రంజాన్ తోఫాఅందేనా?
గత ఏడాదికన్నా 10 వేల కార్డుల కుదింపు
♦ కొత్త కార్డుల సంగతి అంతేనా?
♦ ఎర్రగుంట్లలో తహసీల్దార్‌ను నిలదీసిన లబ్ధిదారులు
♦ నేడు కడపలో లాంఛనంగా పంపిణీ ప్రారంభం
రాష్ర్టప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ ఈసారీ సక్రమంగా అమలయ్యేలా కనిపించడం లేదు. డీలర్ల వద్ద ఉన్న కీరిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో అర్హులందరికీ తోఫా అందడం అనుమానంగా మా రింది. కడప మినహా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ‘తోఫా’ పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే పలుచోట్ల సరుకులందని లబ్ధిదారులు డీలర్లపై ఎదురుదాడులకు దిగుతుండడంతో పంపిణీ గందరగోళంగా మారుతోంది.
కడప సెవెన్‌రోడ్స్: పవిత్ర రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం, దూదేకుల వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘చంద్రన్న రంజాన్ తోఫా’ కార్డుదారులందరికీ సక్రమంగా అందుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతేడాది లక్షా 36 వేల 336 కుటుంబాలకు తోఫా పంపిణీ చేశారు. ఈ ఏడాది లక్షా 47 వేల కార్డులకు కానుకలు అందజేయనున్నట్లు పౌరసరఫరాల అధికారులు తొలుత ప్రకటించారు. ఇప్పుడేమో 1,26,564 కార్డులకే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే, సివిల్ సప్లైస్ కమిషనరేట్ లోని జాబితాలో కార్డుల సంఖ్య ఇలాగే ఉందని పేర్కొంటున్నారు. డీలర్ల వద్ద ఉన్న కీ రిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. అయినప్పటికీ మిస్ అయిన కార్డుల వివరాలు తహసీల్దార్లకు సమర్పిస్తే డీలర్లకు ఆ మేరకు తోఫా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పలువురు డీలర్లు మిస్ అయిన కార్డుల వివరాలను సమర్పించారు.
తలలు పట్టుకుంటున్న డీలర్లు..
మిస్ అయిన జాబితాలోని కార్డులకు సంబంధించి ఇప్పటివరకు సరుకులు అందలేదు. తెల్లకార్డులున్న ముస్లిం లబ్ధిదారులు వచ్చి తమకు కానుకలు ఇవ్వాలని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ బోగస్ కార్డులను తొలగించారని అనుకున్నప్పటికీ, జన్మభూమి కార్డులు పంపిణీ చేశారు. దీంతో గత సంవత్సరం కంటే తోఫా లబ్దిదారుల సంఖ్య తగ్గే సమస్యే ఉత్పన్నం కాదని పలువురు అధికారులే గుసగుసలాడుతున్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, టెక్నికల్ అధికారి మాత్రం లక్షా 47 వేల కార్డులకు సరిపడు సరుకులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఘంటా పథంగా చెబుతున్నారు. తోఫా లబ్ధిదారుల సంఖ్యపై అధికారుల మధ్య పొంతన లేకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో అర్హులందరికీ రంజాన్ తోఫా అందడంపై సందేహాలు నెలకొన్నాయి.
సరుకుల వివరాలు
గోధుమపిండి 632.824 మెట్రిక్ టన్నులు, చక్కెర 253.128 టన్నులు, సేమియాలు 126.564 టన్నులు, నెయ్యి 12.656 టన్నుల మేరకు జిల్లాకు చేరాయి. సరుకులన్నీ ఇప్పటికే జిల్లాలోని 1736 ప్రభుత్వ చౌక దుకాణాలకు చేరుకున్నాయి. ఒక్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియాలు, వంద గ్రాముల నెయ్యి చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తారు. సరుకులను వేటికవే సపరేటుగా ప్యాకింగ్ చేశారు. వీటిని క్యారీ బ్యాగ్‌లో ఉంచి లబ్ధిదారులకు అందిస్తారు.
బ్యాగుపై కూడా గ తేడాది తోఫా మాన్యువల్‌గా పంపిణీ చేశారు. ఈ ఏడాది మాత్రం ఈ-పాస్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లబ్దిదారులు ఎఫ్‌పీ షాపు వద్దకు ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకుని అందులో వారి రేషన్‌కార్డు నెంబరు, మొబైల్ నెంబరు రాసి డీలర్‌కు అందజేయాల్సి ఉంటుంది.
కడపలో నేడు ప్రారంభం..
కడప నగరం మినహా జిల్లా అంతటా శుక్రవారమే తోఫా పంపిణీ ప్రారంభమైంది. కడప నగరంలో మాత్రం శనివారం ఉదయం 9.30 గంటలకు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని 24 వేల 101 కార్డులకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు.
తోఫా పంపిణీ వివక్ష చూపకూడదు..
‘రంజాన్ పండుగను ముస్లింలు, దూదేకులు చాలా పవిత్రంగా జరుపుకుంటారని.. చంద్రన్న కానుకల పేరు మీద ఇస్తున్న రంజాన్ తోఫా సరకులు ఇవ్వడంతో పక్షపాతం చూపకూడదని’ మహిళలు అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన రంజాన్ తోఫా పంపిణీలో సరుకులంద ని అర్హులు అధికారుల తీరుపై తూర్పార బట్టారు. అందరికీ ఇవ్వలేనప్పుడు రంజాన్ తోపా ఎందుకు ప్రవేశపెట్టారని మండిపడుతున్నారు.
కదిరిలో అదుపులోకి ....
ఎర్రగుంట్ల పోలీసులు ప్రసాద్‌రెడ్డిని కదిరిలో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న క్రమంలో నకిలీ కరెన్సీ ఉండాలి. లేదంటే మరెక్కడైనా పక్కాగా నిందితుడు దొరికి అతను సమాచారమైనా ఇచ్చి ఉండాలి. ఇవేవి లేకుండానే గతంలో మీ కుటుంబసభ్యులు నకిలీ కరెన్సీ విక్రయాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎక్కడ నకిలీ కరెన్సీ ఉందో చెప్పాలంటూ పోలీసులు మానసిక హింసకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచి అవమానకరమైన రీతిలో వ్యవహరించడంతో ప్రసాద్‌రెడ్డి మనోవేదనకు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇదివరకూ జిల్లాలో టాస్క్‌ఫోర్సులో పనిచేసిన అధికారులు కొందరు ఎర్రచందనం నిందితులను పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో విచారణ పేరుతో వేధింపులు కొనసాగించేవారు. ఆపై దుంగలతోపాటు, డబ్బులు రాబట్టుకునే అలవాటు అధికంగా ఉండేదని పలువురు వెల్లడిస్తున్నారు. అందులోభాగంగానే దయ్యాల ప్రసాద్‌రెడ్డిని కూడ అదుపులో ఉంచుకొని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపులే ప్రసాద్‌రెడ్డి మృతికి వందశాతం కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.