
'చంద్రన్న దోపిడీ అనాలేమో'
హైదరాబాద్: పేదలకు నిత్యవసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరిగేలా కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.