నోట్ల కష్ట నష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి
Published Fri, Dec 23 2016 12:38 AM | Last Updated on Sat, Jul 28 2018 5:45 PM
వృద్ధాప్య పింఛన్లను ఇళ్లకు వెళ్లి నగదు రూపంలోనే చెల్లించాలి
చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీ
జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు
అమలాపురం టౌన్ :
పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి నేనే లేఖ రాశానని, అది నా సూచనేనని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న ప్రజల కష్ట నష్టాలకు కూడా ఆయనే బాధ్యత వహించి ఆ సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురంలోని నల్లా గార్డె¯ŒSకు చెందిన టీడీపీ నాయకుడు నూకల షణ్ముఖరావు నివాసంలో కన్నబాబు పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలతో కలిసి గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన కమిటీకి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు మన రాష్ట్రంలో నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారని కన్నబాబు విమర్శించారు. చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీనని కన్నబాబు అభివర్ణించారు. చంద్రన్న పేరుతో ప్రజలకు కానుకలా లేదని.. అది చంద్రన్నకే కానుకగా ఉందన్నారు. సరుకుల సంఖ్య...ధరలు పెరగలేదు... గత ఏడాది చంద్రన్న కానుకల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయిస్తే..అదే ఈ ఏడాది రూ.416 కోట్లు కేటాయించటంలోనే అవినీతి దాగి ఉందని ఆరోపించారు. పండుటాకులను ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ తిప్పటం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న దాదాపు అయిదున్నర లక్షల సామాజిక పింఛన్లు ఈ నెల 23వ తేదీ వచ్చినా ఇంకా 50 శాతం మందికి కూడా పింఛ¯ŒS అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో వేయటం... అవి విత్ డ్రా ఆంక్షలతో అవసరాలకు అందకపోవటంతో జిల్లా రైతులునానా కష్టాలు పడుతున్నారని చెప్పారు.
వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు నూకల...
అమలాపురానికి చెందిన టీడీపీ జిల్లా కమిటీ సభ్యుడు నూకల షణ్ముఖరావుతో పాటు దాదాపు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో స్థానిక నల్లా గార్డె¯ŒSలో గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండగుదిటి మోహన్, బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 9వ వార్డులో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో కన్నబాబు, రాజా పాల్గొన్నారు.
Advertisement
Advertisement