Dopidi
-
బీఆర్ఎస్ దోపిడీ పత్రాలను విడుదల చేస్తాం
నల్లగొండ: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు. రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. -
దోపిడికి గురవుతున్న భవన నిర్మాణ శాఖ
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ రామాయంపేట: భవన నిర్మాణ కార్మికులు అడుగడుగునా దొపిడీకి గురవుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరి దరి చేరడంలేదని ఆరోపించారు. ప్రతి కార్మికునికి ప్రభుత్వ పరంగా గహాలు మంజూరు చేయడంతోపాటు అర్హులైనవారికి నెలకు రూ. మూడువేల పింఛన్ మంజూరు చేయాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కార్మికునికి రూ. ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
'చంద్రన్న దోపిడీ అనాలేమో'
హైదరాబాద్: పేదలకు నిత్యవసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరిగేలా కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
రికార్డులు ఎలా బ్రేకవుతున్నాయి?
-
దోపిడి
-
ఇదేం దోపిడీ
-
ప్రచార గీతంలో నాని
‘డి ఫర్ దోపిడి’ చిత్ర కథ నచ్చడంతో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా మారిన నాని, ఆ సినిమా ప్రమోషన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రానికి తాను వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రచారగీతంలో కూడా నాని నర్తించారు. ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నాని మా చిత్రానికి భాగస్వామిగా మారడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇప్పుడు సాంగ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆదిల్ ఈ పాటకు నృత్యరీతుల్ని సమకూర్చారు. ఈ చిత్రం ప్రచారానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని మా నమ్మకం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాన్సెప్ట్ నచ్చడం వల్లే ఈ చిత్రంలో భాగస్వామి అయ్యానని, కొత్తదనంతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాలకూ చేరువ చేయాలనే సంకల్పంతోనే ప్రచారగీతంలో కూడా నటించానని నాని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్, సచిన్, జిగర్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌శంకర్ డొంకాడ. -
‘డి ఫర్ దోపిడి’ పాటలు
‘‘తెలుగువాళ్లయిన రాజ్, కృష్ణ బాలీవుడ్లో సక్సెస్ అయ్యి, టాలీవుడ్‌కి వచ్చారు. ఇక, నాని మంచి కథలను సెలక్ట్ చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాడు. తను ఈ సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే సినిమా బాగుంటుందనే నమ్మకం ఏర్పడింది’’ అన్నారు సి.అశ్వనీదత్. వరుణ్‌సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలనీ ముఖ్య తారలుగా సిరాజ్ కల్లాని దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మించిన చిత్రం ‘డి ఫర్ దోపిడి’. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు వాయిస్ ఓవర్ కూడా చెప్పారు నాని. మహేష్‌శంకర్, సచిన్-జిగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను అశ్వనీదత్ ఆవిష్కరించి ‘దిల్’ రాజుకి ఇచ్చారు. ప్రచార చిత్రాలను శ్రీకాంత్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మంచి పాటలు కుదిరాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. స్క్రీన్ప్తే ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేష్, సుధీర్‌బాబు, ప్రిన్స్, తనీష్, ఆది, మెహర్ రమేష్, మారుతి, శోభారాజ్ తదితరులు పాల్గొని, పాటలు, సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.