రిజిస్ట్రేషన్ కార్డు తీసుకో..
గుర్తింపు కార్డులకు ఎంతో మంది దూరం
ఒకసారి పొందితే అనేక ప్రయోజనాలు
నైపుణ్య శిక్షణ, పింఛన్‌కు అవకాశం
పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు సాయం
రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండేది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కార్మిక శాఖ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.
అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
కడప కోటిరెడ్డిసర్కిల్: భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రిజి్రస్టేషన్ చేసుకున్న కార్మికులకు సంబంధించి కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 3,65,648 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అయితే గుర్తింపు కార్డు పొందని కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ రంగంతోపాటు పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లంబర్లుగా అనేక మంది పని చేస్తున్నారు.
ప్రస్తుతం కార్మికులు రోజూ పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కడప నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయం జెడ్పీ కార్యాలయం, అప్సర సర్కిల్‌లోని అడ్డాలకు చేరుకుని వేచి చూస్తుంటారు. కొందరికి పని దొరకుతున్నా, మరికొందరు ఇబ్బంది పడుతున్నారు.
అవగాహన లేమితో నష్టపోతున్న వైనం
కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో రూ.300 స్టయిఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.1000–5000 పెన్షన్ అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు.
భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి.. పని చేసే కార్మికుల పేరిట ఒక శాతం కార్మిక శాఖకు సెస్ చెల్లించాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి.. అన్ని పథకాలు అందేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
వివిధ వృత్తుల్లో..
భవన నిర్మాణ రంగానికి సంబంధించి పలు విభాగాల కార్మికులు పని చేస్తున్నారు. మట్టి పని, పునాది గుంతలు తీయడం, చదును, తాపీ మేస్త్రీ, కూలీలు, రాడ్‌బెండింగ్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్, ఫ్లంబర్లు, ఎల్రక్టీíÙయన్లు, పాలీష్ వేసే వారు ఉన్నారు. సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్, పొక్లెయినర్ ఆపరేటర్లు తమ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు.
చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్‌వెల్స్, సిమెంటు ఇటుకలు తయారు చేసే వారు ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, రెండు ఫొటోలు, నామిని ఆధార్ కార్డుతోపాటు రూ.50 సభ్యత్వ రుసుం చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment