ప్రచార గీతంలో నాని
‘డి ఫర్ దోపిడి’ చిత్ర కథ నచ్చడంతో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా మారిన నాని, ఆ సినిమా ప్రమోషన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
‘డి ఫర్ దోపిడి’ చిత్ర కథ నచ్చడంతో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా మారిన నాని, ఆ సినిమా ప్రమోషన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రానికి తాను వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రచారగీతంలో కూడా నాని నర్తించారు. ఈ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నాని మా చిత్రానికి భాగస్వామిగా మారడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇప్పుడు సాంగ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆదిల్ ఈ పాటకు నృత్యరీతుల్ని సమకూర్చారు. ఈ చిత్రం ప్రచారానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని మా నమ్మకం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాన్సెప్ట్ నచ్చడం వల్లే ఈ చిత్రంలో భాగస్వామి అయ్యానని, కొత్తదనంతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాలకూ చేరువ చేయాలనే సంకల్పంతోనే ప్రచారగీతంలో కూడా నటించానని నాని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్, సచిన్, జిగర్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌శంకర్ డొంకాడ.