చంద్రన్న కానుకలో గడువుతీరిన సరుకులు
చిత్తూరు జిల్లా సత్యవేడులో సంక్రాంతికి చంద్రన్న కానుకగా ఇచ్చిన పదార్థాలు తిని అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు స్పందించారు. సంక్రాంతి కానుకగా అందించిన సరుకుల్లో గడువు తీరిన (ఎక్స్పైర్ అయిన) సరుకులు కూడా ఉన్నాయని, వాటినే వినియోగదారులకు సరఫరా చేశారని నిర్ధారించారు.
అస్వస్థతకు గురైన బాధితులను తహసిల్దార్ సత్యనారాయణ నాయుడు, ఇతర సిబ్బంది పరామర్శించారు. ఈ సరుకులను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.