
‘చంద్రన్న కానుక’లో తవుడు
గుమ్మల క్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల్లో గోధుమల స్థానంలో తవుడు వచ్చినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఈ మేరకు దుడ్డుఖల్లుకు చెందిన కొండగొర్రి పార్వతి అనే మహిళకు ఇచ్చిన గోధుమ పిండిలో సగభాగం ధాన్యం పొట్టు ఉండటంతో ఆదివారం గ్రామంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న అధికారులకు చూపిస్తూ, ఇవేనా చంద్రన్న ఉచిత సరుకులు.. అని ఆమె ప్రశ్నించారు. పశువులకు ఇవ్వాల్సిన తౌడు మనుషులకు ఇచ్చారేమిటని, ఇలాంటి సరుకులు ఇచ్చినా ప్రయోజనమేమిటని ఆమె అధికారులను నిలదీశారు. ఇదేనా ప్రభుత్వానికి పేదపై ఉండే అభిమానం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.