డైట్‌లో అధ్యాపకుల కుదింపు | Diet faculty compression | Sakshi
Sakshi News home page

డైట్‌లో అధ్యాపకుల కుదింపు

Published Fri, Sep 2 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

ఖమ్మం ప్రభుత్వ డైట్‌ కళాశాల

ఖమ్మం ప్రభుత్వ డైట్‌ కళాశాల

  • డిప్యూటేషన్‌ ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలకు..
  • రిటైర్డ్‌ ఉపాధ్యాయులతో ఖాళీల భర్తీ 
  • ప్రమాణాలపై విద్యార్థుల ఆందోళన
  • ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్‌)లో అధ్యాపకుల సంఖ్యను కుదించారు. డైట్‌ విద్యార్థులకు బోధ న జరుపుతూనే, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వ డం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలు, ఇత ర అంశాలపై ప్రచారం చేసే డైట్‌ అధ్యాపకుల సంఖ్య మూడో వంతుకు తగ్గించారు. 25 మంది నుంచి 8 మందికి కుదించా రు. డిప్యూటేషన్‌పై డైట్‌ కళాశాలలో పనిచేస్తున్న  ముగ్గు రు ఉపాధ్యాయులను వారి వారి పాఠశాలలకు పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ లను రిటైర్డ్‌ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. ఇప్పటికే ఖాళీలతో నెట్టుకొస్తున్న డైట్‌ బోధన, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  విద్యాప్రమాణా లు, ఛాత్రోపాధ్యాయుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. 
    25 నుంచి 8కి..
    200 మంది విద్యార్థులు చదివే జిల్లా డైట్‌ కళాశాలలో 24 మంది అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్‌తో కలిపి మొత్తం25 మంది ఉండేవారు. వీరిలో 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్‌ అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్‌ ఉండేవారు. పలువురు అధ్యాపకులు ఇతర జిల్లాల్లోని డైట్‌ కళాశాలలకు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ పొందడంలో రోజు రోజుకు అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్‌ అధ్యాపకులు,  ప్రిన్సిపాల్‌ మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. మిగిలిన పోస్టుల్లో పీజీ ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించి పనిచేయిస్తున్నారు.  తెలుగు, సోషల్, ఫౌండేషన్‌ కోర్సు( సైకాలజీ, ఫిలాసఫీ), ఆర్డ్‌ ఎడ్యుకేషన్, పీఈటీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో రిటైర్డ్‌ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించి రూ. 18 వేల వేతనం,  ఆర్ట్‌ టీచర్, పీఈటీలకు రూ. 7 వేల మేరకు వేతనాలు చెల్లించనున్నారు. 
    ప్రమాణాలపై ప్రభావం..
    అధ్యాపకుల కుదింపుతో ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 100, ద్వితీయ సంవత్సరంలో 100 మొత్తం 200 మంది విద్యార్థులు చదివే కళాశాలలో కేవలం 8 మంది అధ్యాపకులను నియమిస్తే ఎలా..?  అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల స్కూల్‌ అబ్జర్వేషన్, టీచింగ్‌ ప్రాక్టీస్‌ పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిం ది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభు త్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి డైట్‌ లెక్చరర్స్‌గా నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement