compression
-
టీపీసీసీ ఎన్నికల కమిటీ కుదింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కుదించనున్నారు. ముఖ్య నేతలు, సీని యర్లతోనే కమిటీని నియమించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియమించిన ఈ కమిటీలో 54 మందిని సభ్యులుగా నియమిం చారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కొందరు సీని యర్లు, జిల్లా స్థాయి నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. తాజాగా ఎన్నికల కమిటీ కుదింపు ప్రక్రియపై టీపీసీసీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కమిటీలో సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి నేతలు, పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో పాటు కొన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులను మినహాయించి కమిటీని సగానికి తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కమిటీనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. ప్రతీ పార్లమెంటు స్థానానికి ముగ్గురు లేదా నలుగురు ఆశావహుల పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ స్థాయిలో కీలక సమీక్ష ఇంతవరకు జరగలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ కాం గ్రెస్ ఎందుకు ఓడిపోయిందన్న దానిపై ఏఐసీసీ పెద్ద లు టీపీసీసీ నేతలతో చర్చించలేదు. ఈ సమీక్ష కోసం ఫిబ్రవరి తొలి వారంలో టీపీసీసీ ముఖ్యులను ఢిల్లీకి పిలిపించాలని ఏఐసీసీ భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో పాటు ఇతర ముఖ్య నాయకుల వీలును బట్టి ఫిబ్రవరి 2 నుంచి 7లోపు ఒక రోజు ఢిల్లీలో సమీక్షించనున్నారు. దీంట్లో పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించడంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ మార్గనిర్దేశం చేస్తుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కాగా, 31 కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై రాష్ట్రస్థాయి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ ఆమోదముద్ర వేస్తుందని సమాచారం. -
డైట్లో అధ్యాపకుల కుదింపు
డిప్యూటేషన్ ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలకు.. రిటైర్డ్ ఉపాధ్యాయులతో ఖాళీల భర్తీ ప్రమాణాలపై విద్యార్థుల ఆందోళన ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో అధ్యాపకుల సంఖ్యను కుదించారు. డైట్ విద్యార్థులకు బోధ న జరుపుతూనే, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వ డం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలు, ఇత ర అంశాలపై ప్రచారం చేసే డైట్ అధ్యాపకుల సంఖ్య మూడో వంతుకు తగ్గించారు. 25 మంది నుంచి 8 మందికి కుదించా రు. డిప్యూటేషన్‌పై డైట్ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గు రు ఉపాధ్యాయులను వారి వారి పాఠశాలలకు పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ లను రిటైర్డ్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. ఇప్పటికే ఖాళీలతో నెట్టుకొస్తున్న డైట్ బోధన, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాప్రమాణా లు, ఛాత్రోపాధ్యాయుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. 25 నుంచి 8కి.. 200 మంది విద్యార్థులు చదివే జిల్లా డైట్ కళాశాలలో 24 మంది అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్‌తో కలిపి మొత్తం25 మంది ఉండేవారు. వీరిలో 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్ అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు. పలువురు అధ్యాపకులు ఇతర జిల్లాల్లోని డైట్ కళాశాలలకు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ పొందడంలో రోజు రోజుకు అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. మిగిలిన పోస్టుల్లో పీజీ ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించి పనిచేయిస్తున్నారు. తెలుగు, సోషల్, ఫౌండేషన్ కోర్సు( సైకాలజీ, ఫిలాసఫీ), ఆర్డ్ ఎడ్యుకేషన్, పీఈటీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించి రూ. 18 వేల వేతనం, ఆర్ట్ టీచర్, పీఈటీలకు రూ. 7 వేల మేరకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రమాణాలపై ప్రభావం.. అధ్యాపకుల కుదింపుతో ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 100, ద్వితీయ సంవత్సరంలో 100 మొత్తం 200 మంది విద్యార్థులు చదివే కళాశాలలో కేవలం 8 మంది అధ్యాపకులను నియమిస్తే ఎలా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల స్కూల్ అబ్జర్వేషన్, టీచింగ్ ప్రాక్టీస్ పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభు త్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి డైట్ లెక్చరర్స్‌గా నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
రంజాన్ తోఫాఅందేనా?
గత ఏడాదికన్నా 10 వేల కార్డుల కుదింపు ♦ కొత్త కార్డుల సంగతి అంతేనా? ♦ ఎర్రగుంట్లలో తహసీల్దార్‌ను నిలదీసిన లబ్ధిదారులు ♦ నేడు కడపలో లాంఛనంగా పంపిణీ ప్రారంభం రాష్ర్టప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రంజాన్ తోఫా’ పంపిణీ ఈసారీ సక్రమంగా అమలయ్యేలా కనిపించడం లేదు. డీలర్ల వద్ద ఉన్న కీరిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో అర్హులందరికీ తోఫా అందడం అనుమానంగా మా రింది. కడప మినహా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ‘తోఫా’ పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే పలుచోట్ల సరుకులందని లబ్ధిదారులు డీలర్లపై ఎదురుదాడులకు దిగుతుండడంతో పంపిణీ గందరగోళంగా మారుతోంది. కడప సెవెన్‌రోడ్స్: పవిత్ర రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం, దూదేకుల వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘చంద్రన్న రంజాన్ తోఫా’ కార్డుదారులందరికీ సక్రమంగా అందుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతేడాది లక్షా 36 వేల 336 కుటుంబాలకు తోఫా పంపిణీ చేశారు. ఈ ఏడాది లక్షా 47 వేల కార్డులకు కానుకలు అందజేయనున్నట్లు పౌరసరఫరాల అధికారులు తొలుత ప్రకటించారు. ఇప్పుడేమో 1,26,564 కార్డులకే ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే, సివిల్ సప్లైస్ కమిషనరేట్ లోని జాబితాలో కార్డుల సంఖ్య ఇలాగే ఉందని పేర్కొంటున్నారు. డీలర్ల వద్ద ఉన్న కీ రిజిష్టర్లకు, కమిషనరేట్ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతోంది. అయినప్పటికీ మిస్ అయిన కార్డుల వివరాలు తహసీల్దార్లకు సమర్పిస్తే డీలర్లకు ఆ మేరకు తోఫా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పలువురు డీలర్లు మిస్ అయిన కార్డుల వివరాలను సమర్పించారు. తలలు పట్టుకుంటున్న డీలర్లు.. మిస్ అయిన జాబితాలోని కార్డులకు సంబంధించి ఇప్పటివరకు సరుకులు అందలేదు. తెల్లకార్డులున్న ముస్లిం లబ్ధిదారులు వచ్చి తమకు కానుకలు ఇవ్వాలని అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ బోగస్ కార్డులను తొలగించారని అనుకున్నప్పటికీ, జన్మభూమి కార్డులు పంపిణీ చేశారు. దీంతో గత సంవత్సరం కంటే తోఫా లబ్దిదారుల సంఖ్య తగ్గే సమస్యే ఉత్పన్నం కాదని పలువురు అధికారులే గుసగుసలాడుతున్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, టెక్నికల్ అధికారి మాత్రం లక్షా 47 వేల కార్డులకు సరిపడు సరుకులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఘంటా పథంగా చెబుతున్నారు. తోఫా లబ్ధిదారుల సంఖ్యపై అధికారుల మధ్య పొంతన లేకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో అర్హులందరికీ రంజాన్ తోఫా అందడంపై సందేహాలు నెలకొన్నాయి. సరుకుల వివరాలు గోధుమపిండి 632.824 మెట్రిక్ టన్నులు, చక్కెర 253.128 టన్నులు, సేమియాలు 126.564 టన్నులు, నెయ్యి 12.656 టన్నుల మేరకు జిల్లాకు చేరాయి. సరుకులన్నీ ఇప్పటికే జిల్లాలోని 1736 ప్రభుత్వ చౌక దుకాణాలకు చేరుకున్నాయి. ఒక్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియాలు, వంద గ్రాముల నెయ్యి చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తారు. సరుకులను వేటికవే సపరేటుగా ప్యాకింగ్ చేశారు. వీటిని క్యారీ బ్యాగ్‌లో ఉంచి లబ్ధిదారులకు అందిస్తారు. బ్యాగుపై కూడా గ తేడాది తోఫా మాన్యువల్‌గా పంపిణీ చేశారు. ఈ ఏడాది మాత్రం ఈ-పాస్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లబ్దిదారులు ఎఫ్పీ షాపు వద్దకు ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకుని అందులో వారి రేషన్‌కార్డు నెంబరు, మొబైల్ నెంబరు రాసి డీలర్‌కు అందజేయాల్సి ఉంటుంది. కడపలో నేడు ప్రారంభం.. కడప నగరం మినహా జిల్లా అంతటా శుక్రవారమే తోఫా పంపిణీ ప్రారంభమైంది. కడప నగరంలో మాత్రం శనివారం ఉదయం 9.30 గంటలకు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని 24 వేల 101 కార్డులకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు. తోఫా పంపిణీ వివక్ష చూపకూడదు.. ‘రంజాన్ పండుగను ముస్లింలు, దూదేకులు చాలా పవిత్రంగా జరుపుకుంటారని.. చంద్రన్న కానుకల పేరు మీద ఇస్తున్న రంజాన్ తోఫా సరకులు ఇవ్వడంతో పక్షపాతం చూపకూడదని’ మహిళలు అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో శుక్రవారం ప్రారంభమైన రంజాన్ తోఫా పంపిణీలో సరుకులంద ని అర్హులు అధికారుల తీరుపై తూర్పార బట్టారు. అందరికీ ఇవ్వలేనప్పుడు రంజాన్ తోపా ఎందుకు ప్రవేశపెట్టారని మండిపడుతున్నారు. కదిరిలో అదుపులోకి .... ఎర్రగుంట్ల పోలీసులు ప్రసాద్‌రెడ్డిని కదిరిలో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న క్రమంలో నకిలీ కరెన్సీ ఉండాలి. లేదంటే మరెక్కడైనా పక్కాగా నిందితుడు దొరికి అతను సమాచారమైనా ఇచ్చి ఉండాలి. ఇవేవి లేకుండానే గతంలో మీ కుటుంబసభ్యులు నకిలీ కరెన్సీ విక్రయాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎక్కడ నకిలీ కరెన్సీ ఉందో చెప్పాలంటూ పోలీసులు మానసిక హింసకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచి అవమానకరమైన రీతిలో వ్యవహరించడంతో ప్రసాద్‌రెడ్డి మనోవేదనకు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇదివరకూ జిల్లాలో టాస్క్ఫోర్సులో పనిచేసిన అధికారులు కొందరు ఎర్రచందనం నిందితులను పోలీసు ట్రైనింగ్ సెంటర్లో విచారణ పేరుతో వేధింపులు కొనసాగించేవారు. ఆపై దుంగలతోపాటు, డబ్బులు రాబట్టుకునే అలవాటు అధికంగా ఉండేదని పలువురు వెల్లడిస్తున్నారు. అందులోభాగంగానే దయ్యాల ప్రసాద్‌రెడ్డిని కూడ అదుపులో ఉంచుకొని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపులే ప్రసాద్‌రెడ్డి మృతికి వందశాతం కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
‘కొండపోచమ్మ’ సామర్థ్యం కుదింపు
సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొండపోచమ్మ (పాములపర్తి) రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7-10 టీఎంసీలకు తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాజెక్టుపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, కొండపోచమ్మ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేవలం ఎల్లంపల్లి (20.17టీఎంసీలు), మిడ్‌మానేరు (25.175టీఎంసీలు) మినహాయిస్తే... నదీ ప్రవాహపు మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రణాళికను అనుసరించి కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో 53.74 మీటర్ల ఎత్తులో కట్ట ఏర్పాటు చేయాలి. దీంతో 5,200 ఎకరాల ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున 1,055 గృహాలను తరలించాల్సి ఉంటుంది. దీనికి ఎగువన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను రూ.5,978 కోట్లతో 50టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని సంకల్పించారు. అయితే ఇటీవల సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి.. కొండపోచమ్మ సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎగువన 50టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ ఉన్నందున దిగువన 21 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని, ఈ దృష్ట్యా తగ్గించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
సివిల్ సర్వీసెస్ వయోపరిమితి కుదింపు?
♦ జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గింపు ♦ ఎప్పట్నుంచి వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత లేమి సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చేదువార్త! ఇప్పటివరకు జనరల్ అభ్యర్థులకు ఉన్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లకు కుదించింది. ఈ మేరకు గురువారం upsc.govt.in వెబ్సైట్లో ఓవర్వ్యూ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కేటగిరీ కింద వయోపరిమితి అంశంలో దీన్ని పొందుపరిచింది. అయితే ఈ కుదింపు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందన్న విషయాన్ని అందులో తెలపలేదు. 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి (జనరల్)ను 32 ఏళ్లుగా పేర్కొంది. మరోవైపు 2016లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల టైం టేబుల్లో.. వచ్చే ఏప్రిల్ 23న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 7న ప్రిలిమ్స్, డిసెంబర్ 3 నుంచి ఐదురోజుల పాటు మెయిన్ పరీక్షలు ఉంటాయని వివరించింది. అయితే ఈ వయోపరిమితి కుదింపు ఏప్రిల్ 23న జారీ కాబోయే సివిల్స్ నోటిఫికేషన్‌కు వర్తిస్తుందా లేదా అన్నది యూపీఎస్సీ తన వెబ్సైట్లో ఎక్కడా తెలపలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చేరి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్ర ఆవేదన లో పడ్డారు.