దంపతుల నుంచి వివరాలు సేకరిస్తున్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పి.ఝాన్సీరాణి
ప్రకాశం, చీరాలటౌన్: పేద కుటుంబాలకు చెంది ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెళ్లి చేసుకున్న దంపతులకు ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న పెళ్లికానుక పొందేందుకు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పి.ఝాన్సీరాణి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్న నూతన ముస్లిం దంపతుల ధృవీకరణ పత్రాలు, వివరాలను నమోదు చేసుకున్నారు.
కార్యక్రమానికి హాజరైన జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెళ్లిళ్లు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల దంపతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చంద్రన్న పెళ్లికానుకను ప్రవేశపెట్టిందన్నారు. గతంలో చాలామంది ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోకపోవడంతో ప్రభుత్వం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన వారు చీరాల మండలంలో ఐదుగురు, జిల్లాలో 45 మంది ఇప్పటి వరకు పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని, ఇంకా మిగిలిన వారు కూడా తగిన ధృవీకరణ పత్రాలతో పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం టి.మోహనరావు, సిబ్బంది, అర్జీదారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment