
చంద్రన్న కానుకతో.. 30 మంది ఆస్పత్రిపాలు
తిరుపతి: ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన 'చంద్రన్న సంక్రాంతి కానుక' గిఫ్ట్ ప్యాక్ లో పంపిణీ చేసిన కానుకలు వికటించాయి. చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ఏపీ ప్రభుత్వం చంద్రన్న కానుకల పేరుతో పంపిణీ చేసిన పదార్థాలు తిని 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సత్యవేడులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారంతా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.