల వెంకట సుబ్బారావు, సుసేశ్వరావు, పొంగులేటి అబద్ధం, తోట సుబ్బారావు తదితరులు తెలిపారు. తమ మొరను ముఖ్యమంత్రి ఆలకించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారంతా వాపోతున్నారు. పేదల భూములే కావాలా ? పరిశ్రమలు పెట్టడానికి పేదల భూములే కావాలా? చాలా మంది పెద్ద రైతుల వద్ద భూములున్నాయి. 80 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుని అభివృద్ధి చేస్తే ఆ భూముల్ని మా దగ్గర లాక్కొని బడా పారిశ్రామిక వేత్తలకు ధారదత్తం చేయూలని చూడడం దారుణం. - కారెం రాంబాబు, రైతు, ముసుళ్ళగుంట పురోగమనమా? తిరోగమనమా? చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధి పురోగమనమా? తిరోగమనమో అర్థం కావడం లేదు. పోడుభూముల్ని అభివృద్ధి చేసి ఇప్పుడిప్పుడే సుస్థిర పడుతున్నాం. ఇప్పుడు భూముల్ని లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? మా పిల్లల బతుకులు ఏం కావాలి. రోడ్డున పడితే ఆయనకి సంతోషమా? - శొంఠి వరలక్ష్మి, రైతు, దూబచర్ల -
కానుక..నాసిరకం
అమలాపురం :‘మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా ఉన్నాయి చంద్రన్న పండగ కానుకలు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇస్తున్న పండగ కానుకల్లో నాణ్యత లోపిస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండగలకు పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో పప్పులు పుచ్చిపోగా, బెల్లం జావగారి పోతోంది. పండుగ నాడు పిండివంటలు చేసుకోవాలని కానుకను అందుకునేందుకు వెళుతున్న పేదలు సరుకులను చూసి నీరుగారిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ ఆరంభమైంది. ఇప్పటికే క్రిస్మస్ పండగ నాడు కొంతమందికి వీటిని అందించారు. బియ్యం, పంచదార, కిరోసిన్లతోపాటు కందిపప్పు, శనగపప్పు అరకేజీ చొప్పున, నెయ్యి 100 గ్రాములు, గోధుమ పిండి కేజీ, బెల్లం, పామాయిల్ అరకేజీ చొప్పున పంపిణీ చేస్తున్నారు. పేదల ఇంట పండగ పిండివంటలు చేసేందుకు వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. అయితే సరుకుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. కందిపప్పు, శనగపప్పు తక్కువ రకంవి ఇస్తున్నారు. వీటిలో పుచ్చులు, నలిగిపోయిన పప్పు బద్దలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక బెల్లం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జావగారి ముద్దలా ఉంటోంది. కొన్నిచోట్ల బెల్లం పాకంలా మారి ప్యాకెట్ల నుంచి కారిపోవడం చూసి డీలర్లే గగ్గోలు పెడుతున్నారు. కొన్ని దుకాణాలకు నెయ్యి ఇంకా చేరలేదు. సరుకులు చేరకపోవడం వల్ల పంపిణీ ఆలస్యమవుతోందని, ఈ సమయంలో బెల్లం పాకంలా మారిపోవడం తమకు సమస్యగా మారుతోందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. వీటి పంపిణీ జిల్లాలో గురువారం నుంచి అధికారికంగా ఆరంభించారు. చాలాచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ-పాస్ సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే సాగింది. సర్వర్‌ను మార్చాలని గతం నుంచీ డిమాండ్ వినిపిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీనితో పండగ నాటికి అందరికీ కానుకల పంపిణీ జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇదీ కానుక సరుకుల స్థితి.. మండపేట నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సుమారు 20 వేల మంది కార్డుదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. బెల్లం, శనగలు నాసిరకంగా ఉన్నాయని కార్డుదారులు విమర్శించారు. సంక్రాంతి కానుకలకు సంబంధించి దుకాణాలకు నెయ్యి సరఫరా ఇంకా జరగలేదు. ఇప్పటికే షాపుల్లోకి చేరిన బెల్లం నీరుగారుతోంది. పండుగ సమీపిస్తున్నా సరుకులు ఇంకా పంపిణీ కావడంలేదని కార్డుదారులు విమర్శిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో సరుకులు బాగానే ఉన్నా తూకాల్లో తేడాలు ఉన్నట్టు రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. డబ్బాలో ఇస్తున్న తక్కువగా ఉంటోంది. కందిపప్పు నాసిరకంగా ఉంది. బెల్లం కూడా నాణ్యమైనది కాదు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారం క్రితం చంద్రన్న కానుక సరుకులు రేషన్‌డిపోలకు చేరాయి. చంద్రన్న సంచులు రాకపోవడంతో ఆన్లైన్ సైట్ ఓపెన్ కాలేదు. సరుకులు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. ఆలస్యం కావడంతో బెల్లం పాకంగా మారుతోంది. ముమ్మిడివరంలో సరుకులు ఇంకా పంపిణీ కాలేదు. అమలాపురంలో నాసిరకం పప్పు డీలర్లకు చేరింది. మామిడికుదురులో బెల్లం జావగారి పాకంలా మారింది. రాజమండ్రి రూరల్‌లో పలుచోట బెల్లం తూకంలో 25 గ్రా ముల నుంచి 50 గ్రాముల తేడా వస్తోంది. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు సరుకుల కోసం తరలివస్తూ, ఇంకా ఇవ్వడం లేదని తెలిసి నిట్టూర్చి వెనుదిరుగుతున్నారు. -
ఇది ..ఉచితమా?
ఫ్రీ అని చెప్పి అధ్వాన సరుకుల సంచి అందజేత చంద్రన్న కానుకలో నాణ్యత లోపం పండుగ వేళ అనారోగ్యం బారిన పడాలా? గోధుమల్లో కలసినపొట్టు, రాళ్లు చేరిన కందిపప్పు బెల్లం నీరుగారిపోతోంది. గోధుమపిండిలో పొట్టు కలిసి ఉంటుంది. నెయ్యి నాణ్యతగా లేదని, వంటలు పాడవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. కందిపప్పులో పొల్లు గింజలు అధికంగా ఉండడంతోపాటు నలుపురంగులో పప్పుబద్దలు ఉన్నాయని, బూజు పట్టి చేదు ఎక్కువగా ఉంటోందని ఒక గ్లాసుడు పప్పు ఉడికేందుకు పట్టే సమయం గంటపైమాటే అని గృహిణులు అంటున్నారు. పండుగ వేళ చంద్రన్న కానుకలు పేరుతో అందిస్తున్న సంచులు అందర్నీ నిరాశలో ముంచుతున్నాయి. శ్రీకాకుళం టౌన్: పండుగపూట ప్రచారం ఆర్భాటంతో పౌరసరఫరాలశాఖ చేపట్టిన చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తుంటే లబ్ధిదారులను తీవ్ర అసంతృప్తిలో ముంచుతోంది. సరుకుల నాణ్యత అధ్వానంగా ఉండటంతో తీసుకున్న వారు లబోదిబోమంటున్నారు. తీసుకునేందుకు సిద్ధమైన వారు అవి తెచ్చుకుని ఏం చేయాలా అని మధనపడుతున్నారు. ఉచితం గా వచ్చినవి ఎందుకు విడిచిపెట్టాలని బారులుతీరి తీసుకెళుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు 20 శాతం సరకులు పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ ఇప్పుడు సంక్రాంతి కానుకల పంపిణీకి సిద్ధమవుతోంది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా చంద్రన్న కానుకలు పంపిణీ కానున్నాయి. జిల్లాలో పౌరసరఫరాలశాఖ పరిధిలో 7.8 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. కొత్తగా మరో 22 వేల కార్డులను జన్మభూమి గ్రామసభల్లో పంపిణీకి సిద్ధం చేశారు. ఈ కార్డుదారులందరికీ సంక్రాంతి, క్రిస్మస్ పర్వదినాలు సందర్భంగా ఉచితంగా చంద్రన్న కానుకలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో బెల్లం, శనగపప్పు, గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, నెయ్యి ఉన్న బ్యాగులను లబ్ధిదారులకు అందించాలని సంకల్పించారు. క్రిస్మస్ ముందుగా రావడంతో క్రైస్తవులకు సరుకులను పంపిణీ చేశారు. ఎంతో ఆర్భాటంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటి పంపిణీ చేపట్టారు. అయితే సరకులు అందుకున్న లబ్ధిదారుల్లో సంతోషం ఎంతసేపోలేదు. ఇంటికెళ్లి చూసే సరికి ఖరీదు పెరిగిన కందిపప్పులో రాళ్లు కలిశాయి. బెల్లం నీరుగారి పోయింది. గోధుమపిండిలో పొట్టుకలసిపోయింది. నెయ్యి అదోరకమైన వాసనతో రుచి లేకుండా ఉంది. పండుగ వేళ ఇలాంటి సరుకులతో పదార్థాలు వండుకుంటే అనారోగ్యం పాలవకతప్పదని పలువురు అంటున్నారు. నాణ్యత లేకుండా ఈ సరుకులు జిల్లాకు సరఫరా కావడంతో దిక్కుతోచని అధికారులు వచ్చిన సరకులు వచ్చినట్టు పంపిణీ చేసి చేతులు దులుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పంపిణీకి సిద్ధం జిల్లాలో గురువారం నుంచి సంక్రాంతికి చంద్రన్నకానుకలు పంపిణీ చేయనున్నారు. అందుకోసం 421.65 క్వింటాళ్ల బెల్లం, 39.8 కిలోలీటర్ల పామాయిల్, కందిపప్పు 404.9 క్వింటాళ్లు, గోధుమపిండి 418.625 కింటాళ్లు, 418 క్వింటాళ్లు, నెయ్యి 83.61కిలోలీటర్లు జిల్లాకు చేరాయి. జిల్లాలో క్రిస్మస్ సమయంలో పంపిణీ చేసిన వారికి సంక్రాంతి జాబితాల నుంచి తొలగించి పంపిణీ చేయనున్నారు. -
చంద్రన్నకానుకలో అవినీతి
-
'సాక్షి' కథనానికి స్పందించిన చంద్రబాబు
-
‘చంద్రన్న కానుక’లో తవుడు
-
‘చంద్రన్న కానుక’లో తవుడు
గుమ్మల క్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల్లో గోధుమల స్థానంలో తవుడు వచ్చినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఈ మేరకు దుడ్డుఖల్లుకు చెందిన కొండగొర్రి పార్వతి అనే మహిళకు ఇచ్చిన గోధుమ పిండిలో సగభాగం ధాన్యం పొట్టు ఉండటంతో ఆదివారం గ్రామంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న అధికారులకు చూపిస్తూ, ఇవేనా చంద్రన్న ఉచిత సరుకులు.. అని ఆమె ప్రశ్నించారు. పశువులకు ఇవ్వాల్సిన తౌడు మనుషులకు ఇచ్చారేమిటని, ఇలాంటి సరుకులు ఇచ్చినా ప్రయోజనమేమిటని ఆమె అధికారులను నిలదీశారు. ఇదేనా ప్రభుత్వానికి పేదపై ఉండే అభిమానం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చంద్రన్న కానుకల్లో భారీ అవినీతికి రంగం సిద్ధం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న కానుకల్లో మరోసారి భారీ అవినీతికి రంగం సిద్ధమైంది. సుమారు రూ.400 కోట్ల మేరకు హాంఫట్ చేసేందుకు సర్వం సమాయత్తం అయింది. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఈ తతంగం అంతా నడుస్తోంది. అక్రమార్కులు నిన్నటి నుంచే ఓ హోటల్లో మకాం వేశారు. హోటల్లో మకాం వేసిన అక్రమార్కులు 60 ల్యాప్ ట్యాపుల ద్వారా ఈ-టెండర్‌కు వేస్తున్నారు. ఇక రివర్స్ బిడ్ పేరులో కూడా భారీగా రింగ్ అయ్యారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. చంద్రన్న కానుక ద్వారా 6 వేర్వేరు రకాలు...ఒకో వస్తువుకు ఒక్కో నిబంధన ఉంది. (చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట అర కిలో కందిపప్పు, కిలో శెనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, అరకిలో పామోలిన్, 100 గ్రాముల నెయ్యి ఇలా ఆరు రకాల వస్తువులను అందిస్తారు) ఒక దానిపై ట్యాక్స్, మరో దానిపై ట్యాక్స్ లేకుండా పరాయి రాష్ట్రంలో కొందరు వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషీలో వ్యక్తులకు సంబంధాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకూ పంపకాలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా చంద్రన్న కానుకలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
సరుకులిచ్చిన నెలకు..సంచులొచ్చాయ్!
పాలకొండ: సంక్రాంతి వెళ్లి నెలైంది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో సర్కారు ఆర్భాటంగా సరఫరా చేసిన సరుకులూ జీర్ణమైపోయాయి. కానీ ఆ సరుకుల సరఫరాకు ఉద్దేశించిన సంచులు తీరిగ్గా ఇటీవల మండలాలకు చేరాయి. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు ఆ మూటలు సైతం విప్పకుండా కార్యాలయాల్లో అలాగే ఉంచేశారు. వీటి విలువ ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైనే ఉంటుంది. ఇవన్నీ వృథా అయినట్లే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చెబుతూ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం ఇటువంటి అనవసర ఆర్భాటాలకు పోయి కోట్లాది రూపాయలు వృథా చేయడమెందుకున్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రలో తొలి సంక్రాంతిని ప్రభుత్వపరంగా జరుపుతామంటూ సంబరాల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అందులో భాగంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్‌కార్డుదారులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. వాటిని గిఫ్ట్ ప్యాక్‌గా అందించేందుకు చంద్రబాబు ఫొటోతో సంచుల తయారీకి కూడా పురమాయించింది. జనవరి 10-14 తేదీల మధ్య లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. అయితే నిర్దేశించిన అన్ని రకాల సరుకులు పూర్తిస్థాయిలో అందకపోవడం, అందినవి నాసిరకంగా ఉండటం విమర్శలపాలైన విషయం తెలిసింది. దాన్ని పక్కన పెడితే సరుకుల ప్యాకింగ్‌కు నిర్దేశించిన సంచులు సకాలంలో అందకపోవడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లు సొంత డబ్బులతో పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి సరుకులను ప్యాక్ చేసి లబ్ధిదారులకు అందించారు. సంక్రాంతి సంబరాలు ముగిసి సంచుల విషయం అందరూ మరచిపోయిన తరుణంలో ఇటీవల సంచులు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని మూడు నాలుగురోజుల క్రితం మండల కేంద్రాలకు పంపించారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక స్థానిక అధికారులు మూలన పడేశారు. జిల్లాలో తెల్ల రంగు, అంత్యోదయ, అన్నపూర్ణ, చేనేత కేటగిరీలకు చెందిన 785056 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటితోపాటు 52వేల గులాబీ కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహాయించి మిగిలిన వాటికి ఉచిత సరుకులు అందించారు. ఈ లెక్కన కార్డుకు ఒకటి చొప్పున 785056 సంచులు అందాయి. వీటి తయారీ బాధ్యతను ఒక్కో సంచికి రూ.14 రేటుకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సరుకుల సరఫరా సమయంలో ఇది అందకపోవడం, ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేకపోవడంతో వీటి కోసం చేసిన ఖర్చు వృథా అయినట్లే. జిల్లాకు అవసరమైన సంచుల తయారీకి రూ. 1.99 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అయితే కొన్ని ప్రాంతాలకు సంచులు సకాలంలో అందినట్లు చెబుతుండగా.. ఎలా చూసుకున్నా రూ.కోటికి పైగా వృథా అయ్యిందని అంటున్నారు. సకాలంలో అందని సంచుల తయారీ ఆర్డర్‌ను అప్పుడే రద్దు చేసి ఉంటే ఈ ఖర్చు మిగిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘చంద్రన్న కానుక’తో రూ. 350 కోట్లు వృథా
అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి గుత్తి: సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చిన ‘చంద్రన్న కానుక’ వల్ల రూ. 350 కోట్లు వృథా అయ్యాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘అమ్మహస్తం’ పేరుతో రూ. 185లకు తెల్లరేషన్ కార్డు దారులకు అందించిన విధంగానే ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉచితంగా ఆరు సరుకులు అందించారన్నారు. గత సీఎం కిరణ్ ప్రజలకు అన్ని చేసి ఇప్పుడెక్కడున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయి..హుదూద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయి లోటు బడ్జెట్లో ఉందని, ఇలాంటి సమయంలో ఉచిత కార్యక్రమాలు వద్దని తాను సీఎంకు చెప్పానన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ రూ. 350 కోట్లు ఖర్చ చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజలకు ఉచితంగా సంచులు ఇచ్చే వరకే ప్రభుత్వం గుర్తుంటుందని, ఆ తర్వాత మరచిపోతారని జేసీ అన్నారు. ఈ విషయాన్ని బాబుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. -
కాలం చెల్లిన పిండి.. 'చంద్రన్న కానుక'గా..!
-
చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు
చిత్తూరు జిల్లా సత్యవేడులో సంక్రాంతికి చంద్రన్న కానుకగా ఇచ్చిన పదార్థాలు తిని అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు స్పందించారు. సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో గడువు తీరిన (ఎక్స్పైర్ అయిన) సరుకులు కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని నిర్ధారించారు. అస్వస్థతకు గురైన బాధితులను తహసిల్దార్ సత్యనారాయణ నాయుడు, ఇతర సిబ్బంది పరామర్శించారు. ఈ సరుకులను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
చంద్రన్న కానుకతో.. 30 మంది ఆస్పత్రిపాలు
తిరుపతి: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన 'చంద్రన్న సంక్రాంతి కానుక' గిఫ్ట్ ప్యాక్ లో పంపిణీ చేసిన కానుకలు వికటించాయి. చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ఏపీ ప్రభుత్వం చంద్రన్న కానుకల పేరుతో పంపిణీ చేసిన పదార్థాలు తిని 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సత్యవేడులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారంతా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చంద్రన్న కానుక పంపిణీలో తేడాలు
ముత్తుకూరు : భోగి పండగ రోజుకు కూడా పల్లెల్లోని రేషన్‌షాపు డీలర్లకు, పేదలకు సక్రమంగా చంద్రన్న సంక్రాంతి కానుక చేరలేదు. దీంతో బుధవారం కానుక పంపిణీలో జరిగిన తేడాపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలం మామిడిపూడి రేషన్‌షాపులో వీఆర్వో లక్ష్మి ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ ప్రారంభించారు. అయితే మూడు సరుకులు మాత్రమే పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహించారు. ఇచ్చిన సరుకులు వాపసు చేసి, పంపిణీ నిలిపివేశారు. తహశీల్దార్ చెన్నయ్యకు ఫోన్లో సమాచారం అందించారు. ఈ క్రమంలో వెంటనే నూనె, నెయ్యి ప్యాకెట్లు తెప్పించారు. బెల్లం మాత్రం చేరలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సరుకుల పంపిణీ చేయించారు. బస్తాల్లో వచ్చిన సరుకుల తూకంలో తేడాకు, నాసిరకం సరుకులపై పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. సరుకుల సంచులకు డబ్బు వసూలు చేశారు. బండ్లపాళెం, తాళ్లపూడి గ్రామాల్లో ఇదే తరహా విమర్శలు వచ్చాయి. -
ప్రచార ఆర్భాటమే.. కానుక కొందరికే..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాఫీ మోసాన్ని మరిపించటానికి ముఖ్యమంత్రి కొత్త పథకం వేశారు. అదే చంద్రన్న సంక్రాంతి కానుక. అందుకు రూ.315 కోట్లు ఖర్చుచేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ నిధులు తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి కానుకకోసం కేటాయించిన నిధులనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు జిల్లాలో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ తీరే నిదర్శనం. జిల్లాలో 8.24 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే చంద్రన్న సంక్రాంతి కానుకలు జిల్లాకు వచ్చింది కేవలం 2.50 లక్షల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం. వాటికి 2 లక్షల సంచులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వచ్చిన అరకొర సరుకులనే ‘సముద్రంలో ఇంగువ’ కలిపినట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చిన సరుకులను సైతం కొన్నిచోట్ల డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. బోగోలు మండలంలో చంద్రన్న సంక్రాంతి కానుకలను బ్లాక్‌మార్కెట్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో సంచికి రూ.20 వసూలు చేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో మూడు సరుకులే పంపిణీ చేస్తున్నారు. అందులో గోధుమ పిండి, నెయ్యి, కందిపప్పు ఇవ్వటం లేదు. మరి కొన్నిచోట్ల బెల్లం, శనగలు, గోధుమపిండిని సంచుల్లో రేషన్‌షాపులకు చేర్చారు. దీంతో ఆయా డీలర్లు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్‌చేసి అలాగే ఇచ్చి పంపేస్తున్నారు. సంచులు ఇవ్వమని అడిగితే.. ‘సంచులు లేవు.. గించులు లేవు’ అని తిట్టి పంపేస్తున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూకాల్లో మోసం... మర్రిపాడు మండలంలోని రామానాయుడుపల్లిలో రేషన్‌షాపులో చంద్రన్న కానుకలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు లబ్దిదారులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తూకాల్లో మోసం చేస్తుండడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీలర్లు తమ చేతివాటం చూపి ప్రతి సరకు 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఉదయగిరి-నెల్లూరు రహదారిపై గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మర్రిపాడు తహశీల్దారు ఎంవీ కృష్ణారావు గ్రామంలో పర్యటించి విచారణ జరిపి తూకాల్లో మోసాలు వాస్తవమని నిర్ధారించుకున్నారు. అనంతరం రేషన్‌షాపును సీజ్ చేశారు. ఇలా జిల్లాలో అనేక ప్రాంతాల్లో 100, 150, 200, 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సా... గుతున్న పంపిణీ.. పండగకు ఒకరోజు ముందే సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా.. చంద్రన్న సంక్రాంతి కానుక ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల బుధవారం రాత్రి వరకు పంపిణీ జరిగింది. మరి కొన్ని చోట్ల సరుకులు పంపిణీ చేయలేదు. సరుకులు చాలకపోవటంతో పంపిణీ నిలిపివేశారు. సరుకులు వచ్చాక పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పి కార్డుదారులను తిప్పి పంపేశారు. జిల్లాలో అనేకచోట్ల సంక్రాంతి పండగకు చంద్రన్న కానుక అందే పరిస్థితి కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే... అధికారులు మాత్రం సరకులన్నీ వచ్చాయి.. పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం. -
కానుక కొందరికే
పేదలకు అరకొరగానే చంద్రన్న ‘కానుక’ పంపిణీ ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం.. ప్రణాళిక లోపంతో అస్తవ్యస్తం కార్డుదారుల్లో 60 శాతం మందికి కూడా అందని సంక్రాంతి సరుకులు పలుచోట్ల మూడు, నాలుగు వస్తువుల పంపిణీతో సరిపెట్టిన వైనం నాణ్యత నాసిరకం.. కరిగిపోయిన బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు చాలా చోట్ల నెయ్యి లేదు.. వస్తువుల తూకం కూడా తగ్గిన ఉదంతాలు సంచులు లేవు.. లబ్ధిదారుల చేతుల్లోనే సరుకులను పెడుతున్న వైనం అందని వారికి పండుగ తర్వాత సరుకులు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పండుగ నాటికి తెల్లకార్డుదారులందరికీ.. ఆరు సరకులు ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు పదేపదే చెప్పినా ఆచరణలో పూర్తిగా అమలు చేయలేకపోయారు. గురువారం సంక్రాంతి పండుగ కాగా.. బుధవారం సాయంత్రానికి తెల్లకార్డుదారుల్లో 60% మందికి కూడా పంపిణీ జరగలేదు. సకాలంలో జిల్లాలకు సరుకులు పంపాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోవడంతో అంతటా గందరగోళం నెలకొంది. చాలా జిల్లాలకు మంగళవారం సాయంత్రం వరకూ సరుకులు తరలిస్తూనే ఉన్నారు. పలు జిల్లాల్లో తెల్లకార్డుల సంఖ్యకు అనుగుణంగా సరుకులు ఇవ్వలేదు. దీంతో అనేక చోట్ల ఆరు సరుకులకు గానూ మూడు, నాలుగు సరుకులే ఇస్తున్నారు. నెయ్యి, కందిపప్పు చాలా మందికి అందడంలేదు. పలుచోట్ల ఇచ్చిన సరుకులు కూడా బాగా నాసిరకంగా ఉన్నాయి. పాకంలా కారుతున్న బెల్లం, ముక్కిపోయిన కందిపప్పు పంపిణీ చేశా రు. ఏ వస్తువులోనూ కొలత సరిగా లేదని రాష్ట్రమంతా వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్లో 25 గ్రాములు, అర కేజీ కందిపప్పుకు 450 గ్రాములు, కేజీ శనగలకు 850 గ్రాములు, అర లీటరు నూనెకు 400 గ్రాములు ఇలా ప్రతి వస్తువులోనూ తూకం తక్కువే ఉంది. ఈ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇస్తానన్న సంచులు రాష్ట్ర వ్యాప్తంగా 30% కూడా ఇవ్వలేదు. దీంతో పలుచోట్ల కార్డుదారుల చేతుల్లోనే వస్తువులను పెడుతుండగా, కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగుల్లో వాటిని ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ సరైన ప్రణాళికతో అమలు చేయనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులకు నెలవారీ సరుకులతో పాటు సంక్రాంతి కానుక అందలేదు. * విశాఖ జిల్లాలో 98 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు చెప్తున్నా ఇంకా చాలా గ్రామాల్లో సరుకులు అందలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ 60 శాతం జరిగినా ఎక్కువ మందికి మూడు, నాలుగు సరకులే అందాయి. * తూర్పుగోదావరి జిల్లాలో 15.19 లక్షల తెల్లకార్డుదారులకు సరకులు ఇవ్వాల్సివుండగా 75 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ లక్షన్నర మందికి నెయ్యి ప్యాకెట్లు అందలేదు. గోధుమపిండి, కందిపప్పు సగం మంది కార్డుదారులకు మాత్రమే వచ్చాయి. * పశ్చిమగోదావరి జిల్లాలో 11.27 లక్షల మందికి సరకులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పంపిణీ చేశారు. బుధవారం కూడా చాలా చోట్ల సరకులను డీలర్లకు అందివ్వలేకపోయారు. * కృష్ణా జిల్లాలో పంపిణీ దాదాపు పూర్తయినా తూకాల్లో తేడాలు రావడం, నాసిరకం వస్తువులు ఇవ్వడంతో కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని డీలర్ పాయింట్లకు స్టాకు అందలేదు. * ప్రకాశం జిల్లాలో మొత్తం 8.32 లక్షల మంది కార్డుదారులుండగా సగం మందికి ఇంకా సరకులను పంపిణీ చేయలేకపోయినా అధికారులు మాత్రం 95 శాతం పంపిణీ పూర్తయినట్లు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో బెల్లం కేజీ చొప్పున బ్లాకులు ఇవ్వడంతో వాటిని పగలగొట్టి సమానంగా ఇవ్వాల్సి రావడం డీలర్లకు తలనొప్పిగా మారింది. * నెల్లూరు జిల్లాలో 8.24 లక్షల మందికి చంద్రన్న కానుక ఇవ్వాల్సి ఉండగా 2.50 లక్షల మందికే సరకులు వచ్చాయి. * కర్నూలు జిల్లాలో మొత్తం 10.36 లక్షల కార్డులుండగా సుమారు 2 లక్షల మంది కార్డుదారులకు సంక్రాంతి కానుక అందలేదు. * అనంతపురం జిల్లాలో మండల స్టాకు పాయింట్ల నుంచి డీలర్లకు సకాలంలో సరకులు చేరలేదు. * సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 9.84 లక్షల తెల్లకార్డుదారులు ఉండగా 80 శాతం మందికే సరకులు వచ్చాయి. ఇప్పటివరకూ 60 శాతం మందికే సరకులు అందాయి. కడప జిల్లాలో పంపిణీ 70 శాతం వరకూ పూర్తయినా చాలా చోట్ల డీలర్లు కార్డుదారుల నుంచి రూ. 20 చొప్పున వసూలు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. -
'కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుక'
తిరుమల: రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రన్న కానుకపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే... లబ్దిదారులను అవమాన పరిచనట్లే అని పల్లె వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన తిరుమలలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణం ద్వారా ఆరు రకాల సరుకులను 'చంద్రన్న కానుక' పేరిట టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. -
‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి
సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగ నేపథ్యంలో పంపిణీ చేపిన ఉచిత సరుకులపై విజిలెన్స్‌తో గాని, ముగ్గురు సభ్యులతో కూడిన ఐఏఎస్ అధికారులతో గాని విచారణ జరపాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సరుకుల పంపిణీలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తెలు స్తోందన్నారు. ప్రభుత్వం అందించిన సరుకుల ధరల కన్నా.. స్థానిక, మార్కెట్లో ధరలే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అటువంటప్పుడు హోల్‌సేల్ గా కొనుగోలు చేస్తే వాటి ధర మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం ఉచిత సరుకులందిస్తున్నట్టు ప్రకటించిం దని, అప్పట్లో రూ. 287 కోట్ల అవసరమవుతున్నాయన్నారని, కానీ ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్టు చెబుతున్నారన్నారు. పం డగకు ఉచితంగా సరుకులందించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులైనా.. నాణ్యంగా లేవన్నారు. కొన్నిచోట్ల తక్కువ ధరకు వచ్చే పాలిష్డ్ పప్పు, ఇంకొన్ని చోట్ల నాశిరకంగా ఉందన్నారు. అలాగే 30 కోట్ల రూపాయలతో కొనుగోలుు చేసిన సరుకుల బ్యాగులు ఎక్కడా కానరాలేదన్నారు. మరీ బ్యాగులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. తూకంలో కూడా తగ్గుదల ఉన్నట్టు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన పథకాన్ని... ఎందుకు ఆదరాబాదరాగా చేపట్టాల్సి వచ్చిందో తెలి యడం లేదన్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. సంబరాలకెలా వస్తాం..?; ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే తాము సంబరాల్లో ఎలా పాల్గొంటామని రాజ న్నదొర ప్రశ్నించారు. పింఛన్లు పొందేం దుకు అన్ని అర్హతలున్నా అంద కపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది మనో వ్యాధితో మరణిస్తున్నారన్నారు. అధికారుల తప్పి దం వల్ల రాష్ట్రంలో 7 లక్షల కుటుంబా లు, జిల్లాలో 14 వేల కుటుంబాల రేషన్‌కార్డుల ఆధార్‌సీడింగ్ జరగకపోతే వారికి సరుకులు ఇవ్వడం లేదని, రైతుల రుణమాఫీ కూడా సక్ర మంగా అమలు చేయకపోవడంతో పాటు హుద్‌హుద్ తుపాను పంట నష్ట పరిహారాన్ని కూడా పాత బకాయిలకు బ్యాంకులు జమ చేస్తుంటే రైతులు పండగ ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేదని చెప్పారు. -
సగం మందికే చంద్రన్న సంక్రాంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రన్న సంక్రాంతి కానుక జిల్లాలో సగం మందికే పరిమితమైంది. ప్రతి పేదవాడూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చంద్రన్న సంక్రాంతి కానుకను ప్రకటించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. సరుకులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం, సరఫరాలో జాప్యం పథకాన్ని నీరుగార్చాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆరు సరుకుల్లో ఐదు రకాలే వచ్చాయి. కంది పప్పు 65 శాతమే జిల్లాకు చేరింది. మిగిలినది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 7,52,274 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 3 లక్షల మందికే చంద్రన్న సరుకులు అందాయి. మిగిలినవారికి అందాలంటే మరో మూడు రోజులు పడుతుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. కాగా జిల్లాలో సుమారు 32 వేల కార్డులు ఇన్ యాక్టివ్(ఆధార్ లేకపోవడం వంటి కారణాలతో)గా ఉన్నాయి అయితే ఈ కార్డుదారులందరూ పేదవారే, వీరికి బయోమెట్రిక్ కార్డులు కూడా ఉన్నాయి. ఇటీవల తుపాను పరిహారం కూడా వీరికి అందజేశారు. సంక్రాంతి చంద్రన్న సరుకులను మాత్రం వీరికి అందజేయడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ఈ కార్డుదారులు సంక్రాంతి కానుకకు దూరమయ్యారు. ఆధార్ లేకపోవడం, సకాలంలో ఆధికారులు సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈ కార్డులు ఇన్ యాక్టివ్‌గా ఉండిపాయాయి. ఆదే విధంగా మరో పదివేల కార్డులు ఇటీవల రద్దయ్యాయి. వీటికి కూడా సరుకులు అందే అవకాశం లేదు. కాగా కందిపప్పు వంటి కొన్ని సరుకులు నాసిరకానివి రావడంతో వాటిని వెనక్కి పంపుతున్నారు. మొత్తం మీద జిల్లాలో 3 లక్షల మందికే సరుకులు అందజేశారు, కొన్ని గ్రామాల్లో మూడు సరుకులు, మరికొన్ని గ్రామాలకు ఐదు సరుకులు అందిజేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. -
‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ * సింగపూర్‌కు వందెకరాలివ్వడం దారుణం సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చంద్రన్న కానుక’కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.280 కోట్లలో 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ప్రజలకు సరఫరా చేస్తున్న మొత్తం ఆరు రకాల సరుకుల మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కందిపప్పు, బెల్లం, నెయ్యి మార్కెట్ ధరలకు, టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలకు బాగా వ్యత్యాసం ఉందని చెప్పారు. సరుకులన్నీ పెట్టి ఇచ్చే గిఫ్ట్ సంచుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఒక గిఫ్ట్ సంచి ధర మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 ఉంటే ప్రభుత్వం దాన్ని రూ.11.60 పైసలకు కొనుగోలు చేసిందని చెప్పారు. సంచుల కొనుగోలులో రూ.8 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందన్నారు. చౌక డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు సొంత సంచులను తీసుకెళుతుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వం గిఫ్ట్ సంచులను ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ మంత్రి అనుచరుడికి దోచి పెట్టడానికే ఈ సంచులను కొనుగోలు చేశారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ సంచుల కొనుగోలుకు ఎందుకు తగలేశారని ప్రశ్నించారు. కందిపప్పులో రూ.12 కోట్లు, నెయ్యి కొనుగోలులో రూ.26 కోట్లు, సంచుల్లో రూ.8 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇవిగాక బెల్లాన్ని కూడా మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు, తెలుగు తమ్ముళ్లకు, ఎన్నికల్లో తనకు నిధులు సమకూర్చినవారికి ఆర్థికలబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ఉపయోగపడిందని పేర్కొన్నారు. దీన్ని ప్రజలకిచ్చిన చంద్రన్న కానుక అనాలా లేక చంద్రబాబు హెరిటేజ్‌కు, తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పండుగ కానుక అనాలా.. అని ఎద్దేవా చేశారు. చంద్రన్న కానుక వ్యవహారం చూస్తే పోకిరి సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం బిచ్చగాడికి అర్ధరూపాయి వేసి పండుగ చేస్కో.. అన్నట్లుగా ఉందన్నారు. సంక్రాంతికి రైతుల ఇళ్లకు అల్లుళ్లు, కు మార్తెలు, బంధువులంతా వస్తారని, ఏ ఇంట్లో నూ పదిమందికి తక్కువుండరని.. వారు వంటలు వండుకోవడానికి ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సరుకులు ఏంసరిపోతాయని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి వందెకరాల భూమి ఇవ్వడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఉచిత సేవలందించడానికి సింగపూర్ కంపెనీలేమైనా మనకు బంధువులా అని తొలుత కూడా తాము ప్రశ్నించామని, ఈ వందెకరాలు ఇస్తుంటే అసలు విషయం బయటపడుతోందని ఆయన చెప్పారు. -
గోరంత సాయం.. కొండంత ప్రచారమా!
రైతులు, మహిళల కుటుంబాల్లో చీకట్లు నింపి చంద్రబాబు మాత్రం సంక్రాంత్రి చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, పంటలు పండక రైతులు కష్టాల్లో ఉంటే ఆయనకు మాత్రం పండుగ వెలుగులు కావాల్సి వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సంక్రాంతి వెలుగులు కేవలం తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నేతలకేనని.. ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో గోరంత సాయం చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బ్రహ్మానందం సినిమాల్లో కామెడీ చేస్తుంటే..చంద్రబాబు ప్రజలను కామెడీ చేస్తున్నారని తెలిపారు. చంద్రన్న కానుక పేరుతో రూ. 60 నుంచి రూ.70 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని మోహన్ రెడ్డి విమర్శించారు. -
నెయ్యితో పప్పన్నం డౌటే!
ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని తెల్లరేషన్ కార్డుల వారందరికి ఉచితంగా ఇవ్వనున్న చంద్రన్న కానుకలో భాగంగా కందిపప్పు అరకేజీ, పామాయిల్ అరకేజీ, బెల్లం అరకేజీ, నెయ్యి 100 గ్రాములు, గోధుమపిండి కేజీ, శనగలు కేజీతో కూడిన సంచి ఇవ్వాలని, ఈనెల 12వ తేదీ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 14 మార్కెట్ యార్డులలో రెండురోజుల పాటు ప్యాకింగ్ నిర్వహించినప్పటికీ పూర్తికాలేదు. బెల్లం ప్యాకింగ్‌కు ఇచ్చే చార్జి తమకు గిట్టుబాటు కాదని మహిళలు ప్యాకింగ్ మధ్యలో ఆపేశారు. కందిపప్పు అరకేజీ ప్యాక్ చేసేందుకు 25 పైసలు, అరకేజీ బెల్లం ప్యాకింగ్‌కు 50 పైసలు చొప్పున ఇస్తామని అధికారులు చెప్పటంతో తమకు చాలదంటూ మహిళలు ప్యాకింగ్‌కు రావడానికి ఇష్ట పడటం లేదు. బెల్లం గడ్డలు పగులకొట్టి ప్యాకింగ్ చేయాలి కాబట్టి అరకేజీ ప్యాకింగ్‌కు రెండు రూపాయలు ఇవ్వాలని అడ గటంతో అధికారులు ఆ బాధ్యతలను డీలర్లకు అప్పగించారు. స్థానిక డ్వాక్రా మహిళలతో పాటు జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేయించుకుని ప్రజలకు అందించాలని అధికారులు డీలర్లను ఆదేశించారు. కానీ అధికారులు అనుకున్న స్థాయిలో ప్యాకింగ్ ముందుకు సాగటం లేదు. మంచినూనె మాత్రం అరకేజీ ప్యాకింగ్‌తో రావటంతో అధికారులకు కొంత ఊరట కలిగించింది. మిగిలిన ఐదు సరుకులు ప్యాకింగ్ చేయటమే అధికారులకు పెద్ద సమస్యగా మారింది. అరకొరగా సరుకులు జిల్లావ్యాప్తంగా 48 మండలాలలో 11లక్షల 27వేల 551 మందికి 2వేల 122 రేషన్ షాపుల ద్వారా చంద్రన్న కానుక అందించాల్సి ఉంది. దీనికి 570 టన్నుల బెల్లం అవసరం ఉండగా 370 టన్నులే అందుబాటులో ఉంది. మరో 200 టన్నుల బెల్లాన్ని రప్పించినా నాసిరకంగా ఉండటంతో అధికారులు శుక్రవారం ఏలూరు మార్కెట్ యార్డు నుంచి తిప్పి పంపేశారు. దాని స్థానంలో మంచి బెల్లాన్ని అర కేజీ ప్యాకింగ్ ద్వారా అందించాలని పంపిణీదారుడికి అధికారులు సూచించారు. శనగలు 1127 టన్నులు అవసరం కాగా 700 టన్నులు మాత్రమే వచ్చారుు. నెయ్యి 112 టన్నులకు 45 టన్నులు, కందిపప్పు 570 టన్నులకు 300 టన్నులు, గోధుమపిండి 1127 టన్నులకు 450 టన్నులు మాత్రమే వచ్చింది. అధికారులకు తిప్పలు సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ప్రజలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్ 9963479152ను కేటాయించారు. ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచితే తమకు ఈ తిప్పలు తప్పేవని జిల్లాకు చెందిన ఒక అధికారి తన సిబ్బంది వ్యాఖ్యానించటం వెనుక అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది. ఆదివారం జిల్లాలో కొన్నిచోట్ల చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ లాంఛనంగా ప్రారంభించినా ఆరు సరుకులను మాత్రం అందించలేదు. కొన్నిచోట్ల మూడింటిని ఇచ్చి మిగిలినవి వచ్చాక ఇస్తాం అని డీలర్లు చెప్పారు. పూర్తిస్థాయిలో సరుకులు సోమవారం వస్తాయి చంద్రన్న కానుక కు ఇచ్చే సరుకులలో పామాయిల్ పూర్తి స్థారుులో వచ్చింది. మిగిలిన సరుకులు 70 శాతం వచ్చాయి. 30 శాతం సోమవారం ఉదయానికి వచ్చే ఏర్పాట్లు చేశాం. వచ్చిన వెంటనే ఆయా రేషన్‌షాపులకు పంపిస్తాం. కొంత ఆలస్యం అయినా పూర్తిస్థాయిలో తెల్లరేషన్‌కార్డు దారులందరికీ చంద్రన్న కానుక అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద మొత్తంలో సరుకులు తీసుకువచ్చి ప్యాకింగ్ చేయూల్సి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. జిల్లాకు ప్రస్తుతం వచ్చిన సరుకులన్నీ ప్యాకింగ్ నిమిత్తం డీలర్లకు పంపించి వేశాం. వారు డ్వాక్రా మహిళలు, జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేరుుస్తున్నారు. - డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
కార్డులు మూడు వేలు..కానుకలు నూరు లోపు
సాక్షి, రాజమండ్రి : ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పంపిణీని ఆదివారం ఆర్భాటంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఆదివారం నాటికి జిల్లాకు కేవలం మూడు సరుకులు-గోధుమపిండి, శనగలు, నూనె- మాత్రమే గోదాములకు చేరాయి. ప్రారంభం సందర్భంగా కొన్ని చోట్ల మాత్రమే ఆరు సరుకులు పంపిణీ చేయగా అనేక చోట్ల మూడింటితోనే సరిపెట్టారు. ఇక ఆ మూడు సరుకులూ ప్రతి చౌక డిపోలో ఉండే సుమారు మూడు వేల కార్డులకు వందలోపు కార్డులకు సరిపడా మాత్రమే సరుకులు వచ్చాయి. మిగిలిన బెల్లం, కందిపప్పు, నెయ్యితో పాటు పూర్తిస్థాయిలో సరుకులు ఎప్పుడొస్తాయో అధికారులూ చెప్పలేక పోతున్నారు. పట్టుమని పది మందికి కూడా పంపిణీ చేయకుండానే సరుకులు నిండు కోవడంతో తెల్లకార్డుదారులను డీలర్లు సోమవారం రమ్మంటున్నారు. దీంతో చంద్రన్న మాట నమ్మి పండుగకు సరుకులు కొనుక్కోనక్కరలేదని సంబరపడ్డ పేదలు నిరాశ చెందుతున్నారు. కాగా ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన వారికి సరుకులు సంచుల్లో ఇవ్వగా త ర్వాత వారికి డీలర్లు ప్లాస్టిక్ కవర్లలో పోసి ఇస్తున్నారు. అదేంటంటే సంచుల్లేవంటున్నారు. జిల్లాలోని 19 ని యోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో 15.20 లక్షల రేషన్ కార్డులకు చంద్రన్న కానుకలు అందాల్సి ఉండగా ఆదివారానికి గోదాములకు లక్షన్నర ప్యాకెట్లు కూడా చేరలేదు. వాటిలో 50 వేలైనా పంపిణీ కాలేదు. పంపిణీ తీరిలా.. ఏజెన్సీలో అడ్డతీగల ప్రాంతంలో 20 వేల కార్డులకు 15 ప్యాకెట్లు.. అవీ మూడు సరుకులతోనే పంపిణీ చేశారు. రాజమండ్రిలో మూడు వేల కార్డులుండే ఒక్కో దుకాణానికీ 50 నుంచి 70 కార్డులకే మూడు సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రానికి మిగిలిన స రుకులు చేరితే సోమవారం సాయంత్రానికల్లా రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తామని అధికారులంటున్నారు. జిల్లాలోని 2,100 దుకాణాల్లో 1,500 దుకాణా ల డీలర్లు అన్ని సరుకులూ వచ్చాకే పంపిణీ చేద్దామని ఉన్న మూడు సరుకులు కూడా పంపిణీ చేయలేదు. ఆదివారం మండపేట రావులపేట రేషన్ డిపోలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సరుకుల పంపిణీ ప్రారంభించి కేవలం 20 మందికి మాతమే పంపిణీ చేశారు. వేచి ఉన్న మహిళలు తమకూ సరుకులు ఇమ్మంటే సోమవారం రమ్మని పంపేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి నియోజక వర్గంలోని నాలుగు గ్రామాల్లో పంపిణీ ప్రారంభించారు. కేవలం పంపిణీ కోసమేనన్నట్టు డిపోల వద్ద 100 సంచులు మాత్రమే సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో గోధుమపిండి, నూనె, శనగలు ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి డిపోకు వంద నుంచి 150 మందికి పంపిణీ చేశారు. అయినవిల్లి మండలంలో 41 డిపోలకు కేవలం 29 డిపోలకు అదీ రెండు సరుకులు మాత్రమే అందచేశారు. ప్యాకింగ్ తలపోటు మాకొద్దు.. పండుగ మూడు రోజులుందనగా హడావిడిగా సరుకులు కార్డుదారులకు చేర్చాలన్న అధికారుల ప్రయత్నాలను డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. ముందు కానుకలను సంచుల్లో ప్యాక్ చేసి పంపమని చెప్పగా ఇప్పుడు సరుకు లూజుగా సరఫరా చేసి, తమనే ప్యాక్ చేసి పంపిణీ చేయమంటున్నారని వాపోతున్నారు. తమకున్న సిబ్బందితో ఆ పని సాధ్యం కాదంటున్నారు. -
సమ్‌క్రాంతి
సంక్రాంతి పండగ వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘చంద్రన్న కానుక’ పేరిట గిఫ్ట్ ప్యాక్‌లు ఇస్తారు..పండగ బాగా జరుపుకోవచ్చని భావించిన లబ్ధిదారులకు అశనిపాతమే అయింది. విజయనగరం కంటోన్మెంట్: చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమం జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. గత కొన్ని రోజులుగా పండగ కానుకపై పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూసినప్పటికీ పంపిణీ ఆ స్థాయిలో లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. పలు గ్రామాల్లో అరకొర సరుకుల పంపిణీతో డీలర్లు వినియోగదారులకు పంపిణీ చేయలేకపోయారు. సరుకుల కొరతతో లబ్ధిదారుల కుసమాధానం చెప్పలేక అధికారులు కూడా మొహం చాటేశారు. జిల్లాలో 6.4 లక్షల తెల్ల కార్డులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను ఆదివా రం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆదివారం సాయంత్రంవరకూ ఏ ఒక్క సరుకూ పూర్తిగా రాలే దు, కందిపప్పు, నెయ్యి, అరకొరగా రాగా మిగతా సరుకులన్నీ 60నుంచి 70శాతం మాత్రమే వచ్చాయి. బెల్లం పంచేసుకోండి.. సాలూరు నియోజకవర్గంలోని మక్కువలో బెల్లం అరకిలో ఇవ్వడానికి బదులుగా బెల్లం దిమ్మలు ఇచ్చి పంచుకోమనడంతో డీలర్లు ఆ తతంగమంతా మేం పడలేమంటూ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఈ ప్రాంతంలో సరుకుల పంపిణీని వాయి దా వేశారు. అదేవిధంగా పాచిపెంటలో కందిపప్పు కొరత ఉండడంతో పంపిణీ చేపట్టలేదు. తూకంలో కోతలు కురుపాంనియోజకవర్గంలో కందిపప్పు, బెల్లం సరుకులు అరకిలో బదులు ప్రతి ప్యాకింగ్‌లోనూ 150 నుంచి 200 గ్రాములు తక్కువగా వచ్చాయి. మహిళా గ్రూపులకు ఈ సరుకుల ప్యాకింగ్ ఇవ్వడంతో చాలీచాలని సరుకులను ఈ విధంగా వారు సరిపెట్టి గ్రామాలకు పంపిణీ చేశారు. మంత్రి నియోజకవర్గంలోనూ అంతే.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు ఇంకా సరుకులు చేరుకోలేదు. ఈ నియోజకవర్గంలో కందిపప్పు, గోధుమపిండి ఇంకా రాకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేవలం చీపురుపల్లి పట్టణంలోని నాలుగు డిపోల్లో మాత్రమే పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ఎలా ఉందన్న విషయమై దృష్టి సారించలేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎందుకీ ప్రకటనలంటూ విమర్శిస్తున్నారు. పార్వతీపురం నియోజవకర్గంలో సరుకులు దాదాపు వచ్చినా గ్రామస్థాయికి ఇంకా చేరుకోలేదు. చాలాగ్రామాల్లో ఉచితంగా ఇస్తారన్న విషయం కూడా తెలియదు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కందిపప్పు, నెయ్యి కొరత ఉండగా శనగలు, బెల్లం తూకం తక్కువగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విజయనగరం నియోజకవర్గంలో కందిపప్పు, నెయ్యి ఇంకా దిగుమతి కాలేదు. దీంతో కొన్ని చోట్ల వచ్చిన సరుకులు మాత్రమే ఇవ్వగా..మిగతా చోట్ల అన్ని సరుకులూ వచ్చాక ఇస్తామని డీలర్లు రేషన్ షాపులో స్టాకు ఉంచి కూర్చున్నారు. ఒక్క ఎస్.కోట నియోజకవర్గంలో మాత్రమే అన్ని రకాల సరుకులూ రావడంతో పూర్తిస్థాయిలో పంపిణీ చేపట్టారు, బొబ్బిలి నియోజకవర్గంలో చాలా గ్రామాలకు ఇప్పటికీ సరుకులు చేరుకోలేదు. మాకేమీ తెలీదు బాడంగి మండలం లక్ష్మీపురం, పెదపల్లి, డొంకినవలస గ్రామాల్లో చంద్రన్న సంక్రాంతి కానుక ఉచిత సరుకులు ఇస్తారన్న విషయం కూడా తెలియదని పలువురు చెప్పడం విశేషం. సాలూరు పట్టణంలోని పలు వార్డుల్లో శనగలు, కందిపప్పు తూకంలో తక్కువ వస్తోందన్న విమర్శలు వినిపించాయి. గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రామస్థాయికి సరుకులు చేరుకోలేదు. గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు ఈ సరుకులు ఎప్పుడు ఇస్తారోనని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఆదివారం నుంచి పంపిణీ చేయాల్సిన ఈ సరుకులు ఆదివారం సాయంత్రానికి కూడా చేరుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
సరుకులు.. సర్దేదెలా?
ప్రొద్దుటూరు: సంక్రాంతికి చంద్రన్న కానుక అందేది అనుమానమే... ఆరు సరుకులు ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం మాట నెరవేర్చేందుకు అధికారులు, డీలర్లు కిందామీదా అవుతున్నారు. కేజీ, అరకేజీలుగా ఇవ్వాల్సిన సరుకులు బస్తాలు, 10 కేజీల రూపంలో రావడంతో వాటిని విడగొట్టి ప్యాకెట్లలో సర్దడం ఎలా అని తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం గోడవున్లకు చేరిన సరుకులు రెండు రోజుల్లో డీలర్ల ద్వారా వినియోగదారులకు అందించడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నారుు. నిజామాబాద్ జిల్లా నుంచీ ప్రొద్దుటూరు గోడౌన్‌కు సరఫరా అయిన బెల్లం కేక్‌లు ఒక్కొక్కటి 10 కిలోలుగా ఉంది. నిబంధనల ప్రకారం మిగతా వస్తువులతో పాటు రేషన్ కార్డుదారునికి అరకిలో బెల్లం అందించాల్సి ఉంది. అయితే అధికారులు విడిగా ప్యాక్ చేయకుండా ఇదిగో ఇలా గోడౌనుకు చేర్చారు. అత్యవసరంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచే కానుక వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు నేరుగా ఈ బెల్లం కేక్‌లను డీలర్లకు చేరవేస్తున్నారు. డీలర్ల ఇళ్లకు సరకులు చేరిన తర్వాత డ్వాక్రా మహిళలను నియమించి ఈ బెల్లం కేక్‌లను పగులగొట్టించి అరకిలో చొప్పున ప్యాక్ చేయించి వినియోగదారులకు ఇవ్వాలట. ఈ బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ కేక్‌లను పగులగొట్టి20 ప్యాకెట్లలో నింపడం అంత సులువైన పనా. కేవలం బెల్లం మాత్రమే కాదు గోధుమ పిండి, కందిబేడలు, శనగలు కూడా 100 కిలోల బస్తాల్లో వచ్చాయి. వీటన్నిటినీ ఇలాగే డీలర్లకు అప్పగించి డ్వాక్రా మహిళల ద్వారా కిలో, అరకిలో ప్యాకెట్లు తయారు చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు గానూ కిలో, అరకిలో పాలిథీన్ కవర్లను కూడా సరఫరా చేశారు. అరుుతే డ్వాక్రా మహిళలకు కూలీ చెల్లిస్తారా అనే విషయంపై స్పష్టంగా చెప్పడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. వీటన్నిటినీ తమకు అప్పగిస్తే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. విడగొట్టిన తర్వాత అంతే తూకాలు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఈ సరకులు గోడౌన్లకు రాకపోగా అధికారులు వీటిని ఇంకా డీలర్లకు సరఫరా చేయలేదు. దీంతో అటు అధికారులతో పాటు ఇటు డీలర్లు కూడా పండుగకు ముందే పంపిణీ చేయగలమా అని ఆందోళన చెందుతున్నారు. కాగా చంద్రన్న సంక్రాంతి కానుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల ఉత్పత్తి కర్మాగార సంస్థ నుంచీ నెయ్యి ప్యాకెట్లను సరఫరా చేశారు. తద్వారా సంస్థకు ఆదాయం రావడంతో పాటు వ్యాపారానికి సంబంధించి ప్రజల్లో మరింత ప్రచారం కూడా జరుగనుంది. -
చంద్రన్న కానుకలో మూడే సరుకులు!
5 వేలకు పైగా రేషన్‌కార్డులు గల్లంతు వాకాడు :రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్రాంతి పురస్కరించుకుని చంద్రన్న కానుకగా ఉచితంగా అందిస్తామన్న ఆరు సరుకులకు గాను మూడే సరుకులే అందాయి. నిరుపేద తెల్లరేషన్ కార్డుదారులందరికీ అరకేజీ బెల్లం, అర లీటరు పామాయిల్, 100గ్రా. నెయ్యి, అరకిలో కందిపప్పు, కిలో ముడి శనగలు, కిలో గోధుమ పిండి ఉచితంగా ఈ నెల 12 తేదీ లోపల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రేషన్‌షాపులకు కేజీ గోధుమపిండి, అర కేజీ పామాయిల్, కేజీ ముడిశనగలు మాత్రమే వచ్చాయి. వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు సంబంధించి వాకాడులో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్‌కి మూడు సరుకులు మాత్రమే రావడం, పండగ దగ్గరకు రావడంతో వాటిని మూడు మండలాల్లోని 96 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 45 వేలకు పైగా తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా చంద్రన్న సంక్రాంతి కానుక కోసం రూపొం దించిన నూతన జాబితాలో 39,929 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. సుమారు 5 వేలకు పైగా తెల్ల రేషన్‌కార్డు దారుల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై సంబంధిత డిప్యూటీ తహశీల్దార్‌ను సంప్రదించగా మళ్లీ ఆధార్, రేషన్‌కార్డు జెరాక్స్‌లు అందజేస్తే ఆన్లైన్ చేస్తామని తెలిపారు. అయితే తిరిగి జాబితాలో వస్తే రావచ్చు, రాకపోవచ్చునని అంటున్నారు. -
'చంద్రన్న దోపిడీ అనాలేమో'
హైదరాబాద్: పేదలకు నిత్యవసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరిగేలా కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
ఆ సంచులకు రూ.15 కోట్లు
‘చంద్రన్న కానుక’ పంపిణీ కోసం భారీగా ఆర్డర్ * ఇంత తక్కువ గడువులో అందించలేమంటున్న తయారీదారు సాక్షి, హైదరాబాద్: సంచుల పేరుతో పౌరసరఫరాల శాఖలో దోపిడీకి తెర లేచింది. సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుక కింద సరుకులు అందచేసే సంచులకు రూ.15 కోట్ల వ్యయం కానుంది. పండుగ సందర్భంగా ఆరు రకాల సరుకులను ఒక సంచిలో ఉంచి ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ పేరిట లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించటం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డులు, అంత్యోదయ, అన్నయోజన, అన్నపూర్ణ కార్డులున్న ప్రతి లబ్ధిదారుడికి అర కిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, కిలో శనగలు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యిని చంద్రన్న కానుక కింద అందచేయనున్నారు. ఒక్కో సంచి రూ. 11.60 చొప్పున 1.30 కోట్ల సంచుల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఈ లెక్కన సంచుల కోసమే రూ. 15 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీలోగా లబ్ధిదారులకు సరుకులు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు, మంత్రి మధ్యన సఖ్యత లేకపోవడంతో సంచుల తయారీ కోసం ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా గడువులోగా కోట్ల సంఖ్యలో సంచులు సరఫరా చేయలేమని ఆర్డర్ తీసుకున్న సంస్థ బుధవారం సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఇబ్బందికర స్థితి ఎదురైందని తెలుస్తోంది. -
13 మంది దళ సభ్యుల అరెస్ట్
పట్టుబడిన వారంతా సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)ని వీడిన చంద్రన్న వర్గం సభ్యులే 9 తుపాకులు, 344 తూటాలు, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే నినాదంతో ప్రత్యేక దళంగా ఏర్పాటైన 13 మంది సభ్యులు గల సాయుధ బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నుంచి బయటకొచ్చి చంద్రన్న వర్గంగా ఏర్పాటైన అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. అరెస్టైన వారిలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం యర్రాయిగూడెంకు చెందిన దళ కమాండర్ కుంజా రవి, ఖమ్మం జిల్లా గుండాల మండలం కేశన్నపల్లికి చెందిన డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్ అలియాస్ వెంకటేష్, బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెంకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, వీరమద్దిగూడెంకు చెందిన కరకాల రాము అలియాస్ రామన్న, తూర్పురేగులకుంటకు చెందిన మోకల మురళీకృష్ణ అలియాస్ వెంకటేశ్వరరావు, కైకాల సూర్యనారాయణ, అలివేరుకు చెందిన కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న, కామవరపుకోట మండలం జోగడిగూడెంకు చెందిన తలారి ప్రకాష్‌తోపాటు రాములు, ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన మహ్మద్ అబ్దుల్లా రషీద్, పాల్వంచకు చెందిన అమరాజు గట్టయ్య, పెనుమాక మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పాయం వెంకటేష్ అలియాస్ మురళి, కొత్తగూడెంకు చెందిన బడపటి వీరన్న ఉన్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలో నూతనంగా దళాన్ని ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ రఘురామ్‌రెడ్డి చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, వీరందరినీ బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామ సమీపంలోని విప్పలమ్మ కొయ్య వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నట్టు తెలిసింది. దళ సభ్యుల వద్ద తుపాకులు ఉన్నప్పటికీ, వారు వాటిని ధరించకుండా వాహనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. దళ సభ్యులు అప్రమత్తమయ్యే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. పోలీసులు తమను ముట్టడించిన సమయంలో దళ సభ్యులు పొగాకు బ్యారన్ల వద్ద గల కర్రలతో వారిపై దాడిగి తెగబడగా, పోలీసులు ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. తొలుత దళ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రేగులకుంట సమీపంలోని వంతెన కింద తలదాచుకుంటున్న మరికొందరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, వారినుంచి ఆయుధాలు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.