పాలకొండ రూరల్ : ‘పార్టీలకు అతీతంగా నూతన కార్డులు పంపిణీ చేశాం.. సీఎం ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా చంద్రన్న కానుకలు అందించండి.. దయచేసి డీలర్లు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.. మీలో కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించండి...’ ఇది సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత వారం రోజుల క్రితం పాలకొండ పట్టణ ంలో చెప్పిన మాటలు. పట్టణంలోని 6వ వార్డు జన్మభూమి సభలో పాల్గొన్న ఆమె ఈ విషయూన్ని సభా ముఖంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో దాదాపు మండల వ్యాప్తంగా 32 పంచాయతీల పరిధిలో 16 వేలకు పైబడి కార్డులు మంజూరు కాగా పట్టణానికి సంబంధించి 2,200 పైచిలుకు కార్డులు మంజూరయ్యాయి. అయితే వీటికి సంబంధించి చంద్రన్న కానుకల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పండగంటి పూట...
ఇప్పటికే చంద్రన్న కానుకల పేరిట ఆరు వస్తువులతో కూడిన సరుకుల సంచిలో వచ్చిన సరుకుల్లో డొల్లతనం బయట పడింది. దీనికి తోడు డీలర్లు ఈ సంచిని లబ్ధిదారులకు అందించేందుకు చలాన పేరిట రూ.10, పండగ మామూళ్లు అంటూ మరో రూ.20 బహిరంగంగానే వసూలు చేశారు. ఇంత జరిగినా మళ్లీ వేలిముద్రలు పడలేదంటూ, నూతన కార్డుదారులు తమ పాత కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉన్నాయంటూ లేనిపోని నిబంధనలు సృష్టించి సరుకులు ఇచ్చేందుకు అయిష్టాన్ని వ్యక్తం చేయడంతో పాటు అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు స్పష్టంగా నూతన కార్డులకు సంబంధించి సంక్రాంతి కానుకలు అందించాలని జాబితాలను డీలర్లకు అందించినప్పటికీ ఆ తరహా లబ్ధిదారులకు కూడా సరుకులు అందించడం లేదు.
ఆఖరి నిమిషంలో...
ఇప్పటికే ఐరిష్‌లు, వేలిముద్రలు పడక ఇవ్వకపోవడం ఒకెత్తయితే దీనిపై వచ్చిన ఆరోపణలపై వీఆర్‌ఒ, సంబంధిత పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణానికి వచ్చేసరికి కౌన్సిలర్ల సమక్షంలో సరుకులు అందించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలా కాకుండా డీలర్లు సరుకులు పంపిణీ చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ సరుకులు ఇవ్వకపోతే మిగిలిన సరుకులను వారే రికార్డుల్లో నమోదు చేసి చేతివాటం కనపర్చే అవకాశం ఉందని అందుకే సరుకులు అందించడం లేదంటూ పలువార్డుల్లో లబ్ధిదారులు, కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కార్డుల పంపిణీ విషయంలో జంబ్లింగ్ కారణంగా వార్డులు మారిపోవడంతో ప్రతి డీలరుకు 10శాతం బ్యాగులు అదనంగా ఇచ్చారని అయినప్పటికీ పం పిణీ విషయంలో వీరు వెనుకడుగు వేయ డం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నా రు. దీంతో ప్రతి రేషన్ డిపో వద్ద ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం నాటికి పాలకొండ పట్టణంలో ఈ తరహా ఘటనలు అధికం కావడం కొసమెరుపు. ఇదే విషయమై సీఎస్‌డీటీ సోమేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎటువంటి నిబంధనలు లేకుండా సరుకులు అందించాలని డీలర్లును ఆదేశించామని, సమస్యలుంటే సరి చే స్తామన్నారు.
మంత్రిగారూ...మీరిచ్చిన హామీ ఏమైంది?
Published Fri, Jan 15 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement